Jump to content

దంతేవాడ జిల్లా

వికీపీడియా నుండి
దంతేవాడ జిల్లా
दन्तेवाड़ा जिला
ఛత్తీస్‌ఘడ్ పటంలో దంతేవాడ జిల్లా స్థానం
ఛత్తీస్‌ఘడ్ పటంలో దంతేవాడ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఛత్తీస్‌ఘడ్
డివిజనుబస్తర్
ముఖ్య పట్టణందంతేవాడ
మండలాలు4
Government
 • శాసనసభ నియోజకవర్గాలు1
విస్తీర్ణం
 • మొత్తం3,410.50 కి.మీ2 (1,316.80 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం2,47,029
 • జనసాంద్రత72/కి.మీ2 (190/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత33%
Websiteఅధికారిక జాలస్థలి
దంతేశ్వరి మా ఆలయం, దంతేవాడ

దంతేవాడ జిల్లా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దక్షిణాత్య జిల్లా. ఇది బస్తర్ విభాగంలో భాగం. జిల్లాను దక్షిణ బస్తర్ జిల్లా అని కూడా వ్యవహరిస్తారు. దంతేవాడ, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. 1998 వరకు దంతేవాడ జిల్లా, బస్తరు జిల్లాలో ఒక తాలూకాగా ఉండేది.

2011 జనగణన ప్రకారం ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని 18 జిల్లాలో కెల్లా, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల తర్వాత దంతేవాడ మూడవ అత్యల్ప జనాభా కలిగిన జిల్లా.[1]

చరిత్ర

[మార్చు]

శ్రీనాధుడి కాశీఖండంలో వేమారెడ్డి జైత్రయాత్రను వర్ణించే పద్యంలో దంతేవాడ ప్రస్తావనలు ఉన్నాయి. బారహ దొంతి మన్నెం రాజులు, కోయరాజులతో పాటుగా వేమారెడ్డికి మోకరిల్లుతూంటారని రాసివుంది. అందులోని దొంతి దంతేవాడ పట్టణమేనని పరిశోధకులు పేర్కొన్నారు. రెడ్డిరాజుల కాలంలో దంతేవాడలోని రాజ్యం వేమారెడ్డికి సామంతరాజ్యంగా ఉండేదని తెలుస్తోంది.[2] స్వాతంత్ర్యానికి పూర్వం ఈ జిల్లా బస్తర్ సంస్థానంలో భాగంగా ఉండేది. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బస్తర్ పాలకులు సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. సంస్థానం అప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో భాగమైంది. 1999లో బస్తర్ జిల్లాను మూడుగా విడదీసి బస్తర్, దంతేవాడ, కాంకేర్ జిల్లాలను ఏర్పరచారు. 2000 సంవత్సరంలో దంతేవాడతో పాటు మధ్యప్రదేశ్ లోని పదహారు జిల్లాలతో ఛత్తీస్‌ఘడ్ అనే కొత్త రాష్ట్రం ఏర్పడింది. 2007లో దంతేవాడలోని నాలుగు తాలూకాలు (బీజాపూర్, బైరాంఘర్, ఉసూర్, భోపాలపట్నం) విడదీసి బీజాపూర్ జిల్లాను ఏర్పరచారు. 2012లో దంతేవాడ జిల్లాలోని మరో మూడు తాలూకాలు (ఛింద్‌ఘర్, సుక్మా, కొంతా) తాలూకాలతో మరో కొత్త జిల్లా సుక్మా జిల్లాను ఏర్పరచారు.

భౌగోళిక అంశాలు

[మార్చు]

దంతేవాడ జిల్లా మొత్తం విస్తీర్ణం 3,410.50 చ.కి.మీ. జిల్లాకు ఉత్తరాన, ఈశాన్యాన బస్తర్ జిల్లా, తూర్పున ఒడిశా రాష్ట్రానికి చెందిన మల్కనగిరి జిల్లా, దక్షిణ, నైఋతిల్లో తెలంగాణకు చెందిన ఖమ్మం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. పశ్చిమ సరిహద్దుగా ఇంద్రావతి నది ఉంది. ఇంద్రావతి నదికి అవతలి ఒడ్డున తెలంగాణకు చెందిన కరీంనగర్ జిల్లా, మహారాష్ట్రకు చెందిన గఢచిరోలి జిల్లాలు ఉన్నాయి.

పాలనా విభాగాలు

[మార్చు]

దంతేవాడ జిల్లా నాలుగు తాలుకాలుగా విభజించబడి ఉంది. ఒక్కొక్క తాలూకా ఒక డెవలప్మెంట్ బ్లాక్‌గా కూడా పరిగణింపబడుతున్నది. దంతేవాడ జిల్లాలో మొత్తం 114 గ్రామపంచాయితీలు ఉన్నాయి. [3] జిల్లాలోని నాలుగు తాలూకాలు:[4]

  • దంతేవాడ తాలూకా - 31 గ్రామ పంచాయితీలు, [5]
  • గీదం తాలూకా - 34 గ్రామ పంచాయితీలు,
  • కాటేకళ్యాణ్ తాలూకా - 23 గ్రామ పంచాయితీలు,
  • కువకొండ తాలూకా - 26 గ్రామ పంచాయితీలు.

మూలాలు

[మార్చు]
  1. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. వల్లూరి, విజయ హనుమంతరావు (జనవరి 2015). "మన చరిత్రరచన". సుపథ. 15 (2): 11–20.
  3. "Reports of National Panchayat Directory: Districts of Chhattisgarh". Ministry of Panchayati Raj, Government of India. Archived from the original on 2011-10-11. Retrieved 2014-03-07.
  4. "Reports of National Panchayat Directory: Blocks of Chhattisgarh". Ministry of Panchayati Raj, Government of India. Archived from the original on 2011-10-11. Retrieved 2014-03-07.
  5. "Reports of National Panchayat Directory: Village Panchayat Names of Dantewada, Dantewada, Chhattisgarh". Ministry of Panchayati Raj, Government of India. Archived from the original on 2011-11-12. Retrieved 2014-03-07.