ఖైరాగఢ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఖైరాగఢ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రం ఖైరాఘర్ చుయిఖదాన్ గండై జిల్లా లోని ఒక నగరం. ఇది ఖైరాఘర్ చుయిఖదాన్ గండై జిల్లా ముఖ్యపట్టణం. ఇది పూర్వ రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో భాగంగా ఉండేది. ఈ ప్రాంతం సారవంతమైన మైదానం, వరి దిగుబడిని కలిగి ఉంది. [1]

చరిత్ర[మార్చు]

ఖైరాగఢ్ రాష్ట్రం బ్రిటీష్ ఇండియాలోని మాజీ కేంద్ర రాచిరిక రాష్ట్రాలలో సామంత రాష్ట్రంగా ఉంది. [2] పండాదా ఖైరాఘర్ నుండి 8 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని అత్యంత చారిత్రక ప్రదేశాలలో ఇది ఒకటి. పాత నాగవంశీ రాజ్‌పుత్‌ల రాజ కుటుంబం నుండి వచ్చిన ముఖ్యుడు, 1898లో వంశపారంపర్యంగా రాజా, ది కింగ్ అనే బిరుదును పొందాడు.

భౌగోళికం[మార్చు]

ఖైరాఘర్ సముద్రమట్టానికి 307 మీటర్లు (1007 అడుగులు) ఎత్తున t 21°25′N 80°58′E / 21.42°N 80.97°E / 21.42; 80.97 వద్ద ఉంది.[3]

వాతావరణం[మార్చు]

ఈ ప్రాంతంలో ఏప్రిల్ మధ్య నుండి జూన్ మధ్య మధ్యలో వేడి వాతావరణం ఉంటుంది.ఈ రెండు నెలలు కాకుండా మిగతా కాలంలో వాతావరణం సాధారణంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఖైరాఘఢ్ నగరం సంవత్సరానికి సగటున 900 మిల్లీమీటర్ల వర్షపాతం పొందుతుంది. శీతాకాలంలో, కనిష్ట ఉష్ణోగ్రత 7-9°C.కి పడిపోతుంది.

జనాభా శాస్త్రం[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం ఖైరాఘర్‌లో 15,149 మంది జనాభా ఉన్నారు. అందులో పురుషులు 51% మంది ఉండగా, స్త్రీలు 49% మంది ఉన్నారు. ఖైరాగఢ్ సగటు అక్షరాస్యత రేటు 73%, దీనిని జాతీయ సగటు అక్షరాస్యత రేటుతో 59.5% పోల్చగా ఎక్కువ ఉంది. పురుషుల అక్షరాస్యత 81% ఉంది. స్త్రీల అక్షరాస్యత 64% ఉంది. ఖైరాఘర్‌లో జనాభాలో 13% మంది 6 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సు వారు ఉన్నారు.[4]

చదువు[మార్చు]

కళాశాలలు[మార్చు]

  • పిటి దేవి ప్రసాద్ జీ చౌబే ప్రభుత్వ కళాశాల, గండాయి,
  • వీరంగన అవంతి బాయి ప్రభుత్వ కళాశాల, చుయిఖదన్
  • వీరంగన అవంతి బాయి ప్రభుత్వ కళాశాల ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ స్టేషన్ చుయిఖదన్,
  • రాణి రష్మీ దేవి సింగ్ ప్రభుత్వ కళాశాల, ఖైరఘర్

ఇందిరా పెర్ఫార్మింగ్ ఆర్ట్ అండ్ మ్యూజిక్ యూనివర్సిటీ[మార్చు]

ఖైరాగఢ్ పట్టణంలో దృశ్య, ప్రదర్శన కళలకు అంకితమైన, ఆసియాలో మొదటి విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన ఇందిర కళా సంగీత విశ్వ విద్యాలయం ఉంది

ఇందిరా కళా-సంగీత్ విశ్వవిద్యాలయ మధ్యప్రదేశ్ ప్రభుత్వం 1956 చట్టం XIX ప్రకారం స్థాపించబడింది. 2001లో ఛత్తీస్‌గఢ్ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఛత్తీస్‌గఢ్ గవర్నర్ ఐ.కె.ఎస్.వి.వి. ఖైరాఘర్‌కు ఛాన్సలర్, ప్రధాన పరిపాలనా అధికారిగా ఉన్నాడు.

1956లో, ఖైరాగఢ్ రాచరిక రాష్ట్రానికి చెందిన అప్పటి పాలకులు సంగీతం, లలిత కళల విశ్వవిద్యాలయాన్ని తెరవడానికి తమ రాజగృహంను విరాళంగా ఇచ్చారు.దివంగత రాజా బీరేంద్ర బహదూర్ సింగ్, దివంగత రాణి పద్మావతి దేవి ఈ విశ్వవిద్యాలయానికి తమ ప్రియమైన కుమార్తె 'ఇందిర' పేరు పెట్టారు. [5]

ఇందిరా కళా సంగీత విశ్వవిద్యాలయంలో చేరడం, చదువుకోవడం భారతీయ కళారూపాలను ఆస్వాదించడానికి ఒక మార్గం.శాస్త్రీయ స్వర సంగీతం ( హిందుస్తానీ, కర్నాటిక్), శాస్త్రీయ వాయిద్య సంగీతం (హిందూస్థానీ , కర్నాటిక్), శాస్త్రీయ నృత్య శైలులు (కథక్, భరతనాట్యం), జానపద నృత్యం, సంగీతం, పెయింటింగ్ వంటి విభిన్న కళారూపాలకు సంబంధించిన సబ్జెక్టులు, కోర్సుల సుదీర్ఘ జాబితాను విశ్వవిద్యాలయం అందిస్తుంది.

రవాణా[మార్చు]

ఖైరాగఢ్ పట్టణానికి సమీప రేల్వే స్టేషన్లు, రాజ్‌నంద్‌గావ్ రైల్వే స్టేషన్ 40 కి.మీ దూరంలో, డోంగర్‌గర్ రైల్వే స్ఠేషన్ 42 కి.మీ దూరంలో, దుర్గ్ రైల్వే స్టేషన్ 55 కి.మీ.దూరంలో ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ల నుండి విశాఖపట్నం, ముంబై, పూణే, అహ్మదాబాద్, హౌరా, భువనేశ్వర్, చెన్నై, త్రివేండ్రం, అమృత్‌సర్, న్యూ ఢిల్లీకి నేరుగా రైళ్లు అందుబాటులో ఉన్నాయి, ఇవి నాగ్‌పూర్ మీదుగా హౌరా-ముంబై ప్రధాన రైలు మార్గంలో ఉన్నాయి. రాయ్‌పూర్, నాగ్‌పూర్ విమానాశ్రయాలు వరుసగా 100 కి.మీ. 225 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. Dr.Sanjay Alung, Chhattisgarh ki Riyaste/Princely states aur Jamindariyaa, Vaibhav Prakashan, Raipur1, ISBN 81-89244-96-5
  2. Malleson, G. B.: An historical sketch of the native states of India, London 1875, Reprint Delhi 1984
  3. Falling Rain Genomics, Inc - Khairagarh
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  5. About the University from the website of Indira Kala Sangeet Vishwa Vidyalaya, accessed 06-sep-2008

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఖైరాగఢ్&oldid=3950027" నుండి వెలికితీశారు