ఆగ్రా జిల్లా
ఆగ్రా జిల్లా
आगरा ज़िला آگرہ ضلع | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | ఆగ్రా |
ముఖ్య పట్టణం | ఆగ్రా |
మండలాలు | 6 |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 9 |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,027 కి.మీ2 (1,555 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 43,80,793[1] |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 69.44%.[1] |
ప్రధాన రహదార్లు | NH 2 |
Website | అధికారిక జాలస్థలి |
ఆగ్రా జిల్లా (హిందీ: आगरा ज़िला, ఉర్దూ: گرہ ضلع) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా. చారిత్రిక నగరమైన ఆగ్రా ఈ జిల్లాకు కేంద్రం. ఆగ్రా జిల్లా ఆగ్రా రెవెన్యూ డివిజన్‌లో భాగం. జిల్లా వైశాల్యం 4,027 చ.కి.మీ.
భౌగోళికం
[మార్చు]సరిహద్దులు
[మార్చు]సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
ఉత్తర సరిహద్దు | మథుర జిల్లా |
దక్షిణ సరిహద్దు | ధౌల్‌పూర్ జిల్లా, రాజస్థాన్ |
తూర్పు సరిహద్దు | ఫిరోజాబాద్ జిల్లా |
పశ్చిమ సరిహద్దు | భరత్‌పూర్ జిల్లా, రాజస్థాన్ |
వైశాల్యం | 4027 చ.కి.మీ |
విభాగాలు
[మార్చు]ఆగ్రా జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి. ఎత్మాద్పూర్, కిరౌలి, ఖెరాగర్, ఫతేహాబాద్ (ఆగ్రా), బాహ్. జిల్లాలో 15 బ్లాకులు (మండలాల స్థాయి పాలనా విభాగాలు) ఉన్నాయి: ఎత్మాద్పూర్, ఖందౌలి, షంషాబాద్, ఫతేహబాద్, జగ్నేర్, ఖేరాగర్, సైయాన్ (ఆగ్రా), ఆచనేరా, అకోలా, బిచ్పురి, ఫతేపూర్ సిక్రి, బరౌలి అహిర్, బాహ్, పినాహత్, జైత్పూర్ కలాన్[2]
జిల్లాలో మూడు లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. అవి జలేశ్వర్, ఫిరోజాబాద్, ఆగ్రా. జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు - బాహా, ఫతేహాబాద్, ఎత్మాద్పూర్, దయాళ్ భాగ్, ఆగ్రా కంటోన్మెంట్, పశ్చిమ ఆగ్రా, తూర్పు ఆగ్రా, ఖేరాగర్, ఫతేపూర్ సిక్రీ.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 43,80,793,[1] |
ఇది దాదాపు. | మొల్దోవా దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | కెంటకీ నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 41 వ స్థానంలో ఉంది..[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1084 .[1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 21%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 859:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 69.44%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
భాషలు
[మార్చు]జిల్లాలో భ్రజ్ భాష (హిందీ మాండలికం) వాడుకలో ఉంది. మథుర జిల్లా కేంద్రంగా ఉన్న బ్రజ్ భూభాగంలో భ్రజ్ భాష వాడుకలో ఉంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మథుర, ఆగ్రాలలో రాజస్థాన్ రాష్ట్రంలోని దౌల్‌పూర్, భరత్‌పూర్ లలో భ్రజ్ భాష వాడుకలో ఉంది. ఇది గంగా యమునా మైదానంలో ప్రధానమైన భాష.
చూడదగిన ప్రదేశాలు
[మార్చు]- తాజ్ మహల్
- ఆగ్రాకోట
- ఇతిమాద్-ఉద్- దులాహ్
- అక్బర్ సమాధి
- స్వామి భాగ్
- మన కామేశ్వర్ ఆలయం
- గురుకా తాల్
- జమా మసీద్
- చీనికాతుజా
- రాం భాగ్
- మరియం సమాధి
- మెహతా భాగ్
- కితం లేక్
- ముగల్ హెరిటేజ్ వాక్
- ది కాథదల్
చిత్రమాలిక
[మార్చు]-
మొఘల్ చక్రవర్తి అక్బర్ సమాధి, ఆగ్రా దగ్గర.
-
సొఆమీ బాగ్ సమధ్, దయాల్ బాగ్.
-
పంచమహల్ ఫతేపూర్ సిక్రీ.
ఇవికూడా చూడండి
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]- Official Agra district website
- Pin Codes for Agra District Archived 2008-09-06 at the Wayback Machine
- Map for Agra District
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ "General Administration". Agra district Official website. Archived from the original on 2011-10-29. Retrieved 2015-03-18.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Moldova 4,314,377 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Kentucky 4,339,367