జీడి
జీడి | |
---|---|
![]() | |
పండిన జీడిపండు | |
శాస్త్రీయ వర్గీకరణ ![]() | |
Kingdom: | Plantae |
Clade: | Tracheophytes |
Clade: | Angiosperms |
Clade: | Eudicots |
Clade: | Rosids |
Order: | Sapindales |
Family: | Anacardiaceae |
Genus: | Anacardium |
Species: | A. occidentale
|
Binomial name | |
Anacardium occidentale |
జీడి (Anacardium occidentale) ఉష్ణమండల ప్రాంతాలలో వుండే చెట్టు. దీని నుండి జీడిపండు, జీడిపప్పు లభ్యమవుతాయి. [1][2]
జీడిపండుతో మద్యం[మార్చు]
గోవాలో జీడి పండుని (సహాయక ఫలం) నూరి, ఆ రసాన్ని తీసి 2-3 రోజులు పులియబెడతారు. పులిసిన రసాన్ని రెండు సార్లు బట్టిలో పెడతారు. తద్ఫలితంగా వచ్చిన పానీయాన్ని ఫెని అంటారు. టాంజానియా దక్షిణ ప్రాంతం మత్వరలో జీడి పండుని (స్వహిలి భాషలో బిబో ) ఎండబెట్టి నిల్వచేస్తారు. తరువాత నీటిలో నానబెట్టి, పులియబెట్టి, బట్టిలో కాచి ఘాటైన మద్యాన్ని తయారు చేస్తారు. దీని పేరు గంగో. మొజాంబిక్లో జీడిపప్పు వ్యవసాయదారులు సాధారణంగా ఘాటైన మద్యాన్ని జీడి పండుతో తయారు చేస్తారు. దీనిని "యగవ అర్దంట్" (మండే జలం) అంటారు.[3]
జీడిపప్పు[మార్చు]

జీడిపండుకు జతపరిచివుండే విత్తనమే జీడిపప్పు. ఈ జీడి పంట ద్వారా వచ్చే జీడి పిక్కలను, జీడి పప్పుగా తయారు చేసే పరిశ్రమ పలాస (శ్రీకాకుళం జిల్లా), మోరి (కోనసీమ జిల్లా) గ్రామాలలో వున్నాయి. ఈ పరిశ్రమ ద్వారా అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ జీడి పప్పు ఎగుమతి ద్వారా, ఎగుమతిదారులు, భారతదేశానికి, విలువైన విదేశీమారక ద్రవ్యం సంపాదించి పెడుతున్నారు.
పోషక పదార్థాలు[మార్చు]
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
- శక్తి ---------------580 kcal 2310 kJ
- పిండిపదార్థాలు ---------- 30.19 g
- చక్కెరలు----------- 5.91 g
- పీచుపదార్థాలు--------- 3.3 g
- కొవ్వు పదార్థాలు---------- 43.85 g
- మాంసకృత్తులు---------- 18.22 g
- థయామిన్ (విట. బి1) ---- .42mg 32%
- రైబోఫ్లేవిన్ (విట. బి2) ----- .06mg 4%
- నియాసిన్ (విట. బి3) ----- 1.06mg 7%
- పాంటోథీనిక్ ఆమ్లం (B5) ----- .86mg 17%
- విటమిన్ బి6----------- .42mg 32%
- ఫోలేట్ (Vit. B9) ----- 25 μg 6%
- విటమిన్ సి------------- .5mg 1%
- కాల్షియమ్------------ 37mg 4%
- ఇనుము------------- 6.68mg 53%
- మెగ్నీషియమ్----------- 292mg 79%
- భాస్వరం------------- 593mg 85%
- పొటాషియం------------ 660mg 14%
- జింకు-------------- 5.78mg 58%
ఆధారం: USDA పోషక విలువల డేటాబేసు
- జీడిపప్పు పప్పులో క్రొవ్వు, నూనె పదార్థాలు 54%
- మోనో అన్ సేచ్యురేటెడ్ కొవ్వు (18:1),18%
- పోలి అన్ సేచ్యురేటెడ్ కొవ్వు (18:2),
- సేచ్యురేటెడ్ కొవ్వు-16%
- పల్మిటిక్ ఆమ్లం (16:0),9,%
- స్టేరిక్ ఆమ్లం (18:O) ఉంటాయి.7%
ఉపయోగాలు[మార్చు]
వైద్యం, పరిశ్రమలు[మార్చు]
జీడి పిక్క ద్రవంలో (CNSL), జీడిపప్పు తయారీ పద్ధతిలో మిగిలే ద్రవంలో చాలా మటుకు అనకర్దిక్ ఆమ్లాలు ఉంటాయి. ఈ ఆమ్లాలు దంత సమస్యల పైన ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇది హాని కారక బ్యాక్టీరియాను చంపుతుంది. ఇది వివిధ రకాల హాని కారక బ్యాక్టీరియల పైన కూడా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ చెట్టు వివిధ భాగాలని పటమొన, గయాన వాసులు వైద్యంలో వాడతారు. చెట్టు బెరడు తీసి రాత్రంతా నానబెట్టి లేదా ఉడకబెట్టి విరోచనాలకి మందుగా వాడతారు. విత్తనాల్ని పిండి చేసి పాము కాట్లకు విరుగుడు మందుగా వాడతారు. పిక్క నూనెను అరికాలి పగుళ్ల పైన పూతగా శైవలాల నిరోధకంగా వాడతారు.అనకర్డిక్ ఆమ్లాన్ని రసాయన పరిశ్రమల్లో కర్డనల్ అనే పదార్థం ఉత్పత్తి చేయడానికి వాడతారు.[4]
వంటలలో వాడకం[మార్చు]
జీడిపప్పు ప్రఖ్యాత ఫలహారం, దీని ఘనమైన రుచివల్ల పచ్చిగా కూడా తినవచ్చు, కొద్దిగా ఉప్పు లేదా చెక్కర కలుపుకుని ఆరగించవచ్చు. జీడిపప్పుని చాకొలేట్ పూతతో అమ్ముతారు, కానీ ఇది వేరు సెనగ, బాదం పప్పు కన్నా ఖరీదు ఎక్కువ, వాడకం తక్కువ. థాయి, చైనీస్ వంటకాలలో కూడా జీడిపప్పు భాగం ఉంది, వీరు పూర్తి పిక్కను వాడతారు, అయితే భారతీయ వంటల్లో ముద్ద చేసి షాహీ కుర్మా లాంటి వాటిలో వాడతారు, అంతే కాకుండా పిండి వంటల్లో అలంకరణకు వాడతారు. అంతగా తెలియకపోయినా రుచికరంగా ఉండే జీడిపప్పు అది లేతగా ఉండి, దాని తోలు ఇంకా గట్టిపడకుండా ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. దాని పిక్క మెత్తగా ఉన్నప్పుడు, దానిని కత్తితో రెండు భాగాలుగా చీలుస్తారు. పప్పుని తీసి (అది ఇంకా క్షారతని కోల్పోదు, అందు వల్ల చేతి తొడుగులు అవసరం) పసుపు కలిపిన నీటిలో నానబెడతారు. దీని వల్ల క్షారత కోల్పోతుంది. ఈ విధమైన వాడుక కేరళ వంటకాలలో ముఖ్యంగా అవియల్ తయారీలో కనిపిస్తుంది, ఇందులో రకరకాలైన కూరగాయలు, కొబ్బరి కోరు, పసుపు, పచ్చి మిరపకాయలు వాడతారు. మలేషియాలో లేత ఆకులని పచ్చిగా సలాడ్ లాగా లేదా సంబల్ బెలకన్ (మిర్చి, నిమ్మరసం కలిపిన రొయ్యల ముద్ద) కలిపి తింటారు. బ్రెజిల్లో జీడిపండు రసం దేశం మొత్తం ప్రఖ్యాతి గాంచింది. ఫోర్ట్లేజా వంటి ఈశాన్య ప్రాంత సందర్శకులు తరచుగా అమ్మకందారులు జీడిపప్పు పప్పుని తక్కువ ధరకి అమ్మటాన్ని చూడవచ్చును. కొన్న పిమ్మట ఉప్పువేసి ప్లాస్టిక్ సంచులలో ఇస్తారు. ఫిలిపిన్స్లో జీడిపప్పు అంటిపోలో ప్రఖ్యాతి గాంచిన పంటగా ప్రసిద్ధి, సుమన్ తో కలిపి ఆరగిస్తారు. పంపంగాలో ఒక మిఠాయి అయిన టురోన్స్ డి కసుయ్ కూడా జీడిపప్పు పప్పుతో తాయారు అవుతుంది. జీడిపప్పు మార్జిపాన్ ను తెల్లని కాగితంలో చుడతారు.
మూలాలు[మార్చు]
- ↑ Morton, Julia F (1987). Cashew apple, Anacardium occidentale L. pp. 239–240. ISBN 978-0-9610184-1-2. Archived from the original on 15 March 2007. Retrieved 18 March 2007.
{{cite book}}
:|work=
ignored (help) - ↑ "Anacardium occidentale (cashew nut)". CABI. 20 November 2019. Retrieved 8 May 2021.
- ↑ "How Kaju Feni is Made, Process of Making Kaju Feni". www.goaonline.in. Retrieved 2022-08-24.
- ↑ "Anacardium occidentale". hort.purdue.edu. Retrieved 2022-08-24.