మథుర జిల్లా
మథుర జిల్లా | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
ఎగువ నుండి సవ్యదిశలో: గోవర్ధన్‌లోని మాన్సి గంగ, రాధా కుండ్, రాధా కృష్ణ వివాహ స్థాలి, భండిర్వన్, గోకుల, బర్సానా, బృందావన్, యమునా ఘాట్, కుసుమ్ సరోవర్ | ||||||||||
![]() ఉత్తర ప్రదేశ్ పటంలో మథుర జిల్లా స్థానం | ||||||||||
దేశం | భారత దేశం | |||||||||
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ | |||||||||
డివిజను | ఆగ్రా | |||||||||
ముఖ్యపట్టణం | మథుర | |||||||||
ప్రభుత్వం | ||||||||||
విస్తీర్ణం | ||||||||||
• మొత్తం | 3,329.4 km2 (1,285.5 sq mi) | |||||||||
జనాభా వివరాలు (2011) | ||||||||||
• మొత్తం | 25,47,184[1] | |||||||||
జనాభా | ||||||||||
• అక్షరాస్యత | 74.65%.[1] | |||||||||
కాలమానం | UTC+05:30 (IST) | |||||||||
జాలస్థలి | http://mathura.nic.in/ |
యమునా నది ఒడ్డున ఉన్న మధుర జిల్లా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా. చారిత్రిక పట్టణం మధుర, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది వైష్ణవ మతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటైన బృందావన్‌కు కూడా ప్రసిద్ధి చెందింది. [2] జిల్లా ఆగ్రా విభాగంలో భాగం. మధురకు ఈశాన్యంలో అలీగఢ్ జిల్లా, ఆగ్నేయంలో హాత్‌రస్ జిల్లా, దక్షిణాన ఆగ్రా జిల్లా, పశ్చిమాన రాజస్థాన్, వాయవ్యంలో హర్యానా రాష్ట్రం ఉన్నాయి. మధుర జిల్లా హిందువులకు ముఖ్యమైన తీర్థయాత్రా కేంద్రం.
జనాభా వివరాలు[మార్చు]
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1901 | 6,51,619 | — |
1911 | 5,60,620 | −14.0% |
1921 | 5,28,677 | −5.7% |
1931 | 5,70,211 | +7.9% |
1941 | 6,88,801 | +20.8% |
1951 | 7,74,567 | +12.5% |
1961 | 9,11,685 | +17.7% |
1971 | 10,99,356 | +20.6% |
1981 | 13,30,963 | +21.1% |
1991 | 16,50,653 | +24.0% |
2001 | 20,74,516 | +25.7% |
2011 | 25,47,184 | +22.8% |
2011 జనాభా లెక్కల ప్రకారం మధుర జిల్లా జనాభా 25,47,184, [1] జనాభా పరంగా భారతదేశ జిల్లాల్లో ఇది 167 వ స్థానంలో ఉంది. జిల్లాలో జనసాంద్రత 761. 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 22.53%. మధుర జిల్లాలో లింగ నిష్పత్తి 858 /1000. అక్షరాస్యత 72,65%. మధుర జాట్ ఆధిపత్యమున్న ప్రాంతం. జిల్లలో సుమారు 5.30 లక్షల జాట్లున్నారు . [3]
భౌగోళికం, శీతోష్ణస్థితి[మార్చు]
మధుర 27°17′N 77°25′E / 27.28°N 77.41°E వద్ద [4] సముద్ర మట్టం నుండి 174 మీటర్ల ఎత్తున ఉంది. మధురలో తీవ్రమైన ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. వేసవి చాలా వేడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 44°C దాటిపోతాయి. శీతాకాలాలు పొగమంచుతో కూడుకుని బాగా చల్లగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు 5°C కి తగ్గుతాయి. సగటు వర్షపాతం 793 మి.మీ. ఉంటుంది. జూలై నుండి సెప్టెంబరు వరకు వర్షాకాలం ఉంటుంది.
రవాణా సౌకర్యాలు[మార్చు]
మధుర, సెంట్రల్ రైల్వేకు చెందిన ప్రధాన మార్గాల్లో ఉంది. దేశం లోని ముఖ్యమైన నగరాలైన ఢిల్లీ, ఆగ్రా, లక్నో, ముంబై, జైపూర్, గ్వాలియర్, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నైలకు రైలు సౌకర్యాలున్నాయి. సమీప విమానాశ్రయమైన ఆగ్రా లోని ఖేరియా, మధుర నుండి 62 కి.మీ. దూరంలో ఉంది [5] మధుర నుండి ముఖ్యమైన నగరాలకు చక్కటి రోడ్డు సౌకర్యాలున్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ Gopal, Madan (1990). K.S. Gautam (ed.). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. p. 176.
- ↑ "Nitin Gadkari to hold rally in Jat dominated Mathura district". The Times of India.
- ↑ Falling Rain Genomics, Inc. - Mathura
- ↑ http://www.roaddistance.in/uttar-pradesh/kheria-airport-area-to-mathura-distance/by-road/
![]() |
నూహ్ జిల్లా, హర్యాణా | అలీగఢ్ జిల్లా | ![]() | |
భరత్పూర్ జిల్లా, రాజస్థాన్ | ![]() |
హాత్‌రస్ జిల్లా | ||
| ||||
![]() | ||||
ఆగ్రా జిల్లా |