Coordinates: 16°24′19″N 81°45′26″E / 16.405278°N 81.757199°E / 16.405278; 81.757199

సఖినేటిపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సఖినేటిపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
సఖినేటిపల్లి is located in Andhra Pradesh
సఖినేటిపల్లి
సఖినేటిపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°24′19″N 81°45′26″E / 16.405278°N 81.757199°E / 16.405278; 81.757199
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కోనసీమ
మండలం సఖినేటిపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 15,474
 - పురుషులు 7,798
 - స్త్రీలు 7,676
 - గృహాల సంఖ్య 3,784
పిన్ కోడ్ 533 251
ఎస్.టి.డి కోడ్

సఖినేటిపల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన గ్రామం. పిన్ కోడ్: 533 251.

ఇది సమీప పట్టణమైన నరసాపురం నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4196 ఇళ్లతో, 15720 జనాభాతో 1581 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7908, ఆడవారి సంఖ్య 7812. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 5792 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 166. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587853[1].పిన్ కోడ్: 533251.

ఈ ఊరు గోదావరి నది వశిష్ట పాయ ఒడ్డున ఉండుటంవలన అందాలకు కొరతలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురానికి, సఖినేటిపల్లికి మధ్య గోదావరి మాత్రమే అడ్డు. అందువలన, సఖినేటిపల్లి ప్రాంతములోని వ్యవసాయపు ఉత్పత్తులను, గోదావరి దాటించి, నరసాపురం ద్వారా మిగిలిన ప్రాంతానికి పంపేవారు. ఇప్పుడు నరసాపురం సమీపంలోని చించినాడ వంతెన ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతోంది కనుక సఖినేటిపల్లి ప్రాంతంలో వర్తకం అభివృద్ధి చెందింది. బల్లకట్టు ద్వారా నరసాపురానికి రాకపోకలతో సంబంధం పోలేదు.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

శ్రీరాముడు వనవాస కాలమందు ఈ ఊరిమీదుగా ప్రయాణిస్తూ ఈపల్లెను చూసి సఖీ నేటికీ పల్లెలో బసచేదాం అనడంతో ఆ ఊరివారంతా శ్రీరాముని మాట మీదుగా మనపల్లె నేటి నుండి సఖినేటిపల్లెగానే పిలువబడాలని అనుకొన్నారట.

వశిష్ఠ వారధి[మార్చు]

ఉభయ గోదావరి జిల్లాలను నరసాపురం - సఖినేటిపల్లి మధ్య కలిపేందుకు వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి. వంతెన నిర్మాణవ్యయం రూ.61 కోట్లు. మైటాస్‌ కంపెనీ నుంచి సబ్‌కాంట్రాక్ట్‌ పొందిన కోస్టల్‌ ఇంజనీరింగ్‌ కనస్ట్రక్షన్‌ కంపెనీ రంగంలోకి దిగింది. 391.50 మీటర్ల పొడవు, 7.5 మీటర్ల వెడల్పు (రోడ్డు) తో వంతెన, రోడ్డుకిరువైపులా 1.5 మీటర్ల చొప్పున పుట్‌పాత్‌లు ఏర్పాటవుతాయి. నదిలో 3 స్తంభాలుంటాయి. సత్యం, మేటాస్ సంస్థల పతనం వల్ల పనుల పు రోగతిలో తీవ్ర జాప్యం ఏర్పడింది.2004 సాధారణ ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కూడా ఇక్కడ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ప్రస్తుతం చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డిలు వేసిన శంకుస్థాపన రాళ్ళు గోదావరికి రెండు వైపులా ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఆరుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 18, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల  ఉన్నాయి. సమీప ఇంజనీరింగ్ కళాశాల నర్సాపురంలో ఉంది. సమీప వైద్య కళాశాల అమలాపురంలోను, పాలీటెక్నిక్‌ పోడూరులోను, మేనేజిమెంటు కళాశాల నర్సాపురంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల శివకోడులోను, అనియత విద్యా కేంద్రం అమలాపురంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రాజోలు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

సఖినేటిపల్లిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఆరుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.డిస్పెన్సరీ, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో 7 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది.గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

సఖినేటిపల్లిలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

గ్రామ ప్రముఖులు[మార్చు]

కత్తిమండ ప్రతాప్ కవి, సాహితీవేత్త. కవి సంగమం రచయితలలో ఒకరు.
 • కత్తిమండ ప్రతాప్ -కన్నమ్మ, ప్రభాకరరావ్ దంపతులకు 1978, జనవరి 21న సఖినేటిపల్లిలో జన్మించాడు. కవి, సాహితీవేత్త. కవి సంగమం రచయితలలో ఒకరు. 2019లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ రాష్ట్ర సభ్యుడిగా ఎంపికయ్యాడు.[2][3] 2016లో వర్థమాన రచయితల వేదిక తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.[4]
 • సఖినేటిపల్లి లంక పత్తి కామమ్మ - మహా దానశీలి. ఎందరో ఆభాగ్యులకు జీవితాన్ని ఇచ్చింది. ఆమె దాణగుణానికి బ్రిటిఘ వారు సైతం ముగ్ధులైనారు

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

సఖినేటిపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 239 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 246 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 1095 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 406 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 688 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

సఖినేటిపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 688 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

సఖినేటిపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, కొబ్బరి

చేతివృత్తులవారి ఉత్పత్తులు[మార్చు]

లేసుల అల్లిక

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 15,474.[5] ఇందులో పురుషుల సంఖ్య 7,798, మహిళల సంఖ్య 7,676, గ్రామంలో నివాస గృహాలు 3,784 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

 1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 2. ప్రజాశక్తి, తూర్పు గోదావరి (14 February 2019). "ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ స్టేట్‌ మెంబర్‌గా ప్రతాప్‌". Dailyhunt. Retrieved 3 December 2020.
 3. ఈనాడు, తూర్పు గోదావరి (19 March 2019). "ఉభయ గోదావరి జిల్లాల కవులు, రచయిత సంఘం ఏర్పాటు". Sakshi. Archived from the original on 5 December 2016. Retrieved 3 December 2020. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 3 డిసెంబరు 2020 suggested (help)
 4. సాక్షి, జిల్లాలు (3 December 2016). "రచయితల వేదిక అధ్యక్షుడిగా కత్తిమండ". Sakshi. Archived from the original on 5 December 2016. Retrieved 3 December 2020.
 5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-12.

వెలుపలి లంకెలు[మార్చు]