బారాబంకీ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బారాబంకీ జిల్లా
बाराबंकी ज़िला
بارابنکی ‏ضلع
బారాబంకీ జిల్లా is located in Uttar Pradesh
బారాబంకీ జిల్లా
బారాబంకీ జిల్లా
ఉత్తర ప్రదేశ్ పటంలో జిల్లా స్థానం
Coordinates: 26°55′N 81°12′E / 26.92°N 81.20°E / 26.92; 81.20
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
ప్రాంతంఅవధ్
డివిజన్ఫైజాబాద్
జిల్లాబారాబంకీ
ముఖ్యపట్టణంబారాబంకీ
Area
 • Total3,894.5 km2 (1,503.7 sq mi)
Elevation
125 మీ (410 అ.)
Population
 (2011)[1]
 • Total26,73,581
 • Density686.50/km2 (1,778.0/sq mi)
భాషలు
 • అధికారికహిందీ, ఉర్దూ
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
225 xxx
టెలిఫోన్ కోడ్5248
ISO 3166 codeIN-UP-BB
Vehicle registrationUP 41
లింగనిష్పత్తి893/[2]
అక్షరాస్యత47.39%
శీతోష్ణస్థితిCfa (Köppen)
అవపాతం1,050 millimetres (41 in)
సగటు వేసవి ఉష్ణోగ్రత43.0 °C (109.4 °F)
సగటు శీతాకాల ఉష్ణోగ్రత3.3 °C (37.9 °F)
Location coordinates[3]
Data[4]
బారాబంకిలో రైల్వే స్టేషన్ రోడ్ బ్రిడ్జి సమీపంలో జమురియా నాలా

బారాబంకీ జిల్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ డివిజన్‌లోని 4 జిల్లాలలో ఒకటి. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అవధ్ భూభాగంలో ఉంది. 27°19' - 26°30' ఉత్తర అక్షాంశాలు, 80°05' - 81°51’ తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. జిల్లాలో దక్షిణ - తూర్పు దిశలలో సరిహద్దులలో సమాంతరంగా ఘాఘ్రా - గోమతి నదులు ప్రవహిస్తున్నాయి. జిల్లా తూర్పు సరిహద్దులో సీతాపూర్ జిల్లా ఉంది. ఈశాన్య సరిహద్దులో ఘాఘ్రానది, దాని వెనుక బహ్‌రైచ్, గోండా జిల్లాలు ఉన్నాయి. తూర్పు సరిహద్దులో ఫైజాబాద్ జిల్లా ఉంది. దక్షిణ సరిహద్దులో గోమతీ నది ఉంది. దానికి ఆవల సుల్తాన్‌పూర్ జిల్లా ఉంది. పశ్చిమ సరిహద్దులో లక్నో జిల్లా ఉంది. తూర్పు పడమరలుగా పొడవు 92 కి.మీ., వెడల్పు 93 కి.మీ. జిల్లా వైశాల్యం 3900 చ.కి.మీ. జనసంఖ్య 26,73,581. జనసాంధ్రత 686.50. జిల్లాకేంద్రం బారాబంకీ పట్టణం. ఇది సాహిత్యకారులను, సన్యాసులను, మేధావులనూ ఆకర్షించింది. స్వాతంత్ర్యసమరవీరులకు ఇది కేంద్రంగా ఉంది. బ్రిటిష్ పాలనా కాలంలో జిల్లా వైశాల్యం 1769 చ.కి.మీ. 1856లో బ్రిటిష్ పాలనలో 1857-1858 లో సిపాయీల కలహంలో జిల్లావాసులంతా ఉద్యమంలో పాల్గొన్నారు. అయినప్పటికీ పెద్ద ప్రతిఘటన లేకుండానే బ్రిటిష్ సైన్యాలు లక్నోను స్వాధీనం చేసుకున్నాయి.[5][6] జిల్లా చదునైన భూమి పలు సెలయేర్లు, చిత్తడి నేలలతో కూడి ఉంది. జిల్లా ఎగువ భూమిలో ఇసుక భూమి అధికంగా ఉంది. దిగువభూమిలోని బంకమట్టి సారవంతగా ఉండి పంటలకు అనుకూలంగా ఉంటుంది.[6] జిల్లాలో ప్రవహిస్తున్న నదులు జిల్లా వ్యవసాయ రంగానికి చక్కగా సహకరిస్తున్నాయి. గోమతీ నది, కల్యాణి, ఇతర ఉపనదులు జిల్లా మద్యభాగం నుండి ప్రవహిస్తూ సంవత్సరంలో అధికభాగం నీరు అందిస్తూ ఉన్నాయి. కొన్ని నదులు వేసవిలో ఎండి పోతూ వర్షాకాలంలో వరదలప్రమాదాలను సృష్టిస్తున్నాయి. ఘాఘ్రా నదీ ప్రవాహం దిశ మారుతూ జిల్లా భుభాగాన్ని ప్రతి సంవత్సరం మార్పులకు గురిచేస్తుంది.

పేరు వెనుక చరిత్ర[మార్చు]

బారాబంకీ జిల్లా పూర్వాంచల్ ప్రవేశద్వారంగా గుర్తించబడుతుంది. ఇది అనేక మంది ఋషులకు తపోభూమి. ఇది అతిపురాతనమైన ప్రాంతం. పురాతనమైన ఈ ప్రాంతం గురించి పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ముస్లిములు ఈ ప్రాంతం మీద దండయాత్ర చేయడానికి ముందు ఇది జాస్నౌల్ అని పిలువబడేది. జాస్ బీహార్ గిరిజనుల రాజు. జాస్ సా.శ. 1000 లో జాస్ సామ్రాజ్యాన్ని స్థాపించాడని భావిస్తున్నారు. తరువాత ఇది జాస్నౌల్ అని పిలువబడింది. ముస్లిం వారసులు భూములను 12 భాగాలుగా విభజించబడిన తరువాత వారసులు ఒకరితో ఒకరు తీవ్రంగా కలహించుకున్నారు. అందువలన దీనిని " బారహ్ బంకె " (అంటే 12 కలహకారులు అని అర్ధం) అని పిలువబడింది. అవధిలో బంకా అంటే ఎద్దు, ధైర్యం అని అర్ధం. మరొక కథనం అనుసరించి బన్ అంటే అరణ్యం. బారా బంకీ అంటే 12 అరణ్యభాగాలు అని అర్ధం.[5]

బారాబంకీ జిల్లా దరియాబాదు (బారాబంకీ ) అని పిలువబడింది. జిల్లా కేంద్రం ఒకప్పుడు దరియాబాదు ఉండేది. దరియాబాదును సైనికాధికారి షా షరిక్వి దరియా ఖాన్ పేరుతో స్థాపించాడు. సా.శ. దరియాబాదు 1858 వరకు జిల్లాకేంద్రంగా ఉండేది.</ref> సా.శ. 1859లో తరువాత జిల్లా కేంద్రం నవాబ్‌గంజ్‌కు మార్చబడింది. .[5]

పురాతన చరిత్ర[మార్చు]

రామాయణ శకం[మార్చు]

బారాబంకీ జిల్లా భూభాగం పురాతనకాలంలో సూర్యవంశ చక్రవర్తి దశరథమహారాజు సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. దశరథమహారాజు రాజ్యానికి అయోధ్య రాజధానిగా ఉండేది. దశరథుని కుమారుడు శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారాలలో ఒకటని హిందువుల విశ్వాసం. ఈ ప్రాంతం పురాతన కాలంలో శ్రీరాముని పాలనలో ఉండేది. శ్రీ రాముడు తనగురువు వశిష్ఠుని వద్ద విద్యాభ్యాసం చేసాడు. వశిష్ఠమహర్షి శ్రీ రాముడికి విద్య నేర్పిన ప్రదేశం సత్రిక్ (సప్తఋషి) అని భావిస్తున్నారు.

మహాభారత శకం[మార్చు]

జిల్లా చంద్రవంశ రాజుల పాలనలో చాలాకాలం ఉంది. మహాభారత శకం కాలంలో ఇది కురుసామ్రాజ్యంలో భాగంగా ఉంది. ఇది కురుక్షేత్రం అనిపిలువబడింది. పాండవులు తమ తల్లి కుంతీదేవితో ఘాఘ్రానదీతీరంలో కొంతకాలం నివసించారు. పవిత్రమైన పారిజాత వృక్షం కింతూరు గ్రామంలో ఘాఘ్రా నదీతీరంలో ఉంది.[7] కుంతీదేవి స్థాపించిన కుంతేశ్వర మహాదేవ్ ఆలయసమీపంలో ఉన్న పారిజాత వృక్షం కుంతీదేవి చితాభస్మం నుండి ఉద్భవించిందని భావిస్తున్నారు.[8] చారిత్రాత్మకంగా ఇది నిరూపించకపోయినప్పటికీ ఈ వృక్షం అతి పురాతనమైనది అన్నది సత్యం దీనికి పురాతనమైన చరిత్ర ఉన్నదన్నది నిజం. .[9] బజ్జర్ ధర్మ మండి, లోధేశ్వర్ మహాదేవ్ మందిరం శివలింగం ఈ ప్రాంతం 5 వేల సంవత్సరాల పురాతనమైన మహాభారతకాలం నాటిదని భావిస్తున్నారు.

చరిత్రకాలానికి ముందు[మార్చు]

బారాబంకీ జిల్లాలో అధికభాగం పశ్చింరాత్ దేశం (ఘాఘ్రా, గోమతీ నదుల మద్య ఉన్న ప్రాంతం) అనిపిలువబడేది. [10]), one of the five divisions of the kingdom of Rama.[11] సా.శ. 1000 కంటే ముందు జాస్ గిరిజన రాజుగా ఉండేవాడు. జాస్ జాస్నౌల్ రాజ్యాన్ని స్థాపించాడు. తరువాత దీనిని ముస్లిం పాలకులు పాలించారు. తరువాత ఇది బారాబంకీ అని పిలువబడింది.[5]

1000 - 1525 కాలం[మార్చు]

సా.శ. 1300 జిల్లాలోని సత్రిక్ వద్ద ముస్లిములు మొదటిసారిగా స్థిరనివాసాలు ఏర్పాటుచేసుకున్నారు.[5] సిహలీని ఆక్రమించుకున్నారు. సిహాలీ రాజు సిహాతియా చత్రి మరణించాడు. కింతూరు ఆక్రమినంచబడింది. కింతూర్ భార్ రాణి కింతామ చంపబడింది.[5] క్రీ.పూ 1030 లో చారిత్రక ఆధారాలు లభించాయి. 1030లో ఈ ప్రాంతాన్ని సయ్యద్ సాలర్ మసూద్ (మహ్మూద్‌కు చెందిన ఘజ్ని అల్లుడు) ఆక్రమించుకున్నాడు. సా.శ. 1032 లో సాలర్ మసూద్ మరణించాడు. [5]

సోహి దేవ్[మార్చు]

ఉత్తర భూభాగంలోని చిన్న సామ్రాజ్యం సాహెత్ - మాహేత్ భార్ సైనికాధికారి సోహిల్ దేవ్ (సీహెల్ దేవ్) (ఘాజి సైయ్యద్ సలార్ మసీదు జయించాడు) ను కన్నౌజుకు చెందిన రాథోర్ చక్రవర్తి శ్రీ చంద్రదేవ్ అడ్డుకుని జిల్లాలోని సత్రిఖ్ గ్రామం వద్ద యుద్ధం చేసాడు.[12]

కన్నౌజ్ రాజు[మార్చు]

మదీనాకు చెందిన కుతుబుద్దీన్ చేతిలో కన్నౌజ్ రాజులు, మణికపూర్ ఓడించబడి అవధ్ నుండి తరిమివేయబడ్డారు. బారాబంకీలో ముస్లిముల దండయాత్ర విజయవంతంగా ముగిసింది. తరువాత అంతటావ్యాపించింది. సిహలిని షేక్ నిజాం - ఉద్దీన్ జయించాడు. జైద్పూర్ కూడా ఆక్రమించబడింది. సయ్యద్ అబ్దుల్ వహీద్ భార్లను తరిమివేసాడు. తరువాత పట్టణం పేరును షాహల్పూర్ అని మార్చబడింది. అదే సమయంలో ముసల్మాన్ భత్తీల కాలనీ ఏర్పాటైంది. వారు పంజాబు లోని రాజపుతానా భత్నైర్ లేక భత్తియానా నుండి వచ్చారని భావిస్తున్నారు. వారు మావై మహోరా వద్ద స్థిరపడ్డారు.[5]

ముస్లిం వలసదారులు[మార్చు]

1350లో ముస్లిం వలసప్రజలు పెద్ద సంఖ్యలో జిల్లాభూభాగంలో ద్థిరపడ్డారు. ఈ వలసలు 18 వ శతాబ్దం వరకు కొనసాగింది.[13] ముస్లిములు ముందుగా అవధ్ ప్రాంతంలో శాశ్వతంగా స్థిరపడ్డారు.[14]

రుదౌలి[మార్చు]

రుదౌలి 700 లో అల్లా ఉద్దీన్ ఖల్జీ చేత ఆక్రమించబడింది. అదే సమయం అల్లా ఉద్దీన్ ఖల్జీ అంహల్వారా, చిత్తోర్, డ్కొగిర్, మందూర్, జెస్సుల్మెరె, గగ్రౌన్, మండి మొదలైన ప్రాంతాలను విధ్వంసం చేసాడు. 1350లో రసూల్పూర్ కూడా ఆక్రమించబడింది. దరియాబ్ ఖాన్ 1444 లో దర్యాబాదును స్థాపించాడు.దరియాఖాన్ సోదరిడు ఫతేపూర్‌ ఫతేఖాన్ కాలనీగా మార్చబడింది. రుదౌలి సమీపంలోని బరౌలి, బారై ఆక్రమించబడ్డాయి. 15వ శతాబ్దం మధ్యకాలానికి వాటికి వారి (బరౌలి, బారై ) పేరు నిర్ణయించబడింది.[5]

చత్రీలు[మార్చు]

తరువాత జిల్లాభూభాగంలో స్థిరపడిన ముస్లిములలో చత్రీలు ముఖ్యమైనవారు. మర్మమైన గిరిజనజాతికి చెందిన కంహాలు (20,000), అచల్ సింగ్ సంతతికి చెందిన వారు. 1450లో అచల్ సింగ్ దరీబ్ ఖాన్ వద్ద సైనికుడుగా ఉండేవాడు. అవధ్ మధ్యయుగంలో అచల్ సింగుకు ప్రత్యేక పేరు ఉండేది. ఆయనకు చాలా ఆస్తులు ఉండేవి. ఆయన రాజధాని బాడో సరై (పురాతన ఘాఘ్రా తీరం) .[5]

ఇబ్రహీం షాహ్[మార్చు]

ఇబ్రహీం షాహ్ షర్క్వి తిరిగి జౌన్‌పూర్ చేరుకున్నాడు. జౌన్‌పూర్‌కు చెందిన షర్క్వీలకు ఢిల్లీ లోడీలకు వారి రాజకుమారులకు మద్య అవధ్ యుద్ధభూమిగా మారింది. దరుయాబ్ ఖాన్ హిందువులను సైన్యంలో చేర్చుకున్నాడు. గుజరాత్ నుండి కల్హన్లు వచ్చారు. చత్రీలు, అహ్బన్, పాన్ వార్, గహ్లాట్, గౌర్, బియాలు, పలు ఇతర రాజవంశాలు వచ్చాయి. [5]

సూర్యవంశం[మార్చు]

హర్షవర్ధనుని సూర్యవంశ రాజాస్థానం, సోమవంశానికి చెందిన బహ్రెలియా సూరజ్పూర్ రాజాస్థానాలను చత్రీ కాలనీ వాసులు స్థాపించారు. .[5]

మొగల్ శకం (1526–1732)[మార్చు]

ముగల్ చక్రవర్తి అక్బర్ పాలనాకాలంలో ఈ జిల్లా ఓధ్, లక్నో, మానిక్పూర్ సర్కారులుగా విభజించబడింది.[5][15]

  • అక్బర్ పాలనలో అయిన్ - ఇ- అక్బరి పేరుతో ఉన్న పరగణాలు:-
  • సైలుక్ (ఇప్పుడు రాంనగర్, ంఉహమ్మద్పుర్)
  • దర్యబద్
  • రుదౌలి
  • సుబెహ
  • సత్రిఖ్
  • భితౌలి
  • దేవా
  • సిహలి
  • సిద్ధౌర్
  • ఫతేపూర్
  • కుర్సి

అవధ్ నవాబులు (1732–1856)[మార్చు]

ముస్లిం ప్రభుత్వాన్ని కదిలించడానికి హిందువులు సాగించిన యుద్ధాలను రైక్‌ యుద్ధాలు అంటారు.[5] వాజీరు ఢిల్లీలో సఫ్దార్ లేనిసమయంలో ఫరూకాబాదు వద్ద బంగాష్ ఆఫ్ఘన్లు నేవాల్ రీను ఓడించి చంపారు. తరువాత కొన్ని సురక్షితమైన పట్టణాలు కాక మిగిలిన ప్రాంతం అంతటినీ ఆఫ్ఘన్లు ఆక్రమించుకున్నారు. సా.శ. 1749 లో సఫ్దార్ జంగ్ 60,000 మంది సైన్యంతో ఆఫ్ఘన్లను ఓడించాడు. ఈ సమయంలో ముగల్ అధికారాన్ని ధిక్కరిస్తూ అవధ్ చథ్రీలు స్వతంత్రంగా వ్యవహరించారు. వారు సఫ్దార్ జంగ్ మరణం తరువాత రొహిల్లాలను దేశం నుండి తరిమివేశారు.[5] తరువాత అనూప్ సింగ్ నాయకత్వంలో రామ్నగర్ ధమేరి రాజా, గోండా బైసెన్లు, అనేక ఇతర ప్రభువులు వారి గిరిజనులు సమైక్యమై లక్నో (తరువాత వారు రోహిల్ఖండ్‌కు వెళ్ళి స్థిరపడ్డారు) మీద దాడి చేసారు. లక్నోలో ఉన్న షేక్జదాస్ శత్రువులను ఎదుర్కొనడానికి వెలుపలికి వచ్చాడు ఆయనతో వివాహసంబంధాలు ఉన్న మహ్ముదాబాద్ ఖంజిదాస్, బిల్హరాలు కలుసుకున్నారు. [5] లక్నో రహదారిలో కల్యాణి లోని చెయోలా ఘాట్ వద్ద యుద్ధం కొనసాగింది. ముసల్మానులకు మహముదాబాద్‌కు చెందిన నవాబ్ ముయిజ్- ఉద్ - ద్దీన్ ఖాన్ నాయకత్వం వహించాడు. యుద్ధంలో బాల్రైంపూర్ రాజా మరణించాడు. ఇరువైపులా 15,000 మంది మరణించడం లేక గాయపడడం జరిగింది. తరువాత హిందువులు, ముస్లిముల మద్య విద్వేషాలు చెలరేగాయి. రైక్వార్లు అసంతృప్తికి గురయ్యారు. బైంది, రాం నగర్ సంస్థానాలు విచ్ఛిన్నం అయ్యాయి. రాజాలతో కొన్ని గ్రామాలు మాత్రమే మిగిలిపోయాయి. రాజ్యాల సమైక్యత ప్రయత్నాలు మొదలయ్యాయి. 1856లో రామ్నగర్ రాజా కుటుంబం కోలుకుని రాజ్యవిస్తరణ చేసారు. బౌండి రాజా కూడా 172 గ్రామాలను తన రాజ్యంలో విలీనం చేసుకున్నాడు.[5]

1857 స్వాతంత్ర్య సమరం[మార్చు]

హర్దోలి, గొండా, లక్నో తాలూకాదారులు రాజును పదవీచ్యుతుని చేసారు. నవాబ్‌గంజ్ తరువాత ఎటువంటి తిరుగుబాటు లేకుండానే బ్రిటిష్ ప్రభుత్వం లక్నో రాజాస్థానాన్ని స్వాధీనం చేసుకుంది.[5] జిల్లాభూభాగంలో బ్రిటిష్ పాలనను పలువురు రాజకుమారులు ఎదిరించారు. పలువురు రాజులు వారి స్వతంత్రం కొరకు ఎదిరించి బ్రిటిష్ పాలకులతో యుద్ధం చేసారు. యుద్ధంలో రాజులు వారిసంపదలు కోల్పోయారు. రాజా బలభద్రసింగ్ చెలరి 1000 మంది సహచరులతో స్వాతంత్ర్యసమరంలో ప్రాణాలను పోగొట్టుకున్నారు. 1857లో నవాబ్‌గంజ్ వద్ద హోపే గ్రాంట్ తిరుగుబాటుదారులను ఓడించాడు.[14] 19వ శతాబ్దం సగభాగంలో తిరుగుబాటుదారులు భితౌలి వద్ద సాగించిన యుద్ధం ఓటమితో ముగిసింది. భితౌలి సైన్యాలు బెగం హజారత్ మహల్, నానాసాహెబ్ నేపాల్ భూభాగంలో ప్రవేశించారు. అక్కడి నుండి వారి స్వాతంత్ర్య సమరం సాగించారు.

స్వాతంత్ర్య సమరం[మార్చు]

1921లో గాంధీజి సహాయనిరాకరణోద్యమం ఆరంభించగానే ప్రజలలో స్వాతంత్ర్యజ్వాల తిరిగి రగులుకుంది. రాజకుమారుడు వేల్స్ భారతదేశానికి రావడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లావాసులు కూడా పోరాటంలో భాగస్వామ్యం వహించారు. 1922 - 1934 ఖిలాఫత్ స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో జిల్లావాసులు విదేశీ వస్తుబహిష్కరణ ఉద్యమంలో పాల్గొన్నారు. .[16] ప్రభుత్వవ్యతిరేక నినాదాలు అధికరించాయి. అత్యధికంగా ప్రజలను ఖైదుచేసి వారిమీద కోర్ట్ కేసులు బనాయించారు. నవాబ్‌గంజ్ గవర్నమెంటు ఉన్నత పాఠశాల వద్ద శ్రీ రఫీ అహ్మద్ కిద్వాల్ కూడా ఖైదుచేయబడ్డాడు. 1922లో ఖలీఫత్ ఉద్యమం, 1930 ఉప్ప సత్యాగ్రహం, 1942 క్విట్ ఇండియా ఉద్యమం జిల్లావాసులు ఉత్సాహంగా పాల్గొని బ్రిటిష్ వారికి నిద్రలేకుండా చేసారు. ఫలితంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం మూసివేయబడింది. అయినప్పటికీ జిల్లలోని ప్రజానాయకులు మర్మగా ఉంటూనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రకటనలు జారీచేయడం కొనసాగించారు. తిరుగుబాటు దార్లు 1942 ఆగస్టు 24 న హైదర్ఘర్ పోస్టాఫీసును దోపిడీ చేసారు. బారాబంకీ హెడ్ పోస్టాఫీసు, సత్రిక్‌లలో కూడా దాడులు కొనసాగాయి. జిల్లా ప్రజలు సత్యాగ్రహ పిలుపుకు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలను పెద్ద సంఖ్యలో ఖైదుచేయబడి కోర్టుకేసులను ఎదుర్కొన్నారు. 1942 అక్టోబరు 26 న బ్రిజ్ బహదూర్, హంస్ రాజ్ (సర్దార్) బారాబంకీ పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద బాంబును ఉంచాడు. ఈ సంఘటనను " బారాబంకీ ఔట్ పోస్ట్ బంబ్ కేసు "గా వర్ణించబడింది.[17]

భౌగోళికం[మార్చు]

జిల్లా ఏటవాలుగా కొండల వంటివి లేకుండా ఉంటుంది. జిల్లా భూభాగం సముద్రమట్టానికి 30- 400 అడుగుల ఎత్తులో ఉంది. జిల్లాలో క్రమంగా అభివృద్ధి చేయబడిన అందమైన తోటలు ఖాళీభూములకు నిండుదనం తీసుకువస్తున్నాయి. పంటలకు పుష్కలంగా జలం అందడం వలన జిల్లాలోని భూమి పచ్చదనంతో కళకళలాడుతుంది. అక్కడక్కడా బీడుభూములు కనిపిస్తున్నా క్రమంగా అవి మొక్కజొన్న పండించే పంటభూములుగా మారుతున్నాయి. జిల్లా ఉత్తరభూభాగంలో ఉన్న ఘఘ్రానదీ తీరంలో భూమి ఎగుడుదిగుడుగా ఉండి దట్టమైన చెట్లతో నిండి ఉంటుంది. జిల్లాలోని దక్షిణ భూభాగం క్రమంగా గోమతీ నదీలోయలవఉ దిగుడుగా ఉంటుంది.

సరిహద్దులు[మార్చు]

సరిహద్దు వివరణ జిల్లా
జిల్లా ఉపస్థితి లక్నోకు తూర్పుగా 29 కి.మీ దూరంలో ఉంది
డివిజన్ ఫైజాబాద్
భూభాగం అవధ్ భూభాగం
అక్షాంశం 26° 30' నుండి 27° 19' ఉత్తరం
రేఖాంశం 80° 58' నుండి 81° 55' తూర్పు
తూర్పు సరిహద్దు ఫైజాబాదు జిల్లా
ఉత్తర సరిహద్దు గొండా జిల్లా, బహ్రిచ్ జిల్లా
వాయవ్య సరిహద్దు సీతాపూర్ జిల్లా
పశ్చిమ సరిహద్దు లక్నో జిల్లా
దక్షిణ సరిహద్దు రీ బరేలి
ఆగ్నేయ సరిహద్దు సుల్తాన్‌పూర్ జిల్లా
ఈశాన్య సరిహద్దు ఘాఘ్రా నది (బారబంకీని బహ్రిచ్, గోండా నుండి వేరుచేస్తుంది)

[18]

ప్రదేశం[మార్చు]

1991 గణాంకాల ప్రకారం జిల్లా వైశాల్యం 4401 చ.కి.మీ. జిల్లా పునర్నిర్మాణం సమయంలో రుదాలి తాలూకా ఫైజాబాదు జిల్లాలో విలీనం చేయబడింది. తరువాత జిల్లా వైశాల్యం (3895.4 చ.కి.మీ) తక్కువైంది. ఘాఘ్రా నదీ ప్రవాహం క్రమంగా జిల్లాలో కొంత మార్పులకు గురిచేస్తుంది..[18]

నైసర్గికం[మార్చు]

నైసర్గికంగా జిల్లా మూడు విభాగాలుగా మార్చబడింది.[18]

  • తారై భూభాగం:- ఘాఘ్రా నదీతీరంలోని ఈశాన్య భూభాగం.
  • గోమతి పార్:- నైరుతీ నుండి ఆగ్నేయం వరకు ఉన్న విశాలమైన భూభాగం.
  • హార్:- కొంచెం ఎత్తైన గోమతి నదీ ప్రాంతం. వాయవ్యం నుండి ఆగ్నేయానికి క్రమంగా దిగుడుగా ఉన్న భూభాగం.

నదులు[మార్చు]

ఘాఘ్రా[మార్చు]

జిల్లాలో ప్రధానంగా ఘాఘ్రానది ప్రవహిస్తుంది. బహ్రాంఘాట్ నుండి కొంతదూరంలో ఉన్న ఫతేపూర్ తాలూకా వద్ద చౌకా, సర్దా సంగమిస్తున్నాయి. రెండు నదుల సంగమ ప్రవాహం ఘఘ్రా నదిగా పిలువబడుతుంది. ఈ రెండు నదులు హిమాలయాలలో జన్మించాయి. ఎండాకాలంలో నదీ ప్రవాహాలు సగం వెడల్పుకు కుంచించుకు పోతుంటాయి. ఘాఘ్రా నది బారాబంకీ జిల్లాను బహ్రిచ్, గోండా జిల్లాల నుండి విడదీస్తుంది. ఇది ఈశాన్యంగా ప్రవహించి ఫైజాబాదును దాటి అర్రాహ్ వద్ద గంగానదిలో సంగమిస్తుంది. ఈ నదీ ప్రవాహం ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటాయి. దిగువ భూములలో వరి పండించబడుతుంది. జిల్లాలో ఘాఘ్రా నది ప్రవాహం 48 మైళ్ళు పొడవు ఉంటుంది.కైతి, కామియర్, పాస్క ఘాట్ పడవలు నడుపబడుతున్నాయి.

గోమతి[మార్చు]

గోమతి నది హైదర్గర్, రాం సనేహి ఘాట్ గుండా ప్రవహించి బారాబంకీ జిల్లాను లక్నో, ఫైజాబాద్, సుల్తాన్‌పూర్ జిల్లాల నుండి విడదీస్తుంది. ఇది ఈశాన్య దిశగా ప్రవహిస్తుంది. నది మీగ నాటుపడవలు నడుస్తుంటాయి. గోజ్మతీ నది జిల్లాలో 42 కి.మీ పొడవున ప్రవహిస్తుంది. గోమతీనది పొడవు 105కి.మీ. ఇది ప్రయాణించడానికి అనుకూలమైనది.

కల్యాణి[మార్చు]

కల్యాణీ నది చిన్నది. ఇది ఫతేపూర్ తాలూకాలో జన్మించి జిల్లాలో కొంతదూరం ప్రవహించి ద్వారకాపూర్ గ్రామం వద్ద గోమతీ నదిలో సంగమిస్తుంది. ఇది జిల్లాలో తన ఉపనదులతో ప్రవహిస్తుంది. ఇది జిల్లా మద్యభాగంలో ప్రవహిస్తుంది. వర్షాకాలంలో కల్యాణీ నదికి వరదలు సంభవిస్తుంటాయి.

జమురిహ, రెత్[మార్చు]

జమురిహ, రెత్ నదులు రెండు నవాబ్గంజ్‌ తాలూకాలో ప్రవహిస్తున్నాయి. నదీతీరం పలు లోయలతో విభజించబడి ఉంటుంది. వర్షాకాలంలో నది తీవ్రరూపం ధరిస్తుంది. ఈ నదులు గోమతి నదిలో సంగమిస్తుంది. నదీతీరంలో హైదర్గర్, దేవీగంజ్, చౌరీ, అలాపూర్ వద్ద నివాసయోగ్యంగా ఉన్నాయి. జమూరియా నది బారాబంకీ, నవాబ్‌గంజ్ నగరాలలో ప్రవహిస్తింది.

చెరువులు, ఊటలు, జలాశయాలు[మార్చు]

జిల్లాలో దరియాబాదు, రాంసనేహి ఘాట్, నవాబ్‌గంజ్ వద్ద పలు జలప్రవాహాలు ఉన్నాయి. కొన్ని జలప్రవాహాలు ప్రయాణానికి అనుకూలంగా ఉన్నాయి. ఇవి క్రీడలు, విహారానికి ఉపకరిస్తున్నాయి. రామ్నగర్ పరగణాలో భగ్గర్ సెలయేరు అందంగా ఉంటుంది. జిల్లాలోని మరొక ప్రవాహం దేవా. పర్వా నర్దగి, గంహరి ప్రవాహాలు చిత్తడి భూలను ఏర్పరుస్తున్నాయి. .

మట్టి[మార్చు]

జిల్లా మైదానంలో భాగంగా ఉంటుంది. జిల్లాలో నదీప్రవాహాలు తీసుకువస్తున్న సారవంతమైన మట్టి ఉంటుంది. ఎగువభూమిని " ఊపర్హర్ " అంటారు. భూమిలో పసుపచ్చని బంకమట్టి ఉంటుంది. నదీ ప్రవాహం వెంట ఇసుక భూములు ఉంటాయి. జిల్లాలో ఉన్న ఒకేఒక ఖనిజం ఇసుక. ఇది నదీతీరం వెంట అవసరమైనంత లభిస్తుంది. దీనిని నిర్మాణాలకు ఉపయోగిస్తారు. [18]

గోమతి- కల్యాణి మైదానం[మార్చు]

గోమతి- కల్యాణి మైదానం వైశాల్యం 146,526. జిల్లా ఉత్తర దిశలో కల్యాణి, దక్షిణ దిశలో గోమతి, దాని ఉపనదులు, సర్దా సహాయక్‌కు జలమందించే కాలువ గోమతీ మరొయు కల్యాణీ సంగమం వద్ద ఉంది. .[19][20]

వాతావరణం[మార్చు]

వాతావరణం[మార్చు]

విషయ వివరణ వాతావరణ వివరణ
వాతావరణ విధానం అతి తేమతో కూడిన వాతావరణం
వేసవి అతి వేడిగా ఉంటాయి.
వర్షాకాలం జూన్- సెప్టెంబరు
శీతాకాలం స్వల్పంగా చలిగా ఉంటుంది. (నవంబరు- ఫిబ్రవరి)
గరిష్ఠ ఉష్ణోగ్రత 47.5 ° సెల్షియస్
కనిష్ఠ ఉష్ణోగ్రత 2.5° సెల్షియస్
వర్షపాతం 10.56 మి.మీ [18]

వృక్ష జంతు జాలాలు[మార్చు]

వృక్షజాలం[మార్చు]

బారాబంకీ జిల్లా ప్రాంతంలో విస్తారంగా అరణ్యాలు ఉన్నాయని అందుకే ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం జిల్లాలో కొంతభూభాగంలో మాత్రమే అటవీప్రాంతం మిగిలి ఉంది. కలక్రమానుసారం జనసంఖ్య పెరుగుదల, అధిక ఆహార అవసరాలు అరణ్యప్రాంత క్షీణతకు దారితీసాయి. ప్రస్తుతం జిల్లాలో అసమానమైన భూభాగంలో మాత్రమే అరణ్యాలు ఉన్నాయి. అటవీప్రాంతంలో మిశ్రితరూపంలో ఉన్న చెట్లు, పొదలు ఉన్నాయి. అడవులు అరుదుగా చెదురు మదురుగా మాత్రమే ఉన్నాయి. జిల్లాలో ఆటవీప్రాంత వైశాల్యం 5308 హెక్టారులు. జిల్లాలో ప్రస్తుతం రాంసనేహి ఘాట్ తాలూకాలో 29%, ఫతేపూర్ తాలూకాలో 27%, హైదర్గర్ తాలూకాలో 15% అటవీప్రాంతం ఉంది. అరణ్యాలు అధికంగా గోమతీ, కల్యాణీ నదీతీర ప్రాంతంలో ఉన్నాయి. అదనంగా పి.డబల్యూ.డి రహదార్ల వెంట రెండు వైపులా చెట్లు ఉన్నాయి. జిల్లాలోని అటవీప్రాంతంలో షిషం, అర్జున, కంజి, ఖైర్, సాగౌన్, సుబాబుల్, నీం, యూకలిప్టస్, బాబుల్, కంజు, గోల్డ్ మొహర్, కెసుయా, అకేసియా, మామిడి, జామ మొదలైన చెట్లు ఉన్నాయి.

గ్రోవ్స్[మార్చు]

జిల్లా అంతటా గ్రోవ్స్, గార్డెంస్, ప్లాంటేషన్లు వ్యాపించి ఉన్నాయి. నవాబ్గంజ్, రామ్నగర్, ఫతేఘర్ వద్ద మామిడి చెట్లు అధికంగా ఉన్నాయి.

జంతుజాలం[మార్చు]

జిల్లాలోని అటవీప్రాంతంలో జంతువులు క్రమంగా క్షీణిస్తూ ఉన్నాయి.గత శతాబ్దంలో అధికంగా వేటాడడం, ఆక్రమణలు జంతువుల క్షీణతకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. జిల్లాలో నీల్‌గాయ్, జింక, చిత్తడి జింక, పధ, చిరుత, మచ్చల జింక, నక్క, జాకల్, పొర్క్యూపైన్ మొదలైన జంతువులు ఉన్నాయి. నీల్ గాయ్ సంఖ్య అధికం ఔతున్నందున వ్యవసాయదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ఈ జంతువులన్నీ ప్రస్తుతం అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి.

పక్షులు[మార్చు]

జిల్లాలో పక్షులు పొరుగు జిల్లాలలో ఉన్ంట్లుగానే ఉంటాయి. బాతులు, కింగ్ ఫిషర్, వేటపక్షులు, పావురాళ్ళు, నెమలి మొదలైన పక్షులు ఉంటాయి.

సరీసృపాలు[మార్చు]

జిల్లాలో పలు జాతుల పాములు, సరీసృపాలు ముఖ్యంగా గ్రామీణప్రాంతాలలో ఉన్నాయి. జిల్లాలో త్రాచు, క్రైట్, రాట్ స్నేక్ మొదలైన విష సర్పాలు కూడా ఉన్నాయి. అలాగే విషరహిత పాములు కూడా ఉన్నాయి. జిల్లాలోఅదనంగా ఊసరవెల్లీ, బిచ్ఖోప్రా మొదలైన సరీసృపాలు ఉన్నాయి.

చేప[మార్చు]

చేపలు నదులు, ప్రవాహాలు, చెరువులు, కాలువలలో కృత్రుమ సరోవరాలలో ఉంటాయి. జిల్లాలో అనేక జాతుల చేపలు కనిపిస్తుంటాయి. జిల్లాలో ప్రధానంగా రోహు, మ్నైన్, మంగూర్, సౌల్ కాట్లా మొదలైనవి ఉన్నాయి.

పార్లమెంటు, అసెంబ్లీ[మార్చు]

బారాబంకీ జిల్లా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంటు నియోజక వర్గం ఉన్నాయి.

సంఖ్య 'అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య' 'అసెంబ్లీ నియోజకవర్గం పేరు' 'అసెంబ్లీ నియోజకవర్గం రిజర్వేషన్ స్థితి' 'అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం గృహాల' 'అసెంబ్లీ నియోజకవర్గంలో నికర ఓటర్లు' 'పార్లమెంటరీ నియోజకవర్గం యొక్క నో' 'పార్లమెంటరీ నియోజకవర్గం యొక్క పేరు' 'పార్లమెంటరీ నియోజకవర్గం రిజర్వేషన్ స్థితి' 'పార్లమెంటరీ నియోజకవర్గం లో నికర ఓటర్లు' Ref
1 266 కుర్సి జనరల్ 343 295030 53 బారాబంకి SC 1435692 [21]
2 267 రామ్ నగర్ జనరల్ 323 260400 [22]
3 268 బారాబంకి జనరల్ 322 289765 [23]
4 269 జైద్‌పూర్ షెడ్యూల్డ్ కులాలు 359 302189 [24]
5 272 హైదర్‌ గర్ SC 327 288308 [25]
6 270 దరియాబాద్ జనరల్ 337 304073 54 ఫైజాబాద్ General 1506120 [26]
7 271 రుదౌలి జనరల్ 304 282890 [27]

మౌలిక వసతులు[మార్చు]

మౌలిక వసతుల జాబితా. (1999-2002 data) :[28]

రహదారి[మార్చు]

జాతీరహదారులు 24ఎ, 28, 28సి, 56ఎ జిల్లా మీదుగా పయనిస్తున్నాయి. రహదారి మార్గంలో జిల్లా ఇతర నగరాలతో చక్కగా ఆంసంధానించబడి ఉంది. 1947 మే 15న ఉత్తరప్రదేస్‌లో ఆరంభించబడిన " ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు ట్రాంస్‌పోర్ట్ కార్పొరేషన్ ద్వారా పాసింజర్ - రవాణా సేవలు లక్నో - బారాబంకీమార్గంలో అందిస్తుంది. .[29]

  • బస్ స్టాండ్ 93

రైల్వే[మార్చు]

ఉత్తర రైల్వే, ఉత్తర తూర్పు రైల్వే రెండు బారాబంకీజిల్లా గుండా.

  • రైల్వే లైన్ పొడవు: బ్రాడ్ గేజ్ 131 & nbsp; km
  • రైల్వే స్టేషన్లు/ చేరుతుంది: 19

సమాచార సేవలు[మార్చు]

  • అర్బన్ పోస్ట్ ఆఫీస్ 26
  • గ్రామీణ తపాలా కార్యాలయం 339
  • టెలిగ్రాఫ్ కార్యాలయం 19
  • టెలిఫోన్ కనెక్షన్లు 25691

ప్రజా పంపిణీ వ్యవస్థ[మార్చు]

  • గ్రామీణ చౌకధరల దుకాణాల 1094
  • అర్బన్ చౌకధరల దుకాణాలు 118
  • బయో గ్యాస్ ప్లాంట్స్ 4645
  • కోల్డ్ స్టోరేజ్ 16

విద్యుత్[మార్చు]

  • మొత్తం విద్యుద్ధీకరణ గ్రామాలు 1103
  • మొత్తం విద్యుద్ధీకరణ పట్టణాలు / నగరాలు 13
  • విద్యుద్ధీకరణ షెడ్యూల్ కులం ప్రాంతములలో 1149

నీటి సరఫరా[మార్చు]

ఏరియా కుళాయిలు ఉపయోగించి నీటి సరఫరా కింద కవర్ / భారతదేశం యొక్క handpumps మార్క్ -2:

  • విలేజ్ 1812
  • పట్టణాలు / నగరం 14

వినోదం[మార్చు]

  • సినిమా హాల్స్ 2
  • హాల్స్ సీట్లు మొత్తం సంఖ్య 2675

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,673,581,[30]
ఇది దాదాపు. మౌరిటానియా దేశ జనసంఖ్యకు సమానం.[31]
అమెరికాలోని. లోవా నగర జనసంఖ్యకు సమం.[32]
640 భారతదేశ జిల్లాలలో. 107 వ స్థానంలో ఉంది.[30]
1చ.కి.మీ జనసాంద్రత. 740 .[30]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 26.40%.[30]
స్త్రీ పురుష నిష్పత్తి. 887:1000 [30]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 47.39%.[30]
జాతియ సరాసరి (72%) కంటే. అతి తక్కువ

[33]

2011[మార్చు]

జిల్లాలో మైనారటీల సంఖ్య 23%. సాంఘిక- ఆర్థిక, మైళిక సదుపాయాలు దేశీయ సరాసరి కంటే తక్కువగా ఉన్న జిల్లాలలో బారాబంకీ జిల్లా ఒకటి. [34]

మతం[మార్చు]

Religion in Barabanki district
Religion Percent
Hindus
  
77.51%
Islam
  
22.04%
Others
  
0.55%

జిల్లాలో హిందువులు 77.51%, ముస్లిములు 22.04%, సిక్కులు 0.12%, జైనులు 0.11%. బౌద్ధులు 0.09%, క్రైస్తవులు 0.08%, ఇతరులు 0.05% ఉత్తరప్రదేశ్ హిందువులు 80.61%, ముస్లిములు 18.50%, సిక్కులు 0.41%, జైనులు 0.12%. బౌద్ధులు 0.18%, క్రైస్తవులు 0.13%, ఇతరులు 0.05% [35]

భాషలు[మార్చు]

జిల్లాలో హిందీ భాధాకుటుంబానికి చెందున అవధ్ భాష అధికంగా వాడుకలో ఉంది. అవధి భాషకు 3.8 కోట్ల మంది ప్రజలలో వాడకలో ఉంది. ప్రధానంగా అవధ్‌లో ఈ భాష అధికంగా వాడుకలో ఉంది.[36]

ఆర్థికం[మార్చు]

నీటిపారుదల[మార్చు]

బారాబంకీజిల్లాలో వ్యవసాయభూముల వైశాలల్యం 84.2% (ఉత్తప్రదేశ్ 79%). బారాబంకీనీటిపారుదల 179.9 %. ఉత్తరప్రదేశ్ నీటిపారుదల 140%. జిల్లా నీటిపారుదల సామర్ద్గ్యం సారాసరి కంటే అధికం. జిల్లాలో వ్యవసాయభూములకు బోరు బావులు (69%), కాలువల (29.9%) ద్వారా నీరు అందుతూ ఉంది. ఉతారప్రదేశ్ బోరుబావులు 89.9% కాలువలు 20.9%. బోరుబావులు, నదులు లేక చెరువుల ద్వారా పారుదల రాష్ట్ర సరాసరి కంటే తక్కువ.

పంటలు[మార్చు]

బారాబంకీజిల్లా వ్యవసాయ అనుకూలంగా ఉంటుంది. వ్య్వసాయదారులు వార్షికంగా 5 పంటలు పండిస్తున్నారు.[37] జిల్లాలో ప్రధానంగా వరి, గోధుమలు (68.4%) అధికంగా పండిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వరి 23.1%, గోధుమ 40.6%. ధాన్యాలు 68.4%. ఉత్తరప్రదేశ్ 73.2%. బారాబంకీపప్పుధాన్యాలు 10.1%. ఉత్తరప్రదేశ్ 11.6%. బారాబంకీమొత్తం పంట ధాన్యాలు 78.3%. ఉత్తరప్రదేశ్ 84.9%. బారాబంకీచెరకు 3.6% ఉత్తరప్రదేశ్ 9.5%. ఉర్లగడ్డలు 2.8%. ఉత్తరప్రదేశ్ 2.0%. జిల్లాలో గోధుమ, వరి, మొక్కజొన్నలు ప్రధాన ధాన్యాలుగా ఉపయోగిస్తున్నారు.[38][39] ఓపియం, మెంథాల్ ఆయిల్, చెరకు, పండ్లు, అరటి, పుట్టగొడుగులు మొదలైన పంటలు. ఉర్లగడ్డలు, టమాటా, పూలు (గ్లాడియోల్స్) మొదలైన కూరగాయలు పండించబడుతున్నాయి. జిల్లాలో సుగంధద్రావ్యాలు ప్రధాన వాణిజ్యపంటలుగా పండించబడుతున్నాయి.[40][41][42][43][44] జిల్లా నుండి మామిడి, కూరగాయలను ఎగుమతి చేస్తుంది..[45]

మెంథాల్[మార్చు]

బారాబంకీజిల్లా మెంథాల్ సాగుచేయడంలో దేశంలో ప్రథమస్థానంలో ఉంది. జిల్లాలో 20,000 ఎకరాలలో మెంథాలు సాగుచేయబడుతుంది. బారాబంకీమెంథాల్ క్రిస్టల్స్ తయారుచేయడానికి బారాబంకిలో పరిశ్రమ, మెంథాల్ ఆయిల్ క్రయ విక్రయాలు నిర్వహించడానికి మండి ఉంది.[45][46][47][48]

జంతువుల పెంపకం[మార్చు]

జిల్లాలో జంతువుల పెంపకం, ఫాంలు కూడా ఉన్నాయి.[49] జిల్లాలో బ్రాయిలర్ కోళ్ళ ఫాం కూడా ఉన్నాయి. [50] జిల్లాలోని దేవా బ్లాకులో తేనెటీగల పెంపకం కూడా చేపట్టారు.[50][51] చేపల పెంపకం కూడా జిల్లాలో అధికంగా ఉంది.[50] జిల్లాలో భారతప్రభుత్వ వ్యవసాయశాఖ సంబంధిత " రీజనల్ అగ్రికల్చర్ సీడ్ & డెమాబ్స్ట్రేషన్ స్టేషన్ " ఉంది..[52]

కుటీర పరిశ్రమలు[మార్చు]

Barabanki Handloom Cluster ఉత్తరప్రదేశ లోని బారాబంకీ హ్యాండ్‌లూం క్లస్టర్ లక్నోలో నవాబుల పాలనా కాలం నుండి ప్రసిద్ధి చెంది ఉంది. ఇక్కడ తయారుచేస్తున్న 95% చేనేత వస్త్రాలు ఎగుమతి చేయబడుతున్నాయి. ఎగుమతి అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. చేనేత పరిశ్రమకు అవసరమైన వసతులు అందుబాటులో ఉన్నాయి..[55] దుస్తులు, స్కార్ఫులు, శాలువలు, స్టోల్స్ మొదలైన వాటికి ఎగుమతి అవకాశాలు అధికంగా ఉన్నాయి.[56]

ఈ ఉత్పత్తులు అధికంగా రెండు వర్గాలుగా వర్గీకరించబడ్డాయి:-

* రేయాన్ ఫైబర్
* కాటన్ నూలు

చేనేత[మార్చు]

బారాబంకీ జిల్లా చేతిరుమాలు ఉతపత్తి కేంద్రంగా అభివృద్ధి చెందింది. జిల్లా చేయిరుమాళ్ళ పరిశ్రమ అసంపూర్తి ఉతపత్తులను పూర్తిచేసి తిరిగి వాడకం దారులకు అందిస్తుంది. .[57] బారాబంకిలోని స్కార్వ్ " ది నేషనల్ హ్యాండ్‌లూం ఎక్స్‌పొ -2013 " ప్రదర్శన శాల నిర్వహించింది. ఈ ఎగ్జిబిషన్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలలో తయారుచేయబడిన చేనేత వస్త్రాలు ప్రదర్శించబడ్డాయి. .[58]

ఎంబ్రాయిడరీ[మార్చు]

జర్దోజ్- 2013 లో - జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్టరీ (ఇండియా) (జి.ఐ.ఆర్) అధికారం ఇచ్చిన జియోగ్రఫికల్ ఇండికేషన్ (జి.ఐ) రిజిస్ట్రేషన్ ద్వారా జర్దోగి లక్నో నమోదు చేయబడింది. జర్దోగి ఉత్పత్తులు లక్నో, సమీపంలోని బారాబంకీ, ఉన్నావ్, సీతాపూర్, రీ బరేలి, హర్దోయి, అమేథి జిల్లాలలో అధికంగా ఉత్పత్తి చేయబడితున్నాయి. వస్త్రాల నాణ్యతను తెలియజేయడానికి ఇవి బ్రాండు, లోగోతో వెలువడుతున్నాయి.[59]

  • క్షేత్రియ శ్రీ మహాత్మా గాంధీ ఆశ్రమం, లక్నో రోడ్, బారాబంకి

పరిశ్రమలు[మార్చు]

There are 6 industrial areas in the District Barabanki,[60]

  1. యు.పి.ఎస్.ఐ.డి.సి, కుర్సి రోడ్, బారాబంకి
  2. ఇండస్ట్రీయల్ ఏరియా, దేవా రోడ్, బారాబంకి
  3. ఇండస్ట్రీయల్ ఏరియా, రసూల్ పనహ్, ఫతేపూర్, బారాబంకి
  4. మినీ ఇండస్ట్రియల్ ఏరియా, ఇస్మాయిల్పూర్, దేవా, బారాబంకి
  5. మినీ ఇండస్ట్రియల్ ఏరియా అంబర్సంద బారాబంకి
  6. మినీ ఇండస్ట్రియల్ ఏరియా సోహిల్పూర్, హర్ఖ్ బారాబంకి

సంస్కృతి[మార్చు]

బారాబంకీజిల్లాలో సుసంపన్నంగా ఉంది. జిల్లా తన పురాతన సంప్రదాయాన్ని కాపాడుతూ ఉంటారు. జిల్లాలో అనేకమంది సన్యాసులు, సాధకులు, మేధావులు, స్వతంత్రసమరయోధులను ఒకే కప్పు కిందకు తీసుకువచ్చింది. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సుఫీ సన్యాసి హజీ వారిస్ అలి షాహ్ ప్రజలను " జో రాబ్ వాహి రాం " పేరుతో ప్రభావితం చేస్తున్నాడు. భగవంతుడు ఒక్కడే అన్నది ఆయన సిద్ధాంతం.[61] సత్నామి సన్యాసి శ్రీ జగ్జీవన్ దాస్, సెయింట్ మాలామత్ షాహ్ ప్రజలను పెద్ద ఎత్తున ప్రభావితులను చేసారు. కనవరియాస్ మహాదేవా, మహాభారతంలో ప్ర్స్తావించబడిన కురుక్షేత్ర, పారిజాత - వృక్షం మొదలైనవి జిల్లాలో ఆధ్యాత్మికతకు మైలురాళ్ళుగా నిలిచాయి. 2011 - 12 దేవాషరీఫ్ ష్రైన్ - మహాదేవ ఆలయాలను 19.57 మంది యాత్రీకులు దర్శించారు. [62] డాక్టర్ రాజేశ్వర్ బాలి (రాంపూర్ - దర్యాబాద్ ఎస్టేట్ 13వ తాలూక్దార్) జిల్లాలో మొదటిసారిగా హిందూస్థానీ సంగీతాన్ని ప్రవేశపెట్టాడు. ప్రారంభంలో హిందూస్థానీ సంగీతం ఆలయాలలో వినిపించేది. తరువాత లక్నో లోని భత్ఖండే కాలేజిలో హిందూస్థానీ సంగీతం ప్రవేశపెట్టబడింది. ఈ సందర్భంలో వి.ఎన్ భత్ఖండేను ఆహ్వానించి హిందూస్థానీ సంప్రదాయ సంగీతానికి శిక్షణా విధానం రూపకల్పన చేయమని కోరారు.

వైద్య సౌకర్యాలు[మార్చు]

ఆసుపత్రులు[మార్చు]

  • బారాబంకీప్రభుత్వం లేడీస్ హాస్పిటల్, బారాబంకీనగరం
  • రఫీ అహ్మద్ కిద్వారు మెమోరియల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, బారాబంకి

మూలాలు[మార్చు]

  1. "Census of India" (PDF). Retrieved 2013-12-30.
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; AHS2010-11:UP అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2014-12-16.
  4. "At a Glance". Barabanki.nic.in. Retrieved 2013-12-30.
  5. 5.00 5.01 5.02 5.03 5.04 5.05 5.06 5.07 5.08 5.09 5.10 5.11 5.12 5.13 5.14 5.15 5.16 5.17 Gazetteer of the province of Oudh, BARA BANKI DISTRICT ARTICLE #226-263
  6. 6.0 6.1  One or more of the preceding sentences incorporates text from a publication now in the public domainChisholm, Hugh, ed. (1911). "Bara Banki". ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 3 (11th ed.). Cambridge University Press.
  7. Wickens, Gerald E.; Pat Lowe (2008). The Baobabs: Pachycauls of Africa, Madagascar and Australia. Springer Science+Business Media. p. 61. ISBN 978-1-4020-6430-2.
  8. Kameshwar, G. (2006). Bend in the Sarayu: a soota chronicle. Rupa & Co. p. 159. ISBN 978-81-291-0942-2.
  9. Uttar Pradesh District Gazetteers: Bara Banki. Government of Uttar Pradesh. 1993. p. 21. OCLC 7625267.
  10. Gazetteer of the province of Oudh; By Oudh, William Charles Benett. Books.google.com. Retrieved 2013-12-30.
  11. [1] The Garden of India; Or, Chapters on Oudh History and Affairs By Henry Crossley Irwin, #106
  12. [2] The Garden of India; Or, Chapters on Oudh History and Affairs By Henry Crossley Irwin, #67
  13. [3] The Garden of India; Or, Chapters on Oudh History and Affairs By Henry Crossley Irwin, #76
  14. 14.0 14.1 [4] The geography of British India, political & physical By George Smith
  15. "barabanki.nic.in, History, ORIGIN OF NAME OF DISTRICT". Barabanki.nic.in. Retrieved 2013-12-30.
  16. "छोटे-बड़े आंदोलनों में सहभागी बने थे बाराबंकीवासी (Hindi)". Dainik Jagran. 13 August 2012. Archived from the original on 12 జనవరి 2016. Retrieved 16 August 2012.
  17. Rakesh Ranjan Bakshi (1992). Quit India movement in U.P.: sabotage, bomb, and conspiracy cases. NP Publishers. p. 45. Retrieved 2013-06-30.
  18. 18.0 18.1 18.2 18.3 18.4 [5] Archived 2016-03-04 at the Wayback Machine REPORT ON Professional Institutional Network (PIN), DEPARTMENT OF EXTENSION EDUCATION, Narendra Dev University of Agriculture and Technology, Kumarganj, Faizabad-224229 (UP) India
  19. "Restoration Plan of Gomti River with Designated Best Use Classification of Surface Water Quality based on River Expedition, Monitoring and Quality Assessment" (PDF). Archived from the original (PDF) on 2013-12-30. Retrieved 2013-12-30.
  20. Optimum Utilisation of Surface Water and Ground Water Potential Using Fuzzy Approach Archived 2013-06-09 at the Wayback Machine, XXXII National Systems Conference, NSC 2008, 17–19 December 2008
  21. "Chief Electoral Officeer, Uttar Pradesh>Information and Statistics>AC's,PC's Booths>Assembly Constituencies>266-Kursi". Ceouttarpradesh.nic.in. Retrieved 2013-12-30.
  22. "Chief Electoral Officeer, Uttar Pradesh>Information and Statistics>AC's,PC's Booths>Assembly Constituencies>267-Ram Nagar". Ceouttarpradesh.nic.in. Retrieved 2013-12-30.
  23. "Chief Electoral Officeer, Uttar Pradesh>Information and Statistics>AC's,PC's Booths>Assembly Constituencies>268-Barabanki". Ceouttarpradesh.nic.in. Retrieved 2013-12-30.
  24. "Chief Electoral Officeer, Uttar Pradesh>Information and Statistics>AC's,PC's Booths>Assembly Constituencies>269-Zaidpur". Ceouttarpradesh.nic.in. Retrieved 2013-12-30.
  25. "Chief Electoral Officeer, Uttar Pradesh>Information and Statistics>AC's,PC's Booths>Assembly Constituencies>272-Haidergarh". Ceouttarpradesh.nic.in. Retrieved 2013-12-30.
  26. "Chief Electoral Officeer, Uttar Pradesh>Information and Statistics>AC's,PC's Booths>Assembly Constituencies>270-Dariyabad". Ceouttarpradesh.nic.in. Retrieved 2013-12-30.
  27. "Chief Electoral Officeer, Uttar Pradesh>Information and Statistics>AC's,PC's Booths>Assembly Constituencies>271-Rudauli". Ceouttarpradesh.nic.in. Retrieved 2013-12-30.
  28. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; whereincity అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  29. [6] Archived 2010-01-04 at the Wayback Machine UPSRTC History
  30. 30.0 30.1 30.2 30.3 30.4 30.5 "Basic Data Sheet" (PDF). censusindia.gov.in. 2011. Retrieved 2011-12-25.
  31. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Mauritania 3,281,634 July 2011 est.
  32. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Iowa 3,046,355
  33. "Census of India 2011 - Provisional Population Totals - Uttar Pradesh - Data Sheet" (PDF). Government of India, Ministry of Home Affairs, Vital Statistics Division. Office of the Registrar General & Census Commissioner, India. 2011. pp. 1 & 2. Retrieved 16 August 2012.
  34. MINUTES OF THE 34th MEETING OF EMPOWERED COMMITTEE TO CONSIDER AND APPROVE REVISED PLAN FOR BALANCE FUND FOR THE DISTRICTS OF GHAZIABAD, BAREILLY, BARABANKI, SIDDHARTH NAGAR, SHAHJANPUR, MORADABAD, MUZAFFAR NAGAR, BAHRAICH AND LUCKNOW (UTTAR PRADESH) UNDER MULTI-SECTORAL DEVELOPMENT PROGRAMME IN MINORITY CONCENTRATION DISTRICTS HELD ON 22nd JULY, 2010 AT 11.00 A.M. UNDER THE CHAIRMANSHIP OF SECRETARY, MINISTRY OF MINORITY AFFAIRS. Archived 2011-09-30 at the Wayback Machine F. No. 3/64/2010-PP-I, GOVERNMENT OF INDIA, MINISTRY OF MINORITY AFFAIRS
  35. Prof S S A Jafri (February 2008). "Baseline survey in the minority concentrated districts of Uttar Pradesh: Report of District Barabanki" (PDF). Ministry of Minority Affairs, Govt. of India. Archived from the original (PDF) on 2012-05-23. Retrieved 2013-07-04.
  36. M. Paul Lewis, ed. (2009). "Awadhi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  37. A Full Round Meal, Outlook India, Business/Cover Stories, 13 Apr 2009
  38. "Use of mint essential oil as an agrichemical: Control of N-loss in crop fields by using mint essential oil-coated urea as fertilizer" (PDF). Archived from the original (PDF) on 2006-10-10. Retrieved 2014-12-16.
  39. "Sub-programme on Maize-based Cropping Systems for Food Security in India under GOI-UNDP Food Security Programme". Archived from the original on 2008-08-07. Retrieved 2014-12-16.
  40. UP district to emerge as menthol oil hub, 8 September 2008, 5:41 IST
  41. Low Returns And A Rigid Govt Policy Alienating Opium Farmers Of Barabanki Archived 2011-08-11 at the Wayback Machine, TNN, 26 Jul 2010, 05.18am IST
  42. STATEMENT OF AEZ NODAL OFFICERS (UPDATED) Archived 2011-07-24 at the Wayback Machine, The Agricultural and Processed Food Products Export Development Authority (APEDA)
  43. IISR Newsletter Archived 2011-07-21 at the Wayback Machine, INDIAN INSTITUTE OF SUGARCANE RESEARCH, LUCKNOW, Vol. 16 No. 2, JULY 2009
  44. Traditionally a Potato growing area becomes a new leaf for Gen. Nxt. "BANANA CROP" Archived 2009-12-22 at the Wayback Machine, SPSingh , Ghaziabad: 15 Nov 2009
  45. 45.0 45.1 Characteristics of menthol mint Mentha arvensis cultivated on industrial scale in the Indo-Gangetic plains Archived 2013-02-01 at Archive.today, R. K. Srivastava, A. K. Singh, A. Kalra, V. K. S. Tomar, R. P. Bansal, D. D. Patra, S. Chand, A. A. Naqvi, S. Sharma and Sushil Kumar, Central Institute of Medicinal and Aromatic Plants (CIMAP), PO CIMAP, Lucknow 226 015, India, Revised 9 October 2001. Available online 20 November 2001.
  46. Sniffing success in Begusarai BIHAR CHRONICLE - A New Beginning, Sunday, 30 September 2007
  47. India emerges top in global menthol mint production and export
  48. "Menthol Production in India". Archived from the original on 2016-12-20. Retrieved 2014-12-16.
  49. "Holistic Approach for improving Livelihood Security through Livestock based Farming System in Barabanki and Raebareli districts of U.P." (PDF). Archived from the original (PDF) on 2011-07-21. Retrieved 2014-12-16.
  50. 50.0 50.1 50.2 List of Progressive/Innovative Farmers of Zone-IV, Kanpur[permanent dead link]
  51. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; iisdindia అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  52. Seed Testing Laboratories in India
  53. "Recommendation of the Project Sanctioning Committee (PSC) on the Project Proposals Considered in the Meeting Held on 22-24 December 2009 Under Step Scheme" (PDF). Archived from the original (PDF) on 1 డిసెంబరు 2010. Retrieved 16 డిసెంబరు 2014.
  54. Handloom industry
  55. Barabanki handloom cluster exports 95% of goods Archived 2015-03-11 at the Wayback Machine, June 22, 2010 (India)
  56. Bulletin: Some new designs of handloom clusters... Archived 2009-06-12 at the Wayback Machine, An in-house monthly magazine published from National Institute for Micro, Small and Medium Enterprises (ni-msme) [Formerly known as National Institute of Small Industry Extension Training (nisiet)] (An Organisation of the Ministry of MSME, Government of India); Volume 8, Issue 3, March 2009
  57. Handkerchief business generating employment in Uttar Pradesh, 2010-12-27 17:10:00
  58. "National handloom expo to open Saturday". Indian Express. 15 February 2013. Retrieved 15 February 2013.
  59. "Lucknow zardozi gets GI registration". The Business Standard. 24 April 2013. Retrieved 10 July 2013.
  60. MSME-DEVELOPMENT INSTITUTE,KANPUR. "Brief Industrial Profile of Barabanki District" (PDF). Ministry of MSME, Govt. of India. Archived from the original (PDF) on 2013-06-12. Retrieved 2013-07-04.
  61. [7] Hayat‐e‐Waris
  62. "Lucknow low on agenda of tourists visiting UP". Archived from the original on 2013-07-31. Retrieved 2014-12-16.