అందాల రాముడు (1973 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అందాల రాముడు
(1973 తెలుగు సినిమా)
TeluguFilm Andala Ramudu.jpg
దర్శకత్వం బాపు
నిర్మాణం ఎన్.ఎస్. మూర్తి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు - రాము,
లత - సీత,
రాజబాబు - అప్పుల అప్పారావు,
అల్లు రామలింగయ్య - తీతా,
నాగభూషణం - జె.బి.,
ధూళిపాళ - సెక్రెటరీ,
నూతన్‌ప్రసాద్‌ - గిరి బాబు,
సూర్యకాంతం - సావాలమ్మ,
ఝాన్సీ - బాలనాగమ్మ,
సాక్షి రంగారావు,
మాడా - సరంగు,
ధూళిపాళ,
రావికొండలరావు,
రాధాబాయి,
పొట్టిప్రసాద్,
ముక్కామల,
సుమిత్ర,
కాకరాల,
చలపతిరావు,
వరలక్ష్మి,
విశ్వేశ్వరరావు,
కనకదుర్గ (టైటిల్స్ పాటలో నృత్యకారిణి)
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం మంగళంపల్లి బాలమురళీకృష్ణ,
వి.రామకృష్ణ,
సుశీల
నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి,
రాజు - శేషు,
సుందరం
ఛాయాగ్రహణం వి.ఎస్.ఆర్. స్వామి
కూర్పు అక్కినేని సంజీవరావు,
మాడపాటి రామచంద్రయ్య
నిర్మాణ సంస్థ చిత్రకల్పన
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

అందాల రాముడు బాపు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, లత, నాగభూషణం తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన 1973 నాటి తెలుగు చలన చిత్రం. సినీమాలో 80 శాతం గోదావరిలో లాంచీ మీద సాగుతుంది. బాపు రమణ ల 'అపూర్వ'సృష్టి ఈ చిత్రం. మిని గ్లోబు ను, రాజహంస, జనతా పడవలలో మనం చూడవచ్చు. అన్నిరకాల (మధ్య తరగతి?? మాత్రమే కాదు, పై తరగతి కూడా) మనస్తత్వాలూ ఇందులో దర్శనమిస్తాయి. రాముడు (మంచి బాలుడు), ప్రేమా (అమా)యకురాలు) సీత, తీతా, అప్పుల అప్పారావు, పెసరట్ల సావాలమ్మ, దొంగ భక్తులు, దొంగ అభక్తులు (అథీయిస్టులు), అహంకారులు ఇలా అన్నిపాత్రల్ని ఒక తాడులా పేని ఆ తాటితో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు బాపు రమణలు. మహదేవన్ సంగీతంలో రామకృష్ణ, సుశీల పాడిన పాటలన్నీ హిట్టే. "అబ్బోసి బుల్లెమ్మ, ఎదగడానికెందుకురా తొందరా, మము బ్రొవమని చెప్పవె, కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా, హరికథ ప్రతీపాటా వినులవిందే. తొలి విడుదల లో చిత్రాన్ని ప్రేక్షకులు సరిగా ఆదరించలేదు. (బాపు తన చిత్రాల గురించి వేసిన కార్టూన్లలో ఈ చిత్ర ఫలితాన్ని మునిగి పోతున్న పడవగా చిత్రించారు) తరువాత తరువాత తెలుగులో ఒక క్లాసిక్‌గా ఎదిగింది. ఇటివల వచ్చిన గోదావరి చిత్రంలో అందాలరాముడు ఛాయలు కనిపిస్తాయి.

థీమ్స్, ప్రభావాలు[మార్చు]

అందాల రాముడు దర్శకుడు బాపుకి ప్రముఖ హిందుస్తానీ సంగీత విద్వాంసుడు బడే గులాం అలీ ఖాన్పై చాలా అభిమానం. ఈ సినిమాలో జనతా కాలనీకి బామ్మగారిని చూసేందుకు సీత కార్లో వచ్చినప్పుడు రేడియోలోంచి బడే గులాం అలీ ఖాన్ ఆలపించిన యాద్ పియా టుమ్రీ వస్తూంటుంది. బడేపై అభిమానంతోనే కావాలనే ఆ పాట పెట్టినట్టు బాపు వెల్లడించారు.[1] బాపురమణల బాల్యమిత్రుడు, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్లో ఇంజనీరుగా అప్పటికి పనిచేస్తున్న బి.వి.ఎస్.రామారావు (బాపురమణల మాటల్లో సీతారాముడు) వారి సినిమాల నిర్మాణంలో చాలా సహాయం చేశారు. ఈ సినిమా పూర్తిగా గోదావరిపైనే కావడంతో ఆయన బోటు నిర్మించడం నుంచి మొదలుకొని ఎన్నెన్నో ఏర్పాట్లు చేశారు. బాపురమణలు ఈ సినిమాలో కథానాయకుని పాత్రకు సీతారామారావు అంటూ ఆయన పేరే పెట్టారు. అంతేకాక మీ పేరుతో ఓ పాట కూడా తీస్తున్నామంటూ "రాముడేమన్నాడోయ్.. సీతారాముడేమన్నాడోయ్" అంటూ పాటను కూడా పెట్టారు..[2] అయితే అవి సినిమాలోని మూలకథాంశానికి అనువుగానే ఉండడం మరో విశేషం.

పాటలు[మార్చు]

  1. అబ్బోసి చిన్నమ్మా ఆనాటి ముచ్చటలు ఎన్నెన్ని - రామకృష్ణ, సుశీల
  2. ఎదగడానికి ఎందుకురా తొందరా ఎదరా బ్రతుకంతా చిందర - రామకృష్ణ
  3. కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా మెరిసే గోదారిలో విరబూసిన - రామకృష్ణ, సుశీల
  4. మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ మము - రామకృష్ణ
  5. మెరిసిపోయే ఎన్నెలాయె పరుపులాంటి తిన్నెలాయె - సుశీల
  6. పలుకే బంగారమాయెరా అందాల రామ - మంగళంపల్లి బృందం
  7. రాముడేమన్నాడోయి సీతా రాముడేమన్నాడోయి - రామకృష్ణ
  8. సమూహ భొజనంబు సంతోషమైన విందు అంతస్తులన్ని - రామకృష్ణ బృందం

వనరులు[మార్చు]

  1. బాపు, (సత్తిరాజు లక్ష్మీనారాయణ). "నేనూ - సంగీతం 1". గ్రేటాంధ్ర. Retrieved 28 July 2015. CS1 maint: discouraged parameter (link)
  2. బి.వి.ఎస్.రామారావు (అక్టోబర్ 2014). కొసరుకొమ్మచ్చి (3 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి. Check date values in: |date= (help)CS1 maint: discouraged parameter (link)