Jump to content

మందాడి ప్రభాకర రెడ్డి

వికీపీడియా నుండి
డాక్టర్. ప్రభాకర రెడ్డి
జననం
మందాడి ప్రభాకర రెడ్డి

(1935-10-08)1935 అక్టోబరు 8
మరణం1997 నవంబరు 26(1997-11-26) (వయసు: 62)
చదువువైద్యవిద్య
వృత్తినటుడు, రచయిత, వైద్యుడు
క్రియాశీలక సంవత్సరాలు1960-1988
పిల్లలుగంగ, శైలజ, లక్ష్మి, విశాలాక్షి[1]
తల్లిదండ్రులు
  • లక్ష్మారెడ్డి (తండ్రి)
  • కౌసల్య (తల్లి)

ఎం. ప్రభాకర రెడ్డి గా ప్రసిద్ధులైన డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి (అక్టోబర్ 8, 1935 - నవంబర్ 26, 1997) తెలుగు సినిమా నటుడు, కథా రచయిత. స్వతహాగా వైద్యుడు అయినా నటన పై గల అనురక్తితో చాలా తెలుగు చిత్రాలలో నటించాడు. కొన్ని హిందీ, తమిళ చిత్రాలలో కూడా నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో నటించాడు. 37 ఏళ్ల కెరీర్‌లో 500కు పైగా సినిమాల్లో నట్టించిన నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా. కార్తీక దీపం వంటి అనేక సినిమాలకు కథలను అందించాడు.[2]

ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా చిరంజీవి వరకు కూడా చాలా మంది సినిమాల్లో విలన్‌గానే కాకుండా అనేక పాత్రల్లో నటించాడు ప్రభాకర రెడ్డి. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు అంతకంటే అద్భుతమైన వైద్యుడు కూడా. ఓ వైపు వైద్యవృత్తితో పాటు నటనలోనూ సత్తా చూపించారు ఈయన. తెలుగు సినీ పరిశ్రమ ఒకప్పుడు మద్రాస్‌లోనే ఉండేది. 90ల మొదట్లో దాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. దానికోసం ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా చాలా మంది ఎంతో కృషి చేసారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో స్టూడియోలు నిర్మించడం.. సినిమా హాల్స్ కట్టడం లాంటివి చేసారు. అలాంటి సమయంలో ప్రభాకర రెడ్డి మాత్రం పేద సినీ కళాకారుల కోసం తన 10 ఎకరాల పొలం ఇచ్చేసారు. అది కూడా ఉచితంగా.. అలా కట్టుకున్న కాలనీనే ఇప్పుడు చెప్పుకుంటున్న చిత్రపురి కాలనీ. అందుకే దానికి ప్రభాకర రెడ్డి చిత్రపురి కాలనీ అంటారు. ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నాడు ఆయన 10 ఎకరాలను దానం చేసాడు. అందుకనే హైదరాబాదు లోని మణికొండలో ఈయన స్మారకార్ధం డా. ప్రభాకరరెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురికి ఈయన పేరుపెట్టారు.

జీవిత సంగ్రహం

[మార్చు]

ప్రభాకరరెడ్డి, సూర్యాపేట జిల్లా, తుంగతుర్తిలో లక్ష్మారెడ్డి, కౌసల్య దంపతులకు 1935, అక్టోబర్ 8 న జన్మించాడు. తుంగతుర్తిలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత హైదరాబాదులోని సిటీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. 1955 నుండి1960 వరకు ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్యవిద్యను అభ్యసించాడు. 1960లో గుత్తా రామినీడు దర్శకత్వం వహించిన చివరకు మిగిలేది సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాలో ఒక మానసిక వైద్యుని పాత్ర పోషించాడు. ఈయన సినీ ప్రస్థానంలో మొత్తం 472 సినిమాల్లో నటించాడు. మంచి విజయాలను సాధించిన పండంటి కాపురం, పచ్చని సంసారం, ధర్మాత్ముడు, గృహప్రవేశం, గాంధీ పుట్టిన దేశం, కార్తీకదీపం, నాకు స్వతంత్రం వచ్చింది వంటి సినిమాలతో పాటు మొత్తం 21 తెలుగు సినిమాలకు కథలను అందించాడు.

1996లో కామ్రేడ్ అనే సినిమాకు కథను అందించి దర్శకత్వం వహించాడు. ఆ సినిమాలో కె.జి.సత్యమూర్తి, మాస్టర్జీ పాటలున్నాయి.

ప్రభాకరరెడ్డి 1997, నవంబరు 26 తేదీన తన 62వ యేట హైదరాబాదులో మరణించాడు.[3]

పురస్కారాలు

[మార్చు]

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరంసినిమా పేరునటించిన పాత్ర
1960చివరకు మిగిలేదిమానసిక వైద్యుడు
1961పాండవ వనవాసం
1962భీష్మశంతనుడు
1962మహామంత్రి తిమ్మరుసువీరభద్ర గజపతి
1963నర్తనశాలకర్ణుడు
1963పునర్జన్మ
1963శ్రీ కృష్ణార్జున యుద్ధంశివుడు
1964బొబ్బిలి యుద్ధం
1966నవరాత్రిపోలీస్ ఇన్ స్పెక్టర్
1966పల్నాటి యుద్ధంకన్నమ నాయుడు
1967శ్రీ కృష్ణావతారంబలరాముడు
1967ఉమ్మడి కుటుంబం
1968బ్రహ్మచారి
1968వింత కాపురంరంగరాజు
1968రణభేరి
1969ఆత్మీయులు
1969నాటకాల రాయుడురామారావు, బుజ్జిబాబు అన్నయ్య
1969భలే తమ్ముడుఇన్ స్పెక్టర్ శేఖర్
1970అక్కా చెల్లెలుసీనియర్ లాయర్
1970పెళ్లి కూతురు
1970హిమ్మత్
1970లక్ష్మీ కటాక్షంరాజు
1971మట్టిలో మాణిక్యం
1971మోసగాళ్ళకు మోసగాడు
1971బస్తీ బుల్ బుల్
1971పెత్తందార్లు
1971చలాకీ రాణి కిలాడీ రాజాదొంగలముఠా నాయకుడు
1972బాల భారతం
1972పండంటి కాపురం
1972పాపం పసివాడు
1972పిల్లా పిడుగారీకు
1972మావూరి మొనగాళ్ళు
1973మాయదారి మల్లిగాడు
1973సంసారం సాగరం
1974అల్లూరి సీతారామరాజుమల్లుదొర
1974అందరూ దొంగలే
1974దీక్ష
1974దేవదాసు
1975ఎదురులేని మనిషి
1975జేబుదొంగ
1976ఉత్తమురాలు
1976భక్త కన్నప్ప
1976రామరాజ్యంలో రక్తపాతం
1977కల్పనడాక్టర్
1977ఖైదీ కాళిదాసుజగదీష్ చంద్ర ప్రసాద్
1977దాన వీర శూర కర్ణధర్మరాజు
1977యమగోలరమణమూర్తి/రామశాస్త్రి
1978ఇంద్రధనుస్సు
1978కటకటాల రుద్రయ్య
1978అనుగ్రహంభైరవుని సేవకుడు
1978తల్లే చల్లని దైవం
1978సొమ్మొకడిది సోకొకడిదిబ్లాక్ టైగర్
1979గోరింటాకు
1979కార్తీక దీపంకథా రచయిత, నటుడు : ధనుంజయ రావు
1979రంగూన్ రౌడీ
1980ఏడంతస్తుల మేడ
1980నకిలీ మనిషిసి.ఐ.డి. ప్రభాకర్
1980సర్దార్ పాపారాయుడు
1980యువతరం కదిలింది
1981కిరాయి రౌడీలు
1981పార్వతీ పరమేశ్వరులు
1981ప్రేమాభిషేకం
1981తోడు దొంగలు
1981హరిశ్చెంద్రుడు
1982బొబ్బిలి పులి
1982నా దేశంకైలాసం
1983రుద్రకాళి
1984అల్లుళ్ళు వస్తున్నారు
1984అనుబంధం
1984బాబులుగాడి దెబ్బ
1984మెరుపు దాడిబహదూర్
1984సత్య హరిశ్చంద్ర
1985అగ్ని పర్వతంరుద్రయ్య
1985బుల్లెట్
1985చట్టంతో పోరాటంభారతి తండ్రి
1985ఓ తండ్రి తీర్పు
1985శ్రీ దత్త దర్శనంఅత్రి
1987విశ్వనాథ నాయకుడు
1987వక్త్ కా షాహేన్షా
1988అంతిమతీర్పు
1988ఊరేగింపు
1988చిన్నోడు పెద్దోడు
1989శ్రీరామచంద్రుడుబంగారయ్య
1990అన్న-తమ్ముడు
1990చిన్న కోడలు
1991అల్లుడు దిద్దిన కాపురం

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (25 July 2021). "'నాన్న మూడుసార్లు 'మా' అధ్యక్షుడిగా చేశాడు, వాళ్లకి పెన్షన్‌ ఇచ్చేవారు'". Archived from the original on 26 November 2022. Retrieved 26 November 2022.
  2. Chauhan, Ramesh (31 December 2016). "డాక్టర్ యాక్టర్... తెలంగాణ తేజం". Mana Telangana. Archived from the original on 26 November 2022. Retrieved 26 November 2022.
  3. "బహుముఖ ప్రతిభావంతుడు - హెచ్.రమేష్ బాబు - నవతెలంగాణ - సోపతి - 29-11-2015". Archived from the original on 2016-09-13. Retrieved 2020-06-18.