బైకుంఠ్‌పూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బైకుంఠ్‌పూర్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కొరియా జిల్లాలోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. దీని పరిపాలన నోటిఫైడ్ ఏరియా కమిటీ నిర్వహిస్తుంది.

భౌగోళికం[మార్చు]

బైకుంఠ్‌పూర్ 23°15′N 82°33′E / 23.25°N 82.55°E / 23.25; 82.55 వద్ద ఉంది. [1] సముద్రమట్టం నుండి దీని సగటు ఎత్తు 529 మీటర్లు (1735 అడుగులు ).

జనాభా[మార్చు]

2011 భారత జనగణన నివేదిక ప్రకారం, బైకుంఠ్‌పూర్ మున్సిపాలిటీ జనాభా 28,431, ఇందులో 14,749 మంది పురుషులు కాగా, 13,682 మంది మహిళలు. బైకుంఠ్‌పూర్ సగటు అక్షరాస్యత 78%, ఇది జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ. 57% పురుషులు, 43% స్త్రీలు అక్షరాస్యులు. జనాభాలో 13% మంది 6 సంవత్సరాల లోపు వారు.

ఈ ప్రాంతంలో అపారమైన బొగ్గు వనరులున్నాయి. కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన SECL కు బైకుంఠ్‌పూర్‌లో GM కార్యాలయం ఉంది. అనేక లాభదాయకమైన బొగ్గు గనులను కలిగి ఉంది.

మూలాలు[మార్చు]

  1. Falling Rain Genomics, Inc - Baikunthpur