యమగోల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యమగోల
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం తాతినేని రామారావు
నిర్మాణం వెంకటరత్నం
రచన డి.వి.నరసరాజు
తారాగణం నందమూరి తారక రామారావు,
జయప్రద,
రావుగోపాలరావు,
కైకాల సత్యనారాయణ,
అల్లు రామలింగయ్య
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ పల్లవీ ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

యమగోల ఎన్టీ రామారావు, జయప్రద, రావుగోపాలరావు ప్రధాన పాత్రల్లో నటించగా, తాతినేని రామారావు దర్శత్వం వహించిన 1977 నాటి డివైన్ కామెడీ ప్రధానమైన తెలుగు చలనచిత్రం. బెంగాలీలో విజయవంతమైన యమాలయే జీవంత మానుష్ సినిమా యమగోలకు మాతృక. కెమెరామేన్ గా పనిచేస్తున్న వెంకటరత్నం ఈ సినిమాతో నిర్మాతగా మారారు. మాతృకలో మార్పులు చేసి చిత్రానువాదం, మాటలు రాసిన నరసరాజుకి ఈ సినిమా చాలా పేరు తీసుకువచ్చింది.

తారాగణం[మార్చు]

నిర్మాణం[మార్చు]

అభివృద్ధి[మార్చు]

యమాలయే జీవంత మానుష్ అన్న బెంగాలీ సినిమా అక్కడ చాలా విజయవంతమైంది. అది 1958 నాటి బ్లాక్ అండ్ వైట్ సినిమా, యముడు పొరపాటున ఒకరి బదులు మరొకరిని తీసుకువెళ్తే ఏం జరుగుతుందన్న అంశంపై తీసిన డివైన్ కామెడీ అది. కెమెరామెన్ గా పనిచేస్తూ, నిర్మాతగా ఎదుగుదామన్న ప్రయత్నాలు చేస్తున్న వెంకటరత్నం ఈ బెంగాలీ సినిమా హక్కులు తీసుకుని తెలుగులో ఎన్టీఆర్ తో తీద్దామని ప్రయత్నాలు ప్రారంభించారు.
అప్పటికి విజయవంతమైన దర్శక రచయితలుగా పేరొందుతున్న బాపురమణలను సినిమా రచన దర్శకత్వానికి బుక్ చేసుకున్నారు. అయితే సినిమా చూశాకా వారిద్దరికీ అది తాము తీయగలిగే సినిమా కాదని స్పష్టమైంది. దాంతో బాపురమణలు నిర్మాతకి- సినిమా చాలా మంచి సినిమాగానూ, విజయవంతంగానూ నిలుస్తుందని, కాకుంటే తాము తీసే శైలి చిత్రం కాదని వేరే వాళ్ళని పెట్టుకని తీయమని చెప్పి ప్రాజెక్టు వదిలేశారు.
దాంతో గుండమ్మకథ, పెద్దమనుషులు వంటి విజయవంతమైన హాస్యచిత్రాలు రాసిన డి.వి.నరసరాజును రచయితగా తీసుకుని తెలుగువాతావరణానికి అనుగుణంగా చిత్రానువాదం తిరగరాయించుకున్నారు.[1]

విడుదల[మార్చు]

సినిమా విడుదలై చాలా విజయవంతమైంది. అప్పటి సమకాలీన రాజకీయాలపై సినిమాలో వేసిన వ్యంగ్యాస్త్రాలను కూడా ప్రేక్షకులు చాలా ఆస్వాదించారు.

రీమేక్[మార్చు]

సినిమాని హిందీలో తెరకెక్కించేందుకు కూడా హక్కులు కొనుక్కుని నిర్మాత వెంకటరత్నం హిందీలోనూ పునర్నిర్మించారు. హిందీ రీమేక్ కి కూడా ఎన్టీ రామారావునే హీరోగా, తాతినేని రామారావుకే దర్శకత్వ బాధ్యతలు అప్పగించి, డి.వి.నరసరాజు చేతే చిత్రానువాదం రాయించి తీశారు.[1]

పాటలు[మార్చు]

  • ఆడవె అందాల సురభామిని పాడవె కళలన్ని ఒకటేనని - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల , రచన: వేటూరి సుందర రామమూర్తి
  • ఓలమ్మీ తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా - బాలు, సుశీల, రచన: వేటూరి సుందర రామమూర్తి
  • చిలక కొట్టుడు కొడితే - బాలు, సుశీల, రచన: వేటూరి సుందర రామమూర్తి
  • సమరానికి నేడే ఆరంభం - బాలు , రచన: శ్రీరంగం శ్రీనివాసరావు
  • వయసు ముసురు - బాలు , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి
  • గుడివాడ వెళ్ళాను - సుశీల రచన: వేటూరి సుందర రామమూర్తి

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ముళ్ళపూడి, వెంకటరమణ (July 2013). (ఇం)కోతి కొమ్మచ్చి (6 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి.

డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

చిత్ర కథ[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=యమగోల&oldid=4140701" నుండి వెలికితీశారు