బాందా జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాందా జిల్లా

बांदा जिला
ఉత్తర ప్రదేశ్ పటంలో బాందా జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో బాందా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుచిత్రకూట్
ముఖ్య పట్టణంBanda
విస్తీర్ణం
 • మొత్తం.4413 కి.మీ2 (0.1704 చ. మై)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం17,99,541
 • సాంద్రత41,00,000/కి.మీ2 (1,10,00,000/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత68.11%
 • లింగ నిష్పత్తి863
జాలస్థలిఅధికారిక జాలస్థలి
కలైంజర్ కోట

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బాందా జిల్లా ఒకటి. బాందా పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. బాందా జిల్లా చిత్రకూట్ డివిజన్‌లో భాగం. ఆభరణాల తయారీలో ఉపయోగించే షాజర్ రాళ్ళకు బాందా జిల్లా ప్రసిద్ధి చెందింది. చారిత్రకంగా, ఆర్కిటెక్చరల్‌గా ప్రాధాన్యత కలిగిన ఖజూరహో, కలింజర్ లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఖజూరహో (కుడ్యశిల్పాలయం) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. కలింజర్ అరణ్యాలు దాని యుద్ధచరిత్ర, అద్భుత రాతి శిల్పాలు ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

1998లో కర్వి, మౌ తాలూకాలు గతంలో బాందా జిల్లాలో భాగంగా ఉండేది. బ్రిటిష్ ఇండియా అలహాబాద్ డివిజన్‌లో చిత్రకూట్ జిల్లా రూపొందించిన సమయంలో బాందా పట్టణం అందులో భాగంగా ఉంది. 1901లో జనసంఖ్య 22,565. ఇది కొంతకాలం మిలటరీ కంటోన్మెంట్‌గా ఉండేది. ఈ ప్రాంతం గతంలో బుండేల్‌ఖండ్ రాజకుటుంబానికి చెందిన రావ్‌బహదూర్ రాయ్ పి.టి మాన్యుయల్ అవాషి (183 గ్రామాలు) పాలిత ప్రాంతంగా ఉండేది. 1920 - 1930 మద్య కాలంలో ఇది అతిపెద్ద జారీర్దారుగా ఉండేది. దీనికి వారసుడు అమిత బాజ్‌పాయ్. బాందా 1947 వరకు జిల్లా వాసులలో 75% పి.టి మాన్యుయల్ అవాషి కుటుంబానికి చెందిన వారే.

భౌగోళికం[మార్చు]

జిల్లా భౌగోళికంగా ఎగుడు దిగుడు భూభాగం కలిగి ఉంది. దిగువ భూభాగంలో వర్షాకాలంలో నీరు నిలుస్తుంది. జిల్లాలో ప్రధానంగా బఘెయిన్ నది నైరుతీ నుండి ఈశాన్యం దిశగా ప్రవహిస్తుంది. జిల్లాలో తూర్పు భాగంలో ప్రవహిస్తున్న ప్రధాన నదులలో కెన్‌నది, ఉత్తర భూభాగంలో యమునా నది ప్రవహిస్తున్నాయి. జిల్లాలో క్షత్రియులు, పఠేల్, చంద్రౌల్, చండేల్, బండేలా ప్రజలు అధికంగా నివసిస్తున్నారు.

ఆర్ధికం[మార్చు]

జిల్లా ఆర్థికంగా వ్యవసాయ ఆధారితమైనది. జిల్లాలో ప్రధానంగా వరి, గోధుమ, కూరగాయలు పండిస్తారు.

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశంలో వెనుకబడిన 250 జిల్లాలలో బాందా జిల్లా ఒకటి అని గుర్తించింది. .[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

విభాగాలు[మార్చు]

  • జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి: బాందా, నరియన్, బబెరు, అతర్న.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,799,541,[2]
ఇది దాదాపు. గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. నెబ్రాస్కా నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 265 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 404 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.06%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 863:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 68.11%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

భాషలు[మార్చు]

జిల్లాలో బుండెలి భాష .[5] (జర్మన్ భాషతో పోలిస్తే జర్మన్ భాష 60% ఆంగ్లభాషను పోలి ఉంటుంది )[6] ఈ భాష 7 800 000 మంది బుండెలిఖండ్ ప్రజలకు వాడుక భాషగా ఉంది[5]

సంస్కృతి[మార్చు]

కలింజర్ మహోత్సవ్: ప్రతిసంవత్సరం బాందా జిల్లాలో కలింజర్ మహోత్సవం ఒక వారం కాలం నిర్వహించబడుతుంది. కలింజర్ మహోత్సవంలో పలు సాంస్కృతిక, సాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవం కలింజర్ ప్రాంతంలో లోని కోటలు, వారసత్వ సంపద ప్రాముఖ్యతను పర్యాటకులకు వివరించడానికి ఇది నిర్వహించబడుతుంది.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gambia, The 1,797,860 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 12 (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nebraska 1,826,341 {{cite web}}: line feed character in |quote= at position 9 (help)
  5. 5.0 5.1 M. Paul Lewis, ed. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28. {{cite encyclopedia}}: |edition= has extra text (help)
  6. M. Paul Lewis, ed. (2009). "English". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28. {{cite encyclopedia}}: |edition= has extra text (help)