మైసూరుపాక్
Jump to navigation
Jump to search
మైసూరుపాక్ లేదా మైసూర్ పాక్ ఒక మెత్తని మిఠాయి. ఇది శెనగ పిండితో తయారు చేసే తీపి వంటకం. దీనిని మొట్టమొదటగా మైసూరు మహారాజు ఆస్తాన వంటవాళ్ళు తయారు చేసారు.
కావలసిన పదార్ధాలు[మార్చు]
తయారుచేయు విధానం[మార్చు]
- నెయ్యి కుంపటిసెగని ఒక్కసారి కాగనియ్యాలి.
- చక్కెరలో కొంచెం నీళ్ళుపోసి కలిపి కుంపటిమీద పెట్టాలి. చక్కెర కరిగేదాకా ఉడకనివ్వాలి.
- చక్కెర పాకం ఉడుకుతూ ఉండగానే నెయ్యిలో నాలుగోవంతు భాగం పాకంలో పోసి; కలిపి శనగపిండి కూడా వేసి గరిటెతో అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి. నెయ్యి ఇగిరినప్పుడల్లా మాడకుండా నెయ్యిపోస్తూ, తిప్పుతూ ఉండాలి. నెయ్యి అంతా పూర్తిగా అయేసరికి శనగపిండి పాకంలో ఉడికి, నేతిలోవేగి, విడిపోయి, తెల్లగా నురుగు లాగా కనిపిస్తుంది.
- అప్పుడు చిటికెడు సోడా వేసి మరోసారి కలియబెట్టి వెంటనే పళ్ళెంలోకి కుమ్మరించాలి. వెంటనే గరిటెతోగాని అట్లకాడతోగాని పైపైన మెల్లగా వత్తాలి.
- వేడిలోనే కత్తితో మనకి కావలసిన ఆకారాలలో కోసుకోవాలి. చల్లారిన తర్వాత ముక్కలు విడివిడిగా వస్తాయి.
చిట్కాలు[మార్చు]
- శనగ పిండి కల్తీ లేకుండా స్వచ్ఛమైనదిగా ఉండాలి.
- పేరుకున్న నెయ్యిని ఉపయోగించకూడదు. నెయ్యిని మరిగించిన తర్వాత వేడిగా ఉండగానే కలపాలి.
ఇది కూడా చూడండి[మార్చు]
బయటి లింకులు[మార్చు]

Wikimedia Commons has media related to Mysore pak.