నారాయణపూర్ (ఛత్తీస్‌గఢ్)
Jump to navigation
Jump to search
నారాయణపూర్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా లోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్య పట్టణం కూడా. 2007 మే 11 న బస్తర్ జిల్లా నుండి సృష్టించబడిన రెండు కొత్త జిల్లాలలో ఇది ఒకటి. [1]
నారాయణపూర్‌లో నక్సలైట్ల ప్రభావం ఎక్కువ. ఈ ప్రాంతంలోని గిరిజనులు ఆర్థికాభివృద్ధికి నోచుకోక పోవడమే దీనికి ప్రధాన కారణం. 1985 లో రామకృష్ణ మిషన్ ఈ తెగల అభివృద్ధికి కృషి చేసింది. అభివృద్ధిలో భాగంగా పాఠశాలలు, ఆట స్థలం, గిరిజనులకు ఒక స్టేడియం నిర్మించారు.
రాయపూర్ నుండి రాజ్‌నంద్‌గావ్, జగదల్‌పూర్‌ల మీదుగా నారాయణపూర్‌కు బస్సులు అందుబాటులో ఉన్నాయి. జగదల్పూర్ నుండి నారాయణపూర్ 120 కి.మీ. దూరంలో ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ Srivastava, Dayawanti, ed. (2010). India 2010, A Reference Annual (PDF). New Delhi: Publications Division, Ministry of Information and Broadcasting, Government of Indiaand. p. 1122. ISBN 978-81-230-1617-7. Archived from the original (PDF) on 29 December 2010. Retrieved 23 January 2012.