పప్పు చెక్కలు
Appearance
మూలము | |
---|---|
మూలస్థానం | ఆంధ్రప్రదేశ్ |
వంటకం వివరాలు | |
ప్రధానపదార్థాలు | బియ్యం పిండి, పుట్నాల పప్పు |
పప్పు చెక్కలు ఒక దక్షిణ భారతదేశ వంటకము. ముఖ్యంగా ఇది ఒక పిండివంట
కావలసిన పదార్థాలు
[మార్చు]- బియ్యప్పిండి: కిలో
- పుట్నాలపప్పు: 100 గ్రాములు
- పచ్చిసెనగపప్పు: 100 గ్రాములు
- పెసరపప్పు: 100 గ్రాములు
- కారం: 3 టీస్పూన్లు
- ఉప్పు: 2 టీస్పూన్లు
- వెన్న: నిమ్మకాయంత
- నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
[మార్చు]- పచ్చిసెనగపప్పు, పెసరపప్పు రెండుగంటలపాటు నానబెట్టాలి.
- పుట్నాలపప్పు మెత్తని పొడిలా చేయాలి.
- ఓ వెడల్పాటి బేసిన్‌లో బియ్యప్పిండి, నానబెట్టిన పప్పులు, జీడిపప్పుముక్కలు, ఉప్పు, కారం, పుట్నాలపప్పులపొడి, వెన్న అన్నీ వేసి కలపాలి.
- తరువాత తగినన్ని నీళ్లు పోసి ముద్దలా చేసి నిమ్మకాయసైజు ఉండలుగా చేసుకుని ప్లాస్టిక్ కాగితంమీద నూనె లేదా నెయ్యి రాసి గుండ్రని బిళ్లలుగా వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి.