అల్లూరి సీతారామరాజు (సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అల్లూరి సీతారామరాజు
(1974 తెలుగు సినిమా)
Alluri Seetharamaraju.jpg
దర్శకత్వం వి. రామచంద్రరావు
నిర్మాణం జి. హనుమంతరావు,
జి. ఆదిశేషగిరిరావు
రచన త్రిపురనేని మహారధి
కథ (జీవిత గాధ)
చిత్రానువాదం త్రిపురనేని మహారధి
తారాగణం కృష్ణ,
విజయనిర్మల ,
కొంగర జగ్గయ్య,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
కాంతారావు,
చంద్రమోహన్,
ప్రభాకరరెడ్డి,
బాలయ్య,
త్యాగరాజు,
కె.వి.చలం,
మంజుల,
జయంతి,
రాజశ్రీ
సంగీతం ఆదినారాయణరావు
నేపథ్య గానం ఘంటసాల,
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,
రామకృష్ణ,
పి.సుశీల,
ఎల్.ఆర్. ఈశ్వరి
గీతరచన శ్రీశ్రీ,
సి.నారాయణ రెడ్డి,
ఆరుద్ర,
కొసరాజు,
ఆదినారాయణరావు
సంభాషణలు త్రిపురనేని మహారధి
ఛాయాగ్రహణం వి.ఎస్.ఆర్. స్వామి
నిడివి 187 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అల్లూరి సీతారామరాజు, 1974లో విడుదలైన తెలుగు సినిమా. ప్రఖ్యాత స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు జీవిత కథను తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో మొట్టమొదటి సినిమా స్కోప్ చిత్రం. కృష్ణ సినీ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా పేరుపొందింది. కృష్ణకి ఇది 100 వ చిత్రం.

చిత్రకథ[మార్చు]

రామరాజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అంతమొందించి స్వతంత్ర భారత స్థాపనకు కృషి చేస్తుంటాడు. అవగాహన కోసం దేశమంతటా పర్యటిస్తాడు. అతని ప్రేయసి సీత అతని కోసం ఎదురుచూస్తుంది. పర్యటన నుండి తిరిగివచ్చిన రామరాజు తనకు పెళ్ళి పట్ల ఆసక్తి లేదని, దేశ దాస్య విముక్తికి పాటుపడతానని చెబుతాడు. పెళ్ళి పీటలమీద సీత మరణిస్తుంది. ఆమె గుర్తుగా రామరాజు తన పేరును "సీతా రామరాజు"గా మార్చుకుంటాడు. రామరాజు మన్యంలో ప్రజల కష్టాలకు చలించి వారితరఫున బ్రిటిష్ అధికారులతో పోరాడుతాడు. రామరాజును అదుపు చేయడానికి ప్రభుత్వం రూధర్ ఫర్డ్ అనే అధికారిని నియమిస్తుంది. రామరాజు విప్లవ పోరాటం, అతని మరణం చిత్ర కథ.

పాత్రలు పాత్రధారులు[మార్చు]

 1. అల్లూరి సీతారామరాజు - కృష్ణ
 2. గంటం దొర - గుమ్మడి
 3. మల్లు దొర - ప్రభాకర్ రెడ్డి
 4. అగ్గిరాజు - బాలయ్య
 5. పడాలు - కాంతారావు
 6. వీరయ్యదొర - రావు గోపాలరావు
 7. గోవిందు - చంద్రమోహన్
 8. కోయరాముడు - కొమ్మినేని శేషగిరిరావు
 9. రూథర్ ఫర్డ్ - జగ్గయ్య
 10. మేజర్ గుడాల్ - రాజనాల
 11. బాస్టియన్ - త్యాగరాజు
 12. బ్రేకన్ - పేకేటి శివరాం
 13. పిళ్లె - కె.వి.చలం
 14. కవర్ట్ - జగ్గారావు
 15. హైటర్ - ఆనంద్ మోహన్
 16. సింగన్న - అల్లు రామలింగయ్య
 17. లింగన్న - సాక్షి రంగారావు
 18. సీత - విజయనిర్మల
 19. రత్తి - మంజుల
 20. గంగమ్మ - జయంతి
 21. సింగి - రాజశ్రీ
 22. ఫ్లారెన్స్ - నందితాబోస్
 23. నారాయణమ్మ - పండరీబాయి

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

 1. జమైరే జోరు లగాడి - రచన: కొసరాజు - గానం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్. ఈశ్వరి
 2. తెలుగువీర లేవరా...దీక్షబూని సాగరా...దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా - రచన: శ్రీశ్రీ - గానం: ఘంటసాల, వి.రామకృష్ణ
 3. రగిలింది విప్లవాగ్ని ఈ రోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు - రచన: అరుద్ర - గానం: ఎస్.పి.
 4. వస్తాడు నారాజు ఈ రోజు రానె వస్తాడు - రచన: సినారె - గానం: పి.సుశీల
 5. విప్లవం మరణించదు వీరుడు మరణించడు - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.
 6. హ్యాపీ హ్యాపీ న్యూ యియర్

అవార్డులు[మార్చు]

 • 1974 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు
 • "తెలుగు వీర లేవరా" పాటకై శ్రీశ్రీకి జాతీయ బహుమతి

విశేషాలు[మార్చు]

దేవుడు చేసిన మనుషులు చిత్రం విజయవంతమైన తర్వాత కృష్ణ ఈ చిత్రనిర్మాణం చేపట్టారు. వి.రామచంద్రరావు దర్శకునిగా కృష్ణకు మంచి చిత్రాలు ఇచ్చాడు. అల్లూరి సీతారామరాజు అంతర్నాటకంగా అసాధ్యుడు (1968) చిత్రంలో (రామచంద్రరావు దర్శకత్వంలో)కృష్ణ కనిపించారు. ఈ నేపథ్యంలో వి.రామచంద్రరావు దర్శకత్వంలో చిత్రం మొదలైంది. త్రిపురనేని మహారథి అద్భుతమైన స్క్రీన్ ప్లే చిత్రానికి పెట్టనికోట అయ్యింది. ఆదినారాయణరావు సంగీతం, శ్రీశ్రీ, సినారె, ఆరుద్రల పాటలు, సినిమాస్కోపు, భారీ తారాగణం (జగ్గయ్య, గుమ్మడి, కాంతారావు, చంద్రమోహన్, ప్రభాకరరెడ్డి, అల్లు, కె.వి.చలం, విజయనిర్మల, మంజుల, జయంతి, రాజశ్రీ మొదలైనవారు), అన్నిటినీ మించి కృష్ణ జీవితకాలపు అత్యున్నత నటన చిత్రాన్నిఒక "మాగ్నమ్ ఓపస్" చేశాయి. అక్కినేని గారితో ఈ సినిమా తీయాలని తాతినేని ప్రకాశరావు వారు ప్రయత్నించారు. కాని వీలుకాలేదు. (సీతారామరాజు కథలో సినిమాకు సరిపడిన మెలోడ్రామా లేదని ఎన్.టి.ఆర్ ఈ చిత్ర నిర్మాణాన్ని, స్క్రిప్ట్ (ప్రముఖ నాటక రచయిత పడాల రామారావుచే) రాయించి కూడా విరమించారని చెబుతారు.) దేవదాసు నిర్మాత డి.ఎల్. శోభన్ బాబుతో ఈ సినిమా తీయాలని చూసినా ఫలించలేదు. 1973 డిసెంబరు 12న ముహూర్తం జరిగింది. చిత్ర నిర్మాణ సమయంలోనే దర్శకులు రామచంద్రారావు (47) ఫిబ్రవరి 14న రాయవేలు ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. తర్వాత దర్శకత్వ బాధ్యతను స్వీకరించమని కృష్ణగారికి చాలామంది చెప్పినా కె.ఎస్.ఆర్. దాస్ గారికి ఆ బాధ్యతను అప్పగించారు.

 • ఈ సినిమా 19 కేంద్రాలలో 100రోజులు నడిచింది.
 • ఇది తెలుగులో మొట్టమొదటి కలర్ సినిమాస్కోప్ చిత్రం.[1]. అంతకు ముందు హిందీలో "పాకీజా" చిత్రానికి కమల్ అమ్రోహీ సినిమా స్కోప్ పరికరాలు (కెమెరాలు, కటకాలు) దిగుమతి చేసుకొన్నాడు. వాటినే ఈ సినిమా కోసం కృష్ణ తీసుకొన్నాడు.
 • పూర్తి స్థాయి ఇంగ్లీషు పాట ఉన్న తొలి (తెలుగు) చిత్రం ఇదే. ఈ పాట ఆదినారాయణరావు రాయటం విశేషం.
 • ఇది కృష్ణ 100వ చిత్రం కావడం విశేషము.
 • షూటింగ్ అధికంగా చిత్తూరు జిల్లా మదనపల్లె సమీఒంలోని హార్స‌లీ కొండలలో జరిగింది. షూటింగ్ మధ్యలో దర్శకుడు వి.రామచంద్రరావు మరణించాడు. మిగిలిన దర్శకత్వ బాధ్యతలను కె.ఎస్.ఆర్. దాస్ తీసుకొన్నాడు.
 • ఆఫ్రో - ఏషియన్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడి బహుమతిని అందుకుంది.
 • ఇంక్విలాబ్ జిందాబాద్ అనే పేరుతో హిందీలోకి అనువదించారు.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]