Coordinates: 28°50′N 78°47′E / 28.83°N 78.78°E / 28.83; 78.78

మొరాదాబాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొరాదాబాద్
నగరం
మొరాదాబాద్
మొరాదాబాద్
Nickname: 
ఇత్తడి నగరం
మొరాదాబాద్
మొరాదాబాద్
మొరాదాబాద్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 28°50′N 78°47′E / 28.83°N 78.78°E / 28.83; 78.78
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లామొరాదాబాద్
Area
 • Total149 km2 (58 sq mi)
Elevation
198 మీ (650 అ.)
Population
 (2011)[1]
 • Total8,89,810
 • Density6,000/km2 (15,000/sq mi)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
244001
టెలిఫోన్ కోడ్0591

మొరాదాబాద్ ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లాలోని నగరం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. నగర పాలనను మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది.

మొగలు చక్రవర్తి షాజహాన్ ఆధ్వర్యంలో కతేహార్ గవర్నర్ రుస్తాం ఖాన్, మొరాదాబాద్ నగరాన్ని స్థాపించాడు. చక్రవర్తి చిన్న కుమారుడు మురాద్ బఖ్ష్ పేరు మీద నగరానికి ఈ పేరు పెట్టాడు. స్థాపించిన వెంటనే, కతేహార్ రాజప్రతినిధి స్థానాన్ని సంబల్ నుండి ఇక్కడికి మార్చారు. మొరాదాబాద్‌ను 1740 లో అలీ మొహమ్మద్ ఖాన్ రోహిల్‌ఖండ్ రాజ్యంలో కలుపుకున్నాడు. ఈ నగరం 1774 లో అవధ్ నియంత్రణలోకి వచ్చింది. 1801 లో అవధ్ నవాబు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాడు. [2]

మొరాదాబాద్ రామ్‌గంగా నది ఒడ్డున, జాతీయ రాజధాని, న్యూ ఢిల్లీ నుండి 167 కి.మీ. దూరంలో ఉంది రాష్ట్ర రాజధాని లక్నోకు వాయవ్య దిశలో 344 కి.మీ. దూరంలో ఉంది. నగరంలో ఇత్తడి కళాకృతుల తయారీ ప్రాచుర్యంలో ఉన్నందున దీన్ని ఇత్తడి నగరం (పీతల్ నగరి) అని పిలుస్తారు. [3] ఇక్కడ ఉత్తర రైల్వే (ఎన్ఆర్) లో డివిజనల్ ప్రధాన కార్యాలయం ఉంది. [4] [5]

జనాభా వివరాలు[మార్చు]

మొరాదాబాద్ మ్యాప్ (1955)
మొరాదాబాద్‌లో మతం[6]
మతం శాతం
హిందూ మతం
  
51.68%
ఇస్లామ్
  
46.79%
సిక్కుమతం
  
0.43%
క్రైస్తవం
  
0.61%
ఇతరాలు†
  
0.49%
ఇతరాల్లో

2011 జనాభా లెక్కల ప్రకారం మొరాదాబాద్ నగర జనాభా 8,87,871 జనాభా. జనాభాలో లింగ నిష్పత్తి 903/1000. అక్షరాస్యత 58.67% [7]

పోలీసు శిక్షణ అకాడమీ[మార్చు]

డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ పోలీస్ అకాడమీ మొరదాబాద్‌లో ఉంది. భారత పోలీస్ సర్వీసెస్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ ల రాష్ట్ర పోలీస్ సర్వీస్ ఆఫీసర్లు నియామకానికి ముందు ఇక్కడే శిక్షణ పొందుతారు.

పోలీస్ ట్రైనింగ్ కాలేజీని ఇంతకు ముందు పోలీస్ ట్రైనింగ్ స్కూల్ (పిటిఎస్) అని పిలిచేవారు, దీనిని 1878 లో అలహాబాద్‌లో అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో స్థాపించారు. 1901 లో దీనిని మొరాదాబాద్‌కు మార్చారు. [8] అకాడమీ ఆధ్వర్యంలో పోలీస్ ట్రైనింగ్ కాలేజి, పోలీస్ ట్రైనింగ్ స్కూల్ అనే రో రెండు పోలీసు కళాశాలలున్నాయి.. మొదటి దానిలో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ హోదాలోని పోలీసు అధికారులకు శిక్షణ ఇస్తారు. రెండవ దానిలో హెడ్ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తారు.

ప్రాంతీయ సాయుధ పోలీసు దళం[మార్చు]

పై ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, వెస్ట్రన్ జోన్తో పాటు, ప్రాంతీయ సాయుధ పోలీసు దళం (ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కాన్స్టాబులరీ -పిఎసి) కూడా మొరాదాబాద్లో ఉంది.

మొరాదాబాద్‌లో రాష్ట్ర పోలీసు 9/23/24 బెటాలియన్ ప్రధాన కార్యాలయం ఉంది. లక్నో తరువాత యుపి పోలీసుల అతిపెద్ద పోలీసు స్థావరం మొరాదాబాదే. [9]

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

మొరాదాబాద్ లో తయారయ్యే హస్తకళా వస్తువులలో ఒకటైన అఫ్తాబ్

మొరాదాబాద్ ఒక ప్రధాన పారిశ్రామిక నగరంగా, ఎగుమతి కేంద్రంగా ఉంది. భారతదేశం నుండి జరిగే మొత్తం హస్తకళల ఎగుమతుల్లో 40% కంటే ఎక్కువ నగరం నుండి జరుగుతుంది

2006-2007లో, మొరాదాబాద్ క్లస్టరు నుండి జరిగిన ఎగుమతుల విలువ 3200 కోట్ల రూపాయలు. [10] 2012–2013లో ఇది 4000 కోట్ల రూపాయలకు పెరిగింది.

2014 అక్టోబరులో లైవ్‌మింట్ మొరాదాబాద్‌ను "2025 నాటికి దృష్టిని ఆకట్టుకునే 25 అభివృద్ధి చెందుతున్న నగరాల" జాబితాలో చేర్చింది. [11]

శీతోష్ణస్థితి[మార్చు]

మొరాదాబాద్‌లో వేసవికాలంలో ఉష్ణోగ్రత సాధారణంగా 30°C నుండి 43°C వరకు ఉంటుంది. శీతాకాలంలో ఇది 25°C నుండి 5°C వరకు పడిపోతుంది. [12]

రామగంగా నదికి వరదలు రావడం వల్ల నగరం ముంపుకు గురౌతూంటుంది. [13] .

శీతోష్ణస్థితి డేటా - Moradabad (1981–2010, extremes 1967–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 28.5
(83.3)
33.0
(91.4)
39.4
(102.9)
45.0
(113.0)
45.5
(113.9)
48.2
(118.8)
43.0
(109.4)
39.7
(103.5)
39.0
(102.2)
37.0
(98.6)
34.7
(94.5)
30.1
(86.2)
48.2
(118.8)
సగటు అధిక °C (°F) 19.9
(67.8)
23.9
(75.0)
29.7
(85.5)
36.1
(97.0)
38.9
(102.0)
37.7
(99.9)
33.7
(92.7)
32.8
(91.0)
31.8
(89.2)
30.9
(87.6)
27.1
(80.8)
22.5
(72.5)
30.4
(86.7)
సగటు అల్ప °C (°F) 7.9
(46.2)
10.8
(51.4)
15.7
(60.3)
21.2
(70.2)
24.4
(75.9)
26.1
(79.0)
25.6
(78.1)
25.2
(77.4)
24.0
(75.2)
19.5
(67.1)
14.2
(57.6)
9.5
(49.1)
18.7
(65.7)
అత్యల్ప రికార్డు °C (°F) 0.0
(32.0)
2.0
(35.6)
5.0
(41.0)
10.0
(50.0)
16.0
(60.8)
17.0
(62.6)
19.0
(66.2)
14.0
(57.2)
8.2
(46.8)
12.1
(53.8)
5.0
(41.0)
2.0
(35.6)
0.0
(32.0)
సగటు వర్షపాతం mm (inches) 17.2
(0.68)
24.5
(0.96)
9.2
(0.36)
7.0
(0.28)
25.2
(0.99)
85.3
(3.36)
277.3
(10.92)
265.1
(10.44)
168.9
(6.65)
36.4
(1.43)
3.1
(0.12)
7.3
(0.29)
926.5
(36.48)
సగటు వర్షపాతపు రోజులు 1.2 1.8 0.8 0.8 1.8 4.7 9.4 9.8 6.6 1.3 0.4 0.6 39.1
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 73 63 55 45 47 57 76 81 79 67 66 70 65
Source: India Meteorological Department[14][15]

రవాణా[మార్చు]

రోడ్డు[మార్చు]

కింది జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులలో కొన్ని మొరదాబాద్ గుండా వెళుతున్నాయి. మరి కొన్నిటికి మొరాదాబాద్ నుండి అనుసంధానించే రోడ్లున్నాయి:

 • జాతీయ రహదారి 509 - దీనిని జాతీయ రహదారి 93 అని కూడా పిలుస్తారు, ఇది మొరాదాబాద్‌ ఆగ్రా లను కలుపుతుంది
 • జాతీయ రహదారి 734 - మొరాదాబాద్‌ను ఉత్తరాఖండ్ లోని జస్‌పూర్ ‌తో కలుపుతుంది.
 • రాష్ట్ర రహదారి 43 - మొరాదాబాద్‌ను చారిత్రక నగరమైన బదాయూన్‌తో కలుపుతుంది.
 • రాష్ట్ర రహదారి 49 - మొరాదాబాద్‌ను హరిద్వార్‌తో కలుపుతుంది.
 • రాష్ట్ర రహదారి 76 - మొరాదాబాద్‌ను నూర్‌పూర్ మీదుగా బిజ్నోర్‌కు కలుపుతుంది.
 • రాష్ట్ర రహదారి 78 - అమ్రోహాతో కలుపుతుంది
 • మొరాదాబాద్-సంభాల్ నాలుగు లేన్ల రహదారి.

మొరాదాబాద్ రైల్వే స్టేషన్ భారత రైల్వేల్లోని ప్రధానమైన రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది లక్నో-మొరాదాబాద్ మార్గం, ఢిల్లీ-మొరాదాబాద్ మార్గం, మొరాదాబాద్-అంబాలా మార్గం మీద ఉంది . ప్రతిరోజూ 250 కి పైగా రైళ్లు మొరాదాబాద్ రైల్వే స్టేషన్ గుండా వెళ్తాయి. ఇక్కడి నుండి ఢిల్లీ, లక్నో, కాన్పూర్, ఆగ్రా, అలిగర్, ఘజియాబాద్, జైపూర్, జోధ్పూర్, హరిద్వార్, డెహ్రాడూన్, అమృత్సర్, లుధియానా, అంబాలా, గౌహతి, దిబ్రూగఢ్, కోలకతా, జంషెడ్పూర్, వారణాసి, అహ్మదాబాద్, పాట్నాలకు రైళ్ళున్నాయి. మొరాదాబాద్‌లో శతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, గరీబ్-రథ్ ఎక్స్‌ప్రెస్ లతో పాటు చాలా సూపర్ ఫాస్ట్, మెయిల్, ప్యాసింజర్ రైళ్లు ఆగుతాయి. [16] ఐదు మార్గాల కూడలి కావడం చేత మొరాదాబాద్‌ను ఇంటర్ చేంజ్ స్టేషన్ అంటారు. [17] 1873 లో నిర్మించిన మొరాదాబాద్ రైల్వే స్టేషను, భారతదేశపు పురాతన రైల్వే స్టేషన్లలో ఒకటి. 2012 లో దీన్ని విద్యుదీకరించారు.

మూలాలు[మార్చు]

 1. "Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 26 March 2012.
 2. "Imperial Gazetteer of India, Volume 17, page 429 -- Digital South Asia Library". dsal.uchicago.edu. Retrieved 6 December 2019.
 3. Majid Husain (2011). Understanding: Geographical: Map Entries: for Civil Services Examinations: Second Edition. Tata McGraw-Hill Education. p. 7. ISBN 978-0-07-070288-2. Retrieved 6 October 2012.
 4. "Northern Railway: Moradabad Division". Moradabadrail.in. Archived from the original on 1 August 2015. Retrieved 2015-07-29.
 5. "Moradabad (UP), India | Official Website". Moradabad.nic.in. Retrieved 2015-07-29.
 6. "Moradabad Religion Census 2011". Office of the Registrar General and Census Commissioner, India. Retrieved 2015-10-19.
 7. MINUTES OF THE 34th MEETING OF EMPOWERED COMMITTEE TO CONSIDER AND APPROVE REVISED PLAN FOR BALANCE FUND FOR THE DISTRICTS OF GHAZIABAD, BAREILLY, BARABANKI, SIDDHARTH NAGAR, SHAHJANPUR, MORADABAD, MUZAFFAR NAGAR, BAHRAICH AND LUCKNOW (UTTAR PRADESH) UNDER MULTI-SECTORAL DEVELOPMENT PROGRAMME IN MINORITY CONCENTRATION DISTRICTS HELD ON 22nd JULY, 2010 AT 11.00 A.M. UNDER THE CHAIRMANSHIP OF SECRETARY, MINISTRY OF MINORITY AFFAIRS. Archived 30 సెప్టెంబరు 2011 at the Wayback Machine F. No. 3/64/2010-PP-I, GOVERNMENT OF INDIA, MINISTRY OF MINORITY AFFAIRS
 8. "Uttar Pradesh Police | OfficerProfile". Uppolice.gov.in. Archived from the original on 2018-10-12. Retrieved 2018-10-12.
 9. "Archived copy". Archived from the original on 4 October 2015. Retrieved 2 October 2015.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 10. "Moradabad, India's Brass City Crying Help". Supportbiz.com. Archived from the original on 2014-12-22. Retrieved 2014-12-21.
 11. "Indias growth engines and gateways". livemint.com. 2014-10-30. Retrieved 2015-01-09.
 12. Moradabad Climate, Nainital tourism Retrieved 7 July 2012
 13. "Moradabad: People suffer due to flood". India Today. Retrieved 12 October 2018.
 14. "Station: Moradabad Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 499–500. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 27 April 2020.
 15. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M221. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 27 April 2020.
 16. "Moradabad railway info". indiarailinfo.com. Retrieved 2014-12-21.
 17. "Archived copy". Archived from the original on 23 December 2015. Retrieved 2015-12-23.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
ఉల్లేఖన లోపం: <references> లో "districtcensus" అనే పేరుతో నిర్వచించిన <ref> ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.