Jump to content

బర్గఢ్

బర్గఢ్
పట్టణం
మారుపేరు: 
BGH
బర్గఢ్ is located in Odisha
బర్గఢ్
బర్గఢ్
ఒడిశా పటంలో పట్టణ స్థానం
నిర్దేశాంకాలు: 21°20′N 83°37′E / 21.333°N 83.617°E / 21.333; 83.617
దేశం India
రాష్ట్రం ఒడిశా
జిల్లాబర్గఢ్
విస్తీర్ణం
  మొత్తం
20.80 కి.మీ2 (8.03 చ. మై)
  Rank13 (ఒడిశాలో)
ఎత్తు
171 మీ (561 అ.)
  జనసాంద్రత38,762/కి.మీ2 (1,00,390/చ. మై.)
భాషలు
  అధికారికఒరియా
  మాట్లాడేవిసంబల్‌పురి
టైమ్ జోన్UTC+5:30 (IST)
PIN
768028
వాహన నమోదుOD-17
వెబ్‌సైట్http://bargarh.nic.in

బర్గఢ్ ఒడిశా రాష్ట్రం, బర్గఢ్ జిల్లాలో పట్టణం. ఇది బర్గఢ్ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. బర్గఢ్ 'వరి' సాగుకు ప్రసిద్ధి చెందింది. ఈ జిల్లాను ఒడిశా రాష్ట్ర "భటా హండి" అని పిలుస్తారు.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[1] బర్గఢ్‌ జనాభా 83,651. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. బర్గఢ్ సగటు అక్షరాస్యత 76%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ; 57% పురుషులు, 43% స్త్రీలు అక్షరాస్యులు. జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.

బర్గఢ్ నుండి నాలుగు రాష్ట్రాల రాజధానులకు - రాయ్‌పూర్ (222 కి.మీ.), భువనేశ్వర్ (350 కి.మీ.), రాంచీ (600 కి.మీ. ), కోల్‌కతా (600 కి.మీ.) లకు - చక్కటి రైలు రోడ్డు మార్గాలున్నాయి. ఈ పట్టణం సంబల్పూర్, రాయ్పూర్ నగరాల మధ్య జాతీయ రహదారి 6 (భారతదేశం) (పాత నంబరింగ్) పై ఉంది. బర్గఢ్ రోడ్ రైల్వే స్టేషన్ సంబల్పూర్-జార్సుగూడ-విజయనగరం మార్గంలో ఉంది. ఇది నేరుగా [[[భువనేశ్వర్ రైల్వే స్టేషన్|భువనేశ్వర్]], సంబల్పూర్, రాయ్పూర్, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, కొచ్చి, రాంచీ, అసన్సోల్, కోల్ కతా, వారణాసి, అహ్మదాబాద్, సూరత్, ముంబై లకు రైలు సౌకర్యం కల్పిస్తుంది. జాతీయ రహదారి 26 ఇక్కడే ఉద్భవించింది. ఇది దక్షిణ ఒడిశా లోని దాదాపు అన్ని జిల్లాలతో కలుపుతుంది.

సమీప విమానాశ్రయాలు: రాయ్‌పూర్ (220 కి.మీ.), భువనేశ్వర్ (350 కి.మీ.), ఝార్సుగూడా (110 కి.మీ.).

మూలాలు

[మార్చు]
  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
"https://te.wikipedia.org/w/index.php?title=బర్గఢ్&oldid=4943694" నుండి వెలికితీశారు