ఛత్తీస్‌గఢ్

వికీపీడియా నుండి
(చత్తీస్‌ఘడ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

Chhattisgarh
State of Chhattisgarh
Etymology: "Thirty-six forts"
Nickname: 
Rice bowl of India
Motto
Satyameva Jayate (Truth alone triumphs)
Anthem: Arpa Pairi Ke Dhar (The Streams of Arpa and Pairi)[1][2]
The map of India showing Chhattisgarh
Location of Chhattisgarh in India
Coordinates: 21°15′N 81°36′E / 21.25°N 81.60°E / 21.25; 81.60
Country India
RegionCentral India
Before wasPart of Madhya Pradesh
Formation1 November 2000
CapitalNava Raipur
Districts33 (5 divisions)
Government
 • BodyGovernment of Chhattisgarh
 • GovernorBiswabhusan Harichandan
 • Chief MinisterVishnu Deo Sai[3] (BJP)
 • Deputy Chief MinisterArun Sao (BJP)
Vijay Sharma (BJP)
 • Chief SecretaryAmitabh Jain (IAS)
State LegislatureUnicameral
 • AssemblyChhattisgarh Legislative Assembly (90 seats)
National ParliamentParliament of India
 • Rajya Sabha5 seats
 • Lok Sabha11 seats
High CourtChhattisgarh High Court
విస్తీర్ణం
 • Total1,35,192 కి.మీ2 (52,198 చ. మై)
 • Rank9th
Dimensions
 • Length750 కి.మీ (470 మై.)
 • Width435 కి.మీ (270 మై.)
Elevation
275 మీ (902 అ.)
Highest elevation1,276 మీ (4,186 అ.)
జనాభా
 (2020)[6]
 • TotalIncrease2,94,36,231
 • Rank17th
 • జనసాంద్రత220/కి.మీ2 (600/చ. మై.)
 • Urban
23.24%
 • Rural
76.76%
DemonymChhattisgarhiya
Language
 • OfficialHindi
 • Additional OfficialChhattisgarhi[7]
 • Official ScriptDevanagari script
GDP
 • Total (2022)5.09 లక్ష కోట్లు (US$64 billion) (2023–24 est.)[8]
 • Rank18th
 • Per capitaNeutral increase1,52,348 (US$1,900)[8] (23rd)
Time zoneUTC+05:30 (IST)
ISO 3166 codeIN-CG [9]
Vehicle registrationCG
HDI (2017)Increase 0.613 Medium (31st)
Literacy (2011)Neutral increase 70.28%[10] (27th)
Sex ratio (2011)991/1000 [11] (13th)
Symbols of Chhattisgarh
Emblem of Chhattisgarh
SongArpa Pairi Ke Dhar (The Streams of Arpa and Pairi)[1][2]
LanguageHindi
Foundation dayChhattisgarh Rajyotsava
BirdCommon hill myna
FishWalking catfish
FlowerFrench marigold
FruitJackfruit
MammalWild water buffalo
TreeSal tree
State Highway Mark
State Highway of Chhattisgarh
CT SH1 – CT SH29
List of State Symbols

ఛత్తీస్‌గఢ్ (छत्तीसगढ़), మధ్య భారతదేశం లోని ఒక రాష్ట్రం. ఇది 2000 నవంబరు 1న మధ్య ప్రదేశ్ లోని 16 ఆగ్నేయ జిల్లాలతో యేర్పాటు చేయబడింది. రాయ్‌పుర్ రాష్ట్రానికి రాజధాని. ఛత్తీస్‌గఢ్‌కు వాయువ్యమున మధ్య ప్రదేశ్, పడమట మహారాష్ట్ర, దక్షిణాన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్, తూర్పున ఒడిషా, ఈశాన్యాన జార్ఖండ్ , ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములు సరిహద్దులుగా వున్నందున ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిన రాష్ట్రం అని పేరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాతో ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా సరిహద్దులు కలిగి ఉంది. అదే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా, తెలంగాణలోని ములుగు జిల్లాతో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలతో సరిహద్దులను పంచుకుంటున్నాయి‌.

రాష్ట్రము యొక్క ఉత్తర భాగము ఇండో-గాంజెటిక్ మైదానం అంచులలో ఉంది. గంగా నది ఉపనది అయిన రిహంద్ నది ఈ ప్రాంతములో పారుతుంది. సాత్పూరా శ్రేణులు తూర్పు అంచులు, ఛోటానాగ్‌పూర్ పీఠభూమి పడమటి అంచులు కలిసి తూర్పు నుండి పడమటికి వ్యాపించే పర్వతాలతో మహానది పరీవాహక ప్రాంతం నుండి ఇండో-గాంజెటిక్ మైదానమును వేరుచేస్తున్నాయి. రాష్ట్ర మధ్య భాగం సారవంతమైన మహానది , దాని ఉపనదుల మైదానములలో ఉంది. ఇక్కడ విస్తృతముగా వరి సాగు చేస్తారు. రాష్ట్ర దక్షిణ భాగం దక్కన్ పీఠభూమిలో గోదావరి , దాని ఉపనది ఇంద్రావతి పరీవాహక ప్రాంతములో ఉంది. రాష్ట్రం లోని మొత్తం 40% శాతం భూమి అటవీమయం.

ఇండో-ఆర్యన్ భాషా కుటుంబం తూర్పు-మధ్య శాఖకు చెందిన ఛత్తీస్‌గఢీ భాష ఈ ప్రాంతం ప్రధాన భాష. రాష్ట్రములో పర్వతమయమైన జిల్లాలు ద్రావిడ భాషలు మాట్లాడే గోండులకు ఆలవాలం. హిందీ, ఒరియా, మరాఠి, తెలుగు , ఆదివాసీ భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు.

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

చత్తీష్ అనగా 36. అలాగే గడ్ అనగా కోటలు అని అర్థం. 36 కోటలు ఉన్న రాష్ట్రం అని అర్థం. చత్తిస్గడ్ రాజధాని రాయిపూర్ నగరాన్ని రాయ్ జగత్ అనే గోండ్ రాజు స్థాపించాడు . గోండ్ రాజులు నిర్మించిన 36 కోటల వలనే ఈ రాష్ట్రానికి ఛత్తీస్గడ్ అనే పేరు వచ్చింది

ప్రభుత్వం

[మార్చు]

రాష్ట్రం ఏర్పడినప్పటినుండి అనగా 2000 సంవత్సరం నుంచి 2018 వరకు బిజెపి పార్టీకి చెందిన రమణ్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం నడిచింది. తొలిసారిగా 2018 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ బుఖేష్ భగేల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

రాష్ట్ర గణాంకాలు

[మార్చు]
  • రాష్ట్ర అవతరణ:2000 నవంబరు 1
  • వైశాల్యం:1,36,034 చ.కి.
  • జనసంఖ్య: 25,540,196 అందులో స్త్రీలు 12,712,281, పురుషులు 12,827,915 లింగ నిష్పత్తి .991
  • జిల్లాల సంఖ్య:27
  • గ్రామాలు:19,744 పట్టణాలు.97
  • ప్రధాన భాష :చత్తీస్ గరి, గోండి, హింది, ప్రధాన మతం. హిందూ
  • పార్లమెంటు సభ్యుల సంఖ్య:11 శాసన సభ్యుల సంఖ్య. 90
  • మూలం: మనోరమ ఇయర్ బుక్

దేవాలయాలు

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

రాష్ట్రం లోని జిల్లాలు

[మార్చు]

ఛత్తీస్‌గఢ్‌లో 33 జిల్లాలు ఉన్నాయి. [12] [13] [14] [15] [16] [17] [18] [19]

వ.సంఖ్య కోడ్ జిల్లా ప్రధాన కార్యాలయం జనాభా (2011) Area (చ.కి.మీ) జనసాంద్రత (చ.కి.మీ.కు) అధికార వెబ్సైట్
1 బాలోద్ జిల్లా బాలోద్ 826,165 3,527.00 234 http://balod.gov.in/
2 బలోడా బజార్ జిల్లా బలోడా బజార్ 1,078,911 3,733.87 290 https://balodabazar.gov.in/
3 బలరాంపూర్ జిల్లా బలరాంపూర్ 730,491 6,016.34 100 http://balrampur.gov.in/
4 BA బస్తర్ జిల్లా జగదల్‌పూర్ 834,873 6,596.90 213 http://bastar.gov.in/
5 బెమెతరా జిల్లా బెమెతరా 795,759 2,854.81 279 http://bemetara.gov.in/
6 బీజాపూర్ జిల్లా బీజాపూర్ 255,230 6,552.96 39 http://bijapur.gov.in/
7 BI బిలాస్‌పూర్ జిల్లా బిలాస్‌పూర్ 1,625,502 3,511.10 463 http://bilaspur.gov.in/
8 DA దంతేవాడ జిల్లా దంతెవాడ 283,479 3,410.50 83 http://dantewada.gov.in/
9 DH ధమ్తారి జిల్లా ధమ్తారి 799,781 4,081.93 196 http://dhamtari.gov.in/
10 DU దుర్గ్ జిల్లా దుర్గ్ 1,721,948 2,319.99 742 http://durg.gov.in/
11 GB గరియాబంద్ జిల్లా గరియాబండ్ 597,653 5,854.94 103 http://gariaband.gov.in/
12 GPM గౌరెల్లా పెండ్రా మార్వాహీ జిల్లా గౌరెల్లా 336,420 2,307.39 166 https://gaurela-pendra-marwahi.cg.gov.in/
13 JC జాంజ్‌గిర్ చంపా జిల్లా జాంజ్‌గిర్ 966,671 4,466.74 360 http://janjgir-champa.gov.in/
14 JA జష్పూర్ జిల్లా జష్పూర్ నగర్ 851,669 6,457.41 132 https://jashpur.nic.in/en/
15 KW కబీర్‌ధామ్ జిల్లా కవర్ధా 822,526 4,447.05 185 http://kawardha.gov.in/
16 KK కాంకేర్ జిల్లా కాంకేర్ 748,941 6,432.68 117 http://kanker.gov.in/
17 కొండగావ్ జిల్లా కొండగావ్ 578,326 6,050.73 96 http://kondagaon.gov.in/
18 KCG ఖైరాఘఢ్ చుయిఖదాన్ గండై జిల్లా ఖైరాగఢ్ 368,444 - -
19 KB కోర్బా జిల్లా కోర్బా 1,206,640 7,145.44 169 http://korba.gov.in/
20 KJ కోరియా జిల్లా బైకుంఠ్‌పూర్ 247,427 2378 37 http://korea.gov.in/
21 MA మహాసముంద్ జిల్లా మహాసముంద్ 1,032,754 4,963.01 208 http://mahasamund.gov.in/
22 MCB మనేంద్రగఢ్ చిర్మిరి భరత్‌పూర్ జిల్లా మనేంద్రగఢ్ 376000 4226 -
23 MM మొహ్లా మన్పూర్ అంబాగఢ్ చౌకీ జిల్లా మొహ్లా 283,947 - -
24 ముంగేలి జిల్లా ముంగేలి 701,707 2,750.36 255 http://mungeli.gov.in
25 నారాయణపూర్ జిల్లా నారాయణపూర్ 139,820 6,922.68 20 http://narayanpur.gov.in/
26 RG రాయగఢ్ జిల్లా రాయగఢ్ 1,112,982 - - http://raigarh.gov.in/
27 RP రాయ్‌పూర్ జిల్లా రాయ్‌పూర్ 2,160,876 2,914.37 742 http://raipur.gov.in/
28 RN రాజ్‌నంద్‌గావ్ జిల్లా రాజ్‌నంద్‌గావ్ 884,742 8,070 110 http://rajnandgaon.gov.in/
29 SB సారన్‌గఢ్ బిలాయిగఢ్ జిల్లా సారన్‌గఢ్ 607,434 - -
30 Skt శక్తి జిల్లా శక్తి 653,036 - -
31 SK సుకుమ జిల్లా సుక్మా 250,159 5,767.02 43 https://sukma.gov.in/
32 SJ సూరజ్‌పూర్ జిల్లా సూరజ్‌పూర్ 789,043 4,998.26 158 http://surajpur.gov.in/
33 SU సుర్గుజా జిల్లా అంబికాపూర్ 840,352 5,019.80 167 http://surguja.gov.in/

వీటిలో బీజాపూర్, నారాయణ్ పూర్ లను 2007 మే 2 న రాష్ట్ర ప్రభుత్వం చే పరిపాలనా సౌలభ్యానికై విభజించబడ్డాయి.

మూలాలు

[మార్చు]
  1. "Chhattisgarh State Song : अरपा पैरी के धार... बना छत्तीसगढ़ का राजगीत". Nai Dunia. 4 November 2019. Archived from the original on 21 March 2020. Retrieved 21 March 2020.
  2. "Chattisgarh's official song to play after Vande Mataram to mark commencement of assembly session". ANI News. Archived from the original on 21 March 2020. Retrieved 21 March 2020.
  3. "Vishnu Deo Sai to be Chief Minister of Chhattisgarh: Sources". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 2023-12-10.
  4. "Official site of the Ministry of Statistics and Programme Implementation, India". Archived from the original on 3 December 2013. Retrieved 20 July 2013.
  5. "छत्तीसगढ़ के सर्वोच्च शिखर गौरलाटा पर 5 वर्ष की एडविना कांत". Nai Dunia (in హిందీ). 2015-05-17. Archived from the original on 24 March 2023. Retrieved 2023-03-24.
  6. "Projected Population of Indian States" (PDF). Archived (PDF) from the original on 16 January 2019.
  7. "The Chhattisgarh Official Language (Amendment) Act, 2007" (PDF). indiacode.nic.in. 2008. Archived (PDF) from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  8. 8.0 8.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Chhattisgarh_Budget_Analysis_2023-24 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  9. "Standard: ISO 3166 — Codes for the representation of names of countries and their subdivisions". Archived from the original on 17 June 2016. Retrieved 24 November 2023.
  10. "State of Literacy" (PDF). Census of India. p. 114. Archived from the original (PDF) on 7 May 2012.
  11. "Sex ratio of State and Union Territories of India as per National Health survey (2019-2021)". Ministry of Health and Family Welfare, India. Archived from the original on 8 January 2023. Retrieved 8 January 2023.
  12. Anita (2 January 2012). "Chhattisgarh gets New Year gift - 9 new districts!". Oneindia. Retrieved 16 February 2016.
  13. "Electoral rolls". Office of the Chief Electoral Officer, Chhattisgarh. Archived from the original on 2012-03-05.
  14. Chhattisgarh at a glance-2002 Archived 2012-04-04 at the Wayback Machine Govt. of Chhattisgarh official website.
  15. List of Chhattisgarh District Centres Archived 2012-02-20 at the Wayback Machine at'NIC, Chhattisgarh official Portal
  16. Mathew, K.M. (ed.). Manorama Yearbook 2008, Kottayam: Malayala Manorama, ISSN 0542-5778, p.518
  17. "Gaurela-Pendra-Marwahi to become Chhattisgarh's 28th district on February 10". The New Indian Express. Express News Service. 31 December 2019. Retrieved 26 February 2020.
  18. "Gaurela-Pendra-Marwahi inaugurated as C'garh's 28th district". Business Standard. Press Trust of India. 10 February 2020. Retrieved 26 February 2020.
  19. Ravish Pal Singh (August 15, 2021). "Chhattisgarh CM Bhupesh Baghel announces 4 new districts, 18 tehsils". India Today. Retrieved 2021-10-01.

బయటి లింకులు

[మార్చు]