కత్తిమండ ప్రతాప్
| కత్తిమండ ప్రతాప్ కుమార్ | |
|---|---|
కత్తిమండ ప్రతాప్ | |
| జననం | ప్రతాప్ సఖినేటిపల్లి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, |
| వృత్తి | జర్నలిస్ట్ , ప్రముఖ కవి ,రచయిత , సినీ పాటల రచయిత , పలు అవార్డుల గ్రహీత ఒకేషనల్ కాలేజి ప్రిన్సిపాల్, రచయిత |
| మతం | హిందూ |
| భార్య / భర్త | ఉషాజ్యోతి |
| పిల్లలు | మహీత్, ప్రణయ్ |
| తండ్రి | ప్రభాకరరావ్ |
| తల్లి | కన్నమ్మ |
కత్తిమండ ప్రతాప్ గారు సుప్రసిద్ధ కవి, రచయిత, సాహితీవేత్త, కథా , నవలా రచయిత .సినిమా పాటలు మాటలు రచయిగా కూడా పేరొందారు . తెలుగు రచయితలలో ప్రముఖులు .రాష్ట్ర ప్రభుత్వం చే అనేక అవార్డులు , బిరుదులు అందుకున్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ రాష్ట్ర సభ్యుడిగా నియమించబడ్డారు .[1][2] 2016లో వర్థమాన రచయితల వేదిక తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా కూడా పనిచేశారు . ప్రస్తుతం ప్రపంచ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక ,సామాజిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ గా ఉన్నారు .[3]జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక కవిసమ్మేళనాలు, సాహిత్య కార్యక్రమాలు, సదస్సులు నిర్వహించిన ఏకైక వ్యక్తి .నాన్ స్టాప్ కార్యక్రమాలతో పలు వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్నారు .సాహిత్య చరిత్రలో 48 గంటలపాటు తిరుపతిలో నిరవధికంగా ప్రపంచ తెలుగు సాహిత్య బ్రహ్మో త్సవాలు ప్రతాప్ నిర్వహించి ప్రపంచ రికార్డులకెక్కారు . ఇదిసాహిత్య చరిత్రలో వరల్డ్ రికార్డు . వేలాది మంది కవులను సత్కరించైనా ఘనత ప్రతాప్ గారిది .ప్రపంచ తెలుగు సాహిత్య చరిత్రలో నూతన ఒరవడి సృస్టిస్తున్నారు . కవిసమ్మేళనాలు , కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసి కవులు , కళాకారులకు అండగా నిలుస్తున్నారు. ట్రాన్స్ జెండర్స్ పై అద్బుతమైన వాస్తవిక రియల్ స్టొరీ రాసారు . అది కన్నడ తెలుగు భాషల్లో విడుదల అయ్యింది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చే కళారత్న హంస పురస్కారాన్ని 2025లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నారు . ఆయన సాహిత్యం సామాజిక కోణంలో ఉంటుంది . గల్ప్ వలస కార్మికులపై రెండు వాస్తవిక కథల పుస్తకాలను తీసుకువచ్చారు . దుబాయి , కువైట్ వంటి అరబ్బు దేశాలలో పర్యటించి అక్కడ వలస కార్మికుల పై అధ్యయనం చేసారు . మంచి కథా రచయితగా పేరొందారు . పలు దేశాల్లో అతిధిగా పాల్గొన్నారు. కవులకు ఎన్నో పురస్కారాలు అందించారు .ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నెల నెల కవి సమ్మేళనాలు జాతీయ స్థాయి లో నిర్వహించి ప్రోత్సహిస్తున్న ఏకైక వ్యక్తి .
జననం
[మార్చు]కన్నమ్మ, ప్రభాకరరావ్ దంపతులకు జనవరి 21న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి లో జన్మించాడు.
ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం
[మార్చు]ప్రస్తుతం తూర్పుగోదావరిజిల్లా , ఇప్పుడు డాక్టర్ బి. అంబేద్కర్ కోనసీమ జిల్లాగా విడిపోయింది. మలికిపురం లో నివసిస్తున్నారు .గత 30 సంవత్సరాలనుండి సీనియర్ జర్నలిస్ట్ , వ్యాసకర్తగాను పేరొందారు. జర్నలిస్టు గా అనేక వ్యాసాలూ రాసి ఉత్తమ జర్నలిస్ట్ గా అనేక అవార్డులు అందుకున్నారు. ఒకేషనల్ అండ్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు.ఇటీవలే ? (క్వశ్చన్ మార్క్ ) పేరుతో మంచి కవిత్వం పుస్తకం విడుదల చేసారు.
వివాహం
[మార్చు]వీరికి ఉషాజ్యోతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (మహీత్, ప్రణయ్)
ప్రచురితమయిన మొదటి కవిత
[మార్చు]మొదటి కవిత అంకురం, ఆంధ్రభూమి, వీక్లీలో ప్రచురితం అయింది.
రచనల జాబితా
[మార్చు]- 12 కవితా సంపుటాలు ప్రచురితం.
- మూడు నవలలు రాసారు.
- దృశ్యం సీరియల్ గోదావరి దినపత్రికలో 200 రోజులపాటు ప్రచురితం అయ్యింది.
- చిటారు కొమ్మన మిఠాయి పొట్లం కథల సంపుటి దుబాయి దేశంలో ఆవిష్కరించబడింది.
- గల్ప్ కథలు పలు పత్రికల్లో పబ్లిష్ అయ్యాయి.
- ఇంతవరకు 2000 పైనే కవితలు రాశారు.
- 600పైగా కవితలు , మయూరి, ఆంధ్రభూమి, వార్త, ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర ప్రభ, ఎంప్లాయిస్ వాయిస్, గోదావరి , తెలుగు వెలుగు , ఆంధ్రప్రభ , వేకువ , అంకురం , తదితర పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
- కథలు 19-వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి .
- విపుల , చతుర , ఆంధ్రభూమి , మయూరి, ఆంద్రజ్యోతి , స్వాతి ,గోదావరి తదితర పత్రికల్లో పలు కథలు వ్యాసాలు
- 14 నాటకాలు రాసారు . అవి అనేక చోట్ల అనేక ప్రదర్శనలకు నోచుకున్నాయి . ,
- 3 టెలిఫిల్మ్స్ రాశారు .టెలిప్లే అందించారు
- 1000 పైగా వ్యాసాలు , సమీక్షలు , ఆర్టికల్స్ రాసారు. అవి వివిధ పత్రికల్లో ప్రచురితం
- మయూరి వీక్లీలో కాలమిస్ట్ గా పనిచేసారు . వారం వారం ఆర్టికల్స్ రాసేవారు.
- ప్రజాశక్తి దినపత్రిక ఒక సంవత్సరంలో రాజకీయ కార్టూనిస్ట్ గా పనిచేసారు.
- 20 సంవత్సరాలపాటు సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసారు. ఇప్పుడు డెస్క్ జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు.
- రెండు సినిమాలకు పాటలు అందించారు . సుమన్ సాయికుమార్ హీరోగా పల్లె గూటికి పండగ వచ్చింది సినిమాలో మూడు పాటలు రాసారు .
- రెక్కలు తెగిన స్వప్నం నవల విడుదల అయ్యింది .
- ట్రాన్ జెండర్ లైఫ్ స్టొరీ బుక్ తెలుగులో తొలిసారిగా రాసిన ఘనత ప్రతాప్ గారిదే .
ప్రచురితమయిన పుస్తకాల జాబితా
[మార్చు]- పగిలిన అద్దం (కవితా సంపుటి, 2012)
- మట్టిరాతలు కవితా సంపుటి, 2014 )
- దెయ్యం బాబోయ్ (నవల 1998)
- రాలిపోయే కాలం (కవితా సంపుటి 2015)[4]
- దృశ్యం (2016)
- కాకి ఎంగిలి
- కరోనా కవిత్వం
- క్వచన్ మార్క్ కవిత్వం
- గల్ఫ్ వల(స)లో జీవితాలు (2016
- చిటారు కొమ్మన మిఠాయి పొట్లం 2021
- కథలు వివిధ పత్రికల్లో
- రెక్కలు తెగిన స్వప్నం నవల 2024
- ట్రాన్స్ జెండర్ ట్రూ స్టోరీ
- వందలాది కవి సమ్మేళనాల నిర్వహణ
- జాతీయ స్తాయిలో సాంస్కృతిక , రంగస్థల ప్రదర్శనలు ఏర్పాటు చేసారు .
బహుమానాలు
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే కళారత్న అవార్డు 2025 అందుకున్నారు .
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే పద్మభూషణ్ బోయి భీమన్న కవి జీవన సాఫల్య పురస్కారం 2023 (రెండు లక్షలు నగదు బహుమతితో సత్కరించబడ్డారు )ఈయనే ప్రధమ అవార్డుగా నిలిచారు .
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమి చే సాహిత్య పురస్కారం 2024
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే మహాకవి గుర్రం జాషువా పురస్కారం 2017 అందుకున్నారు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం -2016 అందుకున్నాడు
- 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ రాష్ట్ర సభ్యుడిగా నియమించబడ్డారు
- మాప్స్ ద్వారా "సాహిత్య భూషణ్" అవార్డ్ అందుకోడం
- రోటరీ క్లబ్ నుండి "సాహితీ రత్న అవార్డ్"
- కాసుల పురుషోత్తమ కవి పురస్కారం
- అక్షర తపస్వీ బిరుదు
- కోనసీమ కవిరత్న
- సాహిత్య తపస్వీ అవార్డు
- యు నేస్కో క్లబ్ నేషనల్ అవార్డ్
- దుబాయి ఎక్స్లెన్స్ అవార్డు
- వివిధ సాహిత్య సంస్థల కవితల పోటీల్లో అనేకసార్లు ప్రథమ బహుమతి
- గోదావరి పుష్కరాలు కవితా పోటీల్లో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సాధించడం
- తొలి ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం - కన్వీనర్ గా వ్యవహరించడం
- యునేస్కో నుండి లిటరసి అవార్డ్
- దుబాయి దేశం లో నేషనల్ అవార్డ్
- కువైట్ దేశంలో తెలుగు ఖ్యాతి అవార్డ్
- కన్నడ సంస్థ లచే అత్యంత ప్రతిష్టాత్మక మైన కవి సామ్రాట్ బిరుదు అందుకున్నారు
- వివిధ దేశాలు పర్యటన
- అనేక సాహిత్య సంస్తలనుండి వేలాది బిరుదులూ ,వేలాది సత్కారాలు
- శ్రీ శ్రీ కళావేదిక చైర్మెన్ గా కవులకు ప్రోత్సాహం
- ఇంతవరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా జాతీయ శత కవి సమ్మేళనాలు నిర్వహించిన ఘనత ప్రతాప్ కే దక్కుతుంది
- పలు జాతీయ స్థాయి అవార్డులు సొంతం
- కవిరత్న , కవి కోకిల , సాహిత్య భూషణ్ , కవి సామ్రాట్ ,
- అభినవ శ్రీ కృష్ణ దేవరాయలు . కవితా రాజు , నంది , కవి కిరీటీ ,ఎలా లెక్కకు మించి ఎన్నో అవార్డులు అందుకున్నారు
చిత్రమాలిక
[మార్చు]- దస్త్రం:Kathimanda_Pratap_01.jpgకత్తిమండ ప్రతాప్ కు జ్ఞాపిక బహుకరణ
- దస్త్రం:Prathap_Kattimanda_With_Gaddar.jpgగద్దర్ తో కత్తిమండ ప్రతాప్
- దస్త్రం:Prathap_Kattimanda_With_Kavi_Yakoob.jpgకవి యాకూబ్ తో కత్తిమండ ప్రతాప్
- దస్త్రం:Prathap_Kattimanda_sanmanam.JPGకత్తిమండ ప్రతాప్ ను సన్మానిస్తున్న ప్రముఖులు.
మూలాలు
[మార్చు]- ↑ ప్రజాశక్తి, తూర్పు గోదావరి (14 February 2019). "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ స్టేట్ మెంబర్‌గా ప్రతాప్". Dailyhunt. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 December 2020.
- ↑ ఈనాడు, తూర్పు గోదావరి (19 March 2019). "ఉభయ గోదావరి జిల్లాల కవులు, రచయిత సంఘం ఏర్పాటు". Sakshi. the original నుండి 2020-12-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 December 2020.
- ↑ సాక్షి, జిల్లాలు (3 December 2016). "రచయితల వేదిక అధ్యక్షుడిగా కత్తిమండ". Sakshi. the original నుండి 5 December 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 December 2020.
- ↑ ప్రజాశక్తి (17 October 2015). "ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం ప్రారంభం". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 July 2016.