Jump to content

పూరీ

వికీపీడియా నుండి
పూరీలు
పూరీలు.
పూరీలు

పూరీ గోధుమ పిండి లేదా మైదా పిండితో చేసే ఫలహారం. భారతదేశంలోని పలు ప్రాంతములలో దీనిని ఉదయము ఆల్ఫాహారముగా భుజిస్తారు. దక్షిణ భారతదేశములోని అన్ని హోటళ్ళలో తరచుగా కనిపించే అల్పాహారం పూరీ.

దీనిని తయారు చేయడానికి పిండిని పలుచగా చపాతీల్లాగా వత్తి, నూనెలో వేయిస్తారు.

భారతదేశంలో పూరీలు అంటే ఇష్టపడని వ్యక్తులు ఉండరు. చాలా రుచికరమైన వంటకం. ఈ వంటకం అన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పుడిప్పుడు చాలా అభివృద్ధి చెందుతుంది.

పేరు

[మార్చు]
పూరీ వేయించడం

పూరీ అనే పదం హిందీ पूरी అనే పదం నుండి ఆంగ్లంలోకి వచ్చింది. ఇది సంస్కృత పదం పూర నుండి ఉద్భవించింది. పూర అంటే 'కేక్' అని అర్ధం.[1] సంస్కృత పదం పూరికా అంటే వేయించిన అప్పడం లాంటి ఆహారం అని అర్ధం. [2] వంటల పుస్తకాల రచయిత మధుర్ జాఫ్రీ, పూరీని బెవ్డి అని కూడా పిలుస్తారని, ఢిల్లీలోని గలీ పరాంఠే వాలీ పరిసరాల్లో దీనిని "పరాఠా" అని కూడా పిలుస్తారనీ పేర్కొంది. [3]

తయారీ

[మార్చు]

పూరీలు అంటే గోధుమ పిండితో తయారుచేసిన గుండ్రటి, గాలితో ఉబ్బిన, మెత్తటి, ఆహార పదార్థం.[4]

పూరి తయారు చేసుకోవడానికి అవసరమైన పదార్ధాలు గోధుమ పిండి లేదా మైదా పిండి, నూనె లేదా నెయ్యి, పిండిని తయారు చేయడానికి తగినంత నీరు, కొద్దిగా ఉప్పు.[5] గోధుమ పిండిని సాధారణంగా ఆటా అని కూడా అంటారు. పూరీ తయారీలో కొంతమంది మైదాపిండి ఉపయోగిస్తారు.అయితే మైదాపిండిని తక్కువగా వాడతారు.[6]పిండిని బాగా పిసికిన తర్వాత, [5] వృత్తాలుగా చేసి, సుమారు 10 నుండి 12సెం.మీ. వెడల్పుతో 1 నుండి 3 మిమీ మందంతో ఉండేలా తయారు చేస్తారు.[4] తర్వాత దీనిని చపాతీ పీట ఉపయోగించి చపాతీలను ఒత్తుతారు.[7] చపాతీలను ఒత్తడం కోసం చపాతీ ప్రెస్ లేదా డౌ షీటింగ్ యంత్రాన్ని(ఇది గంటకు వేల పూరీలను ఉత్పత్తి చేసే యంత్రం) కూడా ఉపయోగించవచ్చు.

ఈ ఒత్తిన పూరీలను అవి మునిగేంత నూనె బాండీలో పోసి, వేయిస్తారు.[8] పూరీలు వేయించడానికి సాధారణంగా తవుడు నూనె[9] గానీ, సోయాబీన్ నూనె గానీ ఉపయోగిస్తారు.[10][11] డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు, పిండిలోని తేమ ఆవిరిగా మారి, పూరీలు ఉబ్బుతాయి. ఉబ్బిన పూరీ, వేయించక ముందు ఉన్న మందానికి పది రెట్లు ఉంటుంది.[12] ఉబ్బిన పూరీ, నూనెపై తేలుతుంది. దీనివల్ల అది ఒక్కసారి ఒక వైపే కాలుతుంది. దానిని తిరగేసి, మరల వేయించాలి.[13][14][15][16]

మూలాలు

[మార్చు]
  1. Ayto, John (2012). "Puri". The Diner's Dictionary (2nd ed.). Oxford Reference. ISBN 978-0-19-174443-3.
  2. Achaya 1998, p. 90.
  3. Bigot 2019, p. 803.
  4. 4.0 4.1 Kumar 2016, p. 30.
  5. 5.0 5.1 Saberi, Helen (2014). "Puri". In Davidson, Alan; Jaine, Tom (eds.). The Oxford Companion to Food (3rd ed.). doi:10.1093/acref/9780199677337.001.0001. ISBN 978-0-19-175627-6.
  6. Parimala & Sudha 2015, p. 75.
  7. Banerji, Ananthanarayan & Lele 2020, p. 143.
  8. Jaffrey 1983, pp. 132, 135.
  9. Debnath et al. 2012, p. 250.
  10. Sudo et al. 2004, p. 502.
  11. Tharanathan & Tharanathan 2001, p. 74.
  12. Aguilera 2018, p. 1028.
  13. Kumar Roy, Prasanto (August 12, 2013). "No, a poori isn't healthier than a paratha". Times of India. Retrieved October 31, 2025.
  14. Mir & Shah 2018, p. 5.
  15. Saberi, Helen (2014). "Puri". In Davidson, Alan; Jaine, Tom (eds.). The Oxford Companion to Food (3rd ed.). doi:10.1093/acref/9780199677337.001.0001. ISBN 978-0-19-175627-6.
  16. Jaffrey 1983, p. 135.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • పానీ పూరి
"https://te.wikipedia.org/w/index.php?title=పూరీ&oldid=4693068" నుండి వెలికితీశారు