మహాసముంద్
మహాసముంద్ | |
---|---|
పట్టణం | |
నిర్దేశాంకాలు: 21°07′N 82°06′E / 21.11°N 82.10°ECoordinates: 21°07′N 82°06′E / 21.11°N 82.10°E | |
దేసం | ![]() |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
జిల్లా | మహాసముంద్ |
సముద్రమట్టం నుండి ఎత్తు | 318 మీ (1,043 అ.) |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 85,650 |
భాషలు | |
• అధికారిక | హిందీ, ఛత్తీస్‌గఢీ |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | |
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లు | C.G.06 |
మహాసముంద్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, మహాసముంద్ జిల్లా లోని నగరం. ఇది రాష్ట్రంలోని 12 వ అతిపెద్ద నగరం. మహాసముంద్ జిల్లా ముఖ్యపట్టణం. నగరాన్ని 30 వార్డులు, ఐదు జోన్లుగా విభజించారు. ఇది మహానది తీరప్రాంతంలో అతిపెద్ద నగరం.
వ్యుత్పత్తి శాస్త్రం[మార్చు]
గుప్త రాజవంశానికి చెందిన గొప్ప పాలకుడు సముద్రగుప్తుడి పేరిట ఈ నగరానికి మహాసముంద్ అనే పేరు పెట్టారు. దక్షిణ కోశల్పై చేసిన దండయాత్రలో సముద్రగుప్తుడు, తన సైన్యంతో సహా, మహానది ఒడ్డున బస చేశాడు. అందువలన మహాసముంద్ అనే పేరు ఉద్భవించింది.
భౌగోళికం[మార్చు]
మహాసముంద్ 21°06′N 82°06′E / 21.1°N 82.1°E వద్ద, [1] సముద్రమట్టం నుండి ఇది సగటు ఎత్తు 318 మీటర్లు (1043 అడుగులు). మహాసముంద్, మహానది నదికి దగ్గరగా, జాతీయ రహదారి 6, జాతీయ రహదారి 217 ల కూడలి వద్ద, రాయపూర్‌కు ఆగ్నేయంగా 56 కి.మీ. దూరంలో ఉంది. రాయ్‌పూర్ - విశాఖపట్నం రైలు మార్గంలో మహాసముంద్ నగరం ఒక ముఖ్యమైన స్టేషను.
జనాభా[మార్చు]
2011 భారత జనగణన ప్రకారం,[2] మహాసముంద్ జనాభా 85,650. జనాభాలో పురుషులు 51%, మహిళలు 49% ఉన్నారు. మహాసముంద్ అక్షరాస్యత 70% ఇది జాతీయ సగటు 59.5%కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 79%, స్త్రీల అక్షరాస్యత 61%. జనాభాలో 14% మంది 6 సంవత్సరాల లోపు పిల్లలు.
రవాణా[మార్చు]
మహాసముంద్కు, జాతీయ రహదారి 6, జాతీయ రహదారి 217 ల ద్వారా ప్రధాన భారతీయ నగరాలతో చక్కటి రోడ్డు సౌకర్యం ఉంది. జాతీయ రహదారి 6 ను మహాసముంద్ నుండి ఒడిశా వరకు నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేయడం జరుగుతోంది.
మహాసముంద్ రోడ్డు మార్గాల ద్వారా రాయపూర్ నుండి 55 కి.మీ.ధంతారి నుండి 105 కి.మీ., రాజీమ్ నుండి 30 కి.మీ., బిలాస్‌పూర్ నుండి 160 కి.మీ., దుర్గ్ నుండి 95 కి.మీ., భిలాయ్ నుండి 85 కి.మీ., సారాయిపాలి నుండి 115 కి.మీ.,,బార్‌గఢ్ నుండి 180 కి.మీ., సంబల్పూర్ నుండి 250 కి.మీ. దూరంలో ఉంది.
బస్సు[మార్చు]
మహాసముంద్‌లోని గురు ఘాసీదాస్ బస్ టెర్మినల్ నుండి దాని సమీప నగరాలకు బస్సులు నడుస్తున్నాయి. రాయ్పూర్, బిలాస్పూర్, దుర్గ్ తదితర నగరాలకు, ఇతర రాష్ట్రాల లోని పట్టణాలకూ బస్సు సౌకర్యం ఉంది.
రైలు[మార్చు]
మహాసముంద్లో రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి: మహాసముంద్ రైల్వే స్టేషన్, బెల్సొందా స్టేషన్. మహాసముంద్ రైల్వే స్టేషను తూర్పు తీర రైల్వే జోన్‌లో ఒక ముఖ్యమైన స్టేషన్. రాయ్‌పూర్ నుండి తితిలాగఢ్ వరకు రైల్వే ట్రాకు డబ్లింగు పని పూర్తయింది. రైల్ మంత్రిత్వ శాఖ మహాసముంద్ వద్ద కొత్త రైల్వే మేనేజర్ డివిజన్ ప్రధాన కార్యాలయాన్ని మంజూరు చేసింది.
మహాసముంద్ రైల్వే స్టేషను, రాయపూర్ - విశాఖపట్నం రైలు మార్గంలో ఉంది. ఇక్కడి నుండి భువనేశ్వర్, పూరి, విశాఖపట్నం, దుర్గ్, రాయపూర్, బిలాస్‌పూర్, కోర్బా, నాగపూర్, ముంబై, ఢిల్లీ, భోపాల్, తితిలాగఢ్, సంబల్పూర్, భవానీపట్న, అహ్మదాబాద్, గాంధీధం, న్యూఢిల్లీ, తిరుపతి, షిరిడీ, విజయవాడ, ఆగ్రా, ఇటార్సీ లకు రైళ్లు నడుస్తున్నాయి.
వైమానిక[మార్చు]
రాయ్‌పూర్ లోని స్వామి వివేకానంద విమానాశ్రయం, పట్టణం నుండి 40 కి.మీ. దూరంలో ఉంది.
ఆర్థిక వ్యవస్థ[మార్చు]
మహాసముంద్ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, గనుల మీద ఆధారపడి ఉంది. వరి ఇక్కడ పండించే ప్రధాన పంట. ఈ ప్రాంతంలో నల్ల రాయి పలకల కోసం గనుల తవ్వకం జరుగుతోంది. మహాసముంద్లో రాళ్లు కోసే కర్మాగారాలు కూడా అనేకం ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతాలైన బిర్కోని 10 కి,మీ., బెల్సొందా 5 కి.మీ. దూరం లోనూ ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ Falling Rain Genomics, Inc - Mahasamund
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.