Coordinates: 26°28′N 79°31′E / 26.47°N 79.52°E / 26.47; 79.52

ఔరైయా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఔరైయా
పట్టణం
ఔరైయా is located in Uttar Pradesh
ఔరైయా
ఔరైయా
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 26°28′N 79°31′E / 26.47°N 79.52°E / 26.47; 79.52
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాఔరైయా
Area
 • Total9 km2 (3 sq mi)
Elevation
137 మీ (449 అ.)
Population
 (2011)
 • Total87,736
 • Density9,700/km2 (25,000/sq mi)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)

ఔరైయా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పట్తణం. ఇది ఔరైయా జిల్లాకు ముఖ్య పట్టణం. జాతీయ రహదారి 19 పట్టణం గుండా వెళుతుంది. ఫాఫండ్ రైల్వే స్టేషను, ఇక్కడికి సమీపం లోని రైల్వే స్టేషన్.

1997 సెప్టెంబరు 17 న, ఎటావా జిల్లా నుండి ఔరైయా, బిధునా అనే రెండు తహసీళ్ళను వేరుచేసి, ఔరైయా జిల్లాను ఏర్పాటు చేసారు. కొత్త జిల్లాకు ముఖ్య పట్టణం ఔరైయా. ఇది జాతీయ రహదారి 19 (మొఘల్ రోడ్) పై, ఎటావా నగరానికి తూర్పున 64 కి.మీ. దూరంలో, కాన్పూర్ కు పశ్చిమాన 105 కి.మీ.దూరంలో ఉంది.

భౌగోళికం[మార్చు]

ఔరైయా ఉత్తర ప్రదేశ్‌కు నైరుతి భాగంలో 26 ° 47" ఉత్తర అక్షాంశం, 79° 52" తూర్పు రేఖాంశం వద్ద ఉంది. కాన్పూర్ డివిజన్లో ఐరైయా జిల్లా ఒక భాగం. జిల్లాకు ఉత్తరాన కన్నౌజ్ జిల్లా, పశ్చిమ సరిహద్దున ఎటావా జిల్లా, గ్వాలియర్ జిల్లాలు ఉన్నాయి. తూర్పు సరిహద్దున కాన్పూర్ దేహత్, దక్షిణాన జలౌన్ జిల్లాలు ఉన్నాయి.

జనాభా వివరాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [1] ఔరైయా జనాభా 87,736. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. ఔరైయా అక్షరాస్యత 87.25%, ఇది జాతీయ సగటు, 74.37% కంటే ఎక్కువ. అక్షరాస్యుల్లో 90.88% మంది పురుషులు, 83.23% మంది స్త్రీలు. జనాభాలో 12.16% మంది 6 సంవత్సరాల లోపు పిల్లలు.

రవాణా సౌకర్యాలు[మార్చు]

20కిమీ. దూరంలో ఉన్న డిబియాపూర్ వద్ద ఉన్న ఫాఫండ్, ఇక్కడికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషను.. ఈ స్టేషన్ అలహాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ స్టేషనుకు పశ్చిమాన ఎటావా జంక్షన్ రైల్వే స్టేషన్, తూర్పున కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్లు ఇరువైపులా ఉన్న పెద్ద స్టేషన్లు.

మూలాలు[మార్చు]

  1. "Census | Auraiya | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-06.
"https://te.wikipedia.org/w/index.php?title=ఔరైయా&oldid=3121957" నుండి వెలికితీశారు