Coordinates: 22°01′01″N 82°34′01″E / 22.017°N 82.567°E / 22.017; 82.567

జాంజ్‌గిర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Janjgir
जांजगीर
Janjgir-naila
City
Janjgir is located in Chhattisgarh
Janjgir
Janjgir
Location in Chhattisgarh, India
Coordinates: 22°01′01″N 82°34′01″E / 22.017°N 82.567°E / 22.017; 82.567
Country India
రాష్ట్రంChhattisgarh
జిల్లాJanjgir–Champa
Population
 • Total32,833
భాషలు
 • అధికారహిందీ, Chhattisgarhi
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
495668
టెలిఫోన్ కోడ్07817
Vehicle registrationCG-11
Nearest cityChampa
Literacy73%%

జాంజ్‌గిర్ పట్టణం చత్తీస్‌గఢ్ రాష్ట్ర జాంజ్‌గిర్- చంపా జిల్లాకేంద్రంగా ఉంది. బిలాస్‌పూర్ నుండి 1997లో జాంజ్‌గిర్- చంపా జిల్లా రూపొందించినప్పటి నుండి ఇది జిల్లాకేంద్రంగా ఉంది. జాంజ్‌గిర్ ప్రఖ్యాత విష్ణు ఆలయం ఉంది. జాంజ్‌గిర్ పారిశ్రామికంగా వేగవంతంగా అభివృద్ధిచెందుతుంది. ప్రజలు పలు ప్రయత్నాలు చేసిన తరువాత దీనికి జాంజ్‌గిర్ పేరు స్థిరపరచబడింది. తరువాత రైల్వే స్టేషన్‌కు జాంజ్‌గిర్- నైలా (ముందు దీనికి నైలా అనే పేరు ఉండేది) అని పేరుమార్చబడింది. జాంజ్‌గిర్ రైలు మార్గాలు, రహదారి మార్గాలతో బిలాస్‌పూర్, రాజ్పూర్ నగరాలతో జాతీయరహదారి -200 తో అనుసంధానించబడి ఉంది. జాంజ్‌గిర్ రాజా జైవాల్యా (పురాతన కాలంలో ఈ పట్టణాన్ని పాలించిన రాజు) స్మారకార్ధం " జైవాల్యా దేవ్ లోక్ మహోత్సవ్ " నిర్వహించబడుతుంది. జాంజ్‌గిర్‌లో టాఇటానిక్ ప్రమాదంలో అసువులుబాసిన క్రైస్తవ మిషనరీకి చెందిన " మిస్ ఎ.సి. ఫన్క్ " నివాస శిథిలాలు ఉన్నాయి. అంతేకాక నహరియా బాబా ఆలయం ( హనుమాన్) ఆలయం ఉంది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 32,495
స్త్రీ:పురుష శాతం 48%: 52%
అక్షరాస్యత 70%
6 వయసు లోపు పిల్లలు 14%

జాంజ్‌గిర్ పట్టణంలో సింధ్ (పాకిస్తాన్), పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మొదలైన ప్రాంతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. పట్టణంలో అధికంగా హిందీ భాషవాడుకలో ఉంది. స్వల్పంగా సింధీ, ఇంగ్లీష్ వాడుకలో ఉంది.

పాఠశాలలు[మార్చు]

 • ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జాంజ్‌గిర్ -చంపా (సీబీఎస్ఈ)
 • ఙానజ్యోతి హయ్యర్ సెకండరీ స్కూల్ (సీబీఎస్ఈ)
 • సరస్వతి శిశు మందిర్ (సీబీఎస్ఈ)
 • ఙానదీప్ హయ్యర్ సెకండరీ స్కూల్ (సీబీఎస్ఈ)
 • ఙానభారతి హయ్యర్ సెకండరీ స్కూల్ (సీబీఎస్ఈ)
 • వివేకానంద మోడల్ కాన్వెంట్ స్కూల్ (సీబీఎస్ఈ)
 • నవ్‌జ్యోతి స్కూల్
 • వందే మాత్రం స్కూల్ (సీబీఎస్ఈ)
 • ప్రభుత్వ మల్టీపర్పస్ హై. Sec. స్కూల్ బాయ్స్ స్కూల్ (సీబీఎస్ఈ)
 • గట్టని గర్ల్స్ హై. Sec. స్కూల్ (సీబీఎస్ఈ)
 • సెయింట్. జేవియర్స్ స్కూల్ అకల్తారా (సీబీఎస్ఈ)
 • హస్డియో పబ్లిక్ స్కూల్ (సీబీఎస్ఈ)
 • గ్రీన్ రివర్ వ్యాలీ పాఠశాల
 • ఙానోదయ హయ్యర్ సెకండరీ స్కూల్ (సీబీఎస్ఈ)
 • డి.బి.ఎం. (అగ్రి) హెచ్.ఎస్. స్కూల్
 • జే భారత్ సీనియర్ సెకండరీ స్కూల్ (సీబీఎస్ఈ)

కళాశాలలు[మార్చు]

 • ప్రభుత్వ . పాలిటెక్నిక్ కాలేజ్
 • ప్రభుత్వ పి.గి. కాలేజ్ జాంజ్‌గిర్
 • ప్రభుత్వ. మినిమాతా గర్ల్స్ కాలేజ్ జాంజ్‌గిర్
 • ఎ.ఐ.ఎస్.ఇ.సి.టి కోల్లెజ్
 • బి.ఇ.డి. కోల్లెజ్
 • పండిట్ హరిశంకర్ శిక్షా మహావిద్యాలయ
 • ఙానదీప్ శిక్షా మహావిద్యాలయ
 • ఙానోదయ శిక్షా మహావిద్యాలయ
 • ప్రభుత్వ. బి.టి.ఐ.
 • కేష్రి శిక్షణ్ సమితి పడుకో కాలేజ్ ఖోఖ్రా (జాంజ్‌గిర్)
 • డి.బి.ఎం. ఐటిఐ

విష్ణుమందిరం[మార్చు]

11వ శతాబ్దంలో జాజ్వలీ కల్చురీ రాజు భీం దేవా సరోవర తీరంలో ఒక ఆలయాన్ని నిర్మించాడు. భారతీయ నిర్మాణకళకు ఆలయం ఒక అద్భుత నిదర్శనం.

ఆలయ నిర్మాణశైలి[మార్చు]

ఆలయం వెలుపల సుందరమైన, అలంకృత ప్రతిమలు ఆలయంలో సమకాలీన అభివృద్ధి జరిగినట్లు ఋజువుచేస్తున్నాయి. గంగా, జమునా ఆలయాలలో ఇరువైపులా ద్వారపాలకుల శిల్పాలు ఉన్నాయి. అదనంగా త్రిమూర్తుల శిల్పాలు ఉన్నాయి. కుడివైపున విష్ణుమూర్తి శిల్పం ఉంది. రామా, సీతా, లక్ష్మణ, రావణ, బంగారు జింక శిల్పాలు ఉన్నాయి. రెండవ దృశ్యంలో రావణుడు సీతను అపహరించే దృశ్యం ఉంది.

పురాణం[మార్చు]

ఆలయభవనం గురించి విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పురాణం అనుసరించి ఆలయనిర్మాణం జరుగుతున్న సమయంలో జాంజ్‌గిర్ ష్రివ్రినారాయణ ఆలయం ఒకపోటీలో ఉంది. భగవంతుడైన నారాయణుడు ముందుగా నిర్మించిన ఆలయంలో తాను స్వయంగా ప్రతిష్ఠితుడౌతానని చెప్పాడు. వారు ఆలయం నిర్మించగానే నారాయణుడు తాను ప్రకటించినట్లు ఆలయంలో ప్రతిష్ఠితుడయ్యాడు. మిగిలిన నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది.

మరొకపురాణ కథనం అనుసరించి ఆలయ నిర్మాణంలో భీమునికి, విశ్వకర్మకు మద్య ఆలయనిర్మాణంలో పోటీ వచ్చిందని పోటీలో భీముడు ఓడిపోయాడని అందువలన భీముడు నిర్మించిన ఆలయం అసంపూర్తిగా నిలిచిందని విశ్వసిస్తున్నారు. 12వ శతాబ్దంలో విష్ణుమందిరం హయహయులు నిర్మించారని విశ్వసిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న ఈ ఆలయం సమీపంలో భీం తలాబ్ ఉంది.

హనుమాన్ ఆలయం[మార్చు]

ప్రముఖమైన ఈ ఆలయం " నహ్రియా బాబా ధాం " అని పిలువబడుతుంది. ఇది నైలా కెనాల్ రైల్వే క్రాసింగ్ వద్ద ఉంది.

మంకా డై మందిర్[మార్చు]

మందిర్ జాంజ్‌గిర్ లోని మందిరాలలో మంకా డై ఒకటి. దేవతా విగ్రహం కనిపించిన తరువాత ఇది ఆరాధించబడుతూ ఉందని. తరువాత అది ప్రజలను ఆకర్షించిందని భావిస్తున్నారు. ఈ ఆలయం జాంజ్‌గిర్‌కు 5 కి.మీ దూరంలో ఖొఖ్రా వద్ద ఉంది.

విద్య[మార్చు]

కేష్రి బి.ఇ.డి కాలేజ్ (ఖొఖ్రా; జాంజ్‌గిర్)

ప్రయాణసౌకర్యాలు[మార్చు]

జాంజ్‌గిర్ ఎస్.ఇ.సి. రైల్వేతో అనుసంధానించబడి ఉంది. జాంజ్‌గిర్ రైల్వే స్టేషన్ జాంజ్‌గిర్- నైలా వద్ద ఉంది. భారతీయ రైల్వే ద్వారా జాంజ్‌గిర్ చక్కగా అనుసంధానించబడి ఉంది. జాంజ్‌గిర్ రైలు స్టేషన్ ముంబయి- కోల్ కత్తా రైలుమార్గంతో అనుసంధానించబడి ఉంది. ఇక్కడ నుండి ముబై, కొలకత్తా, పూనా, నాగపూర్, పూరి, విశాఖపట్నం, అహ్మదాబాద్ మొదలైన నగరాలకు దినసరి రైళ్ళు లభ్యం ఔతున్నాయి.

 • రైళ్ళ జాబితా :-
 • గొండ్వానా, చత్తీస్‌గఢ్ ఎక్స్ప్రెస్, కొబ్రా- విశాఖపట్నం ఎక్స్ప్రెస్
 • ఉత్కల్ ఎక్స్ప్రెస్, అహమ్మదాబాద్ ఎక్స్ప్రెస్, షాలిమార్ ఎక్స్ప్రెస్
 • శివనాథ్ ఎక్స్ప్రెస్, త్రివేండ్రం ఎక్స్ప్రెస్ (2 రోజులు)

రైల్వే స్టేషన్ల వివరాలు[మార్చు]

ఎస్.ఎన్ స్టేషన్ పేరు దూరం
జాంజ్‌గిర్ 5 కి.మీ
చంపా 9 కి.మీ
అకలతారా 16 కి.మీ
బరద్వార్ 25 కి.మీ
శక్తి 40 కి.మీ

జాంజ్‌గిర్ నగరంలో ఆటోరిక్షాలు ప్రయాణానికి అనువుగా ఉంటాయి. ఇక్కడి ఆటోలలో 8 మంది కూర్చోవడానికి అవకాశం లభిస్తుంది. రిక్షాలు, గుర్రాలతో లాగబడే టాంగాలు కూడా లభ్యం ఔతుంటాయి. సమీపనగరాలకు, పట్టణాలకు బసులు, టాక్సీలు లభిస్తుంటాయి.

హాస్పిటల్స్[మార్చు]

 • జిల్లా ఆసుపత్రి - నీం పాత్ (జాంజ్‌గర్)
 • సివిల్ హాస్పిటల్ - చంపా
 • సి.హెచ్.సి - అకల్తారా 18 కి.మీ

ఆర్ధికం[మార్చు]

జాంజ్‌గిర్ ప్రజలకు అధికంగా వ్యవసాయం, రైస్ మిల్లులు ఉపాధి కల్పిస్తున్నాయి. ఇక్కడ కొన్ని రసాయన పరి శ్రమలు ఉన్నాయి.

ప్రధాన పరిశ్రమల జాబితా[మార్చు]

 • థర్మల్ పవర్ ప్లాంట్లు
 • స్పాంజ్ ఐరన్, స్టీల్ ప్లాంట్లు
 • ఫ్లోర్ ఋ మిల్స్
 • వాటర్ టాంక్ ప్లాంటు
 • తసూర్ క్లోత్స్
 • ఆయిల్ ఎక్స్ట్రాక్షన్
 • సోప్, ఇతరాలు
 • కె.ఎస్.కె మహానది

ఇవికూడా చూడండి[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

మూలాల జాబితా[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]