పద్రౌనా
పద్రౌనా | |
---|---|
పట్టణం | |
![]() రాజభవన ప్రధాన ద్వారం | |
ముద్దుపేరు(ర్లు): పావా | |
నిర్దేశాంకాలు: 26°54′N 83°59′E / 26.9°N 83.98°ECoordinates: 26°54′N 83°59′E / 26.9°N 83.98°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | కుశినగర్ |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 49,723 |
• ర్యాంకు | 300+ |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 274304 |
టెలిఫోన్ కోడ్ | 05564 |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | UP-57 |
లింగనిష్పత్తి | 950 (approx.) ♂/♀ |
జాలస్థలి | www |
పద్రౌనా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. ఇది కుశినగర్ జిల్లాకు ముఖ్యపట్టణం. ప్రాచీన కాలంలో దీని పేరు పావా. ఇక్కడ బుద్ధుడు తన చివరి భోజనం తిన్నాడు. రాముడు తన జీవితంలో కొన్ని రోజులు గడిపిన ప్రదేశం అది. పద్రౌనా నుండి వెళ్ళిన తరువాత, రాముడు రామకోల వద్దకు చేరుకున్నాడు, అక్కడ అతను సీత, లక్ష్మణులతో కలిసి ఉండటానికి ఒక గుడిసెను నిర్మించుకున్నాడు. పద్రౌనా, ప్రాచీన కాలపు మల్ల క్షత్రియుల రాజ్యం కూడా. వారు తమ శాంతాగారం నుండి ప్రజాస్వామిక ప్రభుత్వ విధానాన్ని అనుసరించారు . పద్రౌనా, కుశినగర్ పట్టణానికి తూర్పున 21 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రవాణా సౌకర్యాలు[మార్చు]
జాతీయ రహదారి 28 బి [1], రాష్ట్ర రహదారి నంబర్ 64 పద్రౌనా గుండా వెళ్తాయి. ప్రతిరోజూ శతాబ్ది బస్సు ఒకటి పద్రౌనా నుండి కాన్పూర్ వరకు నడుస్తుంది. అలాగే, జనరథ్ బస్సులు పద్రౌనా, లక్నో ల మధ్య నడుస్తాయి. పద్రౌనా రైల్వే స్టేషన్ నుండి ఛాప్రా, గోరఖ్‌పూర్, లక్నో, సిద్ధార్థనగర్, ఢిల్లీ, కతిహార్, జలందర్ తదితర ముఖ్యమైన నగరాలకు రైళ్లు నడుస్తున్నాయి. ఇది ప్రతిపాదిత కుశినగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భాగమని భావిస్తున్నారు. కుశినగర్, సారనాథ్ల మధ్య నిర్మించబోయే బుద్ధ ఎక్స్‌ప్రెస్ వే రాష్ట్రంలోని ఆగ్నేయ ప్రాంత నగరాలైన వారణాసి, అలహాబాద్, అజమ్‌గఢ్ లను పద్రౌనాతో కలుపుతుంది
జనాభా[మార్చు]
పద్రౌనాలో మెజారిటీ హిందూ మతం. ఆధిపత్య స్థానం కలిగిన ఇతర మతాలు ఇస్లాం, సిక్కు మతాలు. కొద్దిపాటి బౌద్ధుల జనాభా, క్రైస్తవ జనాభా కూడా పద్రౌనాలో ఉన్నారు. పద్రౌనా సైత్వార్ కులస్థులకు గట్టి పట్టున్న స్థలం. ఆర్‌పిఎన్ సింగ్ ఈ సంఘానికి చెందినవారు.
ప్రస్తావనలు[మార్చు]
- ↑ "Archived copy". Archived from the original on 11 June 2016. Retrieved 6 October 2011.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)