పచ్చడి
పచ్చడి:
పచ్చడి అనేది ఒక రుచికరమైన ఆహార పదార్ధము. దీనిని చప్పగా ఉండే ఫలహారాలు లేదా ఉపాహారాల లో నంచుకుని తింటారు. అన్నంలోకి కూడా ఆధరవుగా తినొచ్చు . కొంతమంది అన్నంలో కలుపుకుని కూడా తింటారు. ఏ జలుబో చేసి ఒంట్లో నలతగా ఉంటే అన్నం తినబుద్ధి కాక పిల్లలు విసిగిస్తూంటారు. అప్పుడు వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి ఇంత అల్లం పచ్చడో, చింతకాయ పచ్చడి గాని కలిపి పెడితే మారు మాట్లాడకుండా ముద్ద వెనక ముద్ద గుటుక్కున మింగేసి హుషారుగా ఆడుకుంటారు. అంతెందుకు దక్షిణాది, ఉత్తరాది, కాంటినెంటల్ రుచులతో 50 రకాల వంటలు వడ్డించినా కాస్త గోంగూర గాని దోసావకాయ కానీ నాలుకకు తగిలితేనే పెళ్లి విందుకు పరిపూర్ణత. అది మన పచ్చడి మహిమ ఆ రుచి ఇప్పుడు విదేశాల వారికి నోరూరిస్తోంది అందుకే భారతీయ పచ్చల ఎగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయని పదేళ్లలో ఏకంగా 733% పెరిగాయని లెక్కలు చెబుతున్నారు నిపుణులు.
ఎవరు కొంటున్నారు మరి?
గత ఏడాది 30% ఎగుమతులు శ్రీలంకకు వెళ్ళాయట. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఒమన్, కువైట్, బెల్జియం, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, వియత్నం తదితర దేశాలు ఉన్నాయి దాదాపు 50 కి పైగా దేశాలు మన పచ్చళ్లు ను దిగుమతి చేసుకుంటున్నాయి. గుజరాత్, గోవా, తమిళనాడు రేవుల నుంచి వీటి ఎగుమతి ఎక్కువగా జరుగుతోంది. అయితే మన పచ్చళ్ళకి ఈ డిమాండ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ కాదు. క్రీస్తుపూర్వం నుంచే ఉండేదంటోంది మన చరిత్ర.[1]
విదేశాల్లో పచ్చళ్ళు చేసుకోరా?
పచ్చళ్ళు పెట్టుకోవడం అన్ని దేశాల సంస్కృతిలోనూ భాగమే కాకపోతే వారి వారి ఆహారపు అలవాట్లను బట్టి పెట్టే విధానం మారుతుంది. మనం నిల్వ పచ్చళ్ళను ఊరగాయలంటాం. ఆంగ్లంలో "పికిల్" అని అంటారు కానీ నిజానికి వాళ్ల పికిల్ వేరు మన ఊరగాయ వేరు. కూరగాయ ముక్కల్ని వెనిగర్ లో ముంచి నిల్వ చేయడం వారికి అలవాటు. పుల్లపుల్లగా ఉండేదాన్ని వాళ్ళు పికిల్ అని అంటారు. జర్మనీ వాళ్ళు క్యాబేజీతో "సార్ క్రాట్" చేసుకుంటే, దక్షిణ కొరియా వాళ్ళు దానికి ముల్లంగి లాంటి మరికొన్ని కలిపి "కిమ్ చి" చేసుకుంటారు. మొరాకో వాళ్ళకి నిమ్మకాయ పచ్చడి అంటే మహా ఇష్టం. మన ఊరగా అలా కాదు. అన్ని రకాల కూరగాయలతోనూ చేస్తాం. తగినంత ఉప్పు, కారం, చింతపండు, ఆవపిండి కలిపి పసుపు, వెల్లుల్లి రెబ్బలు చేర్చి నిండా మునిగేలాగా నూనె పోస్తే చెవులూరే ఎర్ర ఎర్రని ఊరగాయ పచ్చడి సిద్ధమవుతుంది. [2]
న్యూయార్క్ లోని ఫుడ్ మ్యూజియం వారి పరిశోధన ప్రకారం క్రీస్తుపూర్వం 2400లోనే మెసపొటేరియన్లు మన దేశం నుంచి కీరా దోసకాయలని దిగుమతి చేసుకొని వాటిని ముక్కలుగా చేసి వెనిగర్లో నానబెట్టి ఊరగాయగా వాడుకునే వారట{{pickles:A global History}}[3]
అసలు వీటిని ఎవరు కనిపెట్టారో?
కూరగాయలు దొరకని కాలం కోసం వాటిని నిల్వ చేసుకోవడానికి కనిపెట్టిన విధానమే ఊరగాయ అయింది. ఏదో ఒక పదార్థంలో ఊరబెట్టిన కాయ ఊరగాయ. దీన్నే వాడుక భాషలో "పచ్చడి" అంటున్నాం. ఇలా ఊరబెట్టడం వల్ల అది ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది. రుచి తగ్గదు. ఇప్పటిలా ఎక్కడపడితే అక్కడ హోటళ్ళ సదుపాయం లేని ఆ రోజుల్లో దూర ప్రయాణాల్లో వెంట తీసుకెళ్లినా పాడవకుండా ఉండేది. తెలుగువారికి ఊరగాయలతో అనుబంధం ప్రబంధాలు కాలం నుంచి ఉందంటారు సాహిత్యకారులు. {{శ్రీ కృష్ణదేవరాయలు}} రాసిన {{ఆముక్తమాల్యద}} లోనూ ఆవకాయ ప్రస్తావన ఉందట. "ఆపదల నాదుకొను కూర ఆవకాయ" అన్న పేరు దానికి వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు రోజు రోజుకి, తీపి పులుపు ఇష్టపడే ఉత్తరాది రాష్ట్రాల పచ్చడులకు, కారం కారంగా ఘాటుగా ఉండే దక్షిణాది రాష్ట్రాల పచ్చడులకూ, శాఖాహార మాంసాహార పచ్చళ్ళూ కలుపుకుని మొత్తంగా భారతీయ పచ్చళ్లకు అన్నింటికీ డిమాండ్, అభిమానుల ఖాతా పెరిగిపోతోంది మరి![4]
రకాలు
[మార్చు]చిత్రమాలిక
[మార్చు]-
వేరుశనగ పప్పు, కొబ్బరితో చట్నీ
-
సాంప్రదాయకంగా పచ్చడులు తయారుచేసే రుబ్బురోలు
-
కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడికి తయారు చేయడానికి కావలసిన వస్తువులు : కొబ్బరికాయ - 1 ఉప్పు - సరిపడా వెల్లుల్లి - 3 గర్భాలు (ఐఛ్ఛికం) నూనె - చిన్న నేతి గిన్నెడు ఎండుమిర్చి - 10 చింతపండు - చిన్న నిమ్మకాయంత జీలకర్ర - అరచెంచా పోపు లేదా తాలింపు సామాను కరివేపాకు తయారు చేయు విధానము :- ముందుగా కొబ్బరికాయ కొట్టి తురుముతో తురిమి గాని, చిన్న చిన్న ముక్కలుగా చేసి గాని పక్కన పెట్టుకోవాలి. బాండీలో నూనె వేసి పొయ్యి మీద పెట్టి కాగిన తరువాత ఎండుమిర్చి తొడిమలు తీసివేసి అవి ఎర్రగా వేగిన తరువాత పోపు, కరివేపాకు కూడా వేసి దింపుకోవాలి. తరువాత చల్లారక మిక్సీలో గాని రోట్లో గాని మిరపకాయలు వేసి, చింతపండు , వెల్లుల్లి, ఉప్పు వేసి, జీలకర్ర కూడా వేసి మెత్తగా నూరి కొబ్బరి కూడా వేసి మెత్తగా నూరుకుని తాలింపు పెట్టుకోవాలి. ఇలా కొబ్బరి పచ్చడిని చాలా రకాలుగా చేసుకోవచ్చు. కొబ్బరికాయ పచ్చి మామిడికాయ కలిపి పచ్చడి చేయవచ్చు . కొబ్బరికాయ నిమ్మరసం కలిపి కూడా చేయొచ్చు. కొబ్బరి, కందిపప్పు, కానీ కొబ్బరి శనగపప్పు గాని కలిపి పచ్చడి చేయవచ్చు.
-
మామిడికాయ పచ్చడి
-
టొమాటో పచ్చడి టొమేటో పచ్చడికి కావలసిన వస్తువులు : టొమాటోలు - అరకిలో చింతపండు - చాలా కొంచెం నూనె - నేతి గిన్నెడు కరివేపాకు పచ్చిమిర్చి 20 కాయలు అల్లం - ఒక అంగుళం ముక్క పోపు సామాను ఉప్పు - తగినంత తయారు చేయు విధానము :- పొయ్యి మీద బాండీ పెట్టి మిరపకాయలు గాటు పెట్టి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటోలు కూడా వేయించి పెట్టుకోవాలి. వేయించి పెట్టుకున్న మిరపకాయలు, చింతపండు, అల్లం ముక్క, తగినంత ఉప్పు వేసి మిక్సీలో గానీ రోట్లో గాని వేసి మెత్తగా నూరుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేస్తే బాగుంటుంది. ఇష్టమైన వారు వెల్లుల్లి గర్భాలు కూడా వేసి నూరుకోవచ్చు లేదంటే ఇంగువ పోపు వేసుకుంటే బాగుంటుంది. అది మెత్తగా నూరిన తర్వాత టమాటా కూడా వేసి నూరుకోవాలి. బాండీలో మిగిలిన నూనెలో గాని లేకపోతే రెండు చెంచాల నూనె వేసి పోపు వేసి ఈ నూరిన పచ్చడి పోపులో వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది
-
రకరకాల పచ్చళ్ళు
-
దక్షిణ దేశపు పచ్చళ్ళు
-
గోవా పచ్చళ్ళు
ఇది ఆహారానికి, వంటలకూ చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |