Jump to content

జొన్నరొట్టె

వికీపీడియా నుండి
(జొన్న రొట్టె నుండి దారిమార్పు చెందింది)
జొన్న రొట్టెలు

జొన్నలతో చేసిన పిండిని ఉపయోగించి చేసే రొట్టె.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాలలో విరివిగా తింటారు.

తయారు చేయు విధానం

[మార్చు]

జొన్నపిండిలో ఉప్పు కలిపి ముద్ద కట్టేలాగా అందులో కొద్దిగా వేడినీరు పోయాలి. తగు పరిమాణంలో ముద్దగా చేసుకొనేటప్పుడు చల్లనీరు కూడా కలిపి పీటపైన వృత్తాకారం వచ్చేలా చేత్తో తట్టుకోవాలి. (జొన్నలు నాణ్యమైనవి అయితే వేడినీరు అక్కర లేదు.) వేడి పెనం పైన వేసి గుడ్డ ముక్కను నీటిలో తడిపి దాని పైన రాసి కాలాక తిప్పి కాల్చుకోవాలి.

మెత్తగా కావలసిన వారు పిండిని మిల్లులో మృదువుగా వేయించుకోవాలి. తొందరగా పెనం పై నుండి తీసివేయాలి. గట్టిగా కావలసిన వారు పిండిని బరకగా వేయించుకొని సన్నని సెగ పైన ఎక్కువ సేపు కాలనివ్వాలి.

చక్కెర వ్యాధిగ్రస్తులకి, ఊబ కాయులకి మంచి పథ్యకారి. గోధుమ రొట్టెలకి చక్కని ప్రత్యామ్నాయము.

పప్పు, పచ్చడి, మసాల వేసి వండిన కూర, పొడి, పొడికూర, సాంబారు, రసం, మాంసాహారపు కూరలు, ఏదయినా వీటిలోనికి నంజుకొనవచ్చును.

ఇవి కూడా చూడండి

[మార్చు]