షాజహాన్‌పూర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

[[Category:క్లుప్త వివరణ ఉన్న Lua error in package.lua at line 80: module 'Module:Pagetype/setindex' not found.]]

షాజహాన్‌పూర్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ పటంలో షాజహాన్‌పూర్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో షాజహాన్‌పూర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుబరేలీ
ముఖ్య పట్టణంషాజహాన్‌పూర్
Government
 • లోకసభ నియోజకవర్గాలుషాజహాన్‌పూర్
 • శాసనసభ నియోజకవర్గాలుకాట్రా, జలాలాబాద్, తిల్‌హర్, పోవాయన్, షాజహాన్‌పూర్, దద్రౌల్
Area
 • మొత్తం4,575 km2 (1,766 sq mi)
Population
 (2011)
 • మొత్తం30,02,376
 • Density660/km2 (1,700/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత61.61% (Male) 70.09% (Female)
Websiteఅధికారిక జాలస్థలి
షాజహాన్‌పూర్ జిల్లాలో గర్రా నది

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో షాజహాన్‌పూర్ జిల్లా ఒకటి. షాజహాన్‌పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. షాజహాన్‌పూర్ జిల్లా రోహిల్‌ఖండ్ డివిజన్‌లో భాగం. 1813లో బ్రిటిష్ ప్రభుత్వం, బరేలీ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లాను ఏర్పరచింది. జిల్లాలో పొవయాన్, తీహార్, జలాలబాద్, సాదర్.

చరిత్ర[మార్చు]

షాజహాన్‌పూర్ దిలెర్ ఖాన్, బహదూర్ ఖాన్ [1] దరియా ఖాన్ కుమారులు మొగల్ చక్రవర్తి షాజహాన్ సైన్యంలో ఒక సైకులుగా ఉండేవారు. షాజహాన్ పాలనలో సోదరులిద్దరూ (దిలర్ ఖాన్, బహదూర్ ఖాన్) అధికారహోదా కలిగి ఉండేవారు. దిలర్ ఖాన్ సేవలకు సంతృప్తి చెందిన షాజహాన్ చక్రవర్తి 14 గ్రామాలను బహుమానంగా ఇస్తూ కోట నిర్మించడానికి అనుమతి ఇచ్చాడు. దిలర్ ఖాన్ నైనార్ ఖెరా వద్ద కోటను నిర్మించాడు. కోట గంగా, ఖన్నౌత్ నదీసంగమంలో నిర్మించబడింది.

జిల్లా కేంద్రం[మార్చు]

జిల్లాకేంద్రం షాజహాన్ పూర్ ఇప్పటికీ షాజహాన్ పూర్ షహ్ర్ అని పిలువబడుతుంది. ఇది ప్రత్యేక ముంసిపాలిటీగా ఉంది.

భౌగోళికం[మార్చు]

షాజహాన్‌పూర్ బరెలీ డివిజన్ ఆగ్నేయ భూభాగంలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో షాజహాన్‌పూర్ వ్యవసాయ ఆధారిత జిల్లా. ప్రభుత్వ రికార్డుల ఆధారంగా ఈ జిల్లా 1813లో స్థాపించబడిందని భావిస్తున్నారు. జిల్లా రూపొందించక ముందు ఇది బరేలీ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లా 27.35 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 79.37 డిగ్రీల రేల్హాంశంలో ఉంది. జిల్లా సరిహద్దులలో లఖింపూర్ ఖేరి, హర్దోయీ, ఫరూఖాబాద్, బారెల్లీ, బదౌన్, పిలిభిత్. జిల్లా వైశాల్యం 4575 చ.కి.మీ.

జిల్లాలో ప్రధానంగా రామగంగ, గర్రాహ్, గోమతి నదులు ప్రవహిస్తున్నాయి.జిల్లాలో అదనంగా కథన, ఝుక్మా, మెంసీ నదులు ప్రవహించి గోమతి నదిలో సంగమిస్తున్నాయి. కన్నౌట్, సుకేత, కాళి నదులు గర్రాహ్ నదిలో సంగమిస్తున్నాయి. జిల్లాలో ప్రధానంగా గోధుమలు, పప్పుధాన్యాలు, సజ్జలు, ఉర్లగడ్డలు పండించబడుతున్నాయి.

జిల్లాలో ఆర్మీకంటోన్మెంటు, డిఫెంస్ ఫోర్స్ కొరకు పెద్ద క్లోతింగ్ ఫ్యాక్టరీ ఉంది. షాజహాన్ పూర్ క్లబ్బుకు జిల్లాలో ప్రాముఖ్యత ఉంది. ఈ క్లబ్ సభ్యత్వం ఒకప్పుడు అంతస్తు చిహ్నంగా ఉండేది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,002,376, [2]
ఇది దాదాపు. అల్బేనియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. మిసిసపి నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 123వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 673 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.84%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 865:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 61.61%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Dr. Mehrotra N.C. Shahjahanpur Etihasik Evam Sanskritik Dharohar 1999 Pratiman Prakashan 30 Kucha Ray Ganga Prasad Allahabad 211003 భారత దేశము page 114
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Albania 2,994,667 July 2011 est.
  4. "2010 Resident Population Data". U.S.Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Mississippi 2,967,297