ఫిరోజాబాద్
Firozabad జిల్లా फ़िरोज़ाबाद ज़िला فیروزآباد ضلع | |
---|---|
![]() Uttar Pradesh లో Firozabad జిల్లా స్థానము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | Uttar Pradesh |
పరిపాలన విభాగము | Agra |
ముఖ్య పట్టణం | Firozabad |
ప్రభుత్వం | |
• లోకసభ నియోజకవర్గాలు | Firozabad |
విస్తీర్ణం | |
• మొత్తం | 2 కి.మీ2 (912 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 24,96,761[1] |
జనగణాంకాలు | |
• అక్షరాస్యత | 74.6%.[1] |
ప్రధాన రహదార్లు | NH 2 |
జాలస్థలి | అధికారిక జాలస్థలి |
ఉత్తర ప్రదేశ రాష్ట్ర జిల్లాలలో ఫిరోజా బాద్ జిల్లా (హిందీ|फ़िरोज़ाबाद ज़िला); (ఉర్దూ|فیروزآباد ضلع) ఒకటి. ఫిరోజాబాద్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. ఫిరోజా బాద్ జిల్లా ఆగ్రా డివిషన్లో భాగంగా ఉంది.
విషయ సూచిక
చరిత్ర[మార్చు]
పురాతన కాలంలో ఫిరోజాబద్ పట్టణం చంద్వార్ నగర్ అని పిలువబడింది. మొఘల్ చక్రవర్తి అక్బర్ 1566లో ఈ ప్రాంతాన్ని మంసాబ్ దార్ ఫిరోజ్ షాహ్కు ఒప్పందరూపంలో నివాసం ప్రదేశంగా ఇవ్వబడింది. తరువాత ఇది ఫిరోజాబాద్ అని పిలువబడింది. రాజా తొడరమల్ గయ యాత్రాసమయంలో ఈ ప్రదేశాన్ని దాటే సమయంలో దోపిడీ దొంగలు దోచుకుని వస్తువులను దోచుకున్నారు. ఆయన అభ్యర్ధన మీద అక్బర్ చక్రవర్తి మంసబ్ దార్ ఫిరోజ్ షాహ్ను రాజా తొడరమల్ సహాయానికి పంపి రాజా తొడరమల్కు సుఖ్మల్పూర్ వద్ద బస ఏర్పాటు చేసా డు. . ఫిరోజ్ షా సమాధి మరియు కత్రా పథనన్ శిథిలాలు ఈ సంఘటనకు సాక్ష్యంగా ఉన్నాయి. .[ఉల్లేఖన అవసరం]
షాజహాన్[మార్చు]
1596 ఆగ్రా - మథురా గజటీర్ అనుసరించి ఫిరోజాబాద్ పరగణాగా చేయబడి తరువాత షాజహాన్ (1627-1658) పాలనా సమయంలో నవాబు సదౌలాకు జాగీరుగా ఇవ్వబడిందని తెలుస్తుంది. ఈస్టిండియా ప్రభుత్వంతో సంబంధం ఉన్న పీటర్ అనే వ్యాపారి 1632 ఆగస్టు మాదంలో ఈ ప్రాంతం సందర్శించాడని తెలుస్తుంది. ఎతావా, బుదౌన్, మణిపూర్ మరియు ఫిరోజాబాద్ ఫర్రూక్షియార్ (1713-1719) కాలంలో మొదటి తరగతి మున్సబ్దార్లుగా ఉండేవని తెలుస్తుంది. లభోవా ఎస్టేట్,ఝలా వంశరాజులు కలిసి మొగల్ సుల్తానేట్తో పనిచేసి యునైటెడ్ ప్రోవింస్లో పలు భూభాగాలను స్వాధీనం చేసుకున్నారని భావిస్తున్నారు. 1680 నాటికి లభోవాలు ఫిరోజాబాద్ జిల్లాలోని అత్యధిక భాగం స్వాధీనపరచుకున్నారు.
మొహమ్మద్[మార్చు]
మొహమ్మద్ షా పాలనాకాలంలో (1737) బాజీరావు పేష్వా ఎత్మాద్పూర్ మరియు ఫిరోజాబాద్లను దోచుకున్నాడు. ఫిరోజాబాద్ వద్ద మహ్వాన్కు చెందిన జాట్ గిరిజనులు సైనికాధికారి హకిం కాజిం మీద దాడి చేసి 1739 మేలో వధించి తరువాత 30 సంవత్సరాల కాలం ఫిరోజాబాద్ను పాలించారు. గజుద్దీన్, హిదయత్ వక్ష్ (రెండవ ఆలంఘీర్ కుమారుడు), మరియు మిర్జా బాబా ఫిరోజాబాద్ సందర్శించారు. 1782 వరకు మిర్జానబాబ్ ఖాన్ ఇక్కడ నివసించాడు. 18వ శతాబ్దం ముగిసేనాటికి హిమ్మత్ బహదూర్ గుసుయన్ రాజా లభోవా సాయంతో ఫిరోజాబాద్ను పాలించాడు.
ఫ్రెంచ్[మార్చు]
ఫ్రెంచ్ ఆర్మీ చీఫ్ మారథాస్ డాక్టర్. వయన్ 1794లో ఇక్కడ ఆర్డినెంస్ ఫ్యాక్టర్ స్థాపించాడని థోమస్ ట్రావింగ్ తన " ట్రావెల్స్ ఇన్ ఇండియా " పుస్తకంలో సూచించాడు. మారథాస్ ఇక్కడ సుబాదారును నియమించాడు. పాత తాలూకావద్ద సుబాదారు ఒక కోటను నిర్మించాడు. జనరల్ లెక్ మరియు జనరల్ వెలజెల్లి 1802 లో ఫిరోజాబాద్ మీద దాడి చేసారు. బ్రిటిష్ ప్రభుత్వ ఆరంభ పాలనలో ఫిరోజాబాద్ ప్రాంతం ఎతావా జిల్లాలో ఉండేది. తరువాత ఇది అలిఘర్ జిల్లాలో చేర్చబడింది. 1832లో సదాబాద్ జిల్లా రూపొందించినప్పుడు ఫిరోజాబాద్ అందులో భాగం అయింది. 1833లో ఫిరోజాబాద్ పట్టణం ఆగ్రా జిల్లాలో భాగం అయింది.
స్వాతంత్ర్య సమరం[మార్చు]
1857లో మణిపురికి చెందిన చౌహాన్లు, చంద్వార్ జమీందార్ మరియు ప్రాంతీయ మలహాలందరూ 1857 భారతీయ స్వాతంత్ర్యసమరంలో క్రియాశీలకపాత్ర వహించారు. ప్రముఖ ఉర్దూ కవి మునీర్ షికోహబాడికి ఈస్టిండియా ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఈ నగర ప్రజలు ఖలీఫత్ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, మరియు దండియాత్ర భాగస్వామ్యం వహించారు. వారిలో కొందరు ఖైదుచేయబడ్డారు. 1929లో మహాత్మాగాంధీ ఫిరోజాబాద్ను సందర్శించాడు. 1937లో జవహర్లాల్ నెహ్రూ ఫిరోజాబద్ద్ను సందర్శించాడు. 1940లో నేతాజీ సుబాస్ చంద్రబోస్ ఈ నగరాన్ని సందర్శించాడు. 1989 ఫిబ్రవరి 2 న ఫిరోజాబాద్ జిల్లా రూపొందించబడింది.
2001 లో గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,496,761,[1] |
ఇది దాదాపు. | కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | నెవాడా నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 173 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1014 .[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 21.62%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 867:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 74.6%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
సంస్కృతి[మార్చు]
ఫిరోజాబాద్లో చదమిలాల్ జైన్ మందిర్, శ్రీ షుపర్ష్నాథ్ జైన్ మందిర్ (ఘెర్ ఖొకల్) మరియు చంద్ప్రభు జైన్ మందిర్ (ఖిడికి) ఉన్నాయి. ఘెర్ ఖొకల్ మరియు ఖిడ్కి ఆలయాలు 250-300 సంవత్సరాల పూర్వపునాటివని భావిస్తున్నారు. చంద్వర్ ఆలయాన్ని పృధ్విరాజ్ చౌహాన్ నిర్మించాడని భావిస్తున్నారు. ఫిరోజాబాద్ నగరానికి 6 కి.మీ దూరంలో ఉన్న పవిత్ర జైన మందిరం మీద ముహమ్మద్ ఘోర్ 19 మార్లు దాడిచేసాడు. అక్టోబరు 2 న నగరంలో వార్షికంగా ఉత్సవం నిర్వహించబడితుంది. 16వ శతాబ్దంలో అక్బర్ చక్రవర్తి ఫిరోజాబాద్లో జమామసీద్ నిర్మించాడు. ఈ మసీదు నగరంలోని పురాతన మసీదుగా గుర్తించబడుతుంది.
ప్రముఖులు[మార్చు]
భౌగోళికం[మార్చు]
- జిల్లా రైలు మరియు రహదారి మార్గంతో ఇతర ప్రధాన నగరాలతో అనుసంధానితమై ఉంది.ఆగ్రాలో ఉన్న విమానాశ్రయం జిల్లాకు సమీపవిమానాశ్రయంగా భావించబడుతుంది.
- జిల్లా 78 డిగ్రీల తూర్పు రేఖాశం మరియు 27 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో ఉంది. సముద్రమట్టానికి ఈ జిల్లా 164.467 మీ ఎత్తులో ఉంది.
సరిహద్దులు[మార్చు]
సరిహద్దులు[మార్చు]
సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
ఉత్తర సరిహద్దు | ఎతావ |
తూర్పు సరిహద్దు | మణిపురి |
దక్షుణ సరిహద్దు | యమునా నది |
సరిహద్దు |
ఉత్తర ప్రదేశ్ వైశాల్యంలో జిల్లా వైశాల్యం 0.8% ఉంది. జనసఖ్యలో 1.1% ఉంది. జిల్లాలో 73.6% ప్రజలు గ్రామాలలో నివసిస్తున్నారు. జిల్లా అధికభాగం ఉత్తరం నుండి పశ్చిమంగా ఉన్న ఏటవాలు ప్రాంతంలో ఉంది.
ప్రయాణవసతులు[మార్చు]
ఫిరోజాబాద్ జిల్లాను జాతీయరహదారి -2 ఢిల్లీ, కొలకత్తా నగరాలతో అనుసంధానిస్తూ ఉంది. ఢిల్లీ - కొలకత్తా - ఆగ్రా రైలుమార్గం ద్వారా జిల్లా ఇతరనగరాలతో అనుసంధానితమై ఉంది. ఇక్కడకు 44 కి.మీ దూరంలో ఆగ్రా, 250కి.మీ దూరంలో కాంపూర్, ఢిల్లీ 250 కి.మీ దూరంలో ఉంది.
- జిల్లాకు సమీపంలో ఆగ్రా విమానాశ్రయం ఉంది.
పరిశ్రమలు[మార్చు]
ఫిరోజాబాద్ జిల్లాలో గాజు పరిశ్రమ ఉంది. ఇక్కడ చేతి గాజులు మరియు గాజు పాత్రలు తయారు చేయబడుతుంటాయి. దీనిని సుహాగ్ నగర్ అని కూడా అంటారు.[clarification needed] ఇక్కడ వైవిధ్యమైన చేతిగాజులు (ప్రాంతీయ ప్రజలు గొడం)తయారు చేయబడితున్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires
|website=
(help) - ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Kuwait 2,595,62
line feed character in|quote=
at position 7 (help); Cite web requires|website=
(help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
Nevada 2,700,551
line feed character in|quote=
at position 7 (help); Cite web requires|website=
(help)
![]() |
ఎత జిల్లా | ![]() | ||
![]() |
మైంపూరి జిల్లా | |||
| ||||
![]() | ||||
ఆగ్రా జిల్లా | ఎతావ జిల్లా |
వెలుపలి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to ఫిరోజాబాద్. |
- CS1 errors: missing periodical
- CS1 errors: invisible characters
- Articles with short description
- All articles with unsourced statements
- Articles with unsourced statements from May 2011
- Wikipedia articles needing clarification from May 2011
- ఉత్తర ప్రదేశ్ జిల్లాలు
- Firozabad district
- 1989 స్థాపితాలు
- భారతదేశం జిల్లాలు