Jump to content

గౌరీగంజ్

అక్షాంశ రేఖాంశాలు: 26°12′22″N 81°41′24″E / 26.206°N 81.690°E / 26.206; 81.690
వికీపీడియా నుండి
గౌరీగంజ్
పట్టణం
గౌరీగంజ్
గౌరీగంజ్
గౌరీగంజ్ is located in Uttar Pradesh
గౌరీగంజ్
గౌరీగంజ్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 26°12′22″N 81°41′24″E / 26.206°N 81.690°E / 26.206; 81.690
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాఅమేఠీ
Elevation
104 మీ (341 అ.)
జనాభా
 (2011)
 • Total3,26,723
 • జనసాంద్రత855/కి.మీ2 (2,210/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ[1]
Time zoneUTC+5:30
Postal code
227409

గౌరీగంజ్ ఉత్తర ప్రదేశ్ లోని పట్టణం. ఫైజాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న అమేఠీ జిల్లాకు ఇది ముఖ్య పట్టణం. ఇది ఉత్తర ప్రదేశ్‌ తూర్పు భాగాన, రాజధాని లక్నో నుండి సుమారు 126 కి.మీ. దూరంలో ఉంది. 2010 జూలైకి ముందు గౌరీగంజ్, సుల్తాన్పూర్ జిల్లాలో భాగంగా ఉండేది. గౌరీగంజ్, అమేఠీ, జైస్, జగదీస్పూర్, సలోన్ మొదలైనవాటిని తీసుకొని "చత్రపతి సాహూజీ మహారాజ్ నగర్" అనే పేరుతో కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. తరువాత దీనికి గౌరీగంజ్ జిల్లా అని, ఆ తరువాత అమేఠీ జిల్లా అనీ పేరు మార్చారు.

గౌరీగంజ్ లక్నో, హరిద్వార్, ఢిల్లీ, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, హౌరా, డెహ్రాడూన్, అంబాలా, అమృత్సర్ వంటి పెద్ద నగరాలకు రైళ్ళు నడుస్తున్నాయి. ఇది పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ బాగా అభివృద్ధి చెందిన మార్కెట్‌ ఉంది. ఈ మార్కెట్‌ను అమేఠీకి చెందిన రాజా మధో సింగ్ నిర్మించారు. ఇది జిల్లాలో ముఖ్యమైన ధాన్యం మార్కెట్లలో ఒకటి. రామ్‌లీలా మైదానానికి సమీపంలో ఒక మసీదుతో పాటు శివాలయం, రామాలయం ఉన్నాయి. రాష్ట్ర రహదారి 34, జాతీయ రహదారి 128 లు గౌరీగంజ్ గుండా వెళ్తాయి. సమీప నగరాలు సుల్తాన్పూర్, రాయ్‌బరేలీ, ఫైజాబాద్ .

విభిన్న కులాలు, మతాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. గౌరీగంజ్‌లో చాలా చల్లని, పొడి శీతాకాలాలు, వేడి, తేమతో కూడిన వేసవికాలాలతో వెచ్చని ఉప ఉష్ణమండల వాతావరణం ఉంటుంది.

పట్టణ జనాభా 3,26,723, వీరిలో 1,65,284 మంది పురుషులు, 1.61,439 మంది మహిళలు. ఇక్కడ 56,787 గృహాలున్నాయి. గౌరీగంజ్ టెలిఫోన్ కోడ్ 05368.

వాతావరణం

[మార్చు]

డిసెంబరు నుండి ఫిబ్రవరి మధ్య వరకు ఉండే శీతాకాలంలో గౌరీగంజ్, చాలా చల్లగా పొడిగా ఉంటుంది. ఏప్రిల్ నుండి జూన్ మధ్య వరకు ఉండే వేసవిలో పొడిగా, వేడిగా ఉంటుంది. తీవ్రమైన శీతాకాలంలో, గరిష్ఠ ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 3 నుండి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. డిసెంబరు చివరి నుండి జనవరి చివరి వరకు పొగమంచు చాలా సాధారణం. వేసవిలో ఉష్ణోగ్రతలు 40 నుండి 45 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్తాయి.

గౌరీగంజ్‌లో ఉష్ణమండల తడి, పొడి శీతోష్ణస్థితి ఉంటుంది. సగటు ఉష్ణోగ్రతలు 20, 28 °C మధ్య ఉంటాయి  గౌరీగంజ్‌లో వేసవి, రుతుపవనాలు, తేలికపాటి శరదృతువు అనే మూడు విభిన్న ఋతువు లుంటాయి. వేసవి మార్చి నుండి మే వరకు ఉంటుంది, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 నుండి 45 °C వరకు ఉంటాయి. మే వరకు వేసవి కాలం ముగియకపోయినా, నగరంలో మే నెలలో భారీ ఉరుములు వస్తాయి. తేమ ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలం జూన్ మధ్య నుండి సెప్టెంబరు మధ్య వరకు ఉంటుంది. సగటు వర్షపాతం 722 మి.మీ. గౌరీగంజ్, ఎత్తున ఉండడం వలన వేసవిలో కూడా రాత్రులు చల్లగానే ఉంటాయి. ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 48.3 °C. ఋతుపవనాలు జూన్ నుండి అక్టోబరు వరకు ఉంటాయి, మితమైన వర్షపాతం, 10 నుండి 28 °C వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి.. శరదృతువు నవంబరులో ప్రారంభమవుతుంది. పగటి ఉష్ణోగ్రత 28 °C, రాత్రి ఉష్ణోగ్రత 10 °C ఉంటుంది. డిసెంబరు జనవరిల్లో ఉష్ణోగ్రత తరచుగా 3 నుండి 4 °C కు పడిపోతుంది 

మూలాలు

[మార్చు]
  1. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 23 నవంబరు 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=గౌరీగంజ్&oldid=3797836" నుండి వెలికితీశారు