మోరి
మోరి | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°19′58.800″N 81°43′58.800″E / 16.33300000°N 81.73300000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ |
మండలం | సఖినేటిపల్లి |
విస్తీర్ణం | 5.48 కి.మీ2 (2.12 చ. మై) |
జనాభా (2011) | 7,357 |
• జనసాంద్రత | 1,300/కి.మీ2 (3,500/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 3,642 |
• స్త్రీలు | 3,715 |
• లింగ నిష్పత్తి | 1,020 |
• నివాసాలు | 2,001 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 533250 |
2011 జనగణన కోడ్ | 587856 |
మోరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం.[2].
ఇది మండల కేంద్రమైన సఖినేటిపల్లి నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నరసాపురం నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2001 ఇళ్లతో, 7357 జనాభాతో 548 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3642, ఆడవారి సంఖ్య 3715. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1305 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 20. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587856.[3].
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో మూడుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 10, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల అంతర్వేదిపాలెంలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మలికిపురంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల అమలాపురంలోను, పాలీటెక్నిక్ పోడూరులోను, మేనేజిమెంటు కళాశాల నర్సాపురంలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల శివకోడులోను, అనియత విద్యా కేంద్రం అమలాపురంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రాజోలు లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]మోరిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలో 4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
[మార్చు]మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]- సబ్ పోస్ట్ ఆఫీసు టెలిఫోన్ నెంబరు: 08862-226322
- హెడ్ ఆఫీస్: రాజోలు హెడ్ ఆఫీస్ - పిన్ నెంబరు :533242
మోరిలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 6 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]మోరిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 99 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 449 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 129 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 320 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]మోరిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 320 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]మోరిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]పారిశ్రామిక ఉత్పత్తులు
[మార్చు]జీడి ఉత్పత్తులు
చేతివృత్తులవారి ఉత్పత్తులు
[మార్చు]చేనేత
గ్రామ విశేషాలు
[మార్చు]ఈ గ్రామం, చుట్టుప్రక్కల గ్రామాలు ప్రకృతి రమణీయతను సంతరించుకొని చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ గ్రామ ప్రజలు చేనేత, జీడిపప్పు పరిశ్రమలు, వ్యవసాయం, చిన్న వ్యాపారముల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.ఈ గ్రామం జీడిపప్పుకి ప్రసిద్ధి. ఇక్కడ నుంచి జీడిపప్పు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. ఆంధ్ర దేశంలో పలాస (శ్రీకాకుళం జిల్లా), మోరి (తూర్పుగోదావరి జిల్లా) గ్రామాలు జీడి పప్పుకి ప్రసిద్ధి చెందిన గ్రామాలు. యమగోల సినిమాలో, రావుగోపాలరావు 'మోరి జీడిపప్పు' తో తన కోడి పుంజుని పెంచానని, మరణించిన తన కోడి గురించి విలపించే సన్నివేశం ఉంది.
శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ సినిమా ఈ ప్రాంతాలలో వంశీ సినిమాలలోకన్నిటి కంటే సహజత్వానికి దగ్గరగా చిత్రీకరించబడింది. గోదావరి ప్రాంత భాష, యాసలను అక్కడి అలవాట్లు కట్టు బొట్టులను, పల్లెటూళ్ళ అందాలను మరింత అందంగా తెరకెక్కింఛారు. రాజోలు, నర్సాపురం, మోరి, మానేపల్లి, శివకోడు, తాటిపాక, పాసర్లపూడి ఈ గ్రామాలలో దాదాపు పూర్తి సినిమాను తెరకెక్కింఛారు.
- ఇక్కడ 1929 జనవరి 23 నాడు నిర్మించిన ప్రాచీన గ్రంథాలయం ఉంది. ఇందులో, ఈనాడు మూతపడిన పత్రికల ప్రతులు ఈ గ్రంథాలయంలో భద్రంగా ఉన్నాయి. 1930 ప్రాంతాలలో, కులపత్రికలు కూడా ఉండేవి. ఆ కులపత్రికలు కూడా ఇక్కడ ఉన్నాయి. దేవాంగులు, ప్రచురించే, 'దేవాంగ జ్యోతి' పత్రిక ప్రతులు చాలా సంవత్సరాల సంకలనాలు ఉన్నాయి. వాటిలో ఆనాటి సామాజిక సమస్యలు, వార్తలు, స్వాతంత్ర్య ఉద్యమ వార్తలు ఉన్నాయి.
- ఈగ్రామంలో 1962లో నిర్మించబడిన శ్రీమతి జాన సుబ్బమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వందల మంది విద్యార్థినీ విద్యార్థులు 6వ తరగతి నుంచ్ 10వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు.
- మోరి గ్రామ దేవత 'మహలక్ష్మమ్మ' గుడి ఉంది. ప్రతీ సంవత్సరం, ఫాల్గుణ మాసంలో వచ్చే రెండవ మంగళవారం (మార్చి నెల) లో జాతర జరుగుతుంది. ఈ సమయంలో, పెళ్ళై ఇతర గ్రామాలలో ఉన్న మోరి ఆడపడుచులు, ఈ గ్రామానికి తమ పుట్టిళ్ళకు వస్తారు. గ్రామ ప్రజలు గ్రామదేవత పండుగ ఘనంగా జరుపుకుంటారు. గ్రామంలోని అన్ని వీధులు గ్రామదేవత ఊరేగు తుంది. శివాలయం పెద్దది ఉంది. కార్తీక మాసంలో ఇక్కడ ఘనంగా పూజలు జరుగుతాయి. మరికొన్ని చిన్న గుడులు రామాలయం, సాయిరాం, పుంతలో ముసలమ్మ, దుర్గాదేవి, వినాయకుడు గుడ, వీరభద్ర స్వావ్మి గుడి ి కూడా ఉన్నాయి. సినిమా హాలు ఒకటి ఉంది. ఒక చెరువు కూడా ఉంది. గుత్తివారి వీదీ, బళ్లవారి వీధి, లైబ్రరీ వీధి ఉన్నాయి. పోస్టు ఆఫీసు ఉంది. ప్రాథమిక పాఠశాల ఉంది. చేనేత కార్మికులకు చెందిన కోఆపరేటివే సొసైటి ఉంది. గోదావరి బేసిన్ లో ఆయిల్ నిక్షేపాలు దొరికిన తరువాత, ఓ.ఎన్.జి.సి (ఆయిల్ అన్ద్ నేచురల్ గాస్ కార్పొరేషన్) కార్యక్రమాలు ఇక్కడ, విస్తరించాయి. దానితో, ఈ ప్రాంతం లోని భూముల ధరలకు రెక్కలు వచ్చి విపరీతంగా పెరిగాయి. గుత్తివారి వీధి, లైబ్రరీ వీధి, బళ్లవారి వీధి, శంకరయ్య గారి వీధి, మరికొన్ని వీధులు ఉన్నాయి.
- అన్నదానానికి మారు పేరు, అపర అన్నపూర్ణగా పేరు పొందిన 'డొక్కా సీతమ్మ' నివసించిన గన్నవరం గ్రామం ఇక్కడికి దగ్గర. విజయవాడ దగ్గర ఉన్న ఎయిర్‌పోర్టు గన్నవరం గ్రామం వేరు.
- ఇక్కడికి దగ్గరలోని, తాటిపాక (ఒకప్పటి జైన గ్రామం - తాటిపాక జైనుడు విగ్రహం ఈ గ్రామంలో ఉండేది. ఆ విగ్రహాన్ని రాజమండ్రి మ్యూజియంలో పెట్టారు. ఎవరైనా బాగా పొడవుగా వుంటే, ఇక్కడి ప్రజలు 'తాటిపాక జైనుడిలాగ ఎంత పొడవు ఉన్నాడో' అనటం పరిపాటి.) లో టర్పెంటైన్ ఆయిల్ తయారుచేసే కర్మాగారం ఉంది. ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పీరు కోనసీమ. మోరి గ్రామం అందుకు మినహాయింపు కాదు. సర్ ఆర్ధర్ కాటన్ కట్టిన గోదావరి ఆనకట్ట వలన, ఈ ఇసుక నేల, ఇసుక భూములు సస్య శ్యామలమయ్యాయి. ఇక్కడి నేలలు, రెండు, మూడు పంటలు పండుతాయి. ఆనకట్ట కట్టిన తరువాత కూడా, బ్రిటిష్ ప్రభుత్వం, ఒక ఎకరా ఉచితంగా తీసుకుని, ఆ ఎకరానికి ఒక అణా పన్ను (శిస్తు) గా ఇమ్మని ఇక్కడ ప్రజలను ప్రాదేయపడినా, ప్రజలకు నమ్మకం కుదరలేదట. ఈ ఎకరం మీద అణా ఆదాయం వస్తుందా అని. అటువంటి, ఒక ఎకరా ఈనాడు రెండు కోట్లు రూపాయలు పలుకుతుంది. సెంటు భూమి రెండు లక్షలు రూపాయలు . సర్ ఆర్ధర్ కాటన్ కష్టపడి, రోజుకు 20 మైళ్ళు, గుర్రంమీద తిరిగి కట్టీన గోదావరి ఆనకట్ట మహత్యం అది. ఆయన కృషికి భారతీయులు, భారతదేశం ఋణపడి ఉంది. ఇక్కడ పండే ప్రతీ బియ్యపు గింజ మీద సర్ ఆర్ధర్ కాటన్ సంతకం ఉంటుంది అంటారు కోనసీమ ప్రజలు.
- ఈ గ్రామం అక్షరాస్యత విషయంలో చాలా ముందుంది. ఈ గ్రామంలోని యువకులు ఉద్యోగ అన్వేషణలో పడి, హైదరాబాద్, విశాఖపట్నం, గల్ఫ్ దేశాలు, అమెరికా వంటి దేశాలు వలస వెళ్ళటం వలన, ఈ గ్రామంలో యువకులు, యువతులు తక్కువగా కనిపిస్తారు. చదువుకునే యువతీ, యువకులు తప్ప మిగిలిన వారు ఎవరూ లేరు. స్త్రీ, పురుషుల సంఖ్య (ఎక్కువగా కార్మిక వర్గానికి చెందిన వారు కువాయిట్ (ఇక్కడ కొయిటా అంటారు) వంటి గల్ప్ దేశాలకు వెళ్ళటం, రావటం మామూలు. ఆర్థికంగా కూడా ఈ వర్గానికి చెందిన వారు ఉన్నత స్థానంలో ఉన్నారు. ఈ గల్ఫ్ సంపద వలన ఇక్కడ భూముల ధరలు పెరిగాయి. విలాస వస్తువులు, ఎలెక్ట్రానిక్ వస్తువుల, కన్యుమర్ గూడ్స్ వాడకం కూడా ఎక్కువ. యువతులు ఎక్కువగా సైకిళ్ళు తొక్కుకుంటూ కళాశాలలకు వెళ్ళటం ఇక్కడ నిత్య కృత్యం. పూర్వం ఇక్కడి ప్రజలు నడచి, సైకిళ్ళపై వెళ్ళేవారు. కానీ, ఆటోలు బాగా విస్తరించి, స్వయం ఉపాధి కల్పిస్తూ, ప్రజలకు రవాణా సమస్యను తీర్చింది.. ఈ గ్రామం దేశానికి ఒక ఐ.ఏ.ఎస్ అధికారిని (చింతపట్ల ఉమా మహేశ్వర రావు, ఐ.ఏ.ఎస్) ఇచ్చింది.
- ఈ గ్రామం సముద్ర తీర గ్రామం కాబట్టి, ఇక్కడ బావులలో ఉప్పు నీరు ఉంటుంది. ఇక్కడి వారు అంతా మంచినీటి (తాగేనీరు) కోసం 'పోడు' అనే ప్రాంతానికి (2 కి.మీ) బిందెలతో వెళ్ళి తెచ్చుకుంటారు. ఎనిమిది సంవత్సరాల క్రితం, 2003 సంవత్సరంలో, (గ్రామస్థులు, దానశీలురు, పంచాయతీ వారి సమైక్య కృషితో, నేడు ఇంటంటీకీ రక్షిత మంచినీరు గొట్టాల ద్వారా చేరుతుంది. ఆడవారి కస్టాలు తీరాయి.
గణాంకాలు
[మార్చు]2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,727.[4] ఇందులో పురుషుల సంఖ్య 3,822, మహిళల సంఖ్య 3,905, గ్రామంలో నివాస గృహాలు 1,953 ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-12.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-12.