కోర్బా
కోర్బా | |
---|---|
నగరం | |
Coordinates: 22°21′N 82°41′E / 22.35°N 82.68°E | |
దేశం | India |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
జిల్లా | కోర్బా |
విస్తీర్ణం | |
• Total | 100 కి.మీ2 (40 చ. మై) |
• Rank | 7th in state |
Elevation | 316 మీ (1,037 అ.) |
జనాభా (Urban 2011) | |
• Total | 2,65,253 |
• Rank | 126th |
• జనసాంద్రత | 2,700/కి.మీ2 (6,900/చ. మై.) |
Demonym | Korbites |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 495450 |
ప్రాంతపు కోడ్ | 7759 |
Vehicle registration | CG-12 |
లింగనిష్పత్తి | 927 ♂/♀ |
కోర్బా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలోని నగరం, పారిశ్రామిక ప్రాంతం. ఇది కోర్బా జిల్లా ముఖ్యపట్టణం కూడా.
భౌగోళికం
[మార్చు]కోర్బా 22°21′N 82°41′E / 22.35°N 82.68°E వద్ద,[1] సముద్రమట్టం నుండి సగటున 252 మీటర్ల ఎత్తున ఉంది. 2011 నాటి భారత జనగణన ప్రకారం [2] కోర్బా నగర జనాభా 3,65,253
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]జమానిపాలి ప్రాంతంలో NTPC వారి కోర్బా సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది.[3][4][5] దీనికి గేవ్రా, కుస్ముందా గనుల నుండి బొగ్గును వస్తుంది. విద్యుత్కేంద్రానికి అవసరమైన నీటిని హస్దేవ్ నది నుండి తీసుకుంటుంది.[6] కోర్బా థర్మల్ పవర్ స్టేషన్ జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్ యాజమాన్యంలో ఉంది.[7][8] హస్దేవ్ థర్మల్ పవర్ స్టేషన్, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ థర్మల్ పవర్ స్టేషన్, ల్యాంకో అమర్‌కంటక్ పవర్ ప్లాంట్ వంటి చిన్న విద్యుత్కేంద్రాలు నగరానికి సమీపంలో ఉన్నాయి.
భారత్ అల్యూమినియం కంపెనీకి ఇక్కడ తయారీ కేంద్రం ఉంది. ఇది ఆసియాలో అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తి కర్మాగారాల్లో ఒకటి. 2009 లో, బాల్కో స్మెల్టర్ వద్ద గన్నన్ డంకర్లీ & కంపెనీ వారిచే నిర్మాణంలో ఉన్న చిమ్నీ కూలిపోయి 49 మంది కార్మికులు మరణించారు. ఈ సంఘటనలో GDCL యాజమాన్యం నిర్లక్ష్యానికి పాల్పడింది.[9][10][11]
రవాణా
[మార్చు]రైలు
[మార్చు]కోర్బా రైల్వే స్టేషను, హౌరా-నాగ్‌పూర్-ముంబై మార్గంలో ఉన్న చంపా రైల్వే జంక్షనుకు అనుసంధానించబడి ఉంది. ఈ స్టేషన్లు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకు వస్తాయి. ఈ స్టేషన్నుండి బిలాస్‌పూర్‌కి నేరుగా రైళ్ళున్నాయి. ఈ 50.7 కి.మీ. బ్రాడ్ గేజ్ రైలుమార్గాన్ని 1953, 1956 మధ్య నిర్మించారు. 1987 - 1988 లో ఈ మార్గాన్ని విద్యుదీకరించారు. 1988 -1989 లో గేవ్రా రోడ్ రైల్వే స్టేషన్ [12][13] వరకు పొడిగించారు.
రోడ్లు
[మార్చు]కోర్బా నుండి చంపాకు జాతీయ రహదారి 149B ఉంది. NH 130 ద్వారా నగరం నుండి అంబికాపూర్, బిలాస్‌పూర్ లకు రవాణా సౌకర్యం ఉంది.
విద్యాసౌకర్యాలు
[మార్చు]కళాశాలలు
[మార్చు]- విశ్వేశ్వరయ్య ప్రభుత్వ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల
- ప్రభుత్వ మినీమాత బాలికల కళాశాల
- ప్రభుత్వ పాలిటెక్నిక్, కోర్బా
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కోర్బా
- జ్యోతి భూషణ్ ప్రతాప్ సింగ్ లా కాలేజ్, కోర్బా
- కమలా నెహ్రూ కళాశాల, కోర్బా
మూలాలు
[మార్చు]- ↑ "Maps, Weather, and Airports for Korba, India". www.fallingrain.com. Retrieved 2023-01-25.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ "Coal Mine Project Opportunity" (PDF). Korba Coalfield. Retrieved 2011-09-01.
- ↑ "Question remains on CIL's expansion projects in Chhattisgarh – Question remains on CIL's expansion projects in Chhattisgarh". Financial Express. 13 April 2011. Retrieved 2011-09-03.
- ↑ "CIL's SECL makes day record for coal output in March". Steelguru. 13 April 2007. Archived from the original on 5 April 2012. Retrieved 2011-09-04.
- ↑ "NTPC Korba". Archived from the original on 2017-10-26. Retrieved 2021-09-16.
- ↑ Chhattisgarh State Power Generation Company, "Thermal power stations" Archived 11 నవంబరు 2013 at the Wayback Machine, Chhattisgarh State Power Generation Company website, accessed February 2012.
- ↑ "Thermal power stations". Archived from the original on 11 November 2013. Retrieved 2013-08-20.
- ↑ "Balco chimney mishap: Three Chinese officials arrested in Korba". The Hindustan Times. 2010-01-11. Archived from the original on 15 January 2010. Retrieved 2010-01-26.
- ↑ Anderlini, Jamil (2009-09-29). "India questions Sepco staff over chimney collapse". The Financial Times. Retrieved 2009-09-29.
- ↑ "25 die in accident at BALCO's new plant at Korba". Business Standard. 2009-09-24. Retrieved 2009-09-24.
- ↑ Moonis Raza & Yash Aggarwal (1986). Transport Geography of India: Commodity Flow and the Regional Structure of Indian Economy. Concept Publishing Company, A-15/16 Commercial Block, Mohan Garden, New Delhi - 110059. ISBN 81-7022-089-0. Retrieved 2 May 2013.
{{cite book}}
:|work=
ignored (help) - ↑ "History of Electrification". India Rail Info.