Jump to content

హాత్‌రస్

అక్షాంశ రేఖాంశాలు: 27°36′N 78°03′E / 27.60°N 78.05°E / 27.60; 78.05
వికీపీడియా నుండి
హాత్‌రస్
పట్టణం
హాత్‌రస్ is located in Uttar Pradesh
హాత్‌రస్
హాత్‌రస్
Coordinates: 27°36′N 78°03′E / 27.60°N 78.05°E / 27.60; 78.05
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాహాత్‌రస్
Government
 • TypeDemocratic
విస్తీర్ణం
 • Total142 కి.మీ2 (55 చ. మై)
Elevation
178 మీ (584 అ.)
జనాభా
 (2011)
 • Total15,64,708
 • జనసాంద్రత850/కి.మీ2 (2,200/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
204101
టెలిఫోన్ కోడ్05722
Vehicle registrationUP-86
లింగనిష్పత్తి870 /

హాత్‌రస్ ఉత్తర ప్రదేశ్ లోని హాత్‌రస్ జిల్లాలోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. అలీగఢ్, మధుర, ఆగ్రా జిల్లాల్లోని కొన్ని భాగాలను విడదీసి, 1997 మే 3న హాత్‌రస్ జిల్లాను ఏర్పాటు చేసారు. ఇది అలీగఢ్ డివిజనులో భాగం.[1]

హాత్‌రస్ లోని ఒక ఆలయం

ప్రాథమికంగా ఇక్కడ మాట్లాడే భాష బ్రజ్. ఇది హిందీ భాషకు చెందిన ఒక మాండలికం. ఇది ఖడీబోలీ మాండలికానికి దగ్గరగా ఉంటుంది.[2] ఇంగువకు ప్రసిద్ధి చెందిన హాత్‌రస్ గత 100 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున దీనిని ఉత్పత్తి చేస్తుంది.[3]

భౌగోళికం

[మార్చు]

హాత్‌రస్ 27°36′N 78°03′E / 27.6°N 78.05°E / 27.6; 78.05 వద్ద [4] సముద్రమట్టం నుండి 185 మీటర్ల ఎత్తున, ఆగ్రా, అలీగఢ్, మధుర, బరేలీ రహదారుల కూడలి వద్ద ఉంది. ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన వ్యత్యాసాలకు ప్రసిద్ధి చెందింది.[5] 2001 భారత జనాభా లెక్కల ప్రకారం, హాత్‌రస్ జనాభా 123,243. ఇందులో 53% పురుషులు, 47% స్త్రీలు. హాత్‌రస్ అక్షరాస్యత 60%, ఇది జాతీయ సగటు 59.5%తో దాదాపు సమానం, అందులో పురుషుల అక్షరాస్యత 66% కాగా, స్త్రీల అక్షరాస్యత 53%. ఆరేళ్ళ లోపు పిల్లలు జనాభాలో 14% ఉన్నారు .

నగరం హాత్‌రస్ నుండి దూరం హాత్‌రస్ నుండి దిశ
అలీగఢ్ 36 కి.మీ. ఉత్తరం వైపు
మధుర 41 కి.మీ. పడమర వైపు
ఖైర్ 46 కి.మీ. వాయవ్య దిశలో
ఆగ్రా 53.8 కి.మీ. దక్షిణం వైపు

పట్టణంలో హాత్‌రస్ జంక్షన్ రైల్వే స్టేషను ఉంది.

హాత్‌రస్‌లో రుతుపవనాల ప్రభావంతో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంది. ఇది ఉత్తర-మధ్య భారతదేశానికి విలక్షణమైనది. వేసవి కాలం ఏప్రిల్‌లో మొదలై మేలో ముగుస్తుంది. ప్రారంభమవుతుంది. రుతుపవనాలు జూన్ చివరలో మొదలవుతాయి, అక్టోబరు ఆరంభం వరకు కొనసాగుతాయి, అధిక తేమను కలిగిస్తాయి.[6]

శీతోష్ణస్థితి

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - Hathras
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °F (°C) 71.6
(22.0)
82.0
(27.8)
92.1
(33.4)
102.2
(39.0)
108.7
(42.6)
104.0
(40.0)
95.0
(35.0)
93.2
(34.0)
96.6
(35.9)
94.1
(34.5)
73.4
(23.0)
114.1
(45.6)
సగటు అల్ప °F (°C) 47.5
(8.6)
53.6
(12.0)
62.8
(17.1)
72.3
(22.4)
82.0
(27.8)
85.1
(29.5)
81.0
(27.2)
78.8
(26.0)
70.7
(21.5)
73.4
(23.0)
50.2
(10.1)
45.5
(7.5)
Source: India Meteorological Department[7][8]

రవాణా

[మార్చు]

హాత్‌రస్‌లో నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి: హాత్‌రస్ జంక్షన్ రైల్వే స్టేషన్, హాత్‌రస్ రోడ్ రైల్వే స్టేషన్,[9] హాత్‌రస్ సిటీ రైల్వే స్టేషన్, హాత్‌రస్ కిలా రైల్వే స్టేషన్. వస్తు రవాణా కోసం ప్రత్యేకించిన ఫ్రైట్ కారిడార్‌లో నిర్మించిన కొత్త స్టేషన్‌కు న్యూ హాత్‌రస్ అని పేరు పెట్టారు.

మూలాలు

[మార్చు]
  1. "Akhilesh renames eight districts". Thehindu.com. 24 July 2012. Retrieved 6 January 2019.
  2. Scott, Jerrie Cobb; Straker, Dolores Y.; Katz, Laurie (2009-06-02). Affirming Students' Right to Their Own Language: Bridging Language Policies and Pedagogical Practices (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-135-26945-6.
  3. "Official Website of One District One Product Uttar Pradesh / Hathras". odopup.in. Archived from the original on 2020-09-21. Retrieved 2020-07-31.
  4. "Falling Rain Genomics, Inc - Hathras". Fallingrain.com. Retrieved 2012-06-23.
  5. "Weather for Hathras, Uttar Pradesh, India". Timeanddate.com. Retrieved 6 January 2019.
  6. "Hathras Monthly Climate Averages". WorldWeatherOnline.com. Retrieved 2020-08-16.
  7. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)". India Meteorological Department. December 2019. p. M210. Archived from the original on 28 సెప్టెంబరు 2020. Retrieved 27 April 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. "Extremes of Temperature (From Jan 2020 to Aug 2020)". India Meteorological Department. 16 August 2020. p. M210. Archived from the original on 9 అక్టోబరు 2020. Retrieved 16 August 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. "Hathras Road Railway Station (HTJ) : Station Code, Time Table, Map, Enquiry". www.ndtv.com (in ఇంగ్లీష్). Retrieved 2020-05-25.
"https://te.wikipedia.org/w/index.php?title=హాత్‌రస్&oldid=3799636" నుండి వెలికితీశారు