చర్చ:సఖినేటిపల్లి
వశిష్ఠ వారధి
[మార్చు]సఖినేటిపల్లి కి నరసాపురానికి మధ్య 20 నిమిషాల నావ ప్రయాణం అని గుర్తు.నా చిన్నప్పుడు వారధి లేదు. ఇక్కడ గోదావరి చాలా లోతు గాముంటుంది. 3 తాటి చెట్ల లోతు అని చెప్పేవారు కాని నిజానికి కొద్దిగా దూరంగా ఉన్న, చాలా లోతు అనే విషయం మాత్రం నిజం. అందువల్ల అప్పట్లో ఇక్కడ వారధి నిర్మించబడలేదు. కాని బలకట్టు మీద గోదావరి దాటడం అనే విషయాన్ని నేను అంగీకరించను--మాటలబాబు 12:52, 6 ఆగష్టు 2007 (UTC). -- బల్లకట్టు అనేది కాలువలపై ఉపయోగించబడేది.నరసాపురం-సఖినేటిపల్లె'లంక'ల మద్య ప్రతి సంవత్సరం పాట ద్వారా ఫంటు అనునది నడుపుతారు దీన్లో కార్లు కూడా నిలిపే చోటుంటుంది. ఇదికాక తొందరగా దాటాలనుకొనే వారి కోసం మర పడవలుకూడా నడుపబడుతున్నవి.vissu 13:04, 6 ఆగష్టు 2007 (UTC)
- నేను ప్రయాణం చేసిన సమయం లొ (1985-88)ఉన్న సమయంలొ నావలు(మామూలు పడవలు) మాత్రమే ఉండేవి--మాటలబాబు 13:06, 6 ఆగష్టు 2007 (UTC)
- ఆసమయానికి నేను చాలా చిన్నవాడ్ని అప్పటి విషయాలు నాకు సరిగా తెలియవు.vissu 13:30, 6 ఆగష్టు 2007 (UTC)
- ఉభయ గోదావరి జిల్లాలను నరసాపురం - సఖినేటిపల్లి మధ్య కలిపేందుకు వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి.మైటాస్ కంపెనీ నుంచి సబ్‌కాంట్రాక్ట్ పొందిన కోస్టల్ ఇంజనీరింగ్ కనస్ట్రక్షన్ కంపెనీ రంగంలోకి దిగింది.2008 ఏప్రిల్ 15న అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు.నదిపై 391.50 మీటర్ల పొడవు, 7.5 మీటర్ల వెడల్పు(రోడ్డు)తో వంతెన , రోడ్డుకిరువైపులా 1.5 మీటర్ల చొప్పున పుట్‌పాత్‌లు ఏర్పాటవుతాయి. నదిలో 3 స్తంభాలుంటాయి.
ఇప్పుడు ఇక ఆ మేటాస్ వంతెన కథ ముగిసినట్టే. ఇక్కడ వంతెన కోసం యన్టీ రామారావు, చంద్రబాబు, రాజశేఖరరెడ్డిలు ముగ్గురూ శంఖుస్థాపనలు చేశారు. కానీ ఏదీ ప్రారంభం కాలేదు. ఇకపోతే ఫంటు అనేది బల్లకట్టు వలె చూడడానికి ఉండి, 60 హార్స్ పవర్ ఇంజిన్‌తో నడపబడుతుంది. దానిపై ఖాళీ పెద్ద లారీ లేదా లోడెడ్ మినీ లారీలు కూడా వెళ్ళగలవు. ఇప్పటికీ కార్లు కూడా దీనిపై రవాణా అవుతున్నాయి. ఇప్పుడు ప్రయాణం పది నుంచి పదిహేను నిమిషాలు పడుతోంది. పడవలు/నావలు కూడా ఉన్నాయి. వేలం ద్వారా కాంట్రాక్టు నిర్ణయించడం కూడా కరెక్టే. దీని గురించి రామేశ్వరం (సఖినేటిపల్లి) వ్యాసంలో నేను రాసాను. ballasatish