మౌ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మౌ జిల్లా
मऊ
ఉత్తర ప్రదేశ్ పటంలో మౌ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో మౌ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుఆజంగఢ్
Government
 • లోకసభ నియోజకవర్గాలుఘోసీ
 • శాసనసభ నియోజకవర్గాలుఘోసీ, మధుబన్, రసారా, మౌ, సదర్ మొహమ్మదాబాద్, గోహనా
Area
 • మొత్తం1,713 km2 (661 sq mi)
Population
 (2011)
 • మొత్తం22,05,170
 • Density1,300/km2 (3,300/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత75.16%
 • లింగ నిష్పత్తి978
ప్రధాన రహదార్లుNH-29
Websiteఅధికారిక జాలస్థలి
మౌలో ఠాకూర్ బరిసన్ దేవ్ విగ్రహం

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో మౌ జిల్లా (హిందీ:मऊ) (ఉర్దు: مئو ضلع) ఒకటి. మౌ నాథ్‌భంజన్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.మౌ జిల్లా ఆజంగఢ్ డివిజన్‌లో భాగంగా ఉంది.

సరిహద్దులు[మార్చు]

జిల్లా దక్షిణ సరిహద్దులో ఘాజియాబాద్ జిల్లా, తూర్పు సరిహద్దులో బలియా జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఆజంగఢ్ జిల్లా, ఉత్తర సరిహద్దులో గోరక్‌పూర్ జిల్లా ఉన్నాయి. ఉత్తర సరిహద్దులో ఘాఘ్ర నది ప్రవహిస్తుంది. దక్షిణ సరిహద్దులో తంసానది ప్రవహిస్తుంది.

క్రీడలు[మార్చు]

  • మౌ జిల్లాకు క్రీడలలో అద్భుతమైన చరిత్ర ఉంది:

| | భీమ్నారాయణ్ రాయ్ (రేవరిధ్ ) జలెలిన్ త్రో క్రీడాకారుడు సహ్రోజ్- నేషనల్ చాంపియన్, 1961లో నూతన రికార్డ్ సృష్టి, ఆసియన్ క్రీడలలో రీకార్డును అధిగమించుట. 1960లో స్కూలు క్రీడలలో రికార్డ్ అధిగమించుట. 1964లో అత్యుత్తమ ప్రతిభకు అవార్డును అందుకున్నాడు. యు.పి అథ్లెటిక్ సమావేశంలో (-961-1965) యు.పి ట్రాక్ & ఫీల్డ్ చాంపియన్‌షిప్ అందుకున్నాడు.

క్రీడ పేరు ఊరు ప్రత్యేకత
లాంగ్ రేసర్ బహదూర్ ప్రసాద్ -- ఆసియన్ క్రీడలు
కుస్తీ క్రీడాకారుడు కిషోర్ పహల్వాన్ బసిహరం --
స్రింటర్ రాందాస్ అమిల --
యు.పి కేసరి తేజ్బహదూర్ సింగ్ సర్వన్ రణ్బీర్పూర్ --
అంతర్జాతీయ బాస్కెట్ బాల్ త్రిదిప్ రాయ్ కేసరా --
ఐ.పి.ఎల్ క్రికెట్ ప్లేయర్ కమరన్ ఖాన్ నద్వా సరై --

రాజకీయాలు[మార్చు]

In politics there were many politicians like Jharkande Rai and Kalpanath Rai were well known faces of politics Mau is the also land of mafia turned politician Mukhtar Ansari. In literature also, Mau has given many great writers and poet such as:

  • లక్ష్మీనారాయణ్ మిశ్రా (1903-1987) మౌ జిల్లాలోని బస్తి గ్రామంలో జన్మించాడు. ఆయన ప్రబల హిందీ నాటక రచయిత. ఆయన కృషి 1930-1950 మద్య శిఖరాగ్రాన్ని అందుకుంది. స్కూల్, కాలేజీలు, అమెచ్యూర్ నాటక సంఘాలు లక్ష్మీనారాయణ్ మిశ్రా నాటకాలను ప్రదర్శించారు.
  • ఫిజా ఇబాన్ - ఎ- ఫైజ్ (1923-2009 ) ఆధునిక ఉర్దు, పర్షియన్ కవి. ఆయన మౌజిల్లా వాసి. ఉర్దూ ప్రపంచంలో పలు అవార్డులను అందుకున్నాడు. ఫాజీ రచినలు 6 ప్రచురించబడ్డాయి.

2009లో ఆయన పేరు మీద మెమోరియల్ ఆయన గృహం సమీపంలో ఒక ద్వారం నిర్మించబడింది.

  • హబీబ్ - ఆల్ - రహమాన్ -ఆల్ - అజ్మిల్‌మౌలనా హబిబుర్ రహ్మాన్ అజ్మి (1900 - -992 ) ప్రబల ఇస్లామిక్ రచయిత ఈ నగరానికి చెందినవాడే. ఆయన " అబుల్ మాదిర్ " పేరుతో రచనలు సాగించాడు. ఇస్లామిక్ ప్రపంచంలో ఆయన రచనలు ప్రఖ్యాతి చెందాయి. మదీనా యూనివర్శిటీ, అల్ అజర్, దరుల్ ఉలుం, దియోబాండ్ లలో ఆయన సత్కారాలను అందుకున్నాడు. ఆయన రచనలు అంతర్జాతీయంగా గుర్తిపును తెచ్చుకున్నాయి.[1]

2011 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,205,170,
పురుషులు 1,114,888
స్త్రీలు 1,090,282
ఇది దాదాపు. లత్వియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 206వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 1287 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.94%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 978:1000, [4]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 75.16%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

2001 గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జనసంఖ్య 1,853,997, in which males were and remaining
పురుషులు 933,523
స్త్రీలు 920,474 [4]
టౌన్లు, బజార్లు కోపగంజ్, ఘోషి, అమ్లియా, దొహ్రిఘాట్, మండి- ఐపాన్ మధుబన్, మొహమ్మదాబాద్, ఇందరా

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-02-07. Retrieved 2014-12-16.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
"https://te.wikipedia.org/w/index.php?title=మౌ_జిల్లా&oldid=4055334" నుండి వెలికితీశారు