బలియా జిల్లా
బలియా జిల్లా बलिया ज़िला بالیا ضلع | |
---|---|
![]() ఉత్తర ప్రదేశ్ పటంలో బలియా జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | ఆజంగఢ్ |
ముఖ్య పట్టణం | బలియా |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,981 కి.మీ2 (765 చ. మై) |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 32,23,642 |
• సాంద్రత | 1,600/కి.మీ2 (4,200/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 73.82 per cent |
జాలస్థలి | అధికారిక జాలస్థలి |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బలియా జిల్లా (హిందీ:बलिया ज़िला) (ఉర్దు:بالیا ضلع) ఒకటి. బలియా ఈ జిల్లాకు కేంద్రం. బలియా జిల్లా అజంగఢ్ డివిజన్‌లో భాగం.
జిల్లాప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. బలియా పట్టణం వ్యవసాయ ఉత్పత్తులకు ప్రధాన వ్యాపార కూడలిగా ఉంది. జిల్లాలో బలియా, బన్స్దిహ్, రస్ర, బైరియా, సికందర్పూర్, బెల్థారా అనే 6 తాలూకాలు ఉన్నాయి. జిల్లాలో ఒక చక్కెర మిల్లు. ఒక పత్తి మిల్లు, పలు చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. మనియర్‌లో పెద్ద ఎత్తున బిందీ తయారు చేస్తారు.
2001 లో గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,223,642,[1] |
ఇది దాదాపు. | మౌరిటానియా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | లోవా నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 108 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1081:1000 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 16.73%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 933:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 73.82%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
భాషలు[మార్చు]
జిల్లాలో సాధారణ ప్రజలలో భోజ్పురి (bhojpuri language ) భాష వాడుకలో ఉంది. ఆంగ్లం కూడా నాగరికులలో వాడుకలో ఉంది. ముస్లిములలో ఉర్దూ భాష వాడుకలో ఉంది.
సంస్కృతి[మార్చు]
ప్రముఖ హిందీ సాహిత్యకారులు అనేక మంది బలియాలో జన్మించారు. వీరిలో హజారీ ప్రసాద్ ద్వివేది, పరశురాం చతుర్వేది, అమర్‌కాంత్ మొదలైన వారు ప్రముఖులు. ఈ జిల్లా గంగానది రెండు ప్రధాన నదులు గంగా, ఘఘ్రా (సరయు) మధ్యలో ఉంది. ఇవి ఈ భూమిని అధికంగా సారవంతం చేస్తున్నాయి. బలియా హిందూ పవిత్ర నగరాలలో ఒకటిగా భావించబడుతుంది. భృగు ఆలయం ఉన్న ప్రదేశంలో భృగు మహర్షి నివసించాడని భావిస్తున్నారు. భృగు ఆశ్రమం ముందు గంగానది ప్రవహిస్తుంది. శీతాకాలంలో ఒక మాసకాలం ఉత్సవం నిర్వవహించబడుతుంది. ఈ ఉత్సవానికి పరిసర గ్రామాల నుండి వస్తుంటారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15 నాడు జరిగే బలియా సోనాదిహ్ మేళాకి కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది.
రాజకీయం[మార్చు]
బలియా స్వాతంత్ర్యసమరవీరులు ఉన్నారు. చిట్టూ పాండే నాయకత్వంలో సాగించిన ఉద్యమంలో బలియాలో 1942 ఆగస్టు 19 నుండి కొన్ని రాజులపాటు బ్రిటిష్ రాజ్ రద్దు చేయడంలో సఫలమైయ్యారు. స్వాతంత్ర్యసమరవీరుడు ప్రఖ్యాత మంగల్ పాండే ఈ జిల్లాలో జన్మించాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తుపాకిని నిలిపిన మొదటి వ్యక్తిగా మంగల్ పాండేకు ప్రత్యేక గురింపు ఉంది. చిటు పాండే, మురలి మనోహర్, తారకేశ్వర్ పాండే, గౌరి శంకర్ రాయ్, వందలాది ప్రజలు ఈ జిల్లా నుండి స్వతంత్ర సమరంలో పోరాడారు. మురలి మనోహర్, తారకేశ్వర్ పాండే, గౌరి శంకర్ రాయ్ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికచేయబడ్డారు. గౌరి శంకర్ రాయ్ యు.పి శాసనసభ్యుడుగా, యు.పి కౌన్సిల్, ఇండియన్ పార్లమెంటు పార్లమెంటు సభ్యుడు ఆయన ఐక్యరాజ్య సమితికి అద్యక్షత వహించాడు. ఐక్యరాజ్యసమితిలో హిందీలో మాట్లాడిన మొదటి సభ్యుడుగా ఆయనకు ప్రత్యేకత ఉంది.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Mauritania 3,281,634 July 2011 est.
{{cite web}}
: horizontal tab character in|quote=
at position 11 (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Iowa 3,046,355
{{cite web}}
: line feed character in|quote=
at position 5 (help); line feed character in|title=
at position 15 (help)
![]() |
Wikimedia Commons has media related to Ballia district. |
- Pages with non-numeric formatnum arguments
- CS1 errors: invisible characters
- Articles with short description
- Short description is different from Wikidata
- Infobox settlement pages with bad settlement type
- Interlanguage link template link number
- Commons category link from Wikidata
- ఉత్తర ప్రదేశ్ జిల్లాలు
- బలియా జిల్లా
- భారతదేశం లోని జిల్లాలు