సుబర్నపూర్
సుబర్నపూర్
సోనేపూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 20°50′N 83°55′E / 20.83°N 83.92°E | |
దేశం | India |
రాష్ట్రం | ఒడిశా |
జిల్లా | సుబర్నపూర్ |
Elevation | 121 మీ (397 అ.) |
జనాభా (2001) | |
• Total | 17,535 |
భాషలు | |
• అధికారిక | ఒరియా |
• మాట్లాడేవి | సంబల్పురీ భాష |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 767017 |
Telephone code | 06654 |
Vehicle registration | OD-31 |
Website |
సుబర్నపూర్, ఒడిషాలోని సుబర్నపూర్ జిల్లాకు చెందిన పట్టణం, ఈ జిల్లాకు ప్రధాన కార్యాలయం. దీన్ని సోనేపూర్ అని కూడా పిలుస్తారు. వాస్తుకళాపరమైన ప్రాముఖ్యత, తాంత్రికత కలిగిన దేవాలయాల సమూహానికి ఈ పట్టణం ప్రశస్తి. దీన్ని రెండవ వారణాసి అని స్థానికులు పిలుస్తారు. అలహాబాద్‌లో మాదిరిగానే ఇక్కడ కూడా మహానది, టెల్ అనే రెండు నదుల సంగమం జరుగుతున్నందున దీన్ని రెండవ అలహాబాద్ అని కూడా పిలుస్తారు.[1] సుబర్ణపూర్ పట్టు, చేనేత, రొయ్యలు, టెర్రకొట్టా మొదలైనవాటికి కూడా ప్రసిద్ధి చెందింది.
సోనేపూర్ బ్రిటిషు భారతదేశం లోని సోనేపూర్ సంస్థానానికి రాజధానిగా ఉండేది.[2]
జనాభా
[మార్చు]2001 జన గణన ప్రకారం,[3] సోనేపూర్ జనాభా 17,535. ఇందులో పురుషులు 53% కాగా స్త్రీలు 47%. సోనేపూర్ సగటు అక్షరాస్యత 74%. జాతీయ సగటు 59.5% కంటే ఇది బాగా ఎక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 82% కాగా, స్త్రీలలో ఇది 65%. సోనేపూర్ జనాభాలో 11% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.
సోనేపూర్ దేవాలయాలు
[మార్చు]- శ్రీ కపిలేశ్వర్ తాంపుల్ చార్దా
- భగవతీ దేవాలయం
- బుధిమ దేవాలయం
- బుద్ధి సోమలై ఆలయం
- దాధిబాబన్ ఆలయం
- దశమతి దేవాలయం
- గోకర్ణేశ్వర దేవాలయం
- గుండిచా / నృసింహనాథ్ ఆలయం
- జగన్నాథ దేవాలయం
- ఖంబేశ్వరి ఆలయం
- కోసలేశ్వర దేవాలయం
- లంకేశ్వరి ఆలయం
- నారాయణి దేవాలయం
- పశ్చిమ సోమనాథ దేవాలయం
- రామచండి దేవాలయం
- రామేశ్వర దేవాలయం
- సోమలేశ్వరి ఆలయం
- సురేశ్వరి ఆలయం
- సుబర్ణమేరు దేవాలయం
- బాలాజీ (హనుమాన్) దేవాలయం
- శ్రీరాం (రామసీత) దేవాలయం
- పంచరథ దేవాలయం
మూలాలు
[మార్చు]- ↑ "Tourism in Sonepur".
- ↑ Princely States of India
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.