సంత్ కబీర్ నగర్ జిల్లా
సంత్ కబీర్ నగర్ జిల్లా
संत कबीर नगर जिला | |
|---|---|
ఉత్తర ప్రదేశ్ పటంలో సంత్ కబీర్ నగర్ జిల్లా స్థానం | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
| డివిజను | బస్తీ |
| ముఖ్య పట్టణం | ఖలీలాబాద్ |
| ప్రభుత్వం | |
| • లోకసభ నియోజకవర్గాలు | సంత్ కబీర్ నగర్ |
| విస్తీర్ణం | |
• మొత్తం | 1,659.15 కి.మీ2 (640.60 చ. మై) |
| జనాభా (2011) | |
• మొత్తం | 17,14,300 |
| • జనసాంద్రత | 1,000/కి.మీ2 (2,700/చ. మై.) |
| జనాభా వివరాలు | |
| • అక్షరాస్యత | 76.01% |
| Website | అధికారిక జాలస్థలి |

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో సంత్ కబీర్ నగర్ జిల్లా (హిందీ:संत कबीर नगर जिला) ఒకటి. ఖలీలాబాద్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రంగా ఉంది. ఈ జిల్లా బస్తీ డివిజన్‌లో భాగం. 1997 సెప్టెంబరు 5 న బస్తీ జిల్లా నుండి 131 గ్రామాలు, బంసి జిల్లాలోని సిద్ధార్ద్ నగర్ నుండి 161 గ్రామాలు చేర్చి సంత్ కబీర్ నగర్ జిల్లా రూపొందించబడింది.
సరిహద్దులు
[మార్చు]జిల్లా ఉత్తర సరిహద్దులో సిద్ధార్ధనగర్, మహారాజ్‌గంజ్, తూర్పు సరిహద్దులో గోరఖ్‌పూర్, దక్షిణ సరిహద్దులో అంబేద్కర్ నగర్, పశ్చిమ సరిహద్దులో బస్తీ జిల్లాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 1659.15 చ.కి.మీ.
పేరు వెనుక చరిత్ర
[మార్చు]జిల్లకు 15వ శతాబ్ధానికి చెందిన కవి కబీర్దాస్ స్మృత్యర్ధం నామకరణం చేయబడింది. కబీర్దాస్ జిల్లాలోని మఘర్‌లో నివసించాడు. ఆయన మరణం గురించి ఒక కథనం ప్రచారంలో ఉంది. భారతదేశంలో పాఠశాలలలో ఇది పాఠ్యాంశ్యంగా (నీతి కథలు లేక చరిత్ర) కూడా ఉంది. ఆయనను ఖనం చేసే సమయంలో ముస్లిములు మరుయు హిందువుల మద్య వివాదం చెలరేగింది. ముస్లిములు మరణానంతరం శరీరాన్ని పూడ్చి పెట్టడం ఆనవాయితీ. హిందువులు మరణానంతరం శరీరాన్ని దహనం చేయడం ఆనవాయితీ. కబీర్‌దాస్ చెప్పిన విషయాలను పుస్తకరూపంలో హిందువులు, ముస్లిములు వ్రాసి ఉంచినదానిని గుర్తించుకు తెచ్చుకుని దానిని అనుసరించారు. ఇలా వివాదం ముగింపుకు వచ్చింది.మఘర్‌లో ఆయన సమాధి (దర్గా), మందిరం పక్కపక్కన ఉంటాయి.
చరిత్ర
[మార్చు]1997 సెప్టెంబరు 5 న బస్తీ జిల్లా నుండి 131 గ్రామాలు, బంసి జిల్లాలోని సిద్ధార్ద్ నగర్ నుండి 161 గ్రామాలు చేర్చి సంత్ కబీర్ నగర్ జిల్లా రూపొందించబడింది.
ఆర్ధికం
[మార్చు]2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సంత్ కబీర్ నగర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]
విభాగాలు
[మార్చు]| విషయాలు | వివరణలు |
|---|---|
| డివిజన్ | బస్తి |
| తాలూకాలు | 3 ఖాలిలబ్ధ్, మెందావల్, ధన్ఘట |
| మండలాలు | శాంత, మెందవల్, బెళర్ కలాన్, సెమెరియవన్, బఘౌలి, ఖలిలబద్, నాథ్ నగర్, హైన్సర్ బజార్, పౌలి |
| అసెంబ్లీ నియోజక వర్గం | 3 ఖాలిలబ్ధ్, మెందావల్, ధన్ఘట |
| పార్లమెంటు నియోజక వర్గం | సంత్ కబీర్ నగర్ |
| విషయాలు | వివరణలు |
|---|---|
| జిల్లా జనసంఖ్య . | 1,714,300, [2] |
| ఇది దాదాపు. | గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[3] |
| అమెరికాలోని. | నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం.[4] |
| 640 భారతదేశ జిల్లాలలో. | 283 వ స్థానంలో ఉంది.[2] |
| 1చ.కి.మీ జనసాంద్రత. | 1041 [2] |
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 20.71%.[2] |
| స్త్రీ పురుష నిష్పత్తి. | 869:1000 [2] |
| జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
| అక్షరాస్యత శాతం. | 69.01%.[2] |
| జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
.
ప్రముఖ ప్రదేశాలు
[మార్చు]- ఖలిలాబాద్ (భారతదేశం) (జిల్లా ప్రధాన కార్యాలయం)
- మఘార్ (భారతదేశం )
- బఖరియా
- మెహద్వాల్
- ధంఘటా
- ధర్మసింగ్వా
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- సంత్ కబీర్ దాస్ (కవి)
- అఖిలేష్ సింగ్ (మేనేజింగ్ డైరెక్టర్ ఎ.పి.ఆర్.ఐ కుటుంబ అసోసియేట్స్)
- అహసాన్ ఖాన్ (రాజకీయవేత్త)
- జగదీష్ లాల్ శ్రీవాస్తవ (విలేఖరి)
- రాజు రంజన్ యాదవ్ (సోషలిస్టు)
- సిద్ధార్థ నీర్ (విలేఖరి)
- విమలేష్ త్రిపాఠి (విలేఖరి)
- అఖిలేష్ త్రిపాఠి (డైరెక్టర్ యాక్షన్ రూరల్ డెవెలెప్మెంట్ వరదన్ సొసైటీ, ధర్మసింగ్వా)
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- 1 2 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. the original (PDF) నుండి 2012-04-05 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: September 27, 2011.
- 1 2 3 4 5 6 "District Census 2011". Census2011.co.in. 2011. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". the original నుండి 2011-09-27 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-10-01.
Gambia, The 1,797,860 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. the original నుండి 2011-08-23 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-09-30.
Nebraska 1,826,341