Jump to content

ఔరైయా జిల్లా

వికీపీడియా నుండి
ఔరైయా జిల్లా
औरैया जिला
ఉత్తర ప్రదేశ్ పటంలో ఔరైయా జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో ఔరైయా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుకాన్పూర్
ముఖ్య పట్టణంఔరైయా
మండలాలు2
Government
 • శాసనసభ నియోజకవర్గాలు3
విస్తీర్ణం
 • మొత్తం2,054 కి.మీ2 (793 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం13,72,287[1]
 • Urban
2,34,205
జనాభా వివరాలు
 • అక్షరాస్యత80.25%
 • లింగ నిష్పత్తి864/1000
ప్రధాన రహదార్లుNH-2
సగటు వార్షిక వర్షపాతం792 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి
ఫాఫుండ్ సమీపంలోని పొలాలు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఔరైయా జిల్లా (హిందీ:) ఒకటి. ఔరైయా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.[2] ఔరైయా జిల్లా కాంపూర్ డివిజన్‌లో భాగంగా ఉంది.

చరిత్ర

[మార్చు]

1997 సెప్టెంబరు 17 న ఎటావా జిల్లాలోని ఔరైయా, బిధౌనా తాలూకాలు జిల్లలు చేయబడ్డాయి. ఔరైయా జాతీయరహదారి 2 పక్కన ఉంది. ఎటావా జిల్లాకు తూర్పుగా 64కి.మీ దూరంలో ఉంది. కాంపూర్ జిల్లాకు పశ్చిమంలో105 కి.మీ దూరంలో ఉంది.

ఆధునిక చరిత్ర

[మార్చు]

1760లో రోహిల్లాలతో అహమ్మద్ షాహ్ దురాన్ భారతదేశం మీద దండయాత్రచేసాడు. 1761లో అహమ్మద్ షాహ్ దురాన్ మరాఠీలను ఎదిరిస్తూ పానిపట్ యుద్ధంలో పాల్గొన్నాడు. మరాఠీ ప్రతినిధి గోవిందరావ్ పండిట్ యుద్ధంలో ప్రాణాలను కోల్పోయాడు. భారతదేశాన్ని వదిలి వెళ్ళే సమయంలో దురానీ రాజప్రతినిధులు రొహిల్లా ప్రతినిధులకు భూభాగాలను ఇచ్చారు. అలా భూభాలను అందుకున్న వారిలో దుండేఖాన్ ఒకడు. అతడికి షికోహాబాద్ దక్కింది, హఫీజ్ రహ్మతుల్లా ఖాన్ కుమారుడు ఇనాయత్ ఖాన్ ఎటావా జిల్లా ప్రాంతాన్ని పొందాడు. ఈ ప్రాంతాన్ని తిరిగి మరాఠీలు స్వాధీనం చేసుకున్నారు. 1762లో రొహిల్లాలు ముల్లా మొసిన్ ఖాన్ నాయకత్వంలో పోరాడి మరాఠీల నుండి భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఈ పోరాటం ఎటావా వద్ద కిషన్‌రావు, బాలా రావు పండిట్, రోహిల్లాల మద్య జరిగింది. పోరాటంలో కిషన్‌రావు, బాలా రావు పండిట్‌లు ఓడిపోయి యమునకు ఆవలివైపుకు పోయి తలదాచుకున్నారు. ఎటావా కోట వద్ద పోరాటం మొసిన్ ఖాన్ నాయకత్వంలో జరిగింది. కొంతకాలం అనంతరం సైన్యాధ్యక్షుడు కోటను ఆక్రమించాడు. కోట రొహిల్లాల అధీనంలోకి మారింది.

తిరుగుబాటు

[మార్చు]

భూభాగ ఆక్రమణ చివరికి నామమాత్రమే అయింది. జమీందారులు వారి మట్టి కోటలలో సురక్షితంగా ఉండి. ఇనాయత్ ఖాన్‌కు పన్ను చెల్లించడానికి నిరాకరించారు. రొహిల్లాలు షేక్ కుబర్, ముల్లా బాజ్ ఖాన్ నాయకత్వంలో బలమైన సైన్యాలను జమీందారుల మీదకు పంపారు. ఈ దాడిలో జమీందారుల చిన్నకోటలు కొన్నిటిని నేలమట్టం చేసారు. యమున కావల ఉన్న కమాయిత్ జమీందారి కోట మాత్రం దాడికి ఎదురు నిలిచింది. తరువాత వార్షిక కప్పం చెల్లించాలని ఇరుపక్షాలు ఒక తీర్మానానికి వచ్చాయి. తరువాత హఫియజ్ రహ్మత్ ఖాన్ బరేలీకి తిరిగి వెళ్ళాడు. రొహిల్లా సైనికులు మాత్రం జిల్లాలో అనుకూల ప్రాంతాలలో స్థిరపడ్డారు.

మరాఠీలు

[మార్చు]

1776లో మరాఠీలు ముల్హర్ రావు నాయకత్వంలో యమునా నదిని దాటి ఫాఫండ్ వద్ద రొహిల్లా నాయకుడు ముహమ్మద్ హాదన్ ఖాన్ (మోసి ఖాన్ పెద్దకుమాడు ) ను ఎదుర్కొన్నారు. ఈ వార్తను అందుకున్న హఫీజ్ రహ్మత్ ఖాన్ బరేలీ వద్ద మరాఠీలను ఎదుర్కొన్నాడు. హఫీజ్ రహ్మత్ ఖాన్‌తో ఎటావా గవర్నర్ షేఖ్ కుబర్ కలులుకున్నాడు. హఫీజ్ రహ్మత్ ఖాన్‌ యుద్ధవిరమణ సంకేతం పంపినప్పటికీ ముల్హర్ రావు సంధికి వ్యతిరేకించి తిరిగి యమునానది దాటి తనస్థావరానికి చేరుకున్నాడు. నజీబ్- ఉద్ - దుల్లాకు రొహిల్లా దండయాత్ర ఆగ్రహం తెప్పించింది.

నజీబ్ - ఉద్ - దుల్లా మరాఠీ సైన్యాలను ఢిల్లీకి పిలిపించాడు. నజీబ్ - ఉద్ - దుల్లా, మరాఠీసేనలు రోహిల్లాలను సమైక్యంగా ఎదిరించారు. అయినా కొయిల్ వద్ద నజీబ్ - ఉద్ - దుల్లా అశ్వద్థకు గురైయ్యాడు. ఆయన తన పెద్ద కుమారుడు జబితా ఖాన్‌ను మరాఠీయులకు సహాయంగా వదిలి వెనుకకు వెళ్ళాడు. జబితా ఖాన్‌ను తన సోదర ఆఫ్ఘన్‌లతో యుద్ధం చేయడానికి అయిష్టపడ్డాడు. ఇది గ్రహించిన మరాఠీయిలు జబితా ఖాన్‌నుని తమ శిబిరంలో ఖైదు చేసి రొహిల్లాలతో ఎటావా, షికోదాబాద్‌లను కోరుతూ బేరసారాలు సాగించారు. హఫిజ్ రహ్మత్ ఖాన్ ఇందుకు నిరాకరించాడు. మద్యలో జబితా ఖాన్‌ను మారాఠీ ఖైదు నుండి తప్పించుకుని పారిపోయాడు. తరువాత మరాఠీలు, రొహిల్లాల మద్య పలు రాయబారాలు కొనసాగాయి. ధుండేల్ ఖాన్ షికోహాబాద్‌ను ఇవ్వడానికి అంగీకరించాడు. అయినా ఇనాయత్‌ఖాన్ తన ఆధీనంలో ఉన్న ఎటావా భూభాగాన్ని స్వాధీనం చేయడానికి నిరాకరించాడు.

ఎటావా

[మార్చు]

ఇనాయత్ ఖాన్ తనతండ్రి చర్యలకు అసహ్యించుకున్నాడు. ఆయన తండ్రి షెయిక్ కుబేర్ రొహిల్లాకు చెందిన ఎటావా గవర్నర్‌కు ఎటావా కోటను మరాఠీలకు స్వాధీనం చేయమని ఆదేశం జారీచేసాడు. తరువాత మరాఠీలు ఎటావాకు నడకసాగించారు. షేక్ కుబర్‌కు ఆదేశం అందని కారణంగా యూద్ధం ఆరంభం అయింది. కోటను స్వాధీనం చేసుకున్న ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. హఫీజ్ రహ్మత్ ఖాన్ ఆదేశం మీద ఎటావా కోట మరాఠీలకు స్వాధీనం చేయబడింది. మరొకమారు ఎటావా భూభాగాన్ని మరాఠీలకు ఇచ్చి రొహిల్లాలు ఈ భూభాగం వదిలి వెళ్ళారు. సా.శ. 1771 మరాఠీలు ఢిల్లీ వైపు ముందుకు సాగారు. 1772లో మరాఠీలు రొహిల్లా భూభాగంలో అధికభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత జంబితా ఖాన్ తన కుటుంబంతో నివసిస్తున్న ప్రదేశం జంబితా ఖాన్ నిధిని భద్రపరచిన ప్రదేశం అయిన నజాఫ్‌ఘర్ చేరుకుని దానిని స్వాధీనం చేసుకున్నారు.

Shuja-ud-daula, Nawab of Oudh

జబితా ఖాన్ ఓధ్ నవాబ్ వజీర్, షుజా- ఉద్ - దులా సహాయం కోరాడు. హఫీజ్ రహ్మత్ ఖాన్ వ్యవహారంలో అనబసర జోఖ్యం చేయడానికి ఓధ్ నవాబు నిరాకరించాడు. జంబితా ఖాన్ కుటుంబం, రోహిల్‌ఖండ్ భూభాగాన్ని మరాఠీల నుండి విడిపించడానికి షాహ్ ఆలం, మరాఠీల మద్య పలు చర్చలు సాగాయి. షుజా - ఉద్ - దుల్లా అందించిన 40 లక్షలకు బదులుగా తీసుకుని రోహిల్‌ఖండ్ భూభాగాన్ని వదలడానికి మరాఠీలు అంగీకరించారు. ఇందుకు హఫీజ్ రహ్మత్ ఖాన్ అంగీకారంతో ఈ ఒప్పందం మీద సంతకం పెట్టబడింది. సా.శ. 1773లో మరాఠీలు షుజా - ఉద్ - దుల్లా మీద యుద్ధం ప్రకటించారు. షుజా - ఉద్ - దుల్ హఫీజ్ రహ్మత్ ఖాన్ సహాయం కోరాడు. షుజా - ఉద్ - దుల్, హఫీజ్ రహ్మత్ ఖాన్ సమైక్య దళాలు మరాఠీలను అసాద్‌పూర్ వద్ద ఓడించారు. చివరికి మరాఠీలు రోహిల్‌ఖండ్, ఢిల్లీని కూడా వదిలి వెళ్ళారు.

షుజా - ఉద్ - దుల్లా

[మార్చు]

షుజా - ఉద్- దుల్లా ఓధ్‌కు తిరిగివెళ్ళాడు. తరువాత ఆయన పలు ఆఫ్ఘన్ నాయకులను కలుసుకున్నాడు. హఫీజ్ రహ్మత్ ఖాన్ సహకారంతో మరాఠీ సైన్యాలను ఎటావా, షికోహాబాద్ నుండి తొలగించడానికి ప్రయత్నించాడు. ఆయన మరింత ముందుకు వెళ్ళి హఫీజ్ రహ్మత్ ఖాన్‌ను మిగిలిన 35 లక్షలు ఇవ్వమని కోరాడు. హఫీజ్ రహ్మత్ ఖాన్ ధనం ఇవ్వడంలో నిష్ఫలం అయ్యాడు. ఓధ్ నవాబ్ సైన్యం బ్రిటిష్ సైన్యాల సాయంతో హఫీజ్ రహ్మత్ ఖాన్‌ను ఓడించింది. సా.శ. 1774 ఏప్రిల్ 23న మిరాన్‌పూర్ కత్రా వద్ద జరిగిన యుద్ధం తరువాత ఎటావా ఓధ్ ఆధీనంలోకి వచ్చింది.

1774 నుండి 1801

[మార్చు]

1774 నుండి 1801 ఎటావా జిల్లా ఓధ్ ప్రభుత్వం ఆధినంలో ఉంది. ఈ ప్రాంతంలో ఎటావా ప్రాంతం ఆల్మ్స్ అలీఖాన్ పాలన కొనసాగింది. చివరి పాలకులలో గుర్తించతగిన వారు రాజా భగ్మల్ లేక బరమల్ ముఖ్యులు. ఆల్మ్స్ అలీఖాన్ సహోదరి కుమారుడు జన్మతః హిందువైనా తరువాత ముస్లిం మతానికి మారాడు. రాజా భగమత్ ఫఫండ్ వద్ద కోటను, మసీదును నిర్మించాడు. మసీదులో ఇప్పటికీ డోనర్ (దాత]] పేరు చెక్కించబడి ఉంది. ఆల్మ్స్ అలీఖాన్ గొప్పవాడని, ధైర్యశాలి అని కాలనీ రికార్డులలో నమోదుచేయబడి ఉంది. అత్యధికంగా సంపద ఉన్న ఓధ్ నవాబు వారసులు లేని కారణంగా సంపదను ప్రజోపయోగ కార్యాలకు వినియోగించాడు. ఆయన తాను కోటలో నిర్మించిన రాజసభ ఇప్పటికీ శిథిలావస్థలో ఉంది. [2]

భౌగోళికం

[మార్చు]
Indo-Gangetic Plain

ఔరైయా జిల్లా ఉత్తర ప్రదేశ్ నైరుతీ భాగంలో ఉంది. జిల్లా 26.4667° డిగ్రీల ఉత్తర అక్షాంశం, 79.5167° డిగ్రీల రేఖాంశంలో ఉంది. జిల్లా వైశాల్యం 2,054 చ.కి.మీ.ఇందులో నాగింట మూడు వంతులు గ్రామీణ ప్రాంతం. జిల్లా భూభాగం సముద్రమట్టానికి 133 మీ ఎత్తున ఉంది.

సరిహద్దులు

[మార్చు]
సరిహద్దు వివరణ జిల్లా
ఉత్తర సరిహద్దు కన్నౌజ్
పశ్చిమ సరిహద్దు ఎటావా
తూర్పు సరిహద్దు రాంబాయి నగర్
దక్షిణ సరిహద్దు జలౌన్

.

నదులు

[మార్చు]

జిల్లాలో ప్రధానంగా యమునా, సెంగర్ నదులు ప్రవహిస్తున్నాయి. జిల్లాలో 112 కి.మీ పొడవున యమునానది ప్రవహిస్తుంది. ఔరైయా జిల్లా ఇండో - గంగాటిక్ - మైదానంలో ఉంది. [2]

వాతావరణం

[మార్చు]
విషయ వివరణ వాతావరణ వివరణ
వాతావరణ విధానం తేమతో కూడిన ఉప ఉష్ణమండల ఉష్ణోగ్రత
వేసవి ఏప్రిల్ - అక్టోబరు మద్య వరకు.
వేసవి కాలం గాలిలో తేమ 30%
వర్షాకాలం జూన్ - సెప్టెంబరు
శీతాకాలం నవంబరు- జనవరి (హిమపాతం కూడా సంభవం)
గరిష్ఠ ఉష్ణోగ్రత 46 ° సెల్షియస్
కనిష్ఠ ఉష్ణోగ్రత 3 ° సెల్షియస్
వర్షపాతం 792మి.మీ
అధిక వర్షం నైరుతీ ౠతుపవనాలు 85%
వర్షాకాలం గాలిలో తేమ 70%

వ్యవసాయ భూములు

[మార్చు]

1990-1991 జిల్లాలో వ్యవసాయభూములు 141624. మొత్తం వ్యవసాయభూముల సంఖ్య 151838. వ్యవసాయభూములు అధికంగా తక్కువ వైశాల్యలో ఉన్నాయి. వీటిలో 0.5 హెక్టార్ల వైశాల్యం కలిగినవి 47.65%, 0.5 & 1.0 వైశాల్యం కలిగిన వ్యవసాయభూములు 23.76%, 1.0 నుండి 2.0 హెక్టార్ల వైశాల్యం కలిగిన వ్యసాయ భూముల శాతం 8.54%, 4.0 హెక్టార్లకంటే అధిక వైశాల్యం కలిగిన వ్యవసాయభూముల శాతం 2.72%.

నిర్వహణ

[మార్చు]

2012 ఔరైయా జిల్లాలో 2 తాలూకాలు, 2 సెంసస్ పట్టణాలు, 7 (ఆజిత్మల్, భాగ్యనగర్ సహార్, బిధున, ఆచల్ద, ఏర్వకత్ర, ఔరైయా), 841 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో ఒక నగరపాలిక పరిషద్ ఉంది.

రాజకీయాలు

[మార్చు]

ఔరైయా జిల్లా ఎటావా లోకసభలో భాగంగా ఉంది.

  • ఔరైయా - మదన్ సింగ్ గౌతమ్ (ఎస్పి)
  • బిధున - ప్రమోద్ కుమార్ గుప్తా (ఎస్పి)
  • దిబియాపూర్ - ప్రదీప్ కుమార్ యాదవ్ (ఎస్పి).

ఆర్ధికం

[మార్చు]

ఔరైయా జిల్లా వెనుకబడిన జిల్లాలలో ఒకటిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 2 పట్టణప్రాంతాలు (దిబ్యాపూర్, ఔరైయా) లలో పారిశ్రామిక సదుపాయాలు కలిగి ఉన్నాయి.

చిన్న తరహా పరిశ్రమలు

[మార్చు]

జిల్లాలోని దిబియాపూర్, ఔరైయా వద్ద రైస్ మిల్లులు, డాల్ మిల్లులు ఉన్నాయి. జిల్లాలో వివిధ ప్రాంతాలలో స్టీల్ ఫర్నీచర్, సిమెంట్ పరిశ్రమలు మొదలైన చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు ఆగ్రా, కాన్పూర్ నుండి లభిస్తుంది. ప్రధానంగా పప్పులు, వరి, దేశీయ నెయ్యి జిల్లా నుండి పెద్ద ఎత్తున రాష్ట్రంలోని ఇతరజిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. ఔరైయా నగరంలో నాణ్యమైన వుడెన్ ఫర్నీచర్ పెద్ద తరాహా పరిశ్రమగా తయారు చేయబడుతుంది. సమీపప్రాంతాలలో వుడెన్ సామాన్లకు ఔరైయా మంచి మార్కెటుగా గుర్తించబడుతుంది.

దిబియాపూర్

[మార్చు]

దిబియాపూర్ ఒక పారిశ్రామిక పట్టణం. భారతదేశ స్థాయిలో ఖ్యాతి గాంచిన పరిశ్రమలు జిల్లాలో ఉన్నాయి. 663 మె.వా కంబైండ్ సైకిల్ పవర్ ప్లాంట్ (ఎన్.టి.పి.సి),[3] పెట్రో కెమికల్ ప్లాంట్, గెయిల్ వారి గ్యాస్ కమీషనర్ స్టేషను[4] ఉత్తర ప్రదేశ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ (యు.పి.పి.సి) ఆఫ్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఔరైయా జిల్లాలోని పాటాలో ఉంది),

ప్రయాణసౌకర్యాలు

[మార్చు]
NH-2

రైలు

[మార్చు]

జిల్లాలో 8 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో అచల్దా, ఫాఫండ్ (దిబియా), కంచుయాసి ప్రధాన రైలు స్టేషన్లు. జిల్లాలో రైలు మొత్తం మార్గాల పొడవు 33 కి.మీ. ఇది నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ (ఉత్తర మద్య రైవే విభాగం) లో ఉంది.

ప్రధాన రైళ్లు:

  • జమ్ము తావీ, మురి రూర్కెలా ఎక్స్‌ప్రెస్
  • కాల్కా మెయిల్
  • మహానంద ఎక్స్‌ప్రెస్
  • తూఫాన్ ఎక్స్‌ప్రెస్
  • గోమతి ఎక్స్‌ప్రెస్
  • లాల్ ఖిలా ఎక్స్‌ప్రెస్
  • ఉంచార్ ఎక్స్‌ప్రెస్

రహదారి

[మార్చు]

జిల్లాలోని గ్రామాలు, పట్టణాల మధ్య చక్కటి రహదార్లున్నాయి. జాతీయ రహదారి 2 ( ముగల్ రోడ్డు) జిల్లా దక్షిణ భూభాగం గుండా పయనిస్తుంది. జిల్లా కేంద్రం ఔరైయా నుండి ఎటావా 64 కి.మీ దూరం, కాన్పూర్ 105 కి.మీ దూరంలో ఉంది. ఔరైయా బస్ స్టేషను జాతీయ రహదారి 2 పై ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్త్ర రవాణా సంస్థ జిల్లా నుండి రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు బస్సులు నడుపుతోంది. ఔరైయా నుండి కన్నౌజ్, ఆగ్రా, అలహాబాద్, ఫైజాబాద్ నగరాలకు రోజూ బస్సులు నడుస్తున్నాయి.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,372,287,[1]
ఇది దాదాపు. స్వాజీ లాండ్ దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. హవాయి నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 357 వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 681 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 16.3%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 864:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 80.25%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

ఔరైయా తిలక్ డిగ్రీ కాలేజీ అజిత్మల్ జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన విద్యాసస్థగా గుర్తించబడుతుంది. జంత మహా విద్యాలయ, జనతా ఇంటర్ కాలేజి, జవహర్ నవోదయ స్కూల్, ఎం.ఆర్ ఎజ్యుకేషనల్ ఇంస్టిట్యూట్, బి.టి.సి ట్రైనింగ్ స్ర్ంటర్, డి.ఐ.ఇ.టి విద్యా సంస్థలు నాణ్యమైనవని గుర్తించబడుతున్నాయి.

1991లో హిందువులు 92.79% (రాష్ట్ర సరాసరి 83.76% ), ముస్లిములు 6.63% (రాష్ట్ర సరాసరి 15.48%) మిగిలిన 0.58% ప్రజలలో సిక్కులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు ఉన్నారు.

సంస్కృతి

[మార్చు]

నృత్యం & సంగీతం

[మార్చు]

భారతీయ జానపద సంగీతం రీతులు ఉత్తర ప్రదేశ్ అంతటా వినిపిస్తూ ఉంటుంది. వీటిలో ఆల్లహ, ఫాగ్, కజరి, రసియస్ విధానాలు ప్రధానమైనవి.వీటిని వివిధ కాలాలలో పాడుతూ ఉంటారు. జాపద గితాలలో ధోలా, ఉంచారి, లగాడియా మొదలైనవి సాధారణంగా గ్రామాలలో అధికంగ కనిపిస్తుంటాయి. సంగీత పరికరాలు భజనలు, కీర్తనలు కోరస్‌తో ఆలపిస్తూ ఉంటారు. వీటిని జిల్లావాసులు అధికంగా అభిమానిస్తుంటారు.

బహిరంగంగా ప్రదర్శనలు, సామూహిక గ్రానీణశైలి జానపద సంగీతం, నృత్యాలు గ్రామీణ ప్రజల దైనందిక జీవితంలో సాధారణంగా కనిపిస్తుంది. గ్రామాలలో పౌరాణిక కథాంశం ఆధారిత నైతంకి, నాటకాలు తరచుగా ప్రదర్శించబడుతుంటాయి.

పండుగలు , ఉత్సవాలు

[మార్చు]

దీపావళి, రామ నవమి జిల్లాలో ప్రసిద్ధ పండుగలు. ఇతర పండుగలు విజయదశమి, మకర సంక్రాంతి, వసంత్ పంచమి, ఆయుధ పూజ, గంగా మహోత్సవ, జన్మాష్టమి, మహా శివరాత్రి, హనుమాన్ జయంతి, ఈద్.

ఆహారం

[మార్చు]

జిల్లాలో సాధారణంగా దినసరి జీవితంలో వెగిటేరియన్ భోజనం వాడుకలో ఉంటుంది. నార్తిండియన్ తాలి ( రోటీ, అన్నం, పప్పు, కూర, రైతా, అప్పడం). అనేక మంది ప్రజలు ఇప్పటికీ సంప్రదాయ పానీయం కాచ్ త్రాగితుంటారు. పండుగ సందర్భాలలో రోటీ బదులుగా నూనెలో దేవిన ఆహారం తీసుకుంటారు. పండుగ తాలీలో పూరీలు, కచోరీ, సబ్జి (కూర్), పిలఫ్ (పులావ్), పప్పడ్ (అప్పడం), సేవై, ఖీర్ మొదలైన డిసర్టులు ఉంటాయి.

గోధుమలు

[మార్చు]

ప్రజల ప్రధాన ఆహారంగా గోధుమలు ప్రథమ స్థానంలో ఉంది. ఇతర ఆహారాలలో మొక్కజొన్నలు, బార్లీ, పప్పులు, జొన్నలు వాడుకలో ఉన్నాయి. గోధుమ, మొక్కజొన్న పిండితో తయారుచేసే చపాతీలతో డాల్ లేక గర్, పాలతో తుంటారు. మినపప్పు, అర్హర్, పెసలు, చనగలు, మసూర్ మొదలైన పప్పుధాన్యాలు వాడుకలో ఉన్నాయి.

స్వీట్లు

[మార్చు]

ప్రజల ఆహారంలో స్వీట్లు (తీపి పిండి వంటలు) ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ప్రజలు అధికంగా పాలతో తయారు చేసిన వివిధ తియ్యని ఆహార పదార్ధాలను తయారు చేస్తుంటారు. వీటిలో పేడా, గులాబ్ జామూన్, పేఠా, జిలేబీ, మక్ఖన్ మాలై,, చం చం మొదలైన ఆహారాలు ప్రధానమైనవి. సమోసా, పానీపూరి, గోల్ - గప్పా, చాట్, పాన్ వంటి ఆహారాలు జిల్లా వాటి రుచీ, వాసనల కారణంగా అంతటా అభిమాన వంటకాలుగా ఉన్నాయి.

దుస్తులు

[మార్చు]

ఔరైయా ప్రజలు వివిధరకాల వర్ణతంసితమైన దుస్తులు ధరిస్తుంటారు. చీర స్త్రీల అభిమాన వస్త్రంగా ఉంది. తరువాత స్త్రీలు అధికంగా సల్వార్ కమీజ్ ధరిస్తుంటారు. గ్రామీణ పురుషులు సంప్రదాయమైన కుర్తా, లుంగీ, ధోవతీ, పైజమా ధరిస్తుంటారు. ఖాది జాకెట్ (నెహ్రూ జాకెట్) ప్రజల అభిమాన దుస్తులలో ఒకటిగా గుర్తించబడుతుంది. ముస్లిం స్త్రీలు బురఖా, పురుషులు తలపైన గుండ్రని టోపీలు ధరిస్తుంటారు.

మాధ్యమం

[మార్చు]

జిల్లాలో పలు వార్తాపత్రికలు, రీరియాడికల్స్ హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ప్రచురించబడుతున్నాయి. అమర ఉజాలా, దైనిక్ భాస్కర్, దైంక్ జాగ్రణ్ ప్రత్రికలకు విస్తారమైన సర్క్యులేషన్ ఉంది. ప్రధాన నగరాలలో ప్రాంతీయ ఎడిషన్లు ప్రచురించబడుతున్నాయి. ఆంగ్లపత్రికలలో టైంస్ ఆఫ్ ఇండియా, హిందూస్థాన్ టైంస్, హిందూ ప్రధానమైనవి. కేబుల్ టి.వి హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, నేపాలి, అంతత్జాతీయ ప్రదారాలు అందించబడుతున్నాయి. వొడాఫోన్, భారతి ఎయిర్టెల్, బి.ఎస్.ఎన్.ఎల్, రిలయంస్ కమ్యూనికేషంస్, యూనినార్, ఎయిర్సెల్, టాటా ఇండికాం, ఐడియా సెల్యులర్, టాటా డొమొకొ.

క్రీడలు

[మార్చు]

క్రికెట్, అసోసియేషన్ ఫుట్‌బాల్ జిల్లాలో ప్రజాదరణ పొందాయి. జిల్లాలో పలు క్రొకెట్ గ్రౌండ్స్, మైదానాలు ఉన్నాయి.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. 2.0 2.1 2.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-06. Retrieved 2014-12-16.
  3. "NTPC". Archived from the original on 2009-10-25. Retrieved 2009-10-25.
  4. GAIL[permanent dead link]
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Swaziland 1,370,424
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301