కాజాలు
Jump to navigation
Jump to search
![]() | |
మూలము | |
---|---|
ఇతర పేర్లు | కాజాలు |
మూలస్థానం | భారతదేశం |
ప్రదేశం లేదా రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
వంటకం వివరాలు | |
ప్రధానపదార్థాలు | గోదుమ పిండి, చక్కెర, నూనె |
కాజాలు ఆంధ్ర ప్రాంతంలో అత్యదికంగా విక్రయించబడే మిఠాయిలు మరియు శుభకార్యక్రమములలో విరివిగా వినియోగించబడే ప్రసిద్ధ మిఠాయి. కాకినాడ ప్రాంతము కాజాల ద్వారానే బహు ప్రసిద్ధి. పిండి ని పల్చగా సన్నటి పట్టీగా మార్చి దానిని గుండ్రంగా మడచి తరువాత ఒక వైపు కొంచెం నొక్కడంతో కాజా ఆకారం వస్తుంది. దీనిని నూనె లో బంగారపు రంగు వచ్చేవరకూ వేయించి తరువాత పంచదార పాకంలో ముంచి తీసి తయారు చేస్తారు. ఒక్క ఆంధ్రప్రాంతంలోనే కాక దేశవ్యాప్తంగా అన్ని చోట్లా లభ్యమగును.
కాజాలు, రకాలు[మార్చు]
కాజాలలో మడత కాజా, గొట్టం కాజా, చిట్టికాజా అనే రకాలు ఉన్నాయి.
విశేషాలు[మార్చు]
- తాపేశ్వరం గ్రామానికి చెందిన పోలిశెట్టి సత్తిరాజు కాజాకు విశిష్టతను ఆపదించినవారిలో ప్రముఖుడు. అప్పట్లో మైదాపిండితో మడతలు పెట్టి కాజాలను కొత్తగా తయారు చేసి పంచదార పాకం పట్టి అమ్మగా వాటి కమ్మదనం, రుచి కారణంగా కొద్దికాలంలోనే కాజా ప్రజాభిమానం పొందింది. క్రమేణా తాపేశ్వరంకాజాగా ప్రశస్తమైంది.
- శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ తాపేశ్వరం కాజా ప్రపంచ ప్రసిద్ధం
- కోటయ్య కాజాగా పిలిచే కాకినాడ గొట్టం కాజాలు ప్రసిద్ధం