Jump to content

వి. ఎస్. ఆర్. స్వామి

వికీపీడియా నుండి
(వి.ఎస్.ఆర్. స్వామి నుండి దారిమార్పు చెందింది)
వి.ఎస్.ఆర్. స్వామి
వి.ఎస్.ఆర్. స్వామి
జననం
వి.ఎస్.ఆర్. స్వామి

జూలై 15 1935
మరణం2008 నవంబరు 11(2008-11-11) (వయసు 73)
మరణ కారణంగుండెపోటు
ఇతర పేర్లువి.ఎస్.ఆర్. స్వామి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
దర్శకుడు, ఛాయాగ్రాహకుడు

వి.ఎస్.ఆర్. స్వామి సుమారు 100 సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు కృష్ణా జిల్లా, గుడివాడ మండలం, వలివర్తిపాడు గ్రామంలో జూలై 15 1935 న జన్మించాడు.[2] ఇతనికి చిన్నప్పటి నుండి ఫోటోగ్రఫీపైన మక్కువ ఎక్కువ. ఇతడు తన గురువైన సి.నాగేశ్వరరావు వద్ద ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు అయిన రవికాంత్ మెగా, ఎస్.శంకర్ ల దగ్గర పనిచేశాడు. వీరాభిమన్యు, బందిపోటు చిత్రాలకు కెమెరా ఆపరేటర్‌గా పనిచేశాడు. కృష్ణ నటించిన అసాధ్యుడు చిత్రంతో మొదటి సారిగా ఇతడు ఛాయాగ్రాహకుడయ్యాడు. ఇతడు సినిమాటోగ్రఫీలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. తెలుగులో అగ్రనటుల చిత్రాలకు ఎక్కువగా ఛాయాగ్రాహకుడిగా పనిచేసింది ఇతనే. 1986లో నిర్మింపబడిన తొలి తెలుగు 70 ఎం.ఎం. సినిమా సింహాసనంకు ఇతడే ఛాయాగ్రాహకుడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు ఎం.వి.రఘు, ఎస్. గోపాలరెడ్డి, రాం ప్రసాద్ లు ఇతని శిష్యులే.

వెండితెరపై అద్భుతాలు

[మార్చు]

మోసగాళ్ళకు మోసగాడు సినిమా క్లైమాక్స్ తీస్తున్నారు. హీరో కృష్ణ, విలన్ని గట్టిగా గూబమీద కొట్టాలి. ఆ దెబ్బకి అతనికి లోకమంతా గిర్రున తిరిగే ఎఫెక్టు రావాలి. ఈ నన్నివేశం ఎలా తీయాలి?. అందరూ టెన్షన్ పడుతున్నారు గానీ, కెమెరామన్ మాత్రం తాపీగా ఆలోచిసూ కూర్చున్నారు. కాసేపటి తర్వాత లారీ టైర్ తెమ్మని పురమాయించారు. దాన్ని తాడుతో వేలాడదీశారు. "ఈ లారీటైర్తో ఈయనగారు ఏం చేస్తారా" అని యూనిట్ అంతా వళ్లంతా కళ్ళు చేసు కుని మరీ చూస్తుంటే, ఆ కెమెరామన్ తన కెమెరాతో సహా ఆ లారీటైర్లో కూర్చుని దాన్ని గిర్రున తిప్పమని ఆదేశించారు. అలా టైర్లో గిర్రున తిరుగుతూ ఆ సీన్ షూట్ చేశారు. ఆ కాలంలో యిప్పటిలా క్రేనులూ, గ్రాఫిక్సూ లేనప్పటికీ కేవలం తన బుర్రతోనే కెమెరా కు పని చెప్పి వెండితెరపై వండర్స్ చేశారు. ఆయన ఛాయాగ్రహణ శాఖలో పూనా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి వచ్చిన తొలి బృందంలో ఒకరు. రవికాంత్ నగాయిచ్ లాంటి మహామహుల దగ్గర శిష్య రికం చేసిన స్వామి అసాధ్యుడు(1968)తో కెమెరామన్ గా మారారు.[3] తెలుగు సినిమాని సాంకేతికంగా కీలక మైన మలుపు తిప్పిన ఆయన. కలర్, సినిమా స్కోప్, 70 ఎం.ఎం. వంటి ప్రక్రియల్లో తొలినాళ్లలోనే ప్రయో గాలకు శ్రీకారం చుట్టారు. 250 పైగా సినిమాలకు ఛాయాగ్రహణం సమకూర్చారు. మలయాళం మినహా దాదాపు అన్ని భాషల్లోనూ చక్రం (కెమెరా) తిప్పారు. ఆయన ఖాతాలో ఎన్నో విలువైన చిత్రాలు ఉన్నాయి.

హిందీలో 'మహాశక్తిమాన్' అనే త్రీడీ చిత్రం, తెలుగులో ఆపద్బాంధవులు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే ఎదురీత, కలియుగ స్త్రీ అనే సినిమాలను నిర్మించారు. నేటి ప్రసిద్ధ ఛాయాగ్రాహకులు ఎస్.గోపాల్రెడ్డి, ఎమ్వీ రఘు, శరత్, తదితరులు ఈయన దగ్గర శిష్యరికం చేసిన వారే. కెమెరామన్ గా ఆయన చివరి చిత్రం ప్రభాస్ నటించిన 'అడవి రాముడు'.

సినిమాలు

[మార్చు]

ఛాయాగ్రాహకుడిగా

[మార్చు]
====తెలుగు====
  1. అసాధ్యుడు (1968)
  2. కథానాయకుడు (1969)
  3. మోసగాళ్ళకు మోసగాడు (1971)
  4. భలే మోసగాడు (1972)
  5. అందాల రాముడు (1973)
  6. దేవుడు చేసిన మనుషులు (1973)
  7. మంచివాళ్లకు మంచివాడు (1973)
  8. అల్లూరి సీతారామరాజు (1974)
  9. భక్త కన్నప్ప (1976)
  10. సిరిసిరిమువ్వ (1976)
  11. ఎదురీత (1977)
  12. విచిత్ర జీవితం (1978)
  13. యువరాజు (1982)
  14. ఖైదీ (1983)
  15. చట్టంతో పోరాటం (1985)
  16. వేట (1986)
  17. సింహాసనం (1986)
  18. అల్లుడు దిద్దిన కాపురం (1991)
  19. ఆదిత్య 369 (1991)
  20. చినరాయుడు (1992)
  21. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)
  22. రౌడీ ఇన్‌స్పెక్టర్ (1992)
  23. సమరసింహారెడ్డి (1999)
  24. నరసింహ నాయుడు (2001)
  25. భలేవాడివి బాసు (2001)
  26. ఇంద్ర (2002)
  27. కొండవీటి సింహాసనం (2002)
  28. అనగనగా ఓ కుర్రాడు (2003)
  29. అడవి రాముడు (2004)
  30. లక్ష్మీనరసింహా (2004)
  31. విజయేంద్ర వర్మ (2004)
  32. ఒక్క మగాడు (2008)

హిందీ

  1. ఇత్నీ సీ బాత్ (1981)
  2. పాతాళ్ భైరవి (1985)
  3. సింఘాసన్ (1986)
  4. దోస్త్ (1989)

దర్శకుడిగా

[మార్చు]
  1. మహా శక్తిమాన్ (1985)

పురస్కారాలు

[మార్చు]

మరణం

[మార్చు]

నాలుగు దశాబ్దాల పాటు ఛాయాగ్రాహకుడిగా సుదీర్ఘ ప్రయాణం చేసి, ఎన్నో అజరామరమైన చిత్రాలకు తన కెమెరాతో నగిషీలద్దిన మేటి కెమెరామన్ వీయస్ఆర్ స్వామి 2008,నవంబరు 11న మచిలీపట్నంలో గుండెపోటుతో మరణించాడు. మరణించే సమయానికి అతని వయసు 70 సంవత్సరాలు. [5]

మూలాలు

[మార్చు]
  1. "V S R Swamy". Archived from the original on 2016-03-04. Retrieved 2015-12-26.
  2. "ఛాయామాంత్రికుడు వి.ఎస్.ఆర్ స్వామి మనకికలేరు". Archived from the original on 2016-03-05. Retrieved 2015-12-26.
  3. "Cameraman VSR Swamy". By Express News Service. Indian Express. 12 November 2008. Retrieved 20 December 2015.[permanent dead link]
  4. స్వరలాసిక. "ANDHRA PRADESH STATE NANDI FILM AWARDS 1986-1996". తెలుగు సినిమా. ఎల్.వేణుగోపాల్. Retrieved 26 December 2015.
  5. [permanent dead link] వి.ఎస్.ఆర్.స్వామి మరణవార్త]

బయటి లింకులు

[మార్చు]