కోర్బా జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోర్బా జిల్లా
कोरबा जिला
ఛత్తీస్‌గఢ్ పటంలో కోర్బా జిల్లా స్థానం
ఛత్తీస్‌గఢ్ పటంలో కోర్బా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
ముఖ్య పట్టణంకోర్బా
Area
 • మొత్తం6,598 km2 (2,548 sq mi)
Population
 (2011)
 • మొత్తం12,06,640
 • Density180/km2 (470/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత84.36 %
Websiteఅధికారిక జాలస్థలి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాలలో కోర్బా జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా కోర్బాపట్టణం ఉంది.

చైతుర్‌ఘర్‌లోని ఆలయం

భౌగోళికం[మార్చు]

కోర్బా జిల్లా రాష్ట్రంలోని ఉత్తర రాతినేలలలో ఉంటుంది. జిల్లాలో అత్యధిక ప్రాంతం సాత్పురా కొండలలోని మైకాల్ పర్వతశ్రేణులలోని పీఠభూములలో ఉంది. జిల్లాలో ఎగువ, దిగువ, బహిరంగ మైదానాలు అధికంగా ఉన్నాయి. బహిరంగ మైదానాలలో అతి పెద్ద ప్రాంతం పాసన్ సమీపంలో ఉంది. హాస్డియో నది 3 ఉపనదులతో ( గజెచొరై, టాన్, అహిరం) జిల్లాలో ప్రవహిస్తుంది. నదీతీరాలలో అక్కడక్కడా అరణ్యాలు ఉన్నాయి. పర్వతాలలో ప్రధానమైనది కరేలా కొండలు ఎత్తు సముద్రమట్టానికి 3253 మీ. కత్ఘోరా ఉత్తరంలో హస్డియో, గాజ్ లోయలు క్రమంగా ఉత్తరాన ఉన్న సుర్గుజా జిల్లాలో కలుస్తుంది. టాన్, చొరై నదులు తూర్పు, పడమరలుగా ఎదురెదురు దిశలలో హస్డియో నదితో సంగమిస్తున్నాయి. ఉత్తర నదీతీరంలో గురుద్వారీ కొండలు, జంటా కొండలు, మాతిన్ కొండలు, ఢజగ్ కొండలు ఉన్నాయి. జిల్లాలో కోర్బా జిల్లాలో గెవ్రా ప్రాంతం (ఆసియాలో ఇది అతిపెద్ద బొగ్గుగని), కుస్ముండ ప్రాంతం, దిప్క ప్రాంతంలో బొగ్గుగనులు ఉన్నాయి. ఎన్.టి.పి.సి, సి.ఎస్.ఇ.బి ఈస్ట్-వెస్ట్, బాల్కో అల్యూమినియం ప్లాంట్లు కూడా ఈ జిల్లాలో ఉన్నాయి.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,206,563,[1]
ఇది దాదాపు. బహరియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. న్యూ హాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 395వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 183 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.25%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 971:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 73.22%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Bahrain 1,214,705 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470

వెలుపలి లింకులు[మార్చు]