అక్షాంశ రేఖాంశాలు: 24°41′23″N 83°3′55″E / 24.68972°N 83.06528°E / 24.68972; 83.06528

సోన్‌భద్ర జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

24°41′23″N 83°3′55″E / 24.68972°N 83.06528°E / 24.68972; 83.06528

సోన్‌భద్ర జిల్లా
सोनभद्र ज़िला
سون بھدر ضلع
ఉత్తర ప్రదేశ్ పటంలో సోన్‌భద్ర జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో సోన్‌భద్ర జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుమీర్జాపూర్
ముఖ్య పట్టణంరాబర్ట్స్‌గంజ్
Government
 • లోకసభ నియోజకవర్గాలురాబర్ట్స్‌గంజ్
విస్తీర్ణం
 • మొత్తం6,788 కి.మీ2 (2,621 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం18,62,612
 • జనసాంద్రత270/కి.మీ2 (710/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత66.18 per cent
 • లింగ నిష్పత్తి913
ప్రధాన రహదార్లుNH 7, NH 75
Websiteఅధికారిక జాలస్థలి
విజయగర్ కోట నుండి దృశ్యం

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో సోన్‌భద్ర జిల్లా (హిందీ:सोनभद्र ज़िला) (ఉర్దు| سون بھدر ضلع) ఒకటి. రొబర్ట్గంజ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 6788 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 1,463,468 జనసాంధ్రత 216 చ.కి.మీ.

సరిహద్దులు

[మార్చు]
సరిహద్దు వివరణ జిల్లా
రాష్ట్రంలో ఈశాన్య భూభాగంలో ఉంది
నైరుతి సరిహద్దు మిర్జాపూర్
ఉత్తర సరిహద్దు చందౌలి
ఈశాన్య సరిహద్దు కైమూర్, రోహ్తాస్ (బీహార్ రాష్ట్రం)
తూర్పు సరిహద్దు గర్వా (జార్ఖండ్ రాష్ట్రం)
దక్షిణ సరిహద్దు సుర్గుజా, కోరియా (చత్తీస్‌ఘడ్ రాష్ట్రం)
పశ్చిమ సరిహద్దు సింగ్రౌలి (మధ్యప్రదేశ్ రాష్ట్రం)
సరిహద్దు రాష్ట్రాలు చత్తీస్‌ఘడ్,మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్
జిల్లా ప్రత్యేకత 4 రాష్ట్ర సరిహద్దులు ఉన్న ఏకైక జిల్లా

జిల్లా రెడ్‌కార్పెట్‌లో భాగంగా ఉంది..[1]

భౌగోళికం

[మార్చు]
ఉత్తర ప్రదేశ్ పటంలో సోన్‌భద్ర జిల్లా

జిల్లాలో పశ్చిమం నుండి తూర్పు దిశగా సోనే నది ప్రవహిస్తుంది. సోనేనది ఉపనదులైన రిహంద్ నది చత్తీస్‌గఢ్]] రాష్ట్రంలోని సుర్గుజా జిల్లా ఎగువభూముల నుండి ఉత్తరదిశగా ప్రవహించి సోన్‌భద్ర జిల్లాలో సోనే నదిలో సంగమిస్తుంది. సోన్‌భద్ర జిల్లా విద్యపర్వతాల ఆగ్నేయ భాగంలో భగేల్ఖండ్ భూభాగంలో ఉంది. రిహింద్ నది మీద గోవింద్ బల్లభ్‌పంత్ సాగర్ ఆనకట్ట నిర్మించబడింది. ఈ రిజర్వాయర్‌లోని కొంతభాగం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. వారణాసి నుండి దాదాపు 80 కి,మీ దూరంలో సాంస్కృతిక కేంద్రం, వేదిక సంస్కృతికి సాక్ష్యంగా ఉన్న జిల్లా కేంద్రం ప్రధాన్యత కలిగి ఉంది.

వాతావరణం

[మార్చు]
విషయ వివరణ వాతావరణ వివరణ
గరిష్ఠ ఉష్ణోగ్రత 30 °–42 ° సెల్షియస్
కనిష్ఠ ఉష్ణోగ్రత 2-15 ° సెల్షియస్
వర్షపాతం మి.మీ
ఆహ్లాదకరమైన వాతావరణం జూలై నుండి అక్టోబరు

ఆర్ధికం

[మార్చు]

సోన్‌భద్ర జిల్లా దక్షిణ ప్రాంతం " ఎనర్జీ కాపిటల్ ఆఫ్ ఇండియా " (భారతదేశ శక్తి కేంద్రం)గా గుర్తించబడుతుంది. ఈ ప్రాంతంలో పలు విద్యుదుపత్తి కేంద్రాలు ఉన్నాయి. గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ సమీపంలో ఎన్టిపిసి లిమిటెడ్ (భారతదేశం లోని ప్రముఖ విద్యుదుత్పత్తి సంస్థ) చెందిన మూడు బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. శక్తినగర్ (ఉత్తర ప్రదేశ్), (భారతదేశ మొదటి ఎన్టిపిసి పవర్ ప్లాంట్), వింధ్యాచల్ థర్మల్ పవర్ స్టేషను (వింద్యానగర్) ( భారతదేశం లోని అతిపెద్ద విద్యుదుత్పత్తి సంస్థ, 3260 మె.వా సామర్థ్యం కలిగి ఉంది ), బీజ్పూర్ (రిహంద్‌నగర్). జిల్లాలో అన్నపరా వద్ద (ఊపర్వున్ల్ ), ఓబ్రా, ఉత్తరప్రదేశ్, (ఊపర్వున్ల్), రెనుసాగర్ (హిండాల్కో),, పిప్రి - హైడ్రో (ఊపర్వున్ల్), నార్తన్ కోయల్ ఫీల్డ్స్ (కోయల్ ఇండియా శాఖ) మొదలైన విద్యుదుత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. జిల్లా ప్రాంతంలో పలు బొగ్గుగనులు ఉన్నాయి. రెనుకూట్‌లో హిండాల్కో అల్యూమినియం ప్లాంట్ ఉంది.

జిల్లా పారిశ్రామిక కేంద్రంగా ఉంది. కొంత ఆటవీ ప్రాంతంలో లైం స్టోన్ లభ్యం ఔతుండగా అధిక ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు లభిస్తున్నాయి. ఈ ప్రాంతంలో పలు చిన్న నదులు ప్రవహిస్తున్నాయి. ప్రధాన నది సోనేబధ్ర.

లైం స్టోన్ లభిస్తున్న కారణంగా 1956లో చుర్క్ వద్ద సిమెంట్ కంపెనీ స్థాపించబడింది. 1971లో దాలా వద్ద మరొక సిమెంటు కంపెనీ స్థాపించబడింది. 1980లో ఏన్సిల్లరీ కంపెనీ స్థాపించబడింది. ఇతర కంపెనీల స్థాపనకు సిమెంటు కంపెనీలు ఆధారంగా ఉన్నాయి. 1961లో పిప్రి వద్ద రిహంద్ ఆనకట్ట పేరుతో పెద్ద ఆనకట్ట నిర్మించబడింది. ఈ ఆనకట్ట నుండి 300 మె.వా విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుంది. 1968లో రిహంద్ ఆనకట్టకు 40కి.మీ దూరంలో 99 మె.వా విద్యుదుత్పత్తి కేంద్రం స్థాపించబడింది.

బిర్లాగ్రూప్

[మార్చు]

రేనుకుత్ వద్ద బిర్లాగ్రూపు వారు అల్యూమినియం ప్లాంట్ స్థాపించారు. ఇది హిండాల్కోకు చెందిన అతి పెద్ద అల్యూమినియం ప్లాంట్‌గా గుర్తించబడుతుంది.1967లో బిర్లాగ్రూపు వారు తమస్వంత విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని (887.2 మె.వా) స్థాపించారు. ఈ విద్యుత్తు హిండాల్కో సంస్థకు ఉపయోయించబడుతుంది. రేనుకుత్ వద్ద బిర్లాగ్రూపు వారు " హైటెక్ కార్బన్ " సంస్థను ప్రారంభించారు.

  • రేనుకుంత్ వద్ద కనోరియా కెమికల్ సంస్థ స్థాపించబడింది. తరువాత 1998లో ఈ సంస్థ తమస్వంత ఉపయోగానికి 50 మె.వా శక్తికలిగిన విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించారు.
  • 1967లో రష్యా ఇంజనీర్ల సహకారంతో ఓబ్రా వద్ద పెద్ద ధర్మల్ పవర్ ప్లాంటు స్థాపించబడి 1971 నాటికి విజయవంతంగా పూర్తిచేయబడింది. ఈ ప్లాంటు వార్షిక విద్యుత్తు ఉత్పత్తి 1550 మె.వా. 1980లో స్థాపించబడిన మరొక సంస్థ 1630 మె.వా విద్యుత్తును ఉత్పత్తి చేసింది. దీనీని విస్తరించి 2630 మె.వా విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ప్రణాళిక చేస్తుంది.

శక్తినగర్ వద్ద ఎంటీపిసి సంస్థ స్థాపించిన విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం 2000 మె.వా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇదే సంస్థకు చెందిన బీజ్పూర్ ప్లాంటు 3000 మె.వా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.

  • ఈ ప్రాంతంలో 3 సెమెంటు కంపెనీలు, ఒక కార్బన్ ప్లాంటు, ఒక రసాయన సంస్థ, పలు విద్యుత్తు కేంద్రాలు ఉన్నాయి. ఈ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు 11000 విద్యుత్తును ఉతపత్తి చేస్తూ 20,000 మె.వా విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.దేశానికి అంతటికీ ఉపయోగపడుతున్న ఈ ప్రాంతం ఒకప్పుడు అరణ్యాలతో నిండి ఉండి ప్రస్తుతం పంటకు ఉపయోగపడని నిస్సారమైన భూమిగా మారింది.

వెనుకబడిన జిల్లాగా గుర్తింపు

[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సోన్‌భద్ర జిల్లా ఒకటి అని గుర్తించింది. .[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[2]

పరిశ్రమలు

[మార్చు]
  • 1956: చుర్క్ సిమెంట్ ఫ్యాక్టరీ, 800 టి / డే
  • 1961: రిహంద్ ఆనకట్ట, పిప్రి, 300 మెగావాట్ల విద్యుదుత్పత్తు, రిజర్వాయర్
  • 1962: హిందాల్కో అల్యూమినియం ప్లాంట్, రెనుకూత్, అల్యూమినా శుద్ధి - 114,5000 టి.పి.ఎ అల్యూమినియం మెటల్ - 424.000 టి.ఫి.ఎ.
  • 1965: కనోరియా కెమికల్స్, రెనుకూత్, అకెటల్డీహైడ్ - 10000 టి.ఫి.ఎ, ఫార్మాల్డిహైడ్ - 75000 టి.ఫి.ఎ, ళిందనె - 875 టి.ఫి.ఎ, హెక్షమినె - 4000 టి.ఫి.ఎ, పారిశ్రామిక ఆల్కహాల్ - 225 మిలియన్ పిల్లలు / సంవత్సరానికి అల్యూమినియం క్లోరైడ్ - 6875 టి.ఫి.ఎ, ఇథైల్ ఎసిటేట్ - 3300 టి.ఫి.ఎ, ఎసిటిక్ యాసిడ్ - 6000 టి.ఫి.ఎ, వాణిజ్య హైడ్రోజన్.
  • 1967: రెనుసాగర్ పవర్ ప్లాంట్ (హిండాల్కో), విద్యుత్ 741,7 ఎం.డబల్యూ.
  • 1968: ఓబ్ర డ్యామ్, విద్యుత్ 99 మెగావాట్ల పవర్ ప్లాంట్ కోసం రిజర్వాయర్.
  • 1971: డాలా ఫ్యాక్టరీ, 3600 టి / డే సిమెంట్.
  • 1971: ఓబ్ర థర్మల్ పవర్ ప్లాంట్,యు.పి.ఎస్.ఇ.బి., విద్యుత్ 1550 మెగావాట్లు.
  • 1980: చునార్ సిమెంట్ ఫ్యాక్టరీ, డాలా సిమెంట్ ఫ్యాక్టరీ సహాయక యూనిట్.
  • 1980: అంపర థర్మల్ పవర్ ప్లాంట్, యు.పి.ఎస్.ఇ.బి., విద్యుత్ 2000 మెగావాట్లు.
  • 1983: బి.పి. కన్స్ట్రక్షన్ కంపెనీ, అంపర.
  • 1984: సింగ్రౌలి థర్మల్ పవర్ ప్లాంట్ ఎన్టిపిసి, షక్తినగర్, విద్యుత్ 2000 మెగావాట్లు.
  • 1988: ఎక్కువ -టెక్ కార్బన్, రెనుకూత్, కార్బన్ బ్లాక్ - వార్షిక ఉత్పత్తి 1,60,000 ఎం.టి .
  • 1989: రిహంద్ థర్మల్ పవర్ ప్లాంట్, ఎన్టిపిసి, బీజ్పుర్, విద్యుత్ 2000 మెగావాట్లు.
  • 1990: హిల్స్ లో గోల్డ్ మైన్, మిర్చధురి ఆఫ్ ఫైండింగ్.
  • 1998: కనోరియా కెమికల్స్ పవర్ ప్లాంట్, రెనుకూత్, విద్యుత్ 50 ఎం.డబల్యూ
  • 2008: ల్యాంకో అంపర పవర్ లిమిటెడ్, విద్యుత్ 1200 మెగావాట్లు.
  • ఇతర: విలేజ్ దిబుల్గంజ్ భారతదేశం యొక్క అతిపెద్ద గ్రామ పంచాయత్ .
  • భాస్కర్ గ్రూప్, రిలయన్స్ పవర్, ఎస్సార్ పవర్, జేపీ పవర్, ఆదిత్య బిర్లా గ్రూప్ (మహాన్ ప్రాజెక్ట్) వారి శక్తి కర్మాగారాలు అంగస్తంభన దశలో ఉన్నాయి.
  • 1973: మిశ్రా స్టోన్ క్రషింగ్ కంపెనీ

ఆరోగ్యం

[మార్చు]

జిల్లా ప్రాంతం భారతదేశ శక్తికేంద్రంగా ఉంది. ప్రజల పట్ల భరతదేశ రాజకీయనాయకుల ఉదాశీనతకు ఇది నిదర్శనంగా ఉంది. భారీ ఎత్తున పారిశ్రామీకరణ ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపుతుంది. కాలుష్యం వాయువును, నదీజలాలను సహితం ప్రభావితం చేస్తుంది. ప్రజల రక్తంలో పాదరసం వంటి రసాయనాల విషప్రభావం కనిపిస్తుందుది. రసాయనాలు మానవుల కండలు, ఎముకలు, మెదడు మీద ప్రభావం చూపుతూ నిదానమైన ప్రాణహరణిగా మారింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమస్యను గుర్తించడంలో విఫలమైయ్యాయి. పరిశ్రమల అభివృద్ధి ప్రణాళికలు బాధితులు ఆరూగ్యకరమైన సాధారణజీవితం జీవించడానికి అవరోధం కలిగిస్తున్నాయి.

ప్రయాణసౌకర్యాలు

[మార్చు]

వాయుమార్గం

[మార్చు]

రైలు ద్వారా

[మార్చు]
  • మిర్జాపూర్ రైల్వే స్టేషను.
  • రోబెర్ట్స్ రైల్వే స్టేషను.
  • చుర్క్ రైల్వే స్టేషను.
  • చొపన్ రైల్వే స్టేషను.
  • ఓబ్ర, ఉత్తర ప్రదేశ్ రైల్వే స్టేషను.
  • రిహంద్ ఆఅకట్ట సమీపంలోని రెనుకూత్ రైల్వే స్టేషను.
  • అంపర రైల్వే స్టేషను.
  • షక్తినగర్, ఉత్తర ప్రదేశ్ రైల్వే స్టేషను.
  • వారణాసి రైల్వే స్టేషను.
  • దుధినగర్ రైల్వే స్టేషను.
  • వైంధంగంజ్ రైల్వే స్టేషను.

నగరం రైలు మర్గంతో ఢిల్లీ, అలహాబాద్, రాంచి, పాట్నాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. వీటిలో నడుపబడుతున్న రైళ్ళలో మురి ఎక్స్‌ప్రెస్ ( జమ్ము - తావి- ఢిల్లీ- టాటానగర్), జార్ఖండ్ స్వర్నజ్యోతి ఎక్స్‌ప్రెస్, (హతియా- కాంపూర్- ఢిల్లీ), త్రివేణి ఎక్స్‌ప్రెస్ (బరెల్లి -లక్నో - షక్తినగర్- బర్వధి), భోపాల్ ఎక్స్‌ప్రెస్ (భోపాల్- హౌరా) వారాంతం, షక్తిపుంజ్ ఎక్స్‌ప్రెస్ (హౌరా- చొపన్- జబల్పూర్), ఇంటర్సిటీ (సింగ్రౌలీ- చొపన్- వారణాసి) మొదలైన రైళ్ళు ప్రధానమైనవి.

రహదారి

[మార్చు]

సోనాబధ్ర జిల్లా కేంద్రం రొబర్ట్గంజ్ వారణాసి నగరానికి 90కి.మీ దూరంలో ఉంది. రొబర్ట్గంజ్ లక్నో, అలహాబాద్, వారణాసి, మిర్జాపూర్, మధుపూర్, సోన్‌భద్రలతో రహదారి మార్గాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది. వారణాసికి చేరుకోవడానికి రోజంతా బసులు లభిస్తుంటాయి. వారణాసి చేరుకోవడానికి 2.30 గంటల సమయం ఔతుంది. రహదారి వారణాసిని వైధాన్ పాస్‌తో జిల్లాద్వారా కలుపుతుంది. రెనుకోట్, అంపర, షక్తినగర్ నగరాలు వాణిజ్యపరంగా అభివృద్ధిచెందాయి కనుక ఇది జాతీయ రహదారి కానప్పటికీ రహదారి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ షక్తినగర సింగ్రౌలి, ఖదీ వంటి జాతీయ కోల్ ఫీల్డ్ వివిధ ప్రాజెక్టులు, జయంత్, దుధిచూ, అంలోరి, కక్రి మొదలైన ప్రముఖ బొగ్గుగనులు రాష్ట్రానికి అవసరమైన బొగ్గును సరఫరాచేస్తున్నాయి. చురుక్ సమీప ప్రాంతంలో జయ్పీ గ్రూప్ సంస్థ థర్మల్ పవర్ ప్రాజెక్టును స్థాపించింది. ఇసుక, కంకర మోసుకుపోయే 1000 ట్రక్కులు ఈ రహదారిలో నడుస్తున్నందువలన కూడా ఈ రహదారి రద్దీగా ఉండడానికి ఒక కారణనమని భావిస్తున్నారు.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,862,612,[3]
ఇది దాదాపు. కొసావొ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. వెస్ట్ వర్జీనియా నగర జనసంఖ్యకు సమం..[5]
640 భారతదేశ జిల్లాలలో. 254 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 274 .[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 27.27%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 913:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 66.18%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

మాధ్యమం

[మార్చు]
  • గావ్ గిరా- రాబర్ట్స్‌గజ్‌లో ముద్రించబడుతున్న " గావ్ గిరా " ఏకైక హిందీ దినపత్రికగా ప్రత్యేకత కలిగి ఉంది.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Kosovo 1,825,632 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. West Virginia 1,852,994