ధమ్తారి
ధమ్తారి | |
---|---|
నగరం | |
Coordinates: 20°43′N 81°33′E / 20.71°N 81.55°E | |
దేశం | భారతదేశం |
జిల్లా | ధమ్తారి |
విస్తీర్ణం | |
• Total | 34.94 కి.మీ2 (13.49 చ. మై) |
Elevation | 317 మీ (1,040 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,01,677 |
• జనసాంద్రత | 2,900/కి.మీ2 (7,500/చ. మై.) |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 493773, 4936XX,4937XX |
Vehicle registration | CG05 |
Website | www.dhamtari.gov.in |
దమ్తారి, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దమ్తారీ జిల్లా లోని నగరం. ఈ జిల్లా ముఖ్యపట్టణం. నగర పరిపాలన మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. [1] ఇది 1998 జూలై 6 వ తేదీన ఏర్పడిన మహాసముంద్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. చత్తీస్‌గఢ్ మొత్తం జనాభాలో ఈ జిల్లా జనాభా 3.13 శాతం ఉంది.
చరిత్ర
[మార్చు]ధమ్తారి జనాభా 1955 లో 17,278. ఆ సమయంలో, ఈ పట్టణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాయపూర్ జిల్లాలో భాగంగా ఉండేది. 2000 లో, ఇది కొత్త ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భాగమైంది. ధమ్తారీ తహసీల్ ప్రధాన కార్యాలయం. బెంగాల్ నాగపూర్ రైల్వేకు చెందిన బొంబాయి - కలకత్తా ప్రధానమార్గం నుండి చీలి న్యారో గేజి మార్గం ధమ్తారికి వెళ్తుంది. ధమ్తారి వాణిజ్య కేంద్రంగా మారింది. అక్కడ నుండి రవాణా అయ్యే వస్తువుల్లో కలప, యూరియా, బీడి ఆకులు, బియ్యం, జంతు చర్మంతో చేసిన వస్తువులు.
భౌగోళికం
[మార్చు]ధత్తారి చత్తీస్‌గఢ్‌లోని సారవంతమైన మైదానంలో ఉంది. జిల్లా మొత్తం వైశాల్యం 2,029 చదరపు కిలోమీటర్లు (783 చ. మై.). ఇది సముద్ర మట్టానికి 317 మీటర్ల ఎత్తున ఉంది. ధమ్తారి, రాష్ట్ర రాజధాని రాయపూర్ నుండి 65 కి.మీ. దూరంలో ఉంది.
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]జిల్లాలో సీసం నిల్వలు ఉన్నాయి. నగరంలోని చాలా మంది కార్మికులు కలప పరిశ్రమ లేదా బియ్యం లేదా పిండి మిల్లుల్లో (ధమ్తారిలో 200 పైచిలుకు ధాన్యం మిల్లులు ఉన్నాయి) పనిచేస్తారు. పట్టణంలో రసాయన పరిశ్రమ కూడా గణనీయంగా ఉంది. మహానదిపై ఉన్న రవిశంకర్ సాగర్ ఆనకట్ట (గాంగ్రెల్ డ్యామ్) నగరం నుండి 17 కి.మీ. దూరంలో ఉంది. ఇది దాదాపు 1,40,000 ఎకరాల భూమికి సాగునీటిని అందిస్తుంది. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు, భిలాయ్‌లోని ఉక్కు కర్మాగారానికీ ప్రాథమికంగా తాగునీటిని సరఫరా చేస్తుంది.
నగర మేయర్ల జాబితా
[మార్చు]కార్యాలయ వ్యవధి | పేరు | పార్టీ | గమనికలు |
---|---|---|---|
1922-1926 | నారాయణరావు మేఘవాలే | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | |
1932-1934 | నాత్తురావ్ జగ్తాబ్ | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | |
1934-1936 | ఖమ్మన్‌లాల్ సా | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | |
1936-1937 | చోటెలాల్ జీ దౌ | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | |
1937-1939 | బాబు చోటే లాల్ శ్రీవాస్తవ | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | |
1941-1946 | రాంగోపాల్ శర్మ | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | |
1946-1950 | గిరిధరి లాల్ మిశ్రా | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | |
1951-1952 | రాంగోపాల్ శర్మ | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | నామినేట్ చేయబడింది |
1952-1954 | రాధేశ్యామ్ ఖరే | భారతీయ జన సంఘం | |
1955-1957 | రాధేశ్యామ్ ఖరే | భారతీయ జన సంఘం | |
1969-1971 | హనుమాన్ ప్రసాద్ మిశ్రా | భారతీయ జన సంఘం | |
1971-1974 | పండరీ రావు పవార్ | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | |
1984-1987 | కరిషన్ కుమార్ ధంద్ | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | నామినేట్ చేయబడింది |
1995-2000 | నారాయణ్ ప్రసాద్ గుప్తా | బిజెపి | |
2000-2005 | జానకీ పవార్ | బిజెపి | |
2005-2010 | తారాచంద్ హిందూజా | బిజెపి | |
2010-2015 | నారాయణ్ ప్రసాద్ గుప్తా | బిజెపి | |
2015-2020 | అర్చన చౌబే | బిజెపి | |
2020- | విజయ్ దేవాంగన్ | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
ధమ్తారి రాయపూర్ నుండి జగదల్‌పూర్ జాతీయ రహదారి 30 పై ఉంది, ప్రతి 5-15 నిమిషాలకు ఇక్కడ నుండి ఈ నగరాలకు బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి. రాయ్‌పూర్ ధమ్తారిల మధ్య ఉన్న న్యారో-గేజ్ రైలు మార్గం ఒకప్పుడు ఆ ప్రాంతానికి సేవలందించింది.
మూలాలు
[మార్చు]- ↑ "Dhamtari Municipal Corporation". dailypioneer.com. Retrieved 2014-08-14.[dead link]