సూరజ్‌పూర్
సూరజ్‌పూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 23°13′N 82°51′E / 23.22°N 82.85°E | |
దేశం | India |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
జిల్లా | సూరజ్‌పూర్ |
Elevation | 528 మీ (1,732 అ.) |
జనాభా (2011) | |
• Total | 20,189 |
భాషలు | |
• అధికారిక | హిందీ, ఛత్తీస్‌గఢీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 497229 |
Telephone code | 07775 |
Vehicle registration | CG 29 |
సూరజ్‌పూర్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, సూరజ్‌పూర్ జిల్లా లోని పట్టణం. సూరజ్‌పూర్ జిల్లా ముఖ్యపట్టణం. ఇది రిహాండ్ నది ఒడ్డున ఉంది. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వర్తిస్తుంది. సూరజ్‌పూర్ రాష్ట్ర రాజధాని రాయపూర్ నుండి 334 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి 43 సూరజ్‌పూర్ మీదుగా వెళ్తుంది.
భౌగోళికం
[మార్చు]సూరజ్‌పూర్ 23°13′N 82°51′E / 23.22°N 82.85°E వద్ద, [1] సముద్రమట్టం నుండి సగటున 528 మీటర్ల ఎత్తున ఉంది.
జనాభా వివరాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం సూరజ్‌పూర్ పట్టణం జనాభా 20,189. పురుషులు 10430, స్త్రీలు 9759. 6 సంవత్సరాల లోపు పిల్లలు 2649 మంది ఉన్నారు. ఆరేళ్లలోపు మగపిల్లల జనాభా 1419, ఆరేళ్లలోపు ఆడ పిల్లల జనాభా 1230. సూరజ్‌పూర్ నగర అక్షరాస్యత 79.89%, పురుషుల అక్షరాస్యత 86.74%, స్త్రీల అక్షరాస్యత 72.66%. సూరజ్‌పూర్‌లో లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 936 స్త్రీలు. ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో లింగనిష్పత్తి 1000 మగ పిల్లలకు 867. సూరజ్‌పూర్‌లో మొత్తం గృహాల సంఖ్య 4397.
రవాణా
[మార్చు]త్రోవ
[మార్చు]సూరజ్‌పూర్‌కు చక్కని రోడ్డు, రైలు సౌకర్యాలున్నాయి. జాతీయ రహదారి 43 పట్టణాన్ని ఉత్తరాన కట్నీతో, తూర్పున గుమ్లా & రాంచీ లతో కలుపుతుంది. సూరజ్‌పూర్‌కు భయ్యాతాన్, ప్రతాప్‌పూర్, రేణుకూట్, రాబర్ట్స్‌గంజ్ ల మీదుగా వారణాసికి రోడ్డు సౌకర్యం ఉంది. అలాగే బిలాస్పూర్,→ రాయ్పూర్ → భిలాయి → నాగపూర్ లకు రోడ్డు సౌకర్యం ఉంది.
రైలు
[మార్చు]ళ్ళుసూరజ్‌పూర్ రైల్వే స్టేషను పట్టణ కేంద్రం నుండి 6 కి.మీ. దూరంలో ఉంది. ఈ స్టేషను మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌తో అనుసంధానం అందిస్తుంది. సూరజ్‌పూర్ రోడ్డును కలిపే కొన్ని ముఖ్యమైన రై:
- జబల్పూర్ - అంబికాపూర్ ఎక్స్‌ప్రెస్
- అంబికాపూర్ - షాహడోల్
- అంబికాపూర్ - దుర్గ్ ప్యాసింజర్ ఎక్స్‌ప్రెస్
- నర్మదా ఎక్స్‌ప్రెస్: ఇండోర్ జంక్షన్ - బిలాస్‌పూర్ మధ్య
- భోపాల్ - బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ అనుపూర్ రైల్వే స్టేషన్ వద్ద (సూరజ్‌పూర్ స్టేషన్ నుండి 127 కి,.మీ.)
- అమర్‌కంటక్ ఎక్స్‌ప్రెస్ : భోపాల్, దుర్గ్ ల మధ్య నడుస్తుంది. సూరజ్‌పూర్ నుండి 127 కి.మీ. దూరంలో ఉన్న అనుపూర్ రైల్వే స్టేషన్ వద్ద.
చూడదగ్గ ప్రదేశాలు
[మార్చు]గాయత్రి మందిరం ఇక్కడి పురాతన దేవాలయాలలో ఒకటి. ఇది సురాజ్‌పూర్‌లోని గాయత్రి నగర్‌కి పశ్చిమాన రిహాండ్ నది ఒడ్డున ఉంది. ఇది శారదాదేవి ఆలయం. సూరజ్‌పూర్ "గాయత్రి మంత్ర" ప్రార్థనతో మేల్కొంటుంది, ఇది సురాజ్‌పూర్ అంతటా ఉదయం 5:00 గంటలకు వినబడుతుంది. ఆలయం చుట్టూ నర్సరీలు, పార్కులూ ఉన్నాయి.
మహామాయ మందిర్ సూరజ్‌పూర్ నుండి 4 కి.మీ. దూరంలో ఉన్న దేవీపూర్ లో ఉంది. మహామాయ దేవాలయం అత్యంత పురాతన దేవాలయాలలో ఒకటి. వివిధ ప్రదేశాల నుండి ప్రజలు మహామాయ మందిరాన్ని సందర్శిస్తారు. నవరాత్రి సమయంలో ఈ ప్రదేశం ప్రధాన ఆకర్షణగా మారుతుంది.