ఝాన్సీ
ఝాన్సీ | |
---|---|
నగరం | |
Nickname: బుందేల్ఖండ్ ముఖద్వారం | |
Coordinates: 25°26′55″N 78°34′11″E / 25.44862°N 78.56962°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
ప్రాంతం | బుందేల్ఖండ్ |
జిల్లా | ఝాన్సీ |
Founded by | ఓర్చా రాజు |
Elevation | 285 మీ (935 అ.) |
జనాభా (2011 census) | |
• Total | 5,05,693[1] |
• Rank | 57 |
భాషలు | |
• అధికారిక | హిందీ[2] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 284001-2-3-4 |
టెలిఫోన్ కోడ్ | 0510 |
Vehicle registration | UP-93 |
లింగనిష్పత్తి | ♂ 0.905 : ♀ 1.000 |
ఝాన్సీ, ఉత్తర ప్రదేశ్‌లోని చారిత్రిక నగరం. ఇది రాష్ట్రంలో దక్షిణాన, బుందేల్ఖండ్ ప్రాంతంలో పహుజ్ నది ఒడ్డున ఉంది. ఝాన్సీ జిల్లాకు, ఝాన్సీ విభాగానికి ఇది ముఖ్య పట్టణం. బుందేల్‌ఖండ్ ముఖ ద్వారం అని ఈ నగరాన్ని పిలుస్తారు, ఝాన్సీ పహుజ్, బెట్వా నదుల సమీపంలో సముద్రమట్టం నుండి 285 మీటర్ల ఎత్తున ఉంది. ఇది సుమారు న్యూ ఢిల్లీ నుండి సుమారు 420 కిలోమీటర్లు, గ్వాలియరు నుండి 102 కి.మీ. దూరంలో ఉంది.
చరిత్ర
[మార్చు]పురాతన కాలంలో ఝాన్సీ, చందేలా రాజ్‌పుత్ర రాజులకు బలమైన కోటగా ఉండేది. దీనిని బల్వంత్ నగర్ అని పిలిచేవారు. అయితే, 11 వ శతాబ్దంలో చందేలా రాజవంశం క్షీణించిన తరువాత నగరం దాని ప్రాముఖ్యతను కోల్పోయింది. 17 వ శతాబ్దంలో ఓర్చా రాష్ట్రానికి చెందిన రాజా బీర్ సింగ్ దేవ్ 1613 లో ఝాన్సీ కోటను నిర్మించినప్పుడు ఇది మళ్ళీ ప్రాముఖ్యతను సంతరించుకుంది.[3]
1729 లో తన రాజ్యంపై దాడి చేసిన ఫరూఖాబాద్ నవాబు ముహమ్మద్ ఖాన్ బంగాష్ ను ఓడించడంలో తనకు సహాయం చేసినందుకు కృతజ్ఞతా చిహ్నంగా మహారాజా చత్రసాల్, ఝాన్సీని, మరికొన్ని ప్రాంతాలనూ మరాఠా పేష్వా బాజీ రావు I కి అప్పగించాడు. దాంతో ఝాన్సీ, మరాఠా సామ్రాజ్యం లోకి వచ్చింది.[3]
18 వ శతాబ్దంలో, ఝాన్సీ పట్టణం మరాఠా ప్రాంతీయ రాజధానిగా ఉండేది. తరువాత 1804 నుండి 1858 వరకు ఈ భూభాగం బ్రిటిష్ భారతదేశంలో భాగమైనప్పుడు ఝాన్సీ సంస్థానంగా ఉండేది.[3]
స్వాతంత్ర్యం తరువాత, ఝాన్సీని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చేర్చారు
భౌగోళికం, ఆర్థికం
[మార్చు]ఝాన్సీ 25.4333 ఉత్తర అక్షాంశం, 78.5833 తూర్పు రేఖాంశాల వద్ద, సముద్రమట్టం నుండి 284 మీటర్ల ఎత్తున ఉంది.[4] సిట్రస్ పండ్ల జాతులకు ఇక్కడి భూమి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ పండే పంటలలో గోధుమలు, పప్పుధాన్యాలు, బఠానీలు, నూనె గింజలు ముఖ్యమైనవి. నీటిపారుదల అవసరాల కోసం ఈ ప్రాంతం రుతుపవనాలపై ఎక్కువగా ఆధారపడుతుంది. ప్రతిష్ఠాత్మక కాలువ ప్రాజెక్టు (రాజ్‌ఘాట్ కాలువ) కింద, ఝాన్సీ, లలిత్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని కొంత భాగంలో నీటిపారుదల కోసం ప్రభుత్వం కాలువలను నిర్మిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం (ధాన్యం, నూనె గింజలతో సహా) గొప్ప ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉంది.[5] నగరం ఇత్తడి వస్తువుల తయారీ కేంద్రంగా కూడా ఉంది.[6]
శీతోష్ణస్థితి
[మార్చు]శీతోష్ణస్థితి డేటా - Jhansi (1981–2010, extremes 1901–2012) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 33.8 (92.8) |
39.4 (102.9) |
43.3 (109.9) |
46.2 (115.2) |
48.0 (118.4) |
47.8 (118.0) |
45.6 (114.1) |
42.2 (108.0) |
40.6 (105.1) |
40.6 (105.1) |
38.1 (100.6) |
33.1 (91.6) |
48.0 (118.4) |
సగటు అధిక °C (°F) | 23.4 (74.1) |
27.5 (81.5) |
34.0 (93.2) |
39.6 (103.3) |
42.4 (108.3) |
40.5 (104.9) |
34.4 (93.9) |
32.5 (90.5) |
33.5 (92.3) |
34.1 (93.4) |
30.0 (86.0) |
25.4 (77.7) |
33.1 (91.6) |
సగటు అల్ప °C (°F) | 8.1 (46.6) |
11.1 (52.0) |
16.7 (62.1) |
22.6 (72.7) |
26.7 (80.1) |
27.5 (81.5) |
25.1 (77.2) |
23.9 (75.0) |
23.2 (73.8) |
19.5 (67.1) |
13.8 (56.8) |
9.5 (49.1) |
19.0 (66.2) |
అత్యల్ప రికార్డు °C (°F) | 1.2 (34.2) |
0.6 (33.1) |
5.3 (41.5) |
10.1 (50.2) |
15.1 (59.2) |
18.5 (65.3) |
20.3 (68.5) |
18.3 (64.9) |
16.7 (62.1) |
10.7 (51.3) |
1.1 (34.0) |
0.3 (32.5) |
0.3 (32.5) |
సగటు వర్షపాతం mm (inches) | 8.5 (0.33) |
9.2 (0.36) |
10.0 (0.39) |
2.6 (0.10) |
15.5 (0.61) |
92.3 (3.63) |
238.9 (9.41) |
263.1 (10.36) |
168.3 (6.63) |
28.4 (1.12) |
5.3 (0.21) |
3.6 (0.14) |
845.6 (33.29) |
సగటు వర్షపాతపు రోజులు | 0.8 | 1.0 | 0.8 | 0.5 | 1.7 | 5.0 | 11.4 | 12.6 | 6.9 | 1.4 | 0.5 | 0.4 | 43.0 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) | 51 | 40 | 27 | 22 | 24 | 39 | 66 | 73 | 62 | 43 | 44 | 52 | 45 |
Source: India Meteorological Department[7][8] |
జనాభా వివరాలు
[మార్చు]చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1871 | 30,000 | — |
1881 | 33,000 | +10.0% |
1891 | 53,779 | +63.0% |
1901 | 55,724 | +3.6% |
1911 | 70,200 | +26.0% |
1921 | 66,400 | −5.4% |
1931 | 76,700 | +15.5% |
1941 | 1,03,300 | +34.7% |
1951 | 1,27,400 | +23.3% |
1961 | 1,40,200 | +10.0% |
1971 | 1,73,300 | +23.6% |
1981 | 2,31,300 | +33.5% |
1991 | 3,00,850 | +30.1% |
2001 | 4,26,198 | +41.7% |
2011 | 5,05,693 | +18.7% |
Source: 1871-1891 - ఇంపీరియల్ గెజెటీర్ ఆఫ్ ఇండియా[9] 1901-1981 - Populstat.info[10] 1991-2011 - Citypopulation.de[11] |
2011 భారత జనగణన శాఖ లెక్కల ప్రకారం, ఝాన్సీ నగర జనాభా 5,05,693. వీరిలో 2,65,449 మంది పురుషులు, 2,40,244 మంది స్త్రీలు. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 55,824. ఝాన్సీ నగరంలో మొత్తం అక్షరాస్యత 3,73,500, ఇది జనాభాలో 73.9%. పురుషుల అక్షరాస్యత 78.9%, స్త్రీల అక్షరాస్యత 68.3%. ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత 83.0%. ఇందులో పురుషుల అక్షరాస్యత 88.9%, స్త్రీల అక్షరాస్యత 76.6%. షెడ్యూల్డ్ కులాల జనాభా 1,10,318, షెడ్యూల్డ్ తెగల జనాభా 1,681. 2011 లో నగరంలో 91,150 గృహాలు ఉన్నాయి.[1]
రవాణా
[మార్చు]భారతీయ రైల్వేల ఉత్తర మధ్య రైల్వే జోన్లో ఝాన్సీ, ఒక డివిజను కేంద్రంగా ఉంది. ఇది ప్రధాన ఢిల్లీ-చెన్నై, ఢిల్లీ-ముంబై మార్గాల్లో ఉంది. స్టేషన్ కోడ్ JHS.
గుజరాత్ - అస్సాం జాతీయ రహదారి 27; గ్వాలియర్ - రేవా జాతీయ రహదారి 75 ; జమ్మూ - కన్యాకుమారి జాతీయ రహదారి 44 ; జాతీయ రహదారి 39 రహదారులు ఝాన్సీ నగరం గుండా పోతున్నాయి. ఈ విధంగా, ఐదు వేర్వేరు దిశలలోని రహదారులు పోతున్నందున రహదారుల నెట్‌వర్కులో నగరానికి ఒక వ్యూహాత్మక స్థానం ఉంది.
ప్రముఖులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Census of India: Jhansi city". www.censusindia.gov.in. Retrieved 23 November 2019.
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 18 March 2019.
- ↑ 3.0 3.1 3.2 "District of Jhansi - History". Government of Uttar Pradesh.
- ↑ "Jhansi, India Page". fallingrain.com. Retrieved 3 September 2012.
- ↑ The Macmillan Encyclopedia; rev. ed. London: Macmillan, 1983; p. 647
- ↑ Moore, W. G. (1971) The Penguin Encyclopedia of Places. Harmondsworth: Penguin; p. 371
- ↑ "Station: Jhansi Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 367–368. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 27 April 2020.
- ↑ "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M217. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 27 April 2020.
- ↑ "Imperial Gazetteer of India, Volume 14, page 148". dsal.uchicago.edu. Digital South Asia Library. Retrieved 20 July 2017.
- ↑ "INDIA : urban population". www.populstat.info. Archived from the original on 17 ఫిబ్రవరి 2013. Retrieved 20 July 2017.
- ↑ "Jhansi (Jhansi, Uttar Pradesh, India) - Population Statistics and Location in Maps and Charts". www.citypopulation.de (in ఇంగ్లీష్). Retrieved 20 July 2017.