జౌన్‌పూర్ జిల్లా
జౌన్‌పూర్ జిల్లా
जौनपुर ज़िला جون پور ضلع | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | వారణాసి |
ముఖ్య పట్టణం | జౌన్‌పూర్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | జౌన్‌పూర్, మచిలీషహర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,356 కి.మీ2 (910 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 44,76,072 |
• జనసాంద్రత | 1,900/కి.మీ2 (4,900/చ. మై.) |
• Urban | 4,89,456 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 73.66% |
• లింగ నిష్పత్తి | 1018 |
సగటు వార్షిక వర్షపాతం | 987 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో జౌన్‌పూర్ జిల్లా (హిందీ:जौनपुर ज़िला) ; (ఉర్దూ: جون پور ضلع) ఒకటి. జౌన్‌పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఈ జిల్లా వారణాసి డివిజన్‌లో భాగంగా ఉంది.
భౌగోళికం
[మార్చు]జిల్లా వైశాల్యం 4038 చ.కి.మీ. జిల్లా సముద్రమట్టానికి 261- 290 మీ. ఉంటుంది.
వాతావరణం
[మార్చు]జైంపూర్ జిల్లాలో ఆరావళి పర్వతశ్రేణిలో ఉండే వాతావరణం నెలకొని ఉంటుంది. జిల్లాలో ఉష్ణోగ్రత 4-44 డిగ్రీల సెంటీగ్రేడ్ నడుమ ఉంటుంది.[1] వార్షిక వర్షపాతం 1098 మి.మీ. సంవత్సరంలో 46 వర్షపాత దినాలు ఉంటాయి. వీటిలో 31 వర్షపాతదినాలు వర్షాకాలంలో ఉంటాయి. జూన్ నుండి అక్టోబరు మొదటి వారం వరకు వర్షాకాలం ఉంటుంది. జిల్లా అధికంగా కరువు- అంటురోగాల బారినపడుతూ ఉంటుంది. .[2]
నైసర్గికం
[మార్చు]జిల్లా నైసర్గికంగా సాధారణంగా చదరంగా ఉంటూ కొంత భూభాగం నదీ లోయలతో ఎగుడుదిగుడుగా ఉంటుంది. జిల్లాలో ప్రధానంగా గోమతీ, సాయి నదులు ప్రవహిస్తున్నాయి. [3] జిల్లాలోని నదులు ఈశాన్యభూభాగం నుండి ఆగ్నేయంగా ప్రవహిస్తున్నాయి. నదీలోయలూ అదే దిశలో ఉంటాయి. వాయవ్యభూభాగం ఎత్తుగా ఆగ్నేయ భూభాగం దిగువగా ఉంటుంది.[4]
భూగర్భశాస్త్రం
[మార్చు]జౌన్‌పూర్ జిల్లా భూమిలో గంగానదీ ప్రవాహంతో ఏర్పడిన సారవంతమైన మట్టి, బంకమట్టి ఉంటుంది. జిల్లా వింధ్యపర్వత దిగువభాగంలో ఉంటుంది. ఇక్కడ ఖనిజాలు తక్కువగా ఉంటాయి. ఇక్కడ లైం స్టోన్, ఏకీకృతమైన కంకర్ రూపంలో ఉంటుంది. లైం స్టోన్ భవననిర్మాణానికి ఉపయోగిస్తారు. 1927, 1954 మద్య ఇక్కడ భూకంపం నమోదైంది. [4]
ఆర్ధికం
[మార్చు]జౌన్‌పూర్ జిల్లా శీఘ్రగతిలో అభివృద్ధి చెందుతూ ఉంది. జిల్లాలో అధికంగా ఇంఫ్రాస్ట్రక్చర్, విద్యా భివృద్ధి జరుగుతూ ఉంది.
వ్యవసాయం
[మార్చు]జిల్లాలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, కందులు, పీర్ల్ మిల్లెట్, మినుములు, గోధుమలు, శనగలు పండుంచబడుతున్నాయి. అలాగే ఎర్రగడ్డలు, ఉర్లగడ్డలు మొదలైన కూరగాయలు పండించబడుతున్నాయి. వర్షాధారం, నీటిపారుదల ద్వారా వ్యవసాయానికి నీరు అందించబడుతుంది. జిల్లాలో ప్రాంతీయజాతికి చెందినవి, సంకరజాతికి చెందిన పశువులను పోషిస్తున్నారు. జిల్లాలో 43 ప్రభుత్వరిజర్వాయర్లు ఉన్నాయి.[2]
విద్య
[మార్చు]జిల్లాలో 2009లో శ్రీ గణేశ్ రాయ్ పోస్ట్ గ్రాజ్యుయేట్ కాలేజ్ స్థాపించబడింది. ఇక్కడ రెండు సంవత్సరాల అగ్రికల్చరల్ సైన్సు కోర్స్ అందించబడుతుంది. ఇది " యూనివర్శిటీ ఆఫ్ పూర్వాంచల్ " విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. .[5] గుజరాత్ లేక్ ఖెతా సరాయ్ పశ్చిమంలో పిసికల్చర్ (చేపల పోషణ) నిర్వహించబడుతుంది. జిల్లాలో ఇంటర్నెట్ సెంటర్లు, ప్రింట్ షాపులు, రిపేర్ వర్క్ షాపులు మొదలైన సేవలు లభిస్తున్నాయి.
పరిశ్రమ
[మార్చు]జిల్లాలో భారీ పరిశ్రమలు తక్కువగానే ఉన్నాయి. వారణాసి - జౌన్‌పూర్ రహదారి పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి అనుకూలంగా ఉంది. కరంజకాలా వద్ద ఒక కాటన్ మిల్లు ఉంది. ఇక్కడ కొన్ని టెక్స్‌టైల్ తయారీదారులు ఉన్నారు. సెంటు (జాస్మిన్ ఆయిల్, అత్తర్), ధూపం, ఫర్నీచర్, కార్పెట్లు, రసాయన ఎరువులు, సిమెంటు తయారు చేయబడుతున్నాయి. [3][6][7][8]
ఆరోగ్యం
[మార్చు]- ఇషా హాస్పిటల్.
- పార్థ్ హాస్పిటల్.
- ఆదర్శ్ డయాగ్నోస్టిక్ సెంటర్ (అత్యంత ప్రజాదరణ ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్ )
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 44,76,072 |
పురుషులు | 22,17,635 |
స్త్రీలు | 22,58,437 |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | వ స్థానంలో ఉంది. |
1చ.కి.మీ జనసాంద్రత. | 1113 |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 14.89% |
2001-2011అక్షరాస్యత అభివృద్ధి | 59.84 %నుండి 73.66% |
స్త్రీ పురుష నిష్పత్తి. | 1018: 1000 |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | |
జాతియ సరాసరి (72%) కంటే. | |
పురుషుల అక్షరాస్యత | 86.06% |
స్త్రీల అక్షరాస్యత | 61.7% |
6 సంవత్సరాల లోపు పిల్లలు | 14.37% [9] |
విభాగాలు
[మార్చు]జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి.
తాలూకాలు
[మార్చు]- షహ్గంజ్
- బద్లపుర్
- మచ్హలి షహర్
- జౌంపుర్
- మరీహు
- కెరకత్.
మండలాలు
[మార్చు]- శొంధి (షహ్గంజ్)
- శుఇథకల
- ఖుతహన్
- ఖరంజ ఖల
- భద్లపుర్
- మహారాజగంజ్
- శుజంగంజ్
- భక్ష
- ముంగ్రబద్షహ్పుర్
- మచ్హలిషహర్
- మదియహున్
- బర్సథి
- రాంపూర్
- రాంనగర్
- జలాల్పూర్
- కెరకత్
- దొభి
- ముఫ్తిగంజ్
- ధర్మపుర్
- సిక్రర
- సిర్కొని
పోలీస్ స్టేషన్లు
[మార్చు]- కొత్వలి
- సదర్
- లినే భజర్
- జఫ్రబద్
- ఖెతసరై
- షహ్గంజ్
- సర్పతహన్
- కెరకత్
- చంద్వక్
- జలల్పుర్
- సరై ఖ్వజ
- గౌరబద్షహ్పుర్
- బద్లపుర్
- ఖుతహన్
- సింగ్రమౌ
- బక్ష
- సుజంగంజ్
- మహారజ్గంజ్
- ముంగ్రబద్షహ్పుర్
- పవర
- మచ్హలిషహర్
- మీర్గంజ్
- సిక్రర
- మదియహున్
- రంపుర్
- బర్సథి
- నెవధియ
- సురెరి
పేరువెనుక చరిత్ర
[మార్చు]జౌన్‌పూర్ పేరు గురించిన నిర్ధిష్టమై వివరణ లేదు. మహర్షి జమదగ్ని పేరు ఇందుకు మూలం అయివుండవచ్చు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ముస్లిం పేరు జౌనా ఇందుకు మూలం అని అభిప్రాయపడుతున్నారు.[4] పురాతత్వనిపుణులు జౌన్‌పూర్ జిల్లా వేదకాలం (క్రీ.పూ 1500 - 500) నాటిదని భావిస్తున్నారు.క్రీ.పూ 6వ శతాబ్దం నాటికి ఈ ప్రాంతంలో జైనిజం, బుద్ధిజం పరిచయం అయ్యాయి. గౌతమ బుద్ధుడు ఈ ప్రాంతాన్ని సందర్శించాడని భావిస్తున్నారు. .
చరిత్ర
[మార్చు]జౌన్‌పూర్ జిల్లాలో గుప్తుల కాలం (సా.శ. 320-550) నాటి నాణ్యాలు లభించాయి. గుప్తుల కాలంలో ఈ ప్రాంతంలో హిందూ మతం ప్రధానంగా ఉండేది. గుప్తుల శిలశాసనాలు సంస్కృతంలో ఉన్నాయి. అంతకు ముందు ఈ ప్రాంతంలో ప్రాకృతభాష ఉపయోగించబడింది. 6వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో హన్లు, మౌకర్ - గుప్తుల మద్య యుద్ధం జరిగింది.
గుప్తరాజులు:-
- చంద్రగుప్తుడు. క్రీ.పూ 320
- సముద్రగుప్తుడు (చంద్రగుప్తుని కుమారుడు)
హర్షవర్ధన
[మార్చు]మద్య కాలంలో ఈ ప్రాంతం గురించిన చరిత్రక ఆధారాలు లభించలేదు. అయినప్పటికీ క్రీ.పూ 640లో ఈ ప్రాంతం మీద థానేశ్వర్ రాజా హర్షవర్ధనుడు దాడిచేసి ఈ ప్రాంతంలో రాజపుత్రుల రాజ్య పాలన ఆరంభం అయిందని భావిస్తున్నారు.[11] Iswar Varma of Magadha was a king of Jaunpur in the 700s.[12]
ఘురిడ్ సామ్రాజ్యం
[మార్చు]12 వ శతాబ్దంలో ఘోరి మొహమ్మద్ భారతదేశం మీద దండెత్తాడు. ఆయన ఢిల్లీ రాజ్‌ను జయించి ముస్లిం పాలన స్థాపించాడు. .[11] ఘురిడ్ సామ్రాజ్య పాలకులు:-
- ఘియాస్ -ఉద్-దిన్ బాల్బన్ 1205 - 1287
- ఖిల్జీలు, అల-ఉద్-దిన్ మామ. 1287 - 1295
- అల-ఉద్-దిన్ ముహమ్మద్ 1295 - 1316
- అల-ఉద్-దిన్ కుమారుడు 1316 - 1321
- ఘియాద్ -ఉద్-దిన్ తురుక్కీ లైన్ మొదటి తుగ్లక్ .
- ముహమ్మద్ బిన్ తుగ్లక్
- మూడవ ఫిరోజ్ షా (ఫిరోజ్ షా తుగ్లక్) 1351 - 1388.
- ఫిరోజ్ కాలంలో జౌన్‌పూర్ టౌన్షిప్ నిర్మించారు
మద్యయుగ పాలకులు
[మార్చు]షార్క్వి సామ్రాజ్యం
[మార్చు]గురిద్ సామ్రాజ్యం పతనం అయిన తరువాత షర్క్వి పాలకులు సామ్రాజ్యస్థాపన చేసి ఢిల్లీని స్వతంత్ర సామ్రాజ్యంగా మార్చారు.
షర్క్వి " తూర్పు పాలకులు ":-
- మాలిక్ (d. 1398)
- క్వాజా- జహన్ (మాలిక్- షాక్వ్ " లార్డ్ ఆఫ్ ది తూర్పు " ) 1394 - d. 1399 (ఢిల్లీ సుల్తాన్ రెండవ మహ్మద్ నియమించిన నపుంసకుడు).
- ముబారిక్ (జహన్ దత్తుపుత్రుడు ) 1400 - డి. 1401
- ఇబ్రహీం 1401 - 1441 (ముబారిక్ చిన్న కుమారుడు. ఇబ్రహీం సా జౌన్‌పూర్ టౌన్‌షిప్ ఒక సాంస్కృతిక, ముస్లిం మత కేంద్రంగా ఉంది. ఇక్కడ ఆకాలానికి సంబంధించిన పలు నాణ్యాలు ఉన్నాయి)
- మహ్ముద్ 1441 - 1451
- ముహమ్మద్ (బిఖున్ ఖాన్) 1451 - 1478
- హుస్సైన్ 1452 - 1474
లోడి సామ్రాజ్యం
[మార్చు]- బార్బక్ బిన్ బుహ్లోల్ లోడి 1474 - (ఇబ్రహీం సోదరుడు)
- సికందర్ లోడి (మహ్మూద్ యొక్క తండ్రి) 1479 - ధ్వంసం అత్యంత షార్కీ నిర్మాణాలు, మసీదులు వదిలి.
ముగల్ సామ్రాజ్యం
[మార్చు]ఈశాన్య భారతదేశాన్ని ముగల్ పాలకులు చాలాకాలం పాలించారు. జౌంపూరును మొదటిసారిగా బార్బర్ వారసుడు హుమాయూన్ చేరుకున్నాడు.
- బార్బర్ (b. 1483 - d. 1530), 1484 - 1525, జౌన్‌పూర్ ఇబ్రహీం లోడి సామ్రాజ్యంలో భగంగా ఉంది.
- హుమాయున్ 1530 - 1540, d. 1556
- షేర్ ఖాన్ సూరి 1540 - d. 1545, హుమాయూన్ ఓడించిన బార్బర్ ఆఫ్ఘన్ సేనాధిపతి
- హుమాయూన్, 1556 కుమారుడు అక్బర్ - d. 1605 ( ఖాన్-ఐ ఖానన్ ఖనన్ ముహమ్మద్ మిన్ ఇం ఖాన్, 1567 లో జౌన్‌పూర్ (విశ్వసనీయమైన పెద్ద), గవర్నర్ -. ది 1575 గా నియమించాడు)
- అక్బర్ 1605 కుమారుడు జహంగీర్ - . 1627
- అక్బర్ కుమారుడు షాజహాన్ (కుర్రం ) కొడుకు 1627 - (. 1666) 1657
- ఔరంగజేబు 1658 - d 1707
- బహదూర్ షా 1707 - d. 1712
పర్షియా, ఆఫ్ఘన్ స్థాన్ దండయాత్రలు, దేశీయంగా హిందూరాజుల తిరుగుబాటు కారణంగా ముగల్ సామ్రాజ్యం పతనావస్థకు చేరుకుంది.
బ్రిటిష్ పాలన
[మార్చు]1775లో జౌన్‌పూర్ భూభాగం బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయబడింది. తరువాత ఈ ప్రాంతం కంపెనీ పాలనలో ఉంది. 1779లో బ్రిటిష్ ఇంపీరియల్ పాలన ఏకీకృతం చేయబడింది. 1818లో జమీందారీ విధానంలో అధికారిక పన్ను వసూలుచేసే అధికారం ఇవ్వబడింది. ఈ సమయంలో జౌన్‌పూర్ ప్రాంతంలోని బ్రిటిష్ కళాకారులు, రచయితలు జిల్లా సౌందర్యం ధ్వంసం అయిందని వర్ణించారు. కళాకారుల అభిప్రాయంలో ఆధారంగా బ్రిటిష్ రాక మునుపే ఇక్కడ రాజకీయ అస్థిరత నెలకొని ఉన్నదని భావిస్తున్నారు. కళాకారుల వర్ణనలు ఈ ప్రాంతం పట్ల వారికి ఉన్న ఆరాధన, వ్యధ వ్యక్తం ఔతుంది.[19] 1857 తిరుగుబాటు సమయంలో జౌన్‌పూర్ లోని సిక్కు బృందాలు భారతీయుల పక్షం వహించాయి.[20]
చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు
[మార్చు]షాహి క్విలా
[మార్చు]మూడవ 1362లో ఫిరోజ్ షా (షాహి ఖిలా) రాజ కోటను నిర్మించాడు. కేరర్ కోట ఒకప్పుడు గోమతీ నదీ తీరంలో ఉన్న జౌన్‌పూర్ టౌన్‌షిప్ ఉన్న ప్రాంతంలో ఉండేది. అందులో ఒక మసీదు, విశాలమైన టర్కీ శైలి స్నానశాలలు (హమ్మాం) ఉండేవి. వీటిని ఫిరోజ్ సోదరుడు ఇబ్రహీం నిర్మింపజేసాడు. రాతిగోడలమద్య సురక్షితంగా ఉండేలా నిర్మించబడింది. ప్రస్తుతం కోట శిథిలమై కోటలోని నిర్మాణాలు శిథిలాల మద్య మరుగునపడు ఉన్నాయి.[21]
ప్రధానద్వారం
[మార్చు]కోట ప్రధానద్వారం తూర్పు దిశలో ఉంటుంది. ద్వారం 14 అడుగుల ఎత్తున ఉంటుంది. వెలుపలి భాగం బూడిదరంగు రాతితో నిర్మించబడి ఉంటుంది.[21] 16వ శతాబ్దంలో అక్బర్ చక్రవర్తి జౌన్‌పూర్ గవర్నర్ మినింఖాన్ రాజభక్తికి మెచ్చి ఆయన మీద ఉన్న గౌరవానికి చిహ్నంగా కోట వెలుపల ఒక ద్వారాన్ని నిర్మించాడు. వెలుపలి ద్వారం ఆర్చీలు పసుపుపచ్చని టైల్స్‌తో అలంకరించబడ్డాయి. వెలుపలి ద్వారం గోడలు ఆకర్షణీయమైన డిజైన్లతో అలంకరించబడ్డాయి.
రాజభవనం
[మార్చు]రెండు అంతస్తుల నివాస, రాజ్యకార్య నిర్వహణా భవనం (రాజభవనం) నలుచదరంగా నిర్మించబడింది. స్తంభాలతో నిర్మించబడిన వరండా (అయివన్) నుండి మొదటి అంతస్తు, రెండవ అంతస్తులను వీక్షించవచ్చు.
కోట మసీదు
[మార్చు]కోటలో నిర్మించబడిన మసీదు జౌన్‌పూర్ టౌంషిప్ లోని పురాతన మౌన నిర్మాణంగా గుర్తించబడుతుంది. ఇది సాధారణంగా నిరాడంబరంగా నిర్మించబడి ఉంది. ఇది బెంగాలీ శైలిలో స్థాంభాల మీద ఆధారపడి ఉంది. మసీదులో మూడు గుండ్రని పైకప్పులు ఉన్నాయి. మీనారులు లేవు. బదులుగా ఒకదానికి ఒకటి సమీపంలో రెండు స్తంభాలు ఉన్నాయి. .[21][22][23]
స్నానశాల
[మార్చు]హమ్మం లేక భూల్భులైయా భూమిలోపల నిర్మించబడి ఉంది. స్నానశాలలు జౌన్‌పూర్ టౌంషిప్ వద్ద ఉన్నాయి. ఇందులో నిరంతరంగా వేడి, చల్లని నీరు సరఫరా చేయబడుతుంటాయి. [21][23]
ఆటలా మసీదు
[మార్చు]1933లో మూడవ ఫిరోజ్ షా అటలా మసీదును నిర్మించాడు. ఇది ఆటలాదేవి ఆలయప్రదేశంలో నిర్మించబడింది. మూడవ ఫిరోజ్ షా 1376లో ఆటలాదేవి ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించబడిన మసీదు 1408లో పూర్తి చేయబడింది. అసలైన హిందూ స్తంభాలు, పైకప్పు మిగిలిన వస్తువులు మసీదు నిర్మాణానికి ఉపకరించబడ్డాయి. ఈ నిర్మాణం జిల్లాలోని మిగిలిన ఈ తరహా నిర్మాణాలకు మాదిరిగా నిలిచింది. మసీదు ఎత్తు 100 అ. .[24][25][26]
ఝంఝరి మసీదు
[మార్చు]గోమతీ నదీ తీరంలో నిర్మించబడిన ఝంఝారి మసీదును ఇబ్రహీం నిర్మించాడు. ఇది జౌన్‌పూర్ టౌన్‌షిప్ లోని సిపాహ్ ప్రాంతంలో నిర్మించబడింది. ఇక్కడ ఇబ్రహీం నివసించాడు. ఇబ్రహీంతో సన్యాసులు, శిష్యులు, పండితులు, గజ తురగాది సైనిక దళం ఉండేవారు. వరదలు, మానవ ఆక్రమణల తరువాత ప్రస్తుతం ఇక్కడ ప్రహరీ గోడలు మాత్రమే మిగిలాయి.ఇందులో ఒక ఎత్తైన ఆర్చి ఉంది. మసీదులోని రాళ్ళను షాహి వంతెన నిర్మాణానికి వాడారు.[25]
లాల్ దర్వాజా మసీదు
[మార్చు]జౌంపురి టౌంషిప్ ఉత్తరభూభాగంలో బెగుంగంజ్ వద్ద లాల్ దర్వాజా మసీదు నిర్మించబడింది. ఇది 1447, 1455లో షర్క్వి రాజవంశానికి చెందిన ముహమ్మద్ తన భార్య బీబి రాజే కొరకు నిర్మించాడు. ఇది వ్యక్తిగత అవసరాల కొరకు నిర్మించబడింది. ఈ మసీదు ప్రాంతీయ సన్యాసి మసీదు దావూద్ కుతుబుద్దీన్‌కు నిర్మించబడింది. మసీదులో మూడు ద్వారాలు ఒక సభావేదిక ఉంది. దీనిని లాల్ దర్వాజా మసీదు అని కూడా అంటారు.[27]
జమా మసీదు
[మార్చు]జమా మసీదును షర్క్వి కాలంలో ఇబ్రహీం చేత ప్రార, భించబడి పలు మార్పులు చేయబడి హుస్సైన్ చేత పూర్తిచేయబడింది. ఇది షాగజ్ రోడ్డు పురానీ గంజ్ లోని మదియాహు వద్ద ఉంది. మసీదుకు 4 ద్వారాలు ఉన్నాయి. తూర్పు ద్వారం సికిందర్ లోడీ చేత విధ్వంసం చేయబడింది. మసీదు ఈజిప్షియన్ శైలిలో అలంకరించబడింది.
షాహీ ఫూల్
[మార్చు]షాహీ వంతెన జౌన్‌పూర్ టౌంషిప్ వద్ద గోమతీ నది మీద నిర్మించబడింది. ఇది అక్బర్ చక్రవర్తి కొరకు 1564లో ఖాంఖన నిర్మించాడు. ఇది వెడల్పుగా ఉంటుంది. వంతెన మద్యలో చదరంగా ఉండే వేదిక మీద ఏనుగు మీద దాడి చేస్తున్న సింహం శిల్పం ఉంటుంది. ఇది బౌద్ధుల పాలనా కాలంలో నిర్మించబడినదని భావిస్తున్నారు.
ఇతర చారిత్రక ప్రాంతాలు
[మార్చు]- ఖొక్రి మసీదు .ఇది ఒక చారిత్రక ప్రాధాన్యత కలిగిన మసీదు. ఇది గొర్తిన్ నదీతీరంలో ఉంది. ( ఇది సయ్యద్ మొహమ్మద్ నౌంపురి, మహ్ది ఈ మౌద్ ఆహ్ కలుసుకున్న ప్రదేశం)
- Rauza-e-Husain (A.S.)
- శివ్ దేవాలయం (ధర్మపూర్ రాజు శ్రీ కృష్ణదత్తా నిర్మించాడు)
- హిందీ భవన్
- కాళి ఆలయం (కెరకత్)
- శివలింగం (హర్షవర్ధన్ శకం)
- గోమటేశ్వరుడు మహాదేవ (కెరకత్)
- వాన్ విహార్ (టి.డి.. కాలేజ్ కుద్దూపూర్ రోడ్)
- పరమహంస యొక్క సమిధి (ఔంక గ్రామం, ధానియమౌ)
- గసూరి శంకర్ దేవాలయం (సుజ్గంజ్)
- గురు ద్వారా (రాస్మదల్ )
- హనుమాన్ దేవాలయం (రాస్మదల్ )
- శారద దేవాలయం (పర్మంతపూర్)
- కబీర్ మఠం (బసేత గ్రామం, మచలీషహర్)
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ National Informatics Centre "Jaunpur official website." Government of India. Accessed 3 December 2013.
- ↑ 2.0 2.1 "Agricultural contingency plan for Jaunpur." Government of India. November 2013. Accessed 3 December 2013.
- ↑ 3.0 3.1 Ministry of Micro, Small and Medium enterprises "A brief industrial profile of Jaunpur district." Archived 2016-03-03 at the Wayback Machine Government of India. Date not stated. Accessed 3 December 2013.
- ↑ 4.0 4.1 4.2 Prasad G. "Progress in Nanotechnology." Discovery Publishing House. 2008. Vol 2. pp 68-71. Accessed at Google Books 4 December 2013.
- ↑ "Shri Ganesh Rai Postgraduate College." Archived 2014-09-24 at the Wayback Machine htcampus.com website accessed 3 December 2013.
- ↑ "Varanasi city guide" Eicher Goodearth Limited, 2002 ISBN 8187780045, 9788187780045 p 182. Accessed at Google Books, 6 December 2013.
- ↑ Ram R. "Agricultural development: command area approach." Abhinav publications 1993. p88. Accessed at Google Books 4 December 2013.
- ↑ Sharma S. "India - a travel guide." Diamond Pocket Books (P) Ltd., 2008. ISBN 8128400673, 9788128400674. p248. Accessed at Google Books 6 December 2013.
- ↑ Jain H. K. "Census 2011." Website accessed 4 December 2013.
- ↑ Sharma T. R. "A Political History of the Imperial Guptas: From Gupta to Skandagupta." Concept Publishing Company, 1989 ISBN 8170222516, 9788170222514 p39. Accessed at Google Books 4 December 2013.
- ↑ 11.0 11.1 11.2 11.3 11.4 Barhgava G. K. and Shankarlal C. B. ["http://books.google.com.au/books?id=FCG5hGZ-hJsC&pg=PA22&dq=jaunpur+british&hl=en&sa=X&ei=JBWgUo2rIauIiQe-kYGQDQ&ved=0CFUQ6AEwCDgK#v=onepage&q=jaunpur%20british&f=false. "Land and people of Indian states and union territories."] Gyan Publishing House, 2005 ISBN 8178353849, 9788178353845 p17. Accessed at Google Books 5 December 2013.
- ↑ Banerjee R. K. " Jaunpur" University of Michigan and National Atlas and Thematic Mapping Organisation, Department of Science & Technology, [Government of India], 1990. p13. Accessed at Google Books 6 December 2013.
- ↑ Brown C. J. "Coins of India." Asian Educational Services, 1922 ISBN 8120603451, 9788120603455 p85. Accessed at Google Books 4 December 2013.
- ↑ Prinsep J. "Useful Tables, Forming an Appendix to the Journal of the Asiatic Society" Baptist Mission Press, 1834. Original from Oxford University. p148. Accessed at Google Books 5 December 2013.
- ↑ Thomas E. "The chronicles of the Pathán Kings of Dehli: illustrated by coins, inscriptions, and other antiquarian remains." Trübner & Company, 1871. Original from Oxford University. Accessed at Google Books 6 December 2013.
- ↑ Bloom J. M. and Blair J. (Ed.) "The Grove Encyclopedia of Islamic Art and Architecture." Oxford University Press, 2009. ISBN 019530991X, 9780195309911 p270 Accessed at Google Books 4 December 2013.
- ↑ National Informatics Centre "Jaunpur district official website." Archived 2015-06-15 at the Wayback Machine Government of India. Accessed in English 4 December 2013.
- ↑ Kohn G. C. (Ed.) "Dictionary of wars." Routledge, 2013 ISBN 1135955018, 9781135955014 Accessed at Google Books 4 December 2013.
- ↑ Sengupta I. and Ali D. "Knowledge Production, Pedagogy, and Institutions in Colonial India." Palgrave Macmillan, 2011. ISBN 0230347002, 9780230347007. Accessed at Google Books 4 December 2013.
- ↑ Gupta O. "Encyclopaedia of India, Pakistan and Bangladesh." Gyan Publishing House, 2006. ISBN 8182053897, 9788182053892 p1109. Accessed at Google Books 4 December 2013.
- ↑ 21.0 21.1 21.2 21.3 "Jaunpur Fort," Archived 2014-02-07 at the Wayback Machine Archeological Survey of India website. Accessed 7 December 2013.
- ↑ Yasin M. and Yasin M. (Ed.)"Reading in Indian History." Atlantic Publishers & Distributors, 1988. p66. Accessed at Google Books 6 December 2013.
- ↑ 23.0 23.1 Asher C. B. "Architecture of Mughal India, Part 1, Volume 4. From "The new Cambridge history of India." Cambridge University Press, 1992 ISBN 0521267285, 9780521267281. p88 Accessed at Google Books 6 December 2013.
- ↑ Chaitany K. "Arts of India." Abhinav Publications, 1987 ISBN 8170172098, 9788170172093. p17. Accessed at Google Books 7 December 2013.
- ↑ 25.0 25.1 "Atala mosque" Archived 2016-03-04 at the Wayback Machine Jaunpur City website. Accessed 5 May 2012
- ↑ Agarwal M. K. "From Bharata to India: Volume 2: The Rape of Chrysee." iUniverse, 2012. ISBN 1475907699, 9781475907698. Accessed at Google Books 7 December 2013.
- ↑ "lal Darwaza mosque." Archived 2012-10-25 at the Wayback Machine ArchNet Digital Library website. Accessed 7 December 2013.
- ISBN మ్యాజిక్ లింకులను వాడే పేజీలు
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Pages using infobox settlement with no coordinates
- Pages using div col with unknown parameters
- Commons category link from Wikidata
- ఉత్తర ప్రదేశ్ జిల్లాలు
- Jaunpur district
- భారతదేశం లోని జిల్లాలు