నెల్లూరు చేపల పులుసు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

నెల్లూరు చేపల పులుసుకి చాలా ప్రసిద్ధి, రుచి, రంగు, సువాసనకు పెట్టింది పేరు అంటారు. నెల్లూరు ఆడ పడుచు, ప్రముఖ రాజకీయ నాయకురాలు అయిన శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారు, ఈ వంటకాన్ని చాలా మంది ప్రముఖులకు స్వయముగా వండి వడ్దించెవారట![మూలాలు తెలుపవలెను]. అలా ఈ పులుసు చాలా, చాలా పాపులర్ అయిపోయింది[మూలాలు తెలుపవలెను]. ఎప్పుడు మొదటిగా తయారు చెయ్యబడిందో తెలియదు.

నెల్లూరు చేపల పులుసు చేయుటకు కావల్సిన వస్తువులు[మార్చు]

కొరమీను చేపలు
 1. కొరమీను చేపలు.....................................1 కె.జి
 2. చింతపండు...........................................200 గ్రా.
 3. మిరప పొడి......................................... 100 గ్రా..
 4. పసుపు పొడి...................................... 1.5 టి స్పూను
 5. ఉప్పు............................................ ...తగినంత
 6. ఆవాలు............................................. 1 స్పూను
 7. మెంతులు...........................................1 స్పూను
 8. వుల్లిపాయలు...................................... 2 పెద్దవి
 9. దనియాలు, జీలకర్ర............................... 1 స్పూను
 10. నూనె............................................... 50 గ్రా.
 11. కర్రివేపాకు......................................... కొద్దిగా.
 12. టమెటాలు........................................ .2 పెద్దవి
 13. పచ్చి మిరపకాయలు ............................ .3
 14. మామిడి కాయ.................................... .1 పెద్దది
 15. మిరియాలు......................................... కొద్దిగా
 16. వెల్లుల్లి............................................. 5 రెబ్బలు

చేసె విధానము[మార్చు]

 • చేపలను శుభ్రం చేసుకొని, ముక్కలు చేసుకొని, ప్రక్కన పెట్టుకోవాలి.
 • చింత పండును తగినంత నీటిలొ నాన బెట్టుకొని, బాగా పిండి రసము తీయాలి. దానికి మిరప పొడి, పసుపు పొడి, ఉప్పు,కలిపి చిక్కటి పులుసును సిద్ధం చేసుకొవాలి.
 • స్టౌ మీద బాణలి పెట్టి నూనె లేకుండ అందులో మెంతులు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వెసి మంచి సువాసన వచ్చె వరకు వేయించి, దానిని , మెత్తని పొడిగా కొట్టి పెట్టుకోవాలి.
 • మరలా బాణలి పెట్టి నూనెను పొసి బాగా కాగనిచ్చి, అందులో ఆవాలు, పొడుగ్గా తరిగిన పచ్చి మిరపకాయలు, కర్రివేపాకు, వుల్లిపాయలు, టమోటాలు, వేసి బాగ వేగనిచ్చి ఆందులో ముందుగా కలిపి పెట్టుకొన్న పులుసు పొసి, మామిడి ముక్కలు వేసి బాగా తెర్ల నివ్వాలి, పులుసు తెర్లెటపుడు, ముందుగా పొడి చెసిపెట్టుకొన్న మసాలపొడిని వేసి బాగా కలపాలి.
 • ఆ తరువాత చేపముక్కలను వేసి బాగా వుడక నివ్వాలి, ముక్కలు వుడికిన తరువాత, వెల్లుల్లి వేసి కాసేపు వుంచి, దించేయాలి.
 • దీనిని చల్లారిన తరువాత తిన్నచో చేప ముక్కలలోకి పులుసు ఇంకి రుచిగా వుంటుంది.