అలహాబాద్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలహాబాద్ జిల్లా
ఎడమ నుండి సవ్యదిశలో: త్రివేణి సంగమం, ఖుస్రో బాగ్ వద్ద నిహార్ బేగం సమాధి, ఆనంద్ భవన్, న్యూ యమునా వంతెన, బారా థర్మల్ పవర్ స్టేషన్
అలహాబాద్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ పటంలో అలహాబాద్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో అలహాబాద్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుఅలహాబాద్
ముఖ్య పట్టణంఅలహాబాద్
మండలాలు7
విస్తీర్ణం
 • మొత్తం5,482 కి.మీ2 (2,117 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం59,59,798
 • జనసాంద్రత1,100/కి.మీ2 (2,800/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత74.41 per cent
 • లింగ నిష్పత్తి901
ప్రధాన రహదార్లుNH 2
Websiteఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో అలహాబాద్ జిల్లా (హిందీ:इलाहाबाद ज़िला) ఒకటి. దీనికి ప్రయాగ్‌రాజ్ జిల్లా అని కూడా అంటారు. అలహాబాద్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. అలహాబాద్ జిల్లా అలహాబాద్ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లా వైశాల్యం 5,482 చ.కి.మీ. జిల్లాలో 8 తాలూకాలు, 20 తహసీళ్ళు ఉన్నాయి.[1][2][3] అలహాబాద్ డివిజన్‌లో ఫతేపూర్, కౌశాంబి జిల్లాలు ఉన్నాయి. జిల్లా లోని పశ్చిమ భూభాగం కొత్తగా రూపొందించబడిన కౌశాంబి జిల్లాలో చేర్చారు.[4] జిల్లాలో ఫూల్పూర్, కొరయోన్, మేజా తాలూకా, సాదర్ (అలహాబాద్), సరయాన్, హండియా, బారా (అలహాబాద్), కర్చానా డివిజన్లు ఉన్నాయి. అలహాబాదులో గంగ, యమున, సరస్వతి (అంతర్వాహినిగా) నదులు సంగమిస్తున్నాయి. దీనిని త్రివేణి సంగమం అంటారు. స్వాతంత్ర్యం రాకముందు అలహాబాద్, యునైటెడ్ ప్రావిన్సులకు రాజధానిగా ఉండేది.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 59,59,798,[5]
ఇది దాదాపు. ఎరిత్రియా దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. మిస్సోరీ రాష్ట్ర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 13 వ స్థానంలో ఉంది..[5]
1చ.కి.మీ జనసాంద్రత. 1087 [5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 20.74%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 902:1000 [5]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 74.41% ( 74%).[5][8]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

భాషలు

[మార్చు]

జిల్లాలో హిందీ వ్యావహారిక భాషలలో ఒకటైన అవధి భాష వాడుకలో ఉంది. ఇది అవధి ప్రాంతం లోని 3.8 కోట్ల ప్రజలకు వాడుక భాషగా ఉంది.[9] అలాగే 72-91% హిందీ భాషను పోలి ఉండే బగేలి భాష కూడా వాడుకలో ఉంది.[10][11] ఇది 78,00,000 మంది ప్రజలకు వాడుకలో ఉంది..[10]

అలహాబాద్‌ జిల్లాలో మతం[12]
మతం శాతం
హిందూ మతం
  
86.81%
ఇస్లాం
  
12.72%
ఇతరాలు†
  
0.47%
ఇతరాలు
ఇందులో క్రైస్తవులు (0.18%), సిక్కులు (0.13%), బౌద్ధులు (0.04%),
జైనులు (0.04%) సమాచారం తెలియనివారు (0.09%) ఉన్నారు.

అలహాబాద్ హిందువులకు, బౌద్ధులకు పవిత్ర ప్రదేశం. అలహాబాద్‌ను ప్రయాగ అని కూడా పిలుస్తారు. ఇక్కడ గంగా, యమునా, సరస్వతి నదులు సంగమిస్తున్నాయి. దీనిని త్రివేణి సంగమం అంటారు. అలహాబాద్‌లో సంగం అతి ప్రాధాన్యత కలిగిన ప్రదేశం. 2011 గణాంకాల ప్రకారం జిల్లాలో 86.81% హిందువులు, 12.72% ముస్లిములు, 0.18% క్రైస్తవులు, 0.13% సిక్కులు ఉన్నారు.[12] మిగిలిన వారిలో బౌద్ధులు, 0.4% ఏమతానికి చెందని వారు ఉన్నారు.[13]

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "Development Blocks under Tehsils". District court of Allahabad. Archived from the original on 26 మే 2012. Retrieved 4 August 2012.
 2. Hridai Ram Yadav. Village Development Planning. Concept Publishing Company. pp. 9–13. ISBN 978-81-7268-187-6. Retrieved 4 August 2012.
 3. Pramod Lata Jain. Co-operative Credit in Rural India: A Study of Its Utilisation. Mittal Publications. pp. 61–63. ISBN 978-81-7099-204-2. Retrieved 4 August 2012.
 4. blocks, Divisions and. "Maps, Tahsils and villages of Allahabad". Explore Allahabad Press. Retrieved 12 January 2014.
 5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Eritrea 5,939,484 July 2011 est.
 7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Missouri 5,988,927
 8. "Allahabad has highest literacy rate in region". The Times of India'. 15 April 2011. Archived from the original on 6 మే 2013. Retrieved 3 August 2012.
 9. M. Paul Lewis, ed. (2009). "Awadhi: A language of India". Ethnologue: Languages of the World (16 ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
 10. 10.0 10.1 M. Paul Lewis, ed. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16 ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
 11. M. Paul Lewis, ed. (2009). "English". Ethnologue: Languages of the World (16 ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
 12. 12.0 12.1 "Religion-wise Composition of Allahabad". All India Radio, Allahabad. All India Radio, Allahabad. Archived from the original on 15 జూన్ 2013. Retrieved 15 August 2014.
 13. "Provisional Population Totals, Census of India 2011; Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. p. 3. Retrieved 26 March 2012.