బెమెతరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బెమెతరా
పట్టణం
ముద్దుపేరు(ర్లు): 
బెమెత్రా
బెమెతరా is located in Chhattisgarh
బెమెతరా
బెమెతరా
ఛత్తీస్‌గఢ్ పటంలో పట్టణ స్థానం
నిర్దేశాంకాలు: 21°42′N 81°32′E / 21.70°N 81.53°E / 21.70; 81.53Coordinates: 21°42′N 81°32′E / 21.70°N 81.53°E / 21.70; 81.53
దేశం India
రాష్ట్రంఛత్తీస్‌గఢ్
జిల్లాబెమెతరా
విస్తీర్ణం
 • మొత్తం11.82 కి.మీ2 (4.56 చ. మై)
సముద్రమట్టం నుండి ఎత్తు
278 మీ (912 అ.)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం28,536
 • సాంద్రత2,400/కి.మీ2 (6,300/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ, ఛత్తీస్‌గఢీ
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
491335
Telephone code07824
వాహనాల నమోదు కోడ్CG 25
జాలస్థలిwww.bemetara.gov.in

బెమెతారా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బెమెతారా జిల్లాలోని పట్టణం. ఈ జిల్లాను 2012 లో దుర్గ్ జిల్లాను విభజించి ఏర్పాటు చేసారు. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.

బెమెతరాను ఫౌజీ జిల్లా అని కూడా అంటారు. 2011 జనాభా గణన ప్రకారం, బెమెతారా పట్టణంలో మొత్తం జనాభా 28,536.

  • బెమెతారాలో 5,800 గృహాలున్నాయి.
  • జనాభాలో 14,280 మంది పురుషులు (50%), 14,256 మంది మహిళలు (50%)
  • షెడ్యూల్డ్ కులాల వారు 2,398 (8%)
  • మొత్తం షెడ్యూల్డ్ తెగల వారు 884 (3%).
  • బేమెతారాలో అక్షరాస్యులు 20,012 (70%) నిరక్షరాస్యులు 8,524 (30%).
  • పనిచేసేవారు 10,923 (38%)

భౌగోళికం, శీతోష్ణస్థితి[మార్చు]

భౌగోళికం[మార్చు]

శివనాథ్ నది బెమెతారా పట్టణానికి తూర్పున ప్రవహిస్తుంది. దక్షిణ భాగంలో దట్టమైన అడవులు ఉన్నాయి. బెమెతారాకు వాయువ్య దిశలో మైకాల్ కొండలు పెరుగుతాయి. ఉత్తరాన, భూమి ఎత్తు పెరుగుతూ, జార్ఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈశాన్యంగా విస్తరించి ఉన్న చోటా నాగపూర్ పీఠభూమితో కలుస్తుంది. బెమెతారాకు దక్షిణాన దక్కన్ పీఠభూమి ఉంది .

శీతోష్ణస్థితి[మార్చు]

బెమెతారాలో ఉష్ణమండల తడి, పొడి వాతావరణం ఉంటుంది, మార్చి నుండి జూన్ వరకు చాలా వేడిగా ఉంటుంది. మిగతా ఏడాది పొడవునా ఉష్ణోగ్రతలు మితంగా ఉంటాయి. ఏప్రిల్ -మేలో ఉష్ణోగ్రత కొన్నిసార్లు 48 °C (118 °F) కు చేరుతుంది. ఈ వేసవి నెలల్లో పొడి, వేడి గాలులు కూడా ఉంటాయి. నగరానికి దాదాపు 1300 మి.మీ. వార్షిక వర్షపాతం ఉంటుంది. ఇందులో ఎక్కువ భాగం జూన్ చివరి నుండి అక్టోబరు ఆరంభం వరకు ఉండే వర్షాకాలంలోనే పడుతుంది. చలికాలం నవంబరు నుండి జనవరి వరకు ఉంటుంది. సాధారణంగా చలి మామూలుగా ఉన్నప్పటికీ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 °C (41 °F) వరకూ పడిపోవడం జరుగుతుంది.

Bemetara City-వాతావరణం
నెల జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు సంవత్సరం
సగటు అధిక °C (°F) 27 30 35 39 45 36 30 30 31 31 28 26 32
సగటు అల్ప °C (°F) 13 15 20 24 27 26 23 23 22 21 16 14 20
అవక్షేపం mm (inches) 10 17 14 13 18 239 383 364 197 50 11 16 1330
Source: [2]

రవాణా[మార్చు]

రోడ్లు[మార్చు]

బెమెతారా నగరం నుండి రాయపూర్, జబల్‌పూర్, బిలాస్‌పూర్, దుర్గ్, కవర్ధాలకు చక్కటి రోడ్డు మార్గాలున్నాయి. NH-12 A నగరం నడిబొడ్డు గుండా వెళుతుంది. ఇది రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే రహదారి. ఈ హైవే రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌ను నుండి మధ్యప్రదేశ్‌ లోని ప్రధాన నగరమైన జబల్‌పూర్‌తో కలుపుతుంది. దుర్గ - బెమెతారా రాష్ట్ర రహదారి, కుంహారి - బెమెతారా - ముంగేలి రాష్ట్ర రహదారి బెమెతారా గుండా వెళ్తాయి.

రైల్వే[మార్చు]

బెమెతారాలోరైల్వే స్టేషను లేదు. అసలు జిల్లాలోనే రైలు మార్గంలేదు. సమీప రైల్వే స్టేషన్ టిల్డా (35 కి.మీ.). పెద్ద స్టేషన్లు రాయపూర్ (66 కి,మీ.) దుర్గ్ (72 కి.మీ.)

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "District Census Handbook – Durg" (PDF). Census of India. The Registrar General & Census Commissioner. p. 22. Retrieved 21 June 2017.
  2. "Historical Weather for Bemetara, Assam, India". Whetherbase. Retrieved 18 July 2012.
"https://te.wikipedia.org/w/index.php?title=బెమెతరా&oldid=3396310" నుండి వెలికితీశారు